శ్రీ మేధా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం

మీరు జన్మించిన తేది, సమయం, ప్రదేశం ఈ మూడు సమాచారములు మాకు తెలియచేసినచో మీ వ్రుత్తి,వ్యాపార,ఆరోగ్య,ఆర్ధిక పరిస్తితులు, దాంపత్యం, విద్య, ఉద్యోగ, వివాహ, కుటుంబవ్యవహారాలు, సంతానం, రాజకీయ వ్యవహారాలు,ప్రేమ వ్యవహారములు,కుజ దోషం, కాలసర్ప దోషం మరియు వివాహ, ఉపనయన, గృహప్రవేస, జప, హోమ, వ్రత, అన్నప్రసన, నామకరణం లకు ముహూర్తములు పెట్టబడును. P.V.RADHAKRISHNA CELL :+91 9966455872, Mail us : parakrijaya@gmail.com

15, ఆగస్టు 2013, గురువారం

పంచాంగ సాధారణ నియమాలు


 అధిక మాస క్షయమాసములందు విడువతగినవి :

సోమయాగాది కర్మాణి నిత్యాన్యపి మలిమ్లుచే, తదైవాగ్రయణాధాన చాతుర్మాయాది కాన్యపి|| మహాలయాష్టకా శ్రాద్ధోపాకర్మాద్యపికర్మయత్, స్పష్టమాస విశేషాఖ్య విహితం వర్జయేన్మలే || "అగ్న్యాధనం ప్రతిష్ఠాంచ యజ్ఞదాన వ్రతానిచ, వేద వ్రత వృషోత్సర్గ చూడాకర్మణి మేఖలాః|| మాంగల్య మభిషేకంచ మలమాసే వివర్జయేత్, గృహ ప్రవేశ గోదాన స్థానాశ్రమ మహోత్సవం|| వాపీ కూప తడాకాది ప్రతిష్ఠాం యజ్ఞ కర్మచ, న కుర్యాన్మల మాసేతు సంనర్పాహస్పతౌ తధా" || ఈ విధమైన ఆధారములు పరిశీలించగా మూలమాసమందు క్షయమాసము నందును మౌఢ్యకాలమునందువలెనే (పైన చెప్ప బడిన) కార్యములను విడువవలెను.

ఋణ విషయం :

ఋణములు ఇవ్వవలెను అన్నచో స్వాతీ పునర్వసు, విశాఖ, పుష్యమి, శ్రవణం, ధనిష్ఠ, శతబిషం, అశ్వనిల యందు చిత్త, రేవతి, అనూరాధ, మృగశిర, చర, లగ్నములందు లగ్నాత్ కోణ స్థానమందు శుభగ్రహములు ఉండగాను లగ్నాత్ అష్టమ స్థానమందు గ్రహములు లేకుండా చూసి ఋణములు ఈయవలెను. మంగళ, బుధ వారముల యందు సంక్రమణము లందును హస్తా నక్షత్రముతో కూడిన ఆదివారమునందు ఋణములు తీసుకొన్నయెడల ఆరుణము తీసుకొన్నయెడల ఆ ఋణము తీర్చుట కష్టము. వృద్ధినామ యోగము వున్నరోజున అప్పు తీసుకోకూడదు. త్రిపుష్కరము అనగా శని, ఆది, మంగళ వారములలో ఒక రోజు త్రిపాద నక్షత్రము, భద్రతిధిని కలిపి ద్విపుష్కరం అంటారు. ఈ పై రెండు విశేషములలోను ఋణములు పుచ్చుకొనకూడదు. మంగళ వారం ఋణం తీర్చుట విశేషము. దారుణ, ఉగ్ర, సాధారణ, స్థిర నక్షత్రములందు భద్రకరణము నందు, పాతలమందు వృద్ధికోసం యిచ్చే ధనం తిరిగి పొందబడదు.

ఏకవింశతి మహాదోషములు

1 పంచాంగశుద్ది 11 సగ్రహ చంద్ర
2 సంక్రాంతి దోషం 12 దుర్ముహూర్తం
3 పాపార్గళం 13 ఖర్జూరి చక్రం
4 కునవాంశ 14 గ్రహణభ దోషం
5 కుజాష్టమం 15 ఉత్పాతభం దోషం
6 భృగషట్కం 16 క్రూరయగ్ధిష్ణి
7 కర్తరీ దోషం 17 అశుభ విద్ధ
8 అష్టమ లగ్నం 18 విషఘటిక
9 అష్టమచంద్రుడు 19 లగ్నాస్త దోషం
10 గండాస్త దోషం 20. 6,8,12 స్థిత చంద్ర, 21వ్యతీపాత వైధృతి

