ఎటువైపు స్థలం కల్పుకోవచ్చు?
ఆస్తులు కొనుక్కోవాలనుకున్నప్పుడు... ఉంటున్న చోటుకు దూరంగా పోయి కొనుక్కునే కన్నా.. ఆనుకుని ఉన్న ఇళ్ళు. స్థలాలు అమ్మకానికి వస్తే కొనేసుకుని తమ ఆస్తిలో కల్పుకుందా అనుకుంటారు. అలా కల్పుకునే సమయంలో ప్రధానంగా లే అవుట్లలో ఫ్లాట్లు కొన్నవారు ఎక్కువగా ఈ సమస్యలకు లోనవుతుంటారు. ఇలాంటివారు వాస్తు నియమ విరుద్ధంగా స్థలాలను కొని తమ స్థలంలో కల్పుకోకూడదు. ఆ నియమాలు ఏమిటో తెల్సుకుందాం. మీ స్థలానికి... మీ ఇంటికి తూర్పున, ఉత్తరాన ఉన్న స్థలాన్ని ఇంటిని ఆలోచించకుండా కొని మీ స్థలంతో, లేదా మీ ఇంటితో నిశ్చింతంగా కలుపుకోమంటుంది వాస్తు. ఇలా మీ ఆస్తిని ఉత్తరం వైపుకు తూర్పు వైపుకు పెంచుకోవడం వాస్తురీత్యా ఎంతో శుభకరం. ఆరోగ్యం, ఆయుష్షు, ధనం ఇబ్బడి ముబ్బడిగా పెరిగి నట్టింట 'సిరి' నాట్యం చేస్తుంది. జీవితం మూడు పిందెలు... మూడొందల కాయలు అన్నట్లు ఉంటుంది.
ఇక దక్షిణక, పడమర దిశలో ఉన్న స్థలాలను కల్పుకోవడం లేదా ఇండ్లను కొనడం కానీ ఎట్టి పరిస్థితుల్లో చేయకండి. దక్షిణ దిశలో స్థలం అయితే ఉచితంగా వచ్చినా కల్పుకోరాదన్నది వాస్తు పండితులు చేస్తున్న హెచ్చరిక.
అలానే ఆగ్నేయం మూలనున్న స్థలం, నైఋతి మూలనున్న స్థలం, వాయువ్యమూలనున్న స్థలం ఊడా ఆనుకుని ఉన్నాయి కదాని ఎట్టి పరిస్థితుల్లో కాని కల్పుకోకుడదు. కల్పుకున్నారంటే జీవితంలో అన్నీ అవాంతరాలే. ఎన్నో ఎదురు దెబ్బలు.. ప్రధానంగా నైఋతీ మూలనున్న స్థలం ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరకే వచ్చినా అంగుళం కూడా కల్పుకోకుడదు.