బుధు ని లక్షణాలు : బుధుడు నపుంసక గ్రహము. ఇతను రుచుల మిశ్రమమును తెలియజేయును. రంగుఅలలో ఆకుపచ్చరంగును సూచించును. ఇతను వైశ్యజాతికి చెందినవాడు. అధిదేవత విష్ణువు. గుండ్ర్ని ఆకారం కలిగి, పొడవైన వారిని సూచించును. 20 సంవత్సరాలా వయసు వారిని సూచించును. ఇతను వాత, కఫ, పిత్తముల మిశ్రమ తత్త్వము కల్వాడు. హరదృతువును సూచించును. పృధ్వీతత్త్వము కలిగి ఉత్తరదిక్కును సూచించును. లోహములలో కంచు, ఇత్తడి ( మిశ్రమలోహములను ) సూచించును. రత్నములలో మరకతను ( పచ్చ ) ను సూచించును. సంఖ్య 5 . లగ్నములో దిగ్బలమును పొందు రజోగుణప్రధానమైన గ్రహము. వింధ్యపర్వతం నుండి గంగానది వరకు ఇతనిదేశంగా జాతక పారిజాతం చెపుతున్నది.
బుధుడు ఆశ్రేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రములకు అధిపతి శరీరావయవములలో మెదడు, చర్మము, నరములను సూచించును. బుధుడు మిధునము, కన్యారాశులకు అధిపతి. కన్యలో 15వడిగ్రీ నుండి 20వ డిగ్రీవరకు మూల త్రికోణము. ఇతనికి ఉచ్చరాశి కన్య. నీచరాశి మీనం. కన్యలో 15వ డిగ్రీ ఇతనికి పరమోచ్చ. అలాగే మీనంలో 15వడిగ్రీ ఇతనికి పరమనీచ. ఇతనికి రవి, శుక్రులు స్నేహితులు. చంద్రుడు శత్రువు. కుజ, గురు, శని సములు. బుధగ్రహదశ 17 సంవత్సరాలు.
బుధు ని ప్రభావం : ఎల్లప్పుడు సంతోషంగా వుంటారు. వీరి పెదవులపై చిరునవ్వు మెదులుతూ వుంటుంది. పొట్టిగా వుంటారు. చురుకైనవారు. వృద్ధాప్యంలో కూడా యువకుల వలె వుంటారు. నాటకరచయితలు, నటులు, విషయజ్ఞానం ఎక్కువగానే వుంటుంది. దీర్ఘాలోచనా పరులు, సందేహపరులు.
తలనొప్పి, నరముల వ్యాధులు, అలసరువంటి వ్యాధులు రావచ్చు.
రేడియో, టి.వి., పత్రికారంగం, ప్రచురణరంగం, టెలిఫోన్ రంగాలలో రాణిస్తారు.
బుధు ని కారకత్వములు : బుధుడు వాక్ కారకుడు, మేనమామ, మేనల్లుడు, మేనకోడలు మాతమహుడు, ఉపన్యాసములో నైపుణ్యం, లలితకళలు, గణితశాస్త్రం, వ్యాపార శాస్త్రం, అర్ధశాస్త్రం, జ్యోతిష్యం, ఖగోళశాస్త్రం, వాణిజ్యం, వ్యాకరణము, వివిదరకాల భాషలు, శిల్పి, మంత్రం, తంత్రం, వివేకం, పుస్తక ప్రచురణ, గ్రంథాలయం, విష్ణుభక్తి, విష్ణాలయం, వైష్ణవభక్తులు, మధ్యవర్తిత్వం, వైద్యులను సూచించును. నాభి, నరము, నాలుక, స్వరపేటిక, చర్మములను సూచించును. నరముల బలహీనత, మూర్ఛ, చెముడు, మెదడుకు సంబంధించిన వ్యాధులను సూచించును. అన్నిరకముల ఆకుకూరలు, కూరగాయలను సూచించును. ఉపాధ్యాయులు, ఉపన్యాసకులు, న్యాయవాదులు, యాంకరులను సూచించును.