ఔషధసేవ :

హస్తత్రయే పుష్య పునర్వసౌచ విష్ణుత్రయే చాశ్వినీ పౌషణ భేషు | మిత్రేందు మూలేషుచ సూర్యవారే భైషజ్యముక్తం శుభ వావాసరేపి|| హస్త చిత్త స్వాతి, పుష్యమి, పునర్వసు, శ్రవణ, ధనిష్ఠ, శతభీషం, అశ్వనీ, రేవతి, అనూరాధ, మృగశిర, మూలా నక్షత్ర దినములయందును " శుద్ధేరిః ఫద్యున మృతిగృహే నత్తిధౌనోజనేర్ క్షే" లగ్నాత్ పన్నెండు సప్తమ, అషటమ స్థానములందు గ్రహములు లేకుండగాను ఔషధసేవ ప్రారంభం చేయ వలెను. జన్మనక్షత్రంలో ఔషధసేవ చేయకూడదు.

కొన్ని సాధారణ నియమాలు

మౌనం పాటించవలసిన కాలము.

ప్రభాతే మైధునేచైవ ప్రసావే దంతధావనే
స్నానేన భోజనేకాలే మౌనంషట్స విధేయతే ||
ప్రభాత కాలమునందు, మైదాన కాలంలోను, మల మూత్ర విసర్జన సమయంలోను, దమ్తావఏధాన సమయంలోను, స్నానము చేయునప్పుడు, భోజనం చేయునప్పుడు మౌనంగా వుండాలి.
" కుర్యాన్మాత్ర పురేషేతు రౌత్రౌచే ద్దక్షిణాముఖః దినా ఉదజ్మఖ!"
మూత్రపురీషాదులు రాత్రి సమయంలో దక్షిణ ముఖంగా కూర్చొని పగటికాలంలో ఉత్తరముఖంగా కూర్చొని విసర్జించవలెను. అయితే ఉత్తర, దక్షిణ ముఖములుగా మలమూత్ర విసర్జించవలెనని వాస్తు శాస్త్రం చెబుతుంది.

జన్మ నక్షత్రము లో చేయదగిన కార్యములు

జన్మ నక్షత్రము నిషేకము, యాగము, చౌలకర్మ, అన్నప్రాసన, వ్యవసాయము, ఉపనయనం, రాజ్యపట్టాభిషేకం, భూసంపాదన, అక్షరాభ్యాసం నందు శుభప్రధము. పుంసవనం, సీమంతం, యుద్ధము, గర్భదానం, శ్రౌద్ధము, క్షౌరము, ఔషధ సేవ, ప్రయాణముల అందు అశుభప్రధం. స్త్రీలకు వివాహ విషయమై శ్రేష్ఠము.
దోషం - శాంతి మంత్రం
ఆరోగ్య సమస్యలు వున్ననూ ||
పిల్లలకు దృష్టిలోపం వున్ననూ, గర్భిణీలకు గర్భరక్షణ కోసం
మానసిక అశాంతి ఎక్కువగా వున్ననూ
విభూధి చేతపట్టుకొని 41 సార్లు పారాయణం చేసి
విభూధి ముఖమున ధరించిన శాంతి లభించును.
శ్రీమద నృశింహ విభవే గరుడ ధ్వజాయ
తాపత్రయో శమనామ భవౌషధాయ
తృష్నాది వృశ్చికజలగ్ని భజంగరోగ
క్లేశ వ్యయాయ హరయే గురవేనమస్తే
పిల్లలకు మాటలు రాగానే ఈ శ్లోకం నేర్పి వారి చేత నిత్యం పారాయణం చేయిస్తే, దృష్టి దోషం, నరఘోష, భూత బాధ దగ్గరకు రావు ఆరోగ్యంగా వుంటారు.


నవరత్నములు ధరించవలసినవారి నక్షత్రములు

వైఢూర్యం :అశ్విని, మఘ, మూల పుష్యరాగం :పునర్వసు,విశాఖ,పూర్వాభాద్ర పచ్చ:ఆశ్రేష,రేవతి,జ్యేష్ఠ నీలం:పుష్యమి,ఉత్తరాభాధ్ర,అనూరాధ కెంపు: కృత్తిక,ఉత్తర,ఉత్తరాషాడ వజ్రం:భరణి,పుబ్బ,పూర్వాషాఢ గోమేధికం:ఆర్ద్ర,స్వాతి,శతభిషం పగడం:మృగశిర,చిత్త,ధనిష్ఠ ముత్యం:రోహిణి,శ్రవణం,హస్త

