సూర్యడు:-
- చంద్రలగ్నంలోనే ఉంటే జాతకుడు కుటుంబానికి దూరంగా ఉంటాడు. పనులకు ఆటంకాలు కలుగుతాయి. అనవసరశ్రమ, అనారోగ్యం కలుగుతుంది.
- చంద్రలగ్నం లగాయతు రెండవరాశిలో ఉంటే అనవసరశ్రమ, అనారోగ్యం, అశాంతి కలుగుతాయి.
- చంద్రలగ్నం లగాయతు మూడవరాశిలో ఉంటే మిత్రుల సహకారం, ఉద్యోగంలో అభివృద్ధి, ధనలాభం, సుఖశాంతులు లభిస్తాయి.
- చంద్రలగ్నం లగాయతు నాలుగవరాశిలో ఉంటే కుటుంబంలో కలహాలు, ఋణబాధ కలుగుతాయి.
- చంద్రలగ్నం లగాయతు అయిదవరాశిలో ఉంటే బంధువియోగం , దుఃఖము, అశాంతి కలుగును.
- చంద్రలగ్నం లగాయతు ఆరవరాశిలో ఉంటే అనుకున్న పనులు నెరవేరుతాయి. ధనలాభం, కుటుంబంలో సుఖశాంతులు కలుగుతాయి. అనారోగ్యం కలుగుతుంది.
- చంద్రలగ్నం లగాయతు ఏడవరాశిలో ఉంటే అధికప్రయాణాలు, అనారోగ్యం, దాంపత్యసుఖం లేకపోవుట, ఆందోళన కలుగుతుంది.
- చంద్రలగ్నం లగాయతు ఎనిమిదవరాశిలో ఉంటే కుటుంబకలహాలు, అనారోగ్యం, అశాంతి, ధననష్టం కలుగుతాయి.
- చంద్రలగ్నం లగాయతు తొమ్మిదవరాశిలో ఉంటే అనవసర కలహాలు, మనశ్శాంతి లేకపోవుట, ధనవ్యయం కలుగుతాయి.
- చంద్రలగ్నం లగాయతు పదవరాశిలో ఉంటే అనుకున్న పనులు నెరవేరుతాయి. మిత్రులతో విందులు చేసుకుంటారు.
- చంద్రలగ్నం లగాయతు పదకొండవరాశిలో ఉంటే వృత్తిలో అభివృద్ధి, కుటుంబంలో ఆనందం, ధనలాభం కలుగుతాయి.
- చంద్రలగ్నం లగాయతు పన్నెండవరాశిలో ఉంటే మితులకు దూరంగా ఉంటారు. ఆందోళన, ధననష్టం కలుగుతుంది.
- రవి శుభస్థానములు 3,6,10,11
- రవి వేధాస్థానములు 9,12,4,3
- శుభస్థానములలో ఉన్నగ్రహము, ఆగ్రహము యొక్క వేధా స్థానములలో ఏదైనా గ్రహము ఉంటే శుభఫలితాన్ని ఇవ్వలేదు.
చంద్రడు:-
- చంద్రలగ్నంలోనే ఉంటే కుటుంబసౌఖ్యం, ఆరోగ్యం, గౌరవం కలుగుతుంది.
- చంద్రలగ్నం లగాయతు రెండవరాశిలో ఉంటే ధనవ్యయం, కార్యహాని, అపనిందలు, ఇతరులతో విభేదాలు కలుగుతాయి.
- చంద్రలగ్నం లగాయతు మూడవరాశిలో ఉంటే మిత్రుల సహకారమ్, ఉద్యోగంలో అభివృద్ధి, ధనలాభం, కుటుంబసౌఖ్యం కలుగుతాయి.
- చంద్రలగ్నం లగాయతు నాలుగవరాశిలో ఉంటే బంధువులతో విభేదాలు, కార్యహాని, ఆందోళన కలుగుతాయి.
