శ్రీ మేధా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం

మీరు జన్మించిన తేది, సమయం, ప్రదేశం ఈ మూడు సమాచారములు మాకు తెలియచేసినచో మీ వ్రుత్తి,వ్యాపార,ఆరోగ్య,ఆర్ధిక పరిస్తితులు, దాంపత్యం, విద్య, ఉద్యోగ, వివాహ, కుటుంబవ్యవహారాలు, సంతానం, రాజకీయ వ్యవహారాలు,ప్రేమ వ్యవహారములు,కుజ దోషం, కాలసర్ప దోషం మరియు వివాహ, ఉపనయన, గృహప్రవేస, జప, హోమ, వ్రత, అన్నప్రసన, నామకరణం లకు ముహూర్తములు పెట్టబడును. P.V.RADHAKRISHNA CELL :+91 9966455872, Mail us : parakrijaya@gmail.com

23, నవంబర్ 2012, శుక్రవారం

బాలింత

మొదటి కాన్పుకు తీసుకొని వెళ్ళుటకు


విదియ,తదియ,పంచమి,సప్తమి,దశమి,త్రయోదశి తిథులు
 

సోమ,బుధ,గురు,శని వారములు.

శుభ నక్షత్రాలలో గర్భిణీ స్త్రీకి తారా బలం  సరిపోయే విధంగా 

చూసి,వార శూలాలు కూడా చూసుకుని తీసుకు వెళ్ళవలెను.
[కుటుంబ ఆచారమును, పెద్దల సలహాను పాటించవలెను 




బాలింత స్నానమునకు

ఆది,మంగళ,గురు వారములు మంచివి.

అశ్వని,రోహిణి,మృగశిర,ఉత్తర,హస్త,స్వాతి,అనూరాధ,



ఉత్తరాషాడ,ఉత్తరాభాద్ర,రేవతి  నక్షత్రాలు మంచివి.
11 వ రోజున స్నానము చేయించాలి.  


వర్జ్యము పాటించనక్కరలేని సమయాలు

స్నానే,దానే,జపే,హోమే వైశ్వదేవ సురార్చనే ||
ప్రాయశ్చిత్తే తధా శ్రార్ధే ప్రసిద్ధాహ విషనాడికాహ||

ఆసనే,శయనే,భోజ్యే,మల,మూత్ర విసర్జనే ||
ఉగ్ర కర్మణి అస్త్రవధే ప్రశస్తాహ విష నాడికాహ||
శిశువుకు మొలత్రాడు కట్టుటకు

శిశువుకు వెండి లేదా బంగారు మొల త్రాడును పురిటిశుద్ది రోజున లేదా 5 వ నెలయందును కట్టవలెను. మొలత్రాడునకు నల్లపూసలు, రాగికాణి, శిశువుయొక్క పురిటి సమయమందు తీసిన బొడ్డు గాని కట్టిన గాలీ,ధూళి,దిష్టి దోషాలు తగలవు.


బిడ్డను ఇల్లు కదుపుటకు

విదియ, తదియ, పంచమి, సప్తమి, దశమి, ఏకాదశి, త్రయోదశి తిథులు,

అశ్వని, రోహిణి, మృగశిర, పునర్వసు, పుష్యమి, ఉత్తర, హస్త,  చిత్త, అనూరాధ, శ్రవణం, ధనిష్ట, శతభిషం, ఉత్తరాభాద్ర, ఉత్తరాషాడ, రేవతి  నక్షత్రములు.
మేష, వృషభ, కర్కాటక, తుల, ధనుస్సు, మీన లగ్నములు,
సోమ, బుధ, గురు, శుక్ర వారములు మంచివి.
శిశువు పుట్టిన మూడవ నెలలో ముందుగా దేవాలయమునకు
తీసుకు వెళ్లి ఆ తరువాత మేనమామ గారి ఇంటికి తీసుకుకొని వెళ్ళాలి. 

పురుడు తరవాత శిశువుతో అత్త వారింటికి వెళ్ళుటకు


శిశువుకు 3 వ  నెలగాని, 5 వ నెలగాని, ఆపై 7, 9, 11వ  నెలల్లో గాని
అత్తవారింటికి వెళ్ళవచ్చును. వర్తమానంలో  కొంతమంది నెలలోనే పంపించుచున్నారు.


అట్లు చేయుట వలన స్త్రీయొక్క ఆరోగ్యము క్షీణించును.
విదియ, తదియ, చవితి, సప్తమి, దశమి, ఏకాదశి, త్రయోదశి తిథులు,
సోమ, బుధ, గురు, శని వారములు, అశ్విని  , రోహిణి, మృగశిర, పునర్వసు, పుష్యమి,
మఖ, ఉత్తర, హస్త, స్వాతి, అనూరాధ, మూల, ఉత్తరాశాడ, శ్రవణం, శతభిషం, ఉత్తరాభాద్ర, రేవతి నక్షత్రములందు 
తారాబలం, వారశూల, ఆనందాదియోగాములు తప్పక చూడాలి. తారాబలం మాత్రం తల్లికి, శిశువుకు ఇద్దరికీ సరిపోవాలి.
శూన్యమాసాలు, గురు, శుక్ర మూడములు పనికిరావు.   
గర్భిణీ స్త్రీ యొక్క ధర్మములు

గర్భవతి అయిన స్త్రీలు ఈ క్రింది నియమములు తప్పనిసరిగా పాటించవలెను.
ముత్తైదువులను, బ్రాహ్మణులను పూజించవలయును.


ఇష్ట దైవమును భగవంతుని నామమును నిత్యం స్మరించవలెను.


శుభప్రదమైన ఆభరణములు ధరించాలి.
4,6,8, నెలల లో ప్రయాణములు చేయరాదు.
గర్భిణీ స్త్రీ ఏ వస్తువులను కోరునో ఆ వస్తువులు వెంటనే తెచ్చి ఇవ్వవలెను.
సముద్ర స్నానము, చెట్లు నరకుట, గృహారంభ,శంఖు స్థాపన చేయరాదు.మైలను తాకరాదు. శోకించరాదు.
సూర్య, చంద్ర గ్రహణము లందు మాత్రము జాగ్రత్తగా ఉండాలి.
గ్రహణ సమయములో పడుకొని మాత్రమే ఉండాలి.

పుమ్సవనము లేదా సీమంతము 

విదియ, తదియ, పంచమి, సప్తమి, త్రయోదశి, పూర్ణిమ తిథులు,

బుధ, గురు, శుక్రవారములు,
రోహిణి, పుష్యమి, హస్త, చి
త్త, స్వాతి, ఉత్తర, ఉత్తరాషాడ,


ఉత్తరాభాద్ర, పునర్వసు, అనూరాధ, శ్రవణం, ధనిష్ఠ, శతభిషం, రేవతి నక్షత్రములు,
మేష, మిధున, తుల, ధను
స్సు, కుంభ లగ్నములు,
పుమ్సవనమునకు 3వ నెల, సీమంతమునకు 5,7,8,9  నెలలు మంచివి.

ఈ బ్లాగును సెర్చ్ చేయండి



Related Posts Plugin for WordPress, Blogger...