-: మూల మంత్రం :-
ఓం హ్రీం హ్ర్సైం హ్రీం ఓం ఐం థీం క్లీం సౌః సరస్వత్య్తే స్వాహాః || |
శ్రీ మహా సరస్వతి యంత్రమును అర్చించు
వారు యంత్రమును రాగి రేకు పై కాని కాగితముపై కాని వ్రాసి పటము
కట్టించి యథా శక్తి గా ఉదయాస్తమయములందు షోడశోపచార పూజలు చేయుచున్న
గొప్ప గద్య పద్య రచన వాక్సుద్ధి , విద్య ప్రాప్తి , మేథా ధారణా శక్తి
తప్పక కలుగును.
శ్రద్ధా వంతులు ప్రతి నిత్యము ఆచమ్య , ప్రాణామాయ , గోత్ర దేశ కాల మాన
సంకీర్తణాధికముగా త్రి న్యాస పూర్వకముగా , పంచ పూజలొనర్చిన విశేష ఫలము
కలుగును.మూల మంత్ర జపముతో పాటు క్రింది తత్ గాయిత్రి ని కూడ జపదశాంశము
గావించిన మహోత్కృష్ట ఫలితములు తప్పక కలుగును.
ధ్యానము , మూల
మంత్రము , ఏ తత్ గాయిత్రి ఈ మూడింటిని అనునిత్యము అనుసరించు సాధకుడు
పొందలేని ఫలితమే లేదు. అనగా తలచినంతనే సాధకుని కృషి యత్నములనుసరించి మంత్ర
యంత్రములు పని సాధన లందు అనంత ఫల సాధకము లగును.
-: శ్రీ సరస్వతీ గాయత్రి :- వాగ్దేవ్యైచ విద్మహే బ్రహ్మపత్న్యైచ ధీమహితన్నోవాణీః ప్రచోదయాత్.// |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
parakrijaya@gmail.com