ముత్యము
మంచి జాతి ముత్యాలు చంద్రగ్రహానికి చాలా ప్రీతిప్రదము. చంద్రుడు జలగ్రహమై
తెల్లని వర్ణము గలవాడగుట వలన జలము వల్ల పుట్టి సమాన వర్ణచ్ఛాయలు గల
ముత్యములు చంద్ర సంభంధములై యున్నవి. అదీగాక పంచ భూతాలలో నీటికిసంభంధించిన
విభాగమునందే చంద్రుడు ముత్యము గూడా నున్నవి. ఈ ముత్యము త్రిదోషములందలి
కఫదోషములను పోగొట్టగలదు. అపానవాయువు సంకేతముగా గలది. స్త్రీజాతికి
సంభంధించిన దగుటవలన బహుసుకుమారమై ఆకర్షణీయముగా వుంటుంది. శరీరమునందలి
స్వాధిష్ఠాన చక్రమునందలి కాంతి పుంజము లేవికలవో అవి ఈ ముత్యంలో కూడాకలవని
శాస్త్ర వచనము ముత్యము చూచుటకు తెలుపురంగు కలిగి ఉన్నప్పటికీ దీనినుండి
వెలువడే కాంతితరంగాలు ఆకుపచ్చరంగులో నుంటవి. కావున స్వాధిష్ఠాన చక్రమునందలి
ఆకుపచ్చరంగు కాంతికిరణాలు శరీరము నందంతటను వ్యాపించి, వాత దోషములు హృదయ
దౌర్భల్యమును మానసిక చింతను పోకర్చి ఆరోగ్యము కలిగింపగలవు, ఈ కాంతి
ప్రసారశక్తి సన్నగిల్లినప్పుడు, వాత ప్రకోపముచే అనేక
వ్యాధులుత్పన్నములుకాగలవు.
రోహిణి, హస్త, శ్రవణం అను నక్షత్రములందు పుట్టిన వారు ఏ సమయమునందైనను, ముత్యములను ధరించవచ్చును ఇతర జాతకులలో ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్ర జాతకులు తప్ప తక్కిన వారందరూ ముత్యముధరించుట వలన ఇబ్బందియునుండదు. అయిననూ జన్మజాతక గ్రహములయొక్క స్థితిగతులను విచారించి దశాంతర్దశములు - గోచారము బాగుగా పరిశీలించి చంద్రగ్రహము దోషముగానున్న సమయములందీ ముత్యములను ధరించిన యెడల చంద్రగ్రహములవల్ల కలిగే సకల అరిష్టములు తొలగి శుభంకలుగుతుంది.
జనకలమునందేర్పడిన జాతక చక్రమునందు చంద్రగ్రహమునకు 6-8-12 స్థానాధి పత్యములు కల్గుట. లేక ఆస్థానములందుండుట, ఆ స్థాఅనాధిపతుల యొక్క దృష్టి, కలయిక సంభవించుటవల్ల దోషప్రదుడగుచున్నాడు. అంతేగాక రెండవస్థానమున కాధిపత్యముకలిగి ఎనిమిదవ స్థానమునందుండుట అష్టమాధిపత్యము వహించి ద్వితీయమునందుండుట వలన కూడా చంద్రుడు అపకార మొనర్చుట కవకాశములున్నవి. వీటికితోడుగా షడ్వర్గబలము లోపించుట, అష్టక వర్గమునందు హీనబిందువులు కలుగుట. కేమదృమాది దుర్యోగములు ప్రప్తించుట మొదలుగాగల లక్షణములు చంద్రుని దుష్టత్వమును అధికము గావించగలవు.
