జ్యోతిష పరంగా లగ్నాన్ని శిశువు జన్మించిన కాలాన్ని అనుసరించి
గణించబడుతుంది. లగ్నం అంటే జాతక చక్రంలో మొదటి స్థానం. లగ్నం అంటే జాతకుని
శిరోస్థానాన్ని సూచిస్తుంది. గుణగణాలు రూపు రేఖలు లగ్నం అందు ఉన్న గ్రహాలను
అనుసరించి పండితులు నిర్ణయిస్తారు. దశమ స్థానం మరియు కేంద్ర స్థానానమైన
దశమాధిపతి సూర్యుడు, ధనస్థానమైన రెండవ మరియు పుత్ర స్థానం త్రికోణ స్థానం
అయిన పంచమ స్థానాధిపతి గురువు, యోగకారకుడు మరియు త్రికోణ స్థానాధిపతి అయిన
చంద్రుడు వృశ్చిక లగ్నానానికి శుభం కలిగిస్తారు. సప్తమ స్థానాధిపతి మరియు
వ్యయ స్థానమైన ద్వాదశ స్థానాలకు అధిపతి అయిన శుక్రుడు, అష్టమ స్థానాధిపతి
మరియు లాభాధిపతి అయిన బుధుడు ఈ లగ్నానికి అశుభం కలిగిస్తారు.శిశువు వృశ్చిక
లగ్నంలో జన్మించినపుడు లగ్నంలో ఉపస్థితమైన గ్రహాలను అనుసరించి పండితులచేత
చెప్పబడిన కొన్ని ఫలితాలను క్రింది జాబితాలో పరిశీలించ వచ్చు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
parakrijaya@gmail.com