శ్రీ మేధా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం

మీరు జన్మించిన తేది, సమయం, ప్రదేశం ఈ మూడు సమాచారములు మాకు తెలియచేసినచో మీ వ్రుత్తి,వ్యాపార,ఆరోగ్య,ఆర్ధిక పరిస్తితులు, దాంపత్యం, విద్య, ఉద్యోగ, వివాహ, కుటుంబవ్యవహారాలు, సంతానం, రాజకీయ వ్యవహారాలు,ప్రేమ వ్యవహారములు,కుజ దోషం, కాలసర్ప దోషం మరియు వివాహ, ఉపనయన, గృహప్రవేస, జప, హోమ, వ్రత, అన్నప్రసన, నామకరణం లకు ముహూర్తములు పెట్టబడును. P.V.RADHAKRISHNA CELL :+91 9966455872, Mail us : parakrijaya@gmail.com

7, జులై 2013, ఆదివారం

రుద్రుని ప్రతిరూపాలు రుద్రాక్షలు


రుద్రాక్షలు కావలసిన వారు సంప్రదించవలసిన సెల్ నెం: 9966455872, 7659931592.

రుద్రాక్షలను శివుని ప్రతిరూపాలుగా కొలుస్తాము. రుద్రాక్షలు పవిత్రమైనవి, శక్తివంతమైనవి, మహిమాన్వితమైనవి. రుద్రాక్షలు ధరించడంవల్ల అనుకున్న పనులు నెరవేరతాయి. ఎలాంటి కష్టనష్టాలు రావు. అడ్డంకులు తొలగిపోయి, సుఖసంతోషాలతో గడిపేందుకు పరమశివుడు ప్రసాదించిన దివ్యమైన కానుక రుద్రాక్ష. ఆత్మసాక్షాత్కారాన్ని పొందడానికి రుద్రాక్ష అసలైన మార్గం చూపుతుంది. రుద్రాక్షను ఋషులు భూమికీ, స్వర్గానికీ మధ్య వారధిగా భావిస్తారు.

తీవ్రమైన మానసిక ఒత్తిడితో బాధపడుతున్నవారు. అనారోగ్య సమస్యలతో జారిపోతున్నవారు రుద్రాక్షలను ధరిస్తే వారి సమస్యలు మటుమాయమవుతాయి. అంతేకాదు, ఏవైనా వ్యసనాలకు లోనయినవారు తమ అలవాటు మంచిది కాదని తెలిసి, అందులోంచి బయట పడలేకపోతున్నట్లయితే రుద్రాక్షమాలను ధరిస్తే చాలా మంచి ఫలితముంటుంది. నొసటన విభూతి, కంఠాన రుద్రాక్షమాల ధరించి శివనామ జపం చేస్తున్న వ్యక్తిని దర్శించుకుంటే త్రివేణీ సంగమ స్నానం చేసినంత పుణ్యం కలుగుతుంది.

రుద్రాక్షలను సర్వపాపములనూ నశింపచేసే సరస్వతీ నదితో పోల్చారు మునులు. మెడ, చేతులు, చెవులకు, రుద్రాక్షలను ధరించినవారు ఏ అపజయాలు లేకుండా తిరుగులేనివారిగా భాసిస్తారు. ఎవరి మెడలో రుద్రాక్ష ఉంటుందో వారు ఈశ్వరానుగ్రహానికి పాత్రులవుతారని పురాణాలు చెబుతున్నాయి. రుద్రాక్షలపై ఉండే ముఖాల ఆధారంగా రుద్రాక్షలను ఇరవయ్యొక్క రకాలుగా విభజించారు. రుద్రాక్షలను ధరించిన వారు తప్పనిసరిగా పాటించవలసిన నియమాలు కొన్ని ఉన్నాయి,