- చంద్రలగ్నం లగాయతు అయిదవరాశిలో ఉంటే పనులు నెరవేరవు. అనారోగ్యము ఏర్పడుతుంది.
- చంద్రలగ్నం లగాయతు ఆరవరాశిలో ఉంటే నూతన వస్తువులు సమకుర్చుకుంటారు. బంధుమిత్రులతో వినోద కాలక్షేపం చేస్తారు. స్త్రీ సాంగత్యం కలుగుతుంది.
- చంద్రలగ్నం లగాయతు ఏడవరాశిలో ఉంటే బంధువుల సమాగమం, విలాస యాత్రలు చేయుట, స్త్రీసౌఖ్యం కలుగుతుంది.
- చంద్రలగ్నం ఎనిమిదవరాశిలో ఉంటే మానసిక ఒత్తిడి, అనారోగ్యం కలుగుతాయి.
- చంద్రలగ్నం తొమ్మిదవరాశిలో ఉంటే మానసిక ఆందోళన, నిరాశ, బలహీనత ఏర్పడుతాయి.
- చంద్రలగ్నం లగాయతు పదవరాశిలో ఉంటే అధికారంలో అభివృద్ధి, కుటుంబంలో సుఖసంతోషాలు, ఆర్థికాభివృద్ధి కలుగుతాయి.
- చంద్రలగ్నం లగాయతు పదకొండవరాశిలో ఉంటే నూతన వ్యక్తులతో పరిచయాలు, స్త్రీ సాంగత్యం, కుటుంబాభివృద్ధి కలుగుతాయి.
- చంద్రలగ్నం లగాయతు పన్నెండవరాశిలో ఉంటే మిత్రులతో విభేదిస్తారు. పనులు నెరవేరవు.
- చంద్రుడు శుభస్థానములు1,3,6,7,10,11
- వేధాస్థానములు 5,9,12,2,4,8
- శుభస్థానములలో ఉన్నగ్రహము, ఆగ్రహము యొక్క వేధా స్థానములలో ఏదైనా గ్రహము ఉంటే శుభఫలితాన్ని ఇవ్వలేదు.
కుజుడు:-
- చంద్రలగ్నంలోనే ఉంటే బంధువులతో తగాదాలు, ధననష్టం, కార్యహాని, కలుగుతాయి.
- చంద్రలగ్నం లగాయతు రెండవరాశిలో ఉంటే అధికారుల వలన భయం, అనవసరశ్రమ కలుగుతాయి.
- చంద్రలగ్నం లగాయతు మూడవరాశిలో ఉంటే అనుకున్న పనులు నెరవేరుతాయి. సంతానసుఖము, ఆరోగ్యం, ఉద్యోగంలో అభివృద్ధి కలుగుతాయి.
- చంద్రలగ్నం లగాయతు నాలుగవరాశిలో ఉంటే ఇతరులను నమ్మిమోసపోతాడు. అనారోగ్యం కలుగుతుంది.
- చంద్రలగ్నం లగాయతు అయిదవరాశిలో ఉంటే కుమారునివలన మనశ్శాంతి కోల్పోవుదురు. కోపము, బలహీనత కలుగును.
- చంద్రలగ్నం లగాయతు ఆరవరాశిలో ఉంటే కార్యసిద్ధి కలుగుతుంది. నూతన వస్తువులను సేకరిస్తారు.
- చంద్రలగ్నం లగాయతు ఏడవరాశిలో ఉంటే బంధుమిత్రులతో విభేదాలు, అశాంతి కలుగుతుంది.
- చంద్రలగ్నం ఎనిమిదవరాశిలో ఉంటే నిరాశ, అశాంతి, అనారోగ్యం కలుగుతాయి.
- చంద్రలగ్నం తొమ్మిదవరాశిలో ఉంటే ప్రయాణాలు, ధననష్టం, అవమానము, ఆందోళన కలుగుతాయి.