చంద్రుడు దుష్టలక్షణములతో కూడియుండి అతని యొక్క దశగానీ, ఇతర శుభదశలం దాతని అంతార్దశలుగానీ సంభవించినకాలము మరియు గోచారవశమున కాలసర్ప యోగము సంభవించిన కాలమునందలి చంద్రగ్రహ సంచార సమయము బహుదుష్ట లక్షనములు గలిగి అనేక విషయ పరిణామములు, వ్యతిరేక ఫలితములు కలుగుచుండగలవు. ఆ దుష్ట సమయములందు ముఖ్యముగా వ్యాపార స్థంభన నష్టము, ధనహీనత, భాగ్యనాశనము, గృహకల్లోలములు దంపతులకు కలహము స్పర్థలు, వివేక శూన్యత మనశ్శాంతి లోపించుట, వాతాధిక్యత, నిద్రపట్టకపోవుట, పిచ్చి పిచ్చి ఆలోచనలు, భవిష్యత్ శూన్యంగా నుండుట, మనోభయము, అజీర్ణ హృదయ సంభంధ వ్యాధులు, వివాహాటంకములు, వృత్తిలో ప్రతికూలత, అపజయము, మాతృస్త్రీకలహములు మొదలగు దుఃఖజనకమైన ఫలితములు కలుగుచుంటవి. అట్టి సమయములందు మంచి ఆణిముత్యమును ధరించుటవల్ల చంద్రగ్రహ దుష్టత్వము నశించి శుభములు కలుగుతవి.
ముత్యముల ద్వారా కలిగే శుభయోగాలు :
ముత్యములలో కల్లా శ్రేష్ఠమైనట్టి ఆణిముత్యమువంటి ఉత్తమజాతి ముత్యములను శాస్త్రీయ పద్ధతుల ననుసరించి ధరించిన యెడల ప్రశాంతత, మనశ్శాంతి, వీర్యవృద్ది, దాంపత్య సౌఖ్యము. అన్యోన్యత, అధిక జ్ఞాపకశక్తి, సద్భుద్ది, గౌరవ మర్యాదలు పొందగల్గుట, స్త్రీ జనరంజనము, ధైర్యముగా పురోగమించుట, కుటుంబ సుఖసంతోషాలు, ధన ధాన్యాభివృద్ధి, సౌభాగ్యసంపదలు కల్గుట, ఆటంకములంతరించి నిర్విఘ్నముగా అన్ని పనులు నెరవేరుట, వివాహాది శుభకార్యములు కలసి వచ్చి సంతోషము కల్గుట జరుగగలవు. ఈ ముత్యధారణవల్ల కుష్ఠు, అపస్మారము, పిచ్చి, బొల్లి, చర్మవ్యాధులు, క్షయ, ఉబ్బసము, మేహవ్యాధి, కీళ్ళ వాతము, అజీర్ణ భాధలు మొదలగున వన్నియు నివారింపబడి శీఘ్రముగా ఆరోగ్యవంతులు కాగలరు. చంద్రుడు వ్యాపారములకు కొంత సంభంధించి యుండుట వలన వ్యాపార నష్టములను నిరోధించి వ్యాపారాభివృద్ధిని కలిగించుటకు కూడా ముత్యధారణ ఉత్తమమై ఉన్నది.
ముత్యము ధరించే పద్ధతి :-
ముత్యాలు అనేక రకాలుగా నున్నప్పటికీ నీటిచ్ఛాయలు గలిగి తెల్లనై గుండ్రంగా నుండి ప్రకాశించే ఆణిముత్యాలు ధరించడానికి బహుశ్రేష్ఠమైనవి. ముత్యమునకు బరువు ఇంత ఉండాలి అనే నియమం లేక పోయినప్పటికీ ఎంత పెద్దవిగా ఉంటే అంత మంచిది. అదీగాక ఒకే ముత్యం ముత్యం ధరించేటప్పుడు పెద్దదిగా చూచి ధరించడం అవసరం దండలు, మాలలుగా ధరించే ముత్యాలు అనేకంగాబట్టి అవి చిన్నా, పెద్దా వున్నాదోషంలేదు.
ముత్యాలను బంగారం లేదా వెండి లోహాలతో చేయబడిన నలుచదరపు ఉంగరంలో ఇమిడ్చి ధరించాలి. శ్రావణశుద్ద పౌర్ణమినాడు శ్రవణ నక్షత్రంలో గానీ, లేక పూర్ణిమ సోమవారం గానీ, చంద్ర గ్రహణ సమయంలో గానీ, వృషభ రాశిలో చంద్రుడు ఏకదశస్థానంలో నుండగా గానీ, చంద్రహోర జరిగే సమయంలో గానీ, వర్జము దుర్ముహుర్తము లేకుండాచూచిమంచి ముత్యము ఉంగరమునందు బిగించాలి. ఆ తర్వాత ఆ ఉంగరము ఒక దినమంతయు ఆవుపాలలో ఉంచి మరుసటిరోజు మంచి నీటితో శుద్దిగావించాలి.
