శ్రీ మేధా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం

మీరు జన్మించిన తేది, సమయం, ప్రదేశం ఈ మూడు సమాచారములు మాకు తెలియచేసినచో మీ వ్రుత్తి,వ్యాపార,ఆరోగ్య,ఆర్ధిక పరిస్తితులు, దాంపత్యం, విద్య, ఉద్యోగ, వివాహ, కుటుంబవ్యవహారాలు, సంతానం, రాజకీయ వ్యవహారాలు,ప్రేమ వ్యవహారములు,కుజ దోషం, కాలసర్ప దోషం మరియు వివాహ, ఉపనయన, గృహప్రవేస, జప, హోమ, వ్రత, అన్నప్రసన, నామకరణం లకు ముహూర్తములు పెట్టబడును. P.V.RADHAKRISHNA CELL :+91 9966455872, Mail us : parakrijaya@gmail.com

6, అక్టోబర్ 2012, శనివారం

పంచాంగ విషయాలు 5 - రాశులు

రాశులు నక్షత్రములు, పాదములు, రాశులు, వాని ప్రతి నామములు, వాని ఘడియలు
 
1 అశ్వని (4 ) భరణి (4 ) కృత్తిక (1 ) -మేషము - మేక - 4 1 /4 ఘడియలు .

 
2 కృత్తిక  (3 ) రోహిణి (4 ) మృగశిర (2 ) - వృషభము - ఎద్దు - 4 3 /4 ఘడియలు .

 
3 మృగశిర (2 ) ఆర్ద్ర ( 4 ) పునర్వసు (3 ) -మిధునము - దంపతులు - 5 1 /4 ఘడియలు .

 
4 పునర్వసు (1 )పుష్యమి (4 )ఆశ్లేష (4 ) - కర్కాటకము - పీత - 5 1 /2  ఘడియలు .

 
5 మఘ (4 ) పుబ్బ (4 ) ఉత్తర (1 ) - సింహము - సింగము -5 1 /4 ఘడియలు .

 
6 ఉత్తర (3 ) హస్త (4 ) చిత్త (2 ) -కన్య - పడుచు -5 ఘడియలు .

 
7 చిత్త (2 ) స్వాతి (4 ) విశాఖ (3 ) - తుల - త్రాసు -5  ఘడియలు .

 
8 విశాఖ (1 ) అనూరాధ (4 ) జ్యేష్ట (4 ) - వృశ్చికము - తేలు -5 1 /4 ఘడియలు .

 
9 మూల (4 ) పూర్వాషాడ (4 ) ఉత్తరాషాడ (1 ) - ధనుస్సు - విల్లు - 5 1 /2 ఘడియలు .

 
10 ఉత్తరాషాడ (3 ) శ్రవణము (4 ) ధనిష్ఠ (2 )- మకరము - మొసలి - 5 1 /4 ఘడియలు .

 
11 ధనిష్ఠ  (2 ) శతబిశం (4 ) పూర్వాబాద్ర (3 ) - కుంభము -కడవ -4 3 /4 ఘడియలు.

 
12 పూర్వాభాద్ర (1 ) ఉత్తరాబాద్ర (4 ) రేవతి (3 ) - మీనము - చేప - 4 1 / 4 ఘడియలు .

 
12 రాశులకు కలిపి మొత్తం 60 ఘడియలు (సావన 59 ఘ .50 విఘడియలు ). ఇచ్చట సాదారణముగా ఇవ్వబడింది . ఇవి ప్రతి అక్షాంశమునకు మారును.
 

నక్షత్రములు వాని ఆకారములు :
 
1 అశ్వని - గుఱ్ఱము ముఖమును చోలి 3 నక్షత్రములుండును
  భరణి - త్రిభుజము చోలిన 3 నక్షత్రములు దగ్గరగా నుండును .
  కృత్తిక - కొడవలి యాకారముగా 6 నక్షత్రములుండును
  రోహిణి - శకటము (బండి ) వలె 3 నక్షత్రములుండును
  మృగశిర - మృగము తల వలె 3 నక్షత్రములుండును
  ఆర్ద్ర  - పగడము పోలి ఒక నక్షత్రము చక్కగా నుండును.
  పునర్వసు - ధనుస్సు వంటి యాకారము పోలి 5 నక్షత్రములుండును
  ఆశ్లేష - పాము వలె మెలికలుగా 6 నక్షత్రములుండును
  మఘ - పల్లకి యాకారములో 5 నక్షత్రములుండును

