Vastu Tips - 16
ఇంటికి సింహద్వారం
కాంపౌండ్‌వాల్‌కు నిర్మించుకున్న గేటు తర్వాత ఇంటికి ప్రధానమైన ద్వారానే సింహద్వారం అంటారు. ఇంట్లోకి ప్రధాన రాకపోకలను ఈ ద్వారం ద్వారానే జరుగుతాయి.
సింహద్వారం నిర్మించుకునే సమయంలో వాస్తు నియమలు విధిగా నిర్మించుకోవాలి.
1. సింహద్వారం......... ఇంట్లోని అన్ని ద్వారల కన్నా కొలతలలో పెద్దదిగా ఉండాలి. దీనికిఅమర్చే తలుపు కూడా బలిష్ఠంగా, దృఢంగా ఉండాలి. సింహద్వారం ఎట్టి పరిస్ధితిల్లో ఇంటికి ఉచ్ఛస్ధానంలో ఉండాలి. ఒకవేళ నిర్మాణ రీత్యా వీలుచిక్కక పోతేనే కనీసం మధ్యమ స్ధానంలో ఉండేలా జాగ్రత్త పడాలి.
2. నార్త్‌ఫేసింగ్ హౌస్‌కు సింహద్వారం నార్త్‌ఈస్ట్‌లోనే ఉండాలి. ఎట్టి పరిస్ధితిల్లో వాయువ్యంలో ఉండకూడదు.
3. సింహద్వారం మూలకు అమర్చకూడదు.మూల నుండి అడుగు, అడుగున్నర దూరంలో అమర్చకోవాలి.
4. వెస్ట్‌ఫేసింగ్ హౌస్‌కు పశ్చిమ వాయువ్యంలో సింహద్వారం ఏర్పరచుకోవాలి. పశ్చిమ నైఋతిలో ఎట్టి పరిస్ధితిలో సింహద్వారం ఏర్పాటు చేసుకోకూడదు.
5. సౌత్ ఫేసింగ్ ఇంటికి దక్షిణ ఆగ్నేయంలో సింహద్వారం అమర్చకోవాలి. దక్షిణ నైయుతిలో ఎట్టి పరిస్ధితిలో సింహద్వారం ఏర్పాటు చేసుకోకూడదు.
6. ఈస్ట్‌ఫేసింగ్ హౌస్‌కు సింహద్వారం తూర్పు ఈశాన్యంలో ఉండాలి. తూర్పు ఆగ్నేయంలో ఉండకూడదు.
7. సింహద్వారం ముందు ఎలాంటి అడ్డంకులు ఉండరాదు. కనీసం పూలకుండీలు కానీ, క్రీపర్స్ కానీ... సింహద్వారం ఎదురుగా ఉండకూడదు అలానే చెట్టు నీడలు కూడా సింహద్వారం పై పడకూడదు.
8. సింహద్వారం ఎప్పుడూ రోడ్ లెవల్‌కు ఎత్తులో ఉండి తీరాలి.
9. మెయిన్‌డోర్ వద్దకు చేరుకునేందుకు మెట్లు ఉన్నట్లయితే ఈ మెట్లు బేసి సంఖ్యలో ఉండాలి.
10. మెయిన్‌డోర్‌కు ఎదురుగా పాడుబడిన, వాడకుండా వదిలి వేయబడిన గృహాలు లేకుండా చూసుకోవాలి.
11. మన ఇంటి మెయిన్‌డోర్... ఎదుటి ఇంటి మెయిన్‌డోర్‌కు ఖచ్చితంగా ఆపోజిట్‌గా ఉండరాదు.
12. సింహద్వారం ... కాంపౌండ్‌వాల్‌కు అమర్చిన గేటు ఒకే దిశలో ఉండడం వాస్తు రీత్యా మంచిది.
13. సింహద్వారం యొక్క ఎత్తులో సగం వరకు వెడల్పు ఉండేలా సింహద్వారాన్ని తయారు చేసుకోవాలి. సింహద్వారం చెక్కతప్ప... ఇనుమువంటి లోహాలు వాడకూడదు.
14. మెయిన్‌డోర్ పై భాగంలో బాత్రూమ్ లావేటరీ వచ్చేలా పై అంతస్తులో నిర్మాణాలు చేయకూడదు.
15. సింహద్వారానికి స్లయిడింగ్ డోర్ వాడకూడదు.
16. ఇల్లంతా ఊడ్చి సింహద్వారం దగ్గర పోగు పెట్టడం... డస్ట్‌బిన్ సింహద్వారం దగ్గరలో ఉంచటం, చీపుర్లు, బూజు ర్రలు సింహద్వారం వెనుక ఉంచడం వాస్తురీత్యా మంచిదికాదు.
17. మెయిన్‌డోర్‌కు ఎదురుగా పాదరక్షలు విడువరాదు.
18. సింహద్వారం... పగుళ్ళుచ్చినా... తీసివేసేటపుడు కిర్రు శబ్దాలు చేసినా అది ఆ గృహంలో నివసించే వారికి మంచిది కాద.
19. మెయిన్‌డోర్‌కు సెల్ఫ్ క్లోజింగ్ సిస్టమ్ అమర్చకూడదు.
20. మీ సింహద్వారం ఎదురుగా దేవాలయం ఉండకూడదు.