- చంద్రలగ్నం లగాయతు పదవరాశిలో ఉంటే ప్రయాణాలు, ధననష్టం, అవమానము, ఆందోళన కలుగుతాయి.
- చంద్రలగ్నం లగాయతు పదకొండవరాశిలో ఉంటే అనుకున్న పనులు జరుగుతాయి. భూ, ధనలాభం, స్త్రీసౌఖ్యం పొందుతారు.
- చంద్రలగ్నం లగాయతు పన్నెండవరాశిలో ఉంటే అధిక ధనవ్యయం, స్త్రీలతో వైఅరం కలుగుతాయి.
- కుజుడు శుభస్థానములు 3,6,11
- కుజుడు వేధాస్థానములు12,9,5
- శుభస్థానములలో ఉన్నగ్రహము, ఆగ్రహము యొక్క వేధా స్థానములలో ఏదైనా గ్రహము ఉంటే శుభఫలితాన్ని ఇవ్వలేదు.
బుధుడు:-
- చంద్రలగ్నంలోనే ఉంటేనీచులతో స్నేహం, బంధువులతో విరోధం, ఆస్తినష్టం కలుగుతుంది.
- చంద్రలగ్నం లగాయతు రెండవరాశిలో ఉంటే అనుకున్న పనులు నెరవేరుతాయి. ధనలాభం కలుగుతుంది. కాని అవమానం పొందుతారు.
- చంద్రలగ్నం లగాయతు మూడవరాశిలో ఉంటే మిత్రుల సహకారం లభిస్తుంది. బంధువులతో, అధికారులతో విభేదాలు కలుగుతాయి. ధనవ్యయం జరుగుతుంది.
- చంద్రలగ్నం లగాయతు నాలుగవరాశిలో ఉంటే బంధు, మిత్రుల సహకారం, దనము, సుఖము లభించును.
- చంద్రలగ్నం లగాయతు అయిదవరాశిలో ఉంటే కుటుంబం లో కలహాలు, అశాంతి ఏర్పడుతాయి. సుఖసంతోషాలు లభిస్తాయి.
- చంద్రలగ్నం లగాయతు ఆరవరాశిలో ఉంటే నాయకుడు అవుతాడు. ధనవృద్ధి కలుగుతుంది. సుఖ సంతోషాలు లభిస్తాయి.
- చంద్రలగ్నం లగాయతు ఏడవరాశిలో ఉంటే కార్యహాని, కలహాలు, ధనవ్యయం, అశాంతి కలుగుతాయి.
- చంద్రలగ్నం ఎనిమిదవరాశిలో ఉంటే అధికారుల అండ లభిస్తుంది. అనుకున్న పనులు నెరవేరును. ఆనందం పొందుతారు.
- చంద్రలగ్నం తొమ్మిదవరాశిలో ఉంటే బద్దకం పెరుగుతుంది. నీచకార్యాలపై ఆసక్తి కలుగుతుంది.
- చంద్రలగ్నం లగాయతు పదవరాశిలో ఉంటే ఉద్యోగాభివృద్ది, కీర్తి, ధనము లభిస్తాయి.
- చంద్రలగ్నం లగాయతు పదకొండవరాశిలో ఉంటే నూతన వ్యక్తుల పరిచయం, సంఘం లో గౌరవం ఏర్పడుతాయి. అనుకున్న పనులు సాధిస్తారు.
- చంద్రలగ్నం లగాయతు పన్నెండవరాశిలో ఉంటే కుటుంబంలో సమస్యలు, శత్రువుల వలన బాధలు, అపజయము కలుగుతాయి.
- బుధుడు శుభస్థానములు 2,4,6,8,10,11
- బుధుడు వేధాస్థానములు 5,3,9,1,7,12
- శుభస్థానములలో ఉన్నగ్రహము, ఆగ్రహము యొక్క వేధా స్థానములలో ఏదైనా గ్రహము ఉంటే శుభఫలితాన్ని ఇవ్వలేదు.