 పుబ్బ, ఉత్తర - రెండేసి చతురస్రాకారముగా 4 నక్షత్రములుండును
  హస్త -హస్తము లేక అరచేతి వలె 5 నక్షత్రములుండును
  చిత్త - ముత్యము వలె గుండ్రముగా ఒకటే నక్షత్రములుండును
  స్వాతి - మాణిక్యాకారముగా ఒకటే నక్షత్రములుండును
  విశాఖ - (సారిక ) కుమ్మరి చక్రము పోలి 5 నక్షత్రములుండును
  అనూరాధ , జ్యేష్ట - (చత్రాకారము) గొడుగును పోలి 6 నక్షత్రములుండును
  మూల - చెంబును పోలి 5 నక్షత్రములుండును
  పూర్వాషాడ ,ఉత్తరాషాడ - ఖేకము వలె 2 నక్షత్రములుండును
  శ్రవణము - ఒకే పంక్తిగా, వేణువు వలె 3 నక్షత్రములుండును
  ధనిష్ఠ - మద్దెల యాకారముగా నేర్పడి 3 నక్షత్రములుండును
  శతభిషం - చూచుటకు విందుగా, వరుస వరుసగా 100 నక్షత్రములుండును
  పూర్వాభాద్ర , ఉత్తరాభాద్ర - రెండేసి రెండేసి 4 నక్షత్రములుండును
  రేవతి - చేప వలె 3 నక్షత్రములుండును
ఏలినాటి శని : ప్రతి మానవుని జీవిత కాలమందు ముప్పది ఏండ్ల కోక మారు ఏలినాటి శని ప్రవేశించును. జన్మ రాశికి - నామ రాశికి - ద్వాదశమునందు - లగ్నము నందు , ద్వితీయము నందు - శని యున్నచో ఎల్నాటి శని యందురు. శని గ్రహము ఒక్కొక్క రాశి యందు 2 1/2 సంవత్సరముల కాలము సంచారము -మొత్తము కలిపి ఏడున్నర సంవత్సర కాలము ఎల్నాటి శనియున్నదన్నమాట .
ఫలితము: ద్వాదశ  రాశి యందున్నప్పుడు  -ధన వ్యయము , మానసిక భాద , అందోళనములు , కుటుంబ సమస్యలు, వ్యాపార, వృత్తులందు వ్యతిరేకములు కలుగును.
జన్మరాశి యందున్నప్పుడు - బంధు మిత్ర ద్వేషములు, ధన నష్టము - కుటుంబ స్థితి తారుమారుగా ఉండును. కొన్ని శుభ గ్రహ వీక్షణచే ప్తయత్న పూర్వక ధనాదాయము , మిశ్రమ ఫలితములు ఉండవచ్చును. కళత్ర పీడ, మతి బ్రమణం, దీర్ఘ వ్యాదులు కలుగ వచ్చును .
ద్వితీయము నందున్నప్పుడు - ఆశా జీవి యగును . నిందలు పడుట, నిత్య దు : ఖము కలుగును. మానసికముగా క్రుంగదీయును .పై కాలములందు మాస శివ రాత్రి రోజున శని పూజలు చేయుట మంచిది.
సం    నె    రో
ముఖము నందు         0  3  10 శరీర పీడ - ధన నష్టాదులు

దక్షిణ భుజము           1  1   00 ఉద్యోగ వృత్తులందు లాభాదులు
పాదములందు            1  8  10  అశాంతి - దిగులు - అవమానములు
హృదయస్థానము        1  4  20  ధన ప్రాప్తి - గౌరవము - కీర్తి
వామ భుజము           1  1  10  వ్యాధి పీడ - ధన వ్యయము
శిరో భాగము               1  10  00  సంతోషము -ధనాదాయము
కన్నులు                    0  6  20  మన్నన - కుటుంబ సంతోషము
గుదము                     0  6  20  ప్రమాద భరితములు - కీర్తి ధన నష్టము

శని బాధ పడుచున్నవారు నువ్వులు, బెల్లం, నూనె, నవధాన్యములు కలిపి 27 ప్రదక్షిణములు శనీశ్వరునకు చేసి శని విగ్రహము మీద పోస్తే శని దోష మంతయు తొలగి శుభాలు శీఘ్రముగా పొందవచ్చును. మృత్యుంజయ, నవగ్రహ హోమాలు, దానాలు చేస్తే త్వరగా శుబాలు పొందుతారు.
సూచన : దీక్ష  40 రోజులు చేయాలి .
రాహు కేతువులు 3 - 6 - 11 స్థానము లందున్నచో శత్రు జయము అప్రయత్న లాభములు, గౌరవము , పుణ్య క్షేత్ర సందర్శనములు, తీర్ద యాత్రము చేయుట శుభములు కలుగును, కార్య సిద్ది కల్గును.
సూచన : అన్ని గ్రహములు  1  - 8  - 12  స్థానములందున్నచో  కష్ట నష్టాదులు ఏర్పడును .


ఈ బ్లాగును సెర్చ్ చేయండి



Related Posts Plugin for WordPress, Blogger...