blog post from :
http://vaasthuvidya.blogspot.in/2009/11/blog-post.html
Prof. Kodali Srinivas
గృహ నిర్మాణాలలో నూతన వరవడికి శ్రీకారాన్ని చుట్టి, నగరాలలో పట్టణాలలోస్థలాన్ని,ధనాన్ని ఆదా చేసే అపార్ట్ మెంట్స్ కు మన దేశంలో వాస్తు జబ్బు తగులుకుంది. ఈ వాస్తు వల్ల నిర్మాణ వ్యయం పెరగటమే కాకుండా నివాసానికి అసౌకర్యంగా ఉంటున్నాయి. ఈ అపార్ట్ మెంట్స్ కు మన ప్రాచీన వాస్తు వర్తించదన్న విషయం తెలియక చాలా మందిఅనవసర ఆందోళనలకు లోనౌతున్నారు.

ఈ నాడు బహుళ ప్రజాదరణ పొందుతున్న ఈ అపార్ట్ మెంట్స్ దాదాపూ మూడు వందల ఏళ్ల క్రితం యూరప్ లో మొదలై నేడు ప్రపంచమంతా వ్యాపించాయి. నేడు కోట్లాది మందిఈ అపార్ట్ మెంట్స్ లో నిక్షేపం గా జివిస్తున్నారన్నది పరమ సత్యం. వారందరికి కలగని కస్టనష్టాలు మనకి మాత్రమే వస్తాయనుకోవటం సరికాదు.
నిజానికి ఒక గోడను ఆసరాగా చేసుకొని రెండు ఇళ్లు కట్టుకోవటానికి కుడా వాస్తు తప్పు పడుతుంది. అలాంటిది ఎన్నో గృహాల సముదాయం అయిన ఈ ఆధునిక అపార్ట్ మెంట్స్ కి మన ప్రాచీన వాస్తు తో ముడి వేసి లేనిపోని చిక్కులు తెచ్చుకోవటం విజ్ఞత ఎంత మాత్రం కాదు.
ఆ గ్నేయం లో అగ్ని అని కిచెన్ రూమ్, నైరుతిలో బరువు అని మాస్టర్ బెడ్ రూం,ఈశాన్యమ్ లో పూజ, ఉచ్చంలో నడక అని డోర్లు, కారిడార్లు ... వగైరా పది పడికట్టు వాస్తు సూత్రాలను పట్టుకొని, ఇవే వాస్తు అనే వారి మాటలకు విలువ ఇచ్చి కోరి కస్టాలు కొని తెచ్చుకోకండి.
నిజానికి అపార్ట్ మెంట్స్ లో ప్రతి ఫ్లాట్ ను ఒక ఇల్లుగా పరిగణిస్తూ, వాటికి ఇంటి వాస్తును దిశలను బట్టి
పాటిస్తూ నిర్మించిన అపార్ట్ మెంట్స్ లో గాలి,వెలుతురు సరిగా ఉండదు.
ఒక్కో అపార్ట్ మెంట్ కు ఒక్కో ఓరియంటేషన్ పాటించాలి. అన్నిటికి పొయ్యి
ఆగ్నేయం లోనే అంటే ఎలా?
నిజానికి
అపార్ట్ మెంట్స్ లో చూడవలిసినది,ప్రాధాన్యం ఇవ్వవలిసింది వాస్తుకి కాదు.
దాని నాణ్యత, పటిష్టత, సౌకర్యం, సౌందర్యం. వీటికే తొలిప్రాధాన్యం ఇవ్వాలి.
పైన పటారం లోన లొటారం అని వాస్తు ముసుగులో నాసి రకం అపార్ట్ మెంట్స్ ను
నిర్మించి వాస్తు బలం చూపుతూ అంట గట్టే వారికి దూరం గా ఉంటే మంచిది.
పూర్వం ఎప్పుడో దేశ,కాల పరిస్తుతులను బట్టి రూపొందించిన వాస్తు సూత్రాలు నేడు అన్నిటికి పనికి వస్తాయనటం సరికాదు. కాల దోషం పట్టిన వాస్తును వదిలి విశ్వవ్యాప్తంగా
ఆమోదించిన నవీన సాంకేతిక విజ్ఞాన్నిఅపార్ట్ మెంట్స్ నిర్మాణం లో సాదరంగా
స్వాగతించండి. ఆధునిక జీవనాన్ని సుఖవంతంగా ఉండేలా చూసుకోండి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
parakrijaya@gmail.com