గురుడు:-
- చంద్రలగ్నంలోనే ఉంటే ప్రయాణాలు, ధనవ్యయం, ఆందోళన, బంధువులతో విభేదాలు కలుగుతాయి.
- చంద్రలగ్నం లగాయతు రెండవరాశిలో ఉంటే స్త్రీసౌఖ్యం, అధికారం లభిస్తాయి. ధనార్జన ఉంటుంది.
- చంద్రలగ్నం లగాయతు మూడవరాశిలో ఉంటే స్థానచలనము, పనులకు ఆటంకాలు ఏర్పడుతాయి
- చంద్రలగ్నం లగాయతు నాలుగవరాశిలో ఉంటే ఉద్యోగంలో ఇబ్బందులు, అధికారం కోల్పోవుట, ఆందోళన కలుగుతాయి.
- చంద్రలగ్నం లగాయతు అయిదవరాశిలో ఉంటే మిత్రుల సహకారం, ధనము, అదికారము లభించును. శుభకార్యములు నెరవేర్చుదురు.
- చంద్రలగ్నం లగాయతు ఆరవరాశిలో వుంటే శ్రమపడినా ఫలితం దక్కదు. దాంపత్యసుఖం లభించదు.
- చంద్రలగ్నం లగాయతు ఏడవరాశిలో ఉంటే సమాజంలో గౌరవం, కుటుంబ సుఖం, ధనలాభం కలుగుతాయి.
- చంద్రలగ్నం ఎనిమిదవరాశిలో ఉంటే ప్రయాణాలు, అనవసర శ్రమ, ధననష్టం కలుగుతాయి.
- చంద్రలగ్నం తొమ్మిదవరాశిలో ఉంటే అనుకున్న పనులు జరుగుతాయి. కుటుంబసఖము, అధికారము లభిస్తాయి.
- చంద్రలగ్నం లగాయతు పదవరాశిలో ఉంటే వృత్తిపరంగా, కుటుంబపరంగా ఇబ్బందులు కలుగుతాయి.
- చంద్రలగ్నం లగాయతు పదకొండవరాశిలో ఉంటే ఉద్యోగం, అధికారం, దనము, సుఖము లభిస్తాయి.
- గురుడు శుభస్థానములు 2,5,7,9,11
- గురుడు వేధాస్థానములు 12,4,3,10,8
- శుభస్థానములలో ఉన్నగ్రహము, ఆగ్రహము యొక్క వేధా స్థానములలో ఏదైనా గ్రహము ఉంటే శుభఫలితాన్ని ఇవ్వలేదు.
శుక్రుడు:-
- చంద్రలగ్నంలోనే ఉంటే కుటుంబసుఖం, విద్యాభివృద్ధి, ఉద్యోగం లభిస్తాయి.
- చంద్రలగ్నం లగాయతు రెండవరాశిలో ఉంటే కుటుంబంలో ఆనందం, ధనలాభం, సుఖశాంతులు లభిస్తాయి.
- చంద్రలగ్నం లగాయతు మూడవరాశిలో ఉంటే నూతన పరిచయాలు, సంఘంలో గౌరవం కలుగుతాయి. అధికారం లభిస్తుంది.
- చంద్రలగ్నం లగాయతు నాలుగవరాశిలో ఉంటే మిత్రులతో వినోదయాత్రలు చేస్తారు. ధాన్యలాభం, సుఖశాంతులు పొందుతారు.
- చంద్రలగ్నం లగాయతు అయిదవరాశిలో ఉంటే మిత్రుల సహకారంతో అనుకున్న పనులు నెరవేరుతాయి.
- చంద్రలగ్నం లగాయతు ఆరవరాశిలో ఉంటే ధనవ్యయము అవుతుంది. ఋణము చేస్తారు.
- చంద్రలగ్నం లగాయతు ఏడవరాశిలో ఉంటే స్త్రీల వలన సమస్యలు, ఇబ్బందులు ఏర్పడుతాయి.