1. రుద్రాక్షమాలను ధరించి మైలపడిన వారిని తాకకూడదు.
2. రుద్రాక్ష మాలను ధరించి శ్మశానానికి వెళ్లకూడదు.
3. కుటుంబసభ్యులు అయినప్పటికీ ఒకరి రుద్రాక్షమాలను మరొకరు ధరించకూడదు.
4. రుద్రాక్షమాలను ఉంగరంలో ధరించకూడదు.
5. రుద్రాక్షమాలను ధరించి నిద్రపోకూడదు.
6. రుద్రాక్షమాలను ధరించి శృంగారంలో పాల్గొనకూడదు.
7. స్త్రీలు రుతుసమయంలో రుద్రాక్షమాలను ధరించకూడదు.

రుద్రాక్షమాల ధారణవిధి:-
సోమవారం లేదా పుష్యమి నక్షత్రం నాడు లేదా ఏదైనా శుభసమయంలో రుద్రాక్షలను శుద్ధి చేసి శివపూజ చేయాలి. ఆ తర్వాతే రుద్రాక్షను ధరించాలి. రుద్రాక్షను ధరించిన వెంటనే ఏదో అద్భుతం జరిగిపోతుంది అని ఎదురుతెన్నులు చూస్తే ఫలితం ఉండదు. సత్వర ఫలితాన్ని ఆశించేవారు, రుద్రాక్షల పూర్తి సమాచారాన్ని సేకరించి, సిసలైన పద్ధతి ప్రకారం, గురువు సమక్షంలో ధరించి, సాధన చేయాలి.

రుద్రాక్షమాలను ధరించవలసిన తిథులు:-
పౌర్ణమి, త్రయోదశి, చతుర్దశి, మహాశివరాత్రి లేదా మాస శివరాత్రి నాడు ఈశ్వరుని రుద్రాక్షలతో పూజించడం మహాశ్రేష్టం. రుద్రాక్షలను ధరిస్తే సర్వదుఃఖాలు తొలగిపోతాయి. సకల సంపదలూ ఒనగూడుతాయని స్కాందపూరాణం చెబుతోంది. జావా, సమత్రా, ఇండోనేషియా, నేపాల్ మొదలైన చోట్ల, ఇండియాలో చాలా కొద్ది ప్రదేశాల్లో రుద్రాక్ష చెట్లు పెరుగుతాయి.

జన్మనక్షత్ర రీత్యా  ధరించవలసిన రుద్రాక్షలు:-

నక్షత్రము      ధరించవలసిన రుద్రాక్ష
అశ్వని           నవముఖి
భరణి             షణ్ముఖి
కృత్తిక            ఏకముఖి, ద్వాదశముఖి
రోహిణి           ద్విముఖి
మృగశిర        త్రిముఖి
ఆరుద్ర           అష్టముఖి
పునర్వసు      పంచముఖి
పుష్యమి        సప్తముఖి
ఆశ్లేష            చతుర్ముఖి
మఖ            నవముఖి
పుబ్బ          షణ్ముఖి
ఉత్తర           ఏకముఖి, ద్వాదశముఖి
హస్త           ద్విముఖి
చిత్త            త్రిముఖి
స్వాతి         అష్టముఖి
విశాఖ        పంచముఖి
అనురాధ    సప్తముఖి
జ్యేష్ఠ          చతుర్ముఖి
మూల       నవముఖి
పూర్వాషాఢ     షణ్ముఖి
ఉత్తరాషాఢ       ఏకముఖి లేదా ద్వాదశముఖి
శ్రవణం            ద్విముఖి
ధనిష్ట             త్రిముఖి
శతభిషం         అష్టముఖి
పూర్వాభాద్ర     పంచముఖి
ఉత్తరాభాద్ర      సప్తముఖి
రేవతి             చతుర్ముఖి


రుద్రాక్షలు కావలసిన వారు సంప్రదించవలసిన సెల్ నెం: 9966455872, 7659931592.

ఈ బ్లాగును సెర్చ్ చేయండి



Related Posts Plugin for WordPress, Blogger...