శ్రీ మేధా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం

మీరు జన్మించిన తేది, సమయం, ప్రదేశం ఈ మూడు సమాచారములు మాకు తెలియచేసినచో మీ వ్రుత్తి,వ్యాపార,ఆరోగ్య,ఆర్ధిక పరిస్తితులు, దాంపత్యం, విద్య, ఉద్యోగ, వివాహ, కుటుంబవ్యవహారాలు, సంతానం, రాజకీయ వ్యవహారాలు,ప్రేమ వ్యవహారములు,కుజ దోషం, కాలసర్ప దోషం మరియు వివాహ, ఉపనయన, గృహప్రవేస, జప, హోమ, వ్రత, అన్నప్రసన, నామకరణం లకు ముహూర్తములు పెట్టబడును. P.V.RADHAKRISHNA CELL :+91 9966455872, Mail us : parakrijaya@gmail.com

23, అక్టోబర్ 2013, బుధవారం

ఇదో రంగుల ప్రాపంచిక సత్యం

                                        

                                                                                                                      

     
                           
 

పసుపు  రంగు మీకు ఇష్టమైనదైతే మీది ఉహాత్మక మస్తిష్కం . మీ ఆలోచనా  సరళి  పారదర్శకమై నిర్మణాత్మకమై ఉంటుంది. వాదనతో జయించి గెలిచే మనస్తత్వం మీది. సాధారణంగా లజ్జ గలిగి ఏకాంతంగా గడపాలనుకుంటారు. మీరు నమ్మదగిన వారు, కానీ కోర్కెలను అణుచుకుని మీశక్తి సామర్ధ్యాలు  ప్రకటించు కుంటారు. పైకి మీరు ధర్మరాజ మనస్కులు.  

 

                   
 నీలం రంగు మీకు ఇష్టమైనదైతే మీరు సంకుచిత మనస్కులు ఐనా ఆహ్లాదంగా గడుపుతూ సౄజనాత్మక రీతిని నెలకొల్పే నమ్మకాలను కలిగి ఉంటారు. మీకు ఓర్పు లేదనే చెప్పాలి. నిత్య కౄత్యాలు చేయడంలో మీకు ఇష్టత సుముఖత తక్కువ, బుద్ధి కుశాగ్ర, ఊహా జనిత ప్రచోదిత విషయాలపై మీరు ఆశక్తులు. 

 

గులాబీ రంగు మీకు ఇష్టమైనదైతే మీరు ఎంత కుశాగ్ర బుద్ధి కలవారో అంత సంయమనం లేనివారిగా ఉంటారు. సూక్ష్మాతి సూక్ష్మంగా పరికిస్తూ మీదైన క్రమశిక్షణా పద్ధతిని పనితీరును కలిగి ఉంటారు. మీకంటే చిన్నా పెద్దలిద్దరూ మీరు చేసే ప్రతి పనిపై ఆశక్తి కలిగి ఉంటారు. మీరు హాస్యంగా ఉండడాన్ని ఇష్ట పడుతూ హాస్యాన్ని ప్రస్తుతిస్తారు కూడా, నిర్మాణాత్మక శక్తి కలిగిన గర్వితులు మీరు.
   


  గోధుమ రంగు మీకు ఇష్టమైనదైతే శుద్ధాంతిక సైద్ధాంతిక వ్యక్తిత్వం కలవారు. సరళీకౄత విధానాలు సాంసర్గిక ప్రచోదనాలతో ఇనుమడించే మీ గౌరవ ప్రతిపత్తులు ఎందరినో ప్రేమించే టట్లుగా అనుసరించే టట్లుగా చేస్తాయి, కానీ మీ స్నేహ శీలత కొందరికే పరిమితం  సైద్ధాంతిక జీవన సత్యాన్ని మీరు ఎల్లప్పుడూ అనుసరిస్తారు.




ఎరుపు రంగు మీకు ఇష్టమైనదైతే విప్లవాత్మక భావాలతో శారీరక శక్తులతో మీరు సమౄద్ధులు , కానీ మీ స్పందనలు అంత రసవంతము కాదు. మీ నిరాశావాద ధోరణి జీవితంలో నిర్ణయాలను ప్రకటించలేదు.కొన్ని సందర్భాలలో మిమ్ము మీరే విసుగుకుంటూ నిందా గర్భితముగా మాట్లాడతారు. యెడతెరిపిలేని ఆలోచనాత్మకత ప్రకౄతి ఆరాధన మీకిష్టమైనవి .మీ భావజాల ధోరణి మీది.
 

  
 ఆకుపచ్చ రంగు మీకు ఇష్టమైనదైతే  వౄద్ధాప్యాన్ని, చేతగాని తనాన్ని అసహ్యించుకుంటూ టక్కున పట్టుబడే విధంగా నలుగురిలో మీ మాటల ధోరణి ఉంటుంది. ఒంటరితనం మీకు నచ్చదు ఏదో ఒక సాహచర్యాన్ని మీరు కోరుకుంటారు ఎప్పుడూ ఒకేలా ఉండడం మీకిష్టపడదు వేగ వంతమైన మార్పులు  మార్గాలు మీకిష్టం . కళాత్మక సౄజనత్మక ఆసక్తులు మీరు, కానీ  ఆ సంసర్గత లేని జీవన విధానం మీది. మరో మాటగ చెప్పాలంటే మీ పట్టుదల తక్కువ.

  
 తెలుపు రంగు మీకు ఇష్టమైనదైతే మీరు తప్పక అనుసరిస్తున్నారు సర్వసాధారణ జీవనశైలి , కానీ మీ అభినివేశం ఆలోచనా ధోరణి అందరికి అందనిది. ప్రకృతి ప్రేమికులు అనేకన్నా మీరు అందాన్ని పొగుడుతూ ప్రేమిస్తూ చూస్తూ ఉంటారు. మీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని మీకు ఇష్టమైనదిగా మలుచుకోవడంలో మీకు మీరే సాటి.

 


నలుపు రంగు మీకు ఇష్టమైనదైతే రహస్యాత్మకమైన పోలికలేని ఆలోచనా ధోరణితో సతమతమౌతూ వౄధా జీవనాన్ని గడిపేస్తూ ఉంటరు, కానీ స్వాధికారత గలిగిన బుద్ధి మీది. సలహాలిచ్చే వారంటే మీకు చాలా చికాకు. ఖర్చు చేయడంలో మీకంటూ మీ విధానం మీది. అదే విధంగా సంపాదనా పటిమ కూడా మీది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

parakrijaya@gmail.com

ఈ బ్లాగును సెర్చ్ చేయండి



Related Posts Plugin for WordPress, Blogger...