- చంద్రలగ్నం ఎనిమిదవరాశిలో ఉంటే మిత్రుల కలయిక, ధనము, స్త్రీసౌఖ్యం, ఆరోగ్యం లభిస్తాయి.
- చంద్రలగ్నం తొమ్మిదవరాశిలో ఉంటే మిత్రులు సహకరిస్తారు. అనుకున్న పనులు నెరవేరుతాయి. సుఖశాంతులు కలుగుతాయి.
- చంద్రలగ్నం లగాయతు పదవరాశిలో ఉంటే మిత్రులు సహకరిస్తారు. ఉద్యోగరీత్యా శుభప్రదం. వ్యసనాల వలన అవమానాలు పొందుతారు.
- చంద్రలగ్నం లగాయతు పదకొండవరాశిలో ఉంటే మిత్రులు సహకరిస్తారు. స్త్రీ సౌఖ్యం లభిస్తుంది.
- చంద్రలగ్నం లగాయతు పన్నెండవరాశిలో ఉంటే స్త్రీలతో పరిచయాలు, అధికవ్యయం కలుగుతుంది. అనుకున్న పనులు జరగవు.
- శుక్రుడు శుభస్థానములు 1,2,3,4,5,8,9,10,12
- శుక్రుడు వేధాస్థానములు 8,7,1,10,9,5,11
- శుభస్థానములలో ఉన్నగ్రహము, ఆగ్రహము యొక్క వేధా స్థానములలో ఏదైనా గ్రహము ఉంటే శుభఫలితాన్ని ఇవ్వలేదు.
మందుడు(శని):-
- చంద్రలగ్నంలోనే ఉంటే దూరప్రయాణాలు, అనారోగ్యం, పనులకు ఆటంకాలు కలుగుతాయి.
- చంద్రలగ్నం లగాయతు రెండవరాశిలో ఉంటే ఆర్థికంగా ఇబ్బందులు, అనారోగ్యం, అశాంతి కలుగుతాయి.
- చంద్రలగ్నం లగాయతు మూడవరాశిలో ఉంటే అనుకున్న పనులు నెరవేరుతాయి. ఇతరులవలన తన పనులు జరుగుతాయి. అనారోగ్యం కలుగుతుంది.
- చంద్రలగ్నం లగాయతు నాలుగవరాశిలో ఉంటే పనులకు ఆటంకాలు ఏర్పడును. అనవసరంగా ధనవ్యయం జరుగును.
- చంద్రలగ్నం లగాయతు అయిదవరాశిలో ఉంటే భార్యకు అనారోగ్యం కలుగుతుంది. అనవసరంగా ధనం వ్యయమవుతుంది.
- చంద్రలగ్నం లగాయతు ఆరవరాశిలో ఉంటే ఆరోగ్యం, ధనలాభం, కుటుంబసౌఖ్యం కలుగుతుంది.
- చంద్రలగ్నం లగాయతు ఏడవరాశిలో ఉంటే ప్రయాణాలు, అలసట, అనారోగ్యం కలుగుతాయి.
- చంద్రలగ్నం ఎనిమిదవరాశిలో ఉంటే కుటుంబ సమస్యలు ఏర్పడుతాయి.
- చంద్రలగ్నం తొమ్మిదవరాశిలో ఉంటే అధికారుల వలన బాధలు అనవసర ప్రయాణాలు, అనారోగ్యం కలుగుతుంది.
- చంద్రలగ్నం లగాయతు పదవరాశిలో ఉంటే ఉద్యోగం లభిస్తుంది. నీచకార్యాలపై ఆసక్తి కలుగుతుంది.
- చంద్రలగ్నం లగాయతు పదకొండవరాశిలో ఉంటే కుటుంబసుఖము, గౌరవము, ధనము లభిస్తాయి.
- చంద్రలగ్నం లగాయతు పన్నెండవరాశిలో ఉంటే అనవసర శ్రమ, అనారోగ్యం, ధననష్టం కలుగుతాయి.