తెలివైనవారు, పండితులు, చరిత్రకారులు, గుమాస్తాలు, పెయింటర్లు, ఎడిటర్లు, రాయబారులు, విద్య, ఖాతాలు, దస్తూరి, వ్యాసములు, నవలలు, కల్పితాలు సామెతలు, చిన్నపుస్తకములు, ధృవీకరణపత్రాలు, వదంతులు, ప్రకటనలు, సత్యములు, యువకులు, వ్యాపారము, కేబుల్స్, డైరీలు, సైకిళ్ళు, గుర్రపుబండ్లు, చేతులు, కేటలాగు, పదనిఘంటువులు, వాహనములను సూచించును.
బుధుడు సుచించు విద్యలు : బుధుడు గణీతము, ఎకౌంట్లు, డిజైన్లు, ప్లానులు గీయుట, చిత్రలేఖనము, పుస్తకప్రచురణ, పుస్తకముల వ్యాపారం, రచన, తర్కములను సూచిమ్చును. శుక్రునితో కలసి సినిమా వ్యాపారం, జీవశాస్త్రం, రసాయనశాస్త్రం, వృక్షశాస్త్రం, ఖగోళశాస్త్రం, జ్యోతిష్యశాస్త్రం, జర్నలిజంలను సూచించును. గురునితో కలసి ఉపాధ్యాయులు, ప్రొఫెసర్లు, బోధకులను సూచించును.
బుధుడు సూచించు వ్యాధులు : మూగతనము, చెముడు, చర్మవ్యాధులు, మెదడుకు సంబంధించిన వ్యాధులు, పోలియో, నరముల బలహీనత, నత్తి, మాటలు ఆలస్యంగా రావటం, మూర్ఛ, ఫిట్సులను సూచించును. బుధుడు చంద్రునితో కలసి తరచుగా స్పృహకోల్పోవుట, హిస్టీరియా, మానసికవ్యాధి, అధికముగా మాట్లాడుట, కోమాలను సూచించును. బుధ్డు గురునితో కలసి మెదడువాపు వ్యాధి, శనితో కలసి అకస్మాత్తుగా నిద్రపోవుట, కుజునితో కలసి బ్రెయిన్ కాన్సర్ అధికంగా ఆలోచించుట, నరాలు చిట్లిపోవుటను సూచించును. రాహువుతో కలసి విషప్రయోగం, మెదడు చెడిపొవుటను, కేతువుతో కలసి హింసించు స్వభావంను సూచించును.
బుధుడు సూచించు వృత్తి వ్యాపారాలు : ఎడిటర్స్, ఉపాధ్యాయులు, టైపిస్టు, స్టెనోగ్రాఫర్, శిల్పి, రాయబారి, మధ్యవర్తి, ఇన్సూరెన్స్ ఏజెంట్, జ్యోతిష్యుడు, రైల్వేఉద్యోగి, తంతితపాలాశాఖలోని ఉద్యోగస్థులు, కవి, రచయిత, కాషియర్స్, ఆడిటర్, బ్యాంకు, ట్రెజరీ, రెవెన్యూ శాఖలలో ఉద్యోగస్థులు, ఆదాయశాఖ, వాణిజ్యశాఖ, ఇంజనీరింగ్ శాఖ, న్యాయశాఖలలో ఉద్యోగస్థులను సూచించును. ఫింగర్ ప్రింట్ లను పరిశీలించువారు, ఎకౌంటెంట్లు, జర్నలిస్టులను సూచించును. శుక్రునితో చూడబడుతుంటే సంగీతం, రేడియో, ఆభరణాలు, దుస్తుల తయారీలను సూచించును.
బుధునికి మిత్రులు: సూర్య శుక్ర
బుధునికి శత్రువు: చంద్ర
బుధునికి సములు: మంగళ గురు శని రాహు కేతు