నవవస్త్రాభరణధారణ :

విప్రాజ్ఞయందు, ఉత్సవముల యందు ఈ క్రింద చెప్పిన తిధివార నక్షత్ర సంభంధం లేకుండా వస్త్రభూషణం చేయవచ్చును. రేవతి, రోహిణి, ఉత్తర, ఉత్తరాషాఢ, ఉత్తరాభాద్ర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనూరాధ, ధనిష్ఠ, పునర్వసు, పుష్యమి యందు రిక్తేతర తిదుల యందు, ఆది, సోమ, బుధ, గురు, శుక్రవారముల యందును నూతన వస్త్రధారణ మాంచిది. మంగళవారం ఎర్రని వస్త్రములు ధరించుటకు మంచిది. పునర్వసు, పుష్యమి నక్షత్రములందు దృవనక్షత్రములయందును, మంగళవారము నందును సౌభాగ్యవతియగు స్త్రీ నూతన వస్త్రాభరణధారణ చేయకూడదు.

మౌఢ్యమునందు విడువవలసిన కార్యములు

వ్యాపారం, తటాక, కూప, గృహారంభ, గృహప్రవేశములు, వ్రతారంభ, వ్రతోద్యాపన, వధూప్రవేశ, మహాదాన సోమయాగాష్టకా శ్రాద్ధములు సంచయన, ప్రధమో పాకర్మ వేధవ్రతములు, కామ్య వృషోత్సర్గ వివాహాదుల, దేవతా ప్రతిష్ఠలు, దీక్షోపనయన, చూడా కర్మలు, కర్మలు, అపూర్వ దేవతీర్ధ దర్శనము, సన్యాగ్రహణము, అగ్నిస్వీకారము, రాజ దర్శనము, రాజ్యాభిషేకము, యాత్ర, సమావర్తనము, కర్ణవేధనలు చేయకూడదు. అయితే మాస ప్రాధాన్యములైన సీమంతము పుంసవనం, నామకరణం, అన్నప్రాశన వంటివి చేయవచ్చును.

శూన్యమాస విచారణ

మీనములో రవి ఉండగా చైత్ర మాసము, మిధునంలో వుండగా ఆషాడమాసము, కన్యలో రవి ఉండగా భాద్రపద మాసము, ధనుస్సులో ఉండగా పుష్యమాసము శూన్యమాసములు.

సముద్ర స్నానం

సముద్రే పర్వసు స్నాయా దయాయాంచ విశేషతః|
పాపైర్విముచ్యతే సర్వై రమాయాం స్నానమాచరన్||
సముద్రమందు పూర్ణమ, అమావాస్య మొదలగు పర్వములందే స్నానం చేయవలెను. శుక్ర, మంగళ వారములు నిషేధము. "ఆకామావై పౌర్ణిమ" గా పిలువబడు ఆషాఢపౌర్ణిమ, కార్తీక పౌర్ణిమ, మాఘ పౌర్ణిమ, వైశాఖ పౌర్ణీమలు సముద్రస్నానమునకు విశేషమైనపర్వములు. "అశ్వత్థ సాగరౌసేవ్యౌ సస్పర్శస్తు కదాచన. అశ్వత్థం మందవారేచ సముద్ర పర్వణి స్పృశేత్" అశ్వత్థ వృక్షమును సముద్రమును సర్వదా సేవించవలెను కాని స్పృశించకూడదు. శనివారం అశ్వత్థ వృక్షమును పర్వములందు సముద్రమును స్పృశించ వచ్చును. వ్రతాచరణ నిమిత్తంగా అశ్వత్థ (రావి) వృక్షమును స్పృశింపవచ్చును.

సేవకా సయ్యాది విషయము :

పాదుకలు, ఆసనములు, మంచములు వాడుక విషయంలో దృవ, క్షిప్ర, మృదునక్షత్రములను శ్రవణం, భరణి, పునర్వసు నక్షత్రములయందును, మంచితిధుల యందును వాడకం ప్రారంభించుట మంచిది. క్షిప్ర, దృవ నక్షత్రముల యందును, అనూరాధ పుష్యమి నక్షత్రముల యందును, బుధ, గురు, శుక్ర, ఆదివారముల యందును, సేవాకార్యం నౌకరీ ప్రారంభించవలెను. శుభలగ్నమందును దశమ ఏకాదశస్ఠః ఆనములందును రవి లేక కుజుడు వుండగా ప్రారంభించవలెను.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

parakrijaya@gmail.com

ఈ బ్లాగును సెర్చ్ చేయండి



Related Posts Plugin for WordPress, Blogger...