- శని శుభస్థానములు 3,6,11
- శని వేధాస్థానములు 12,9,5
- శుభస్థానములలో ఉన్నగ్రహము, ఆగ్రహము యొక్క వేధా స్థానములలో ఏదైనా గ్రహము ఉంటే శుభఫలితాన్ని ఇవ్వలేదు.
రాహువు:-
- చంద్రలగ్నంలోనే ఉంటే అనారోగ్యం, ప్రాణాపాయం కలుగుతాయి.
- చంద్రలగ్నం లగాయతు రెండవరాశిలో ఉంటే ధననష్టం కలుగుతుంది.
- చంద్రలగ్నం లగాయతు మూడవరాశిలో ఉంటే సుఖశాంతులు కలుగుతాయి.
- చంద్రలగ్నం లగాయతు నాలుగవరాశిలో ఉంటే కష్టములు కలుగుతాయి.
- చంద్రలగ్నం లగాయతు అయిదవరాశిలో ఉంటే ధననష్టము కలుగును.
- చంద్రలగ్నం లగాయతు ఆరవరాశిలో వుంటే కుటుంబ సుఖము, సంతోషము కలుగుతాయి.
- చంద్రలగ్నం లగాయతు ఏడవరాశిలో ఉంటే పనులు నెరవేరవు. ధననష్టం జరుగుతుంది.
- చంద్రలగ్నం ఎనిమిదవరాశిలో ఉంటే అనారోగ్యం, ఆపద కలుగుతాయి.
- చంద్రలగ్నం తొమ్మిదవరాశిలో ఉంటే పనులు నెరవేరవు. ధననష్టం కలుగుతుంది.
- చంద్రలగ్నం లగాయతు పదవరాశిలో ఉంటే కార్యసిద్ధి కలుగుతుంది.
- చంద్రలగ్నం లగాయతు పదకొండవరాశిలో ఉంటే కుటుంబసుఖము, స్త్రీ సాంగత్యం లభిస్తుంది.
- చంద్రలగ్నం లగాయతు పన్నెండవరాశిలో ఉంటే పనులు నెరవేరవు. అనవసర శ్రమ, ధనవ్యయం కలుగుతాయి.
కేతువు:-
- చంద్రలగ్నం లగాయతు రెండవరాశిలో ఉంటే అనారోగ్యం కలుగుతుంది.
- చంద్రలగ్నం లగాయతు మూడవరాశిలో ఉంటే అనారోగ్యము, ధనవ్యయము కలుగుతుంది.
- చంద్రలగ్నం లగాయతు నాలుగవరాశిలో ఉంటే ధనము, సుఖము లభించును.
- చంద్రలగ్నం లగాయతు అయిదవరాశిలో ఉంటే కుటుంబ సుఖము, ధనము, ఆరోగ్యము లభించును.
- చంద్రలగ్నం లగాయతు ఆరవరాశిలో ఉంటే ధనవ్యయం కలుగును.
- చంద్రలగ్నం లగాయతు ఏడవరాశిలో ఉంటే అనారోగ్యం, ఆపద కలుగుతాయి.
- చంద్రలగ్నం లగాయతు ఎనిమిదవరాశిలో ఉంటే ధననష్టం కలుగుతుంది.
- చంద్రలగ్నం లగాయతు తొమ్మిదవరాశిలో ఉంటే బంధుమిత్రులు సహకారం లభిస్తుంది.
- చంద్రలగ్నం లగాయతు పదవరాశిలో ఉంటే ధనవ్యయం , బాధలు కలుగుతాయి.
- చంద్రలగ్నం లగాయతు పదకొండవరాశిలో ఉంటే ఆర్ధిక ఇబ్బందులు కలుగుతాయి.
- చంద్రలగ్నం లగాయతు పన్నెండవరాశిలో ఉంటే కుటుంబసుఖము, ధనార్జన ఉంటుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
parakrijaya@gmail.com