ధరించేవాడు తమకు తారాబలము చంద్రబలములు బాగుగా నుండిన శుభతిధులలో సోమవారం లేక శుక్రవారం రోజున వృషభ, కర్కాటక, ధనుర్మీన లగ్నమునందు ఉంగరము (పూజించి) ధరించవలెను, ఉంగరమును నిర్ణయించిన శుభసమయమునందు ధరించుటకు ముందుగానే యధావిధిగా పూజించి, నమస్కరించి, గురువుని, గణపతిని, చంద్రగ్రహమును ధ్యానించి కుడివైపునగల అరచేతిలో నుంచుకొని "ఓం వం ఐం హ్రీం శ్రీం జూం సః చంద్రమనే స్వహా"అనే మంత్రాన్ని నిశ్చలంగా 108 పర్యాయములు జరిపించిన పిదప ఆ ఉంగరమును ముమ్మారు కనులకద్దుకొని కుడిచేతి ఉంగరపు వ్రేలికి ధరించాలి స్త్రీలు మాత్రం ఎడమ చేతి ఉంగరపు వ్రేలికి(అనామిక)ధరించడం చాలా విశేషము స్త్రీలుగాని, పురుషులు గానీ ముత్యములను మాలలుగా ఇతర ఆభరణములుగా గానీ ధరించుట గూడా పైవిధానము ప్రకారమే పూజించి ధరించవలెను. ఉండరమునందలి అడుగుభాగం రంద్రముగా నుండినయెడల ముత్యమునందలి శక్తి సంపన్నమైన దివ్యకిరణములు శరీరమునందు ప్రవేశించి ఫలసిద్దికి తోడ్పడగలదు.
ముత్యం
ముత్యములను పరీక్షించుట:
ముత్యాలు దొరుకు ప్రదేశం:
ముత్యాలకు వివిధ నామాలు:
వ్యాపారనామం - పెరల్, దేశీయనామం - పెరల్, మోతి
ముత్యం లక్షణాలు:
చంద్రగ్రహ దోష నివారణ
చంద్రగ్రహ దోష నివారణకు చంద్రుని పూజించుట,దుర్గా దేవి ఉపాసించుట,బియ్యం దానం చేయుట,ముత్యము ఉంగరమున ధరించుట గాని,మాలగా వేసుకొనుట గాని చేయవలయును.సీసము,తెల్లని ఆవు, ముత్యములు, తెల్లని వస్త్రము నేయితో నింపిన కలశము,ఎద్దులలో ఎదేని ఒకటి సోమవారము దానము చేసినచో చంద్రునకు సంభంధించిన దోషము పోవును. వట్టివేర్లు,దిరిసెన గంధము,కుంకుమ పూవు,రక్తచందనము కలిపి శంఖువు నందు పోసిన నీటి చేత స్నానము చేసినచో చంద్ర దోషము పరిహారము కలుగును.సీసపు ఉంగరము ,వెండి ఉంగరము గాని ధరించుట మంచిది.
శుభ తిధి గల సోమవారము నందు ఓం-శ్రాం-శ్రీం-శ్రౌం-సః చంద్రయనమః అను మంత్రమును 40 జపము చేసి చివరి రోజున అనగ 41వ రోజున బియ్యం,తెల్లని వస్త్రము నందు పోసి దానము చేసినచో చంద్ర దోష నివారణ కలుగును.
శ్రీగణేశాయ నమః|
అస్య శ్రీచన్ద్రాష్టావింశతినామస్తోత్రస్య గౌతమ ఋషిః,
సోమో దేవతా, విరాట ఛన్దః, చన్ద్రప్రీత్యర్థే జపే వినియోగః|
చన్ద్రస్య శ్రృణు నామాని శుభదాని మహీపతే|
యాని శ్రృత్వా నరో దుఃఖాన్ముచ్యతే నాత్ర సంశయః|| ౧||
సుధాకరశ్చ సోమశ్చ గ్లౌరబ్జః కుముదప్రియః|
లోకప్రియః శుభ్రభానుశ్చన్ద్రమా రోహిణీపతిః|| ౨||
శశీ హిమకరో రాజా ద్విజరాజో నిశాకరః|
ఆత్రేయ ఇన్దుః శీతాంశురోషధీషః కలానిధిః|| ౩||
జైవాతృకో రమాభ్రాతా క్షీరోదార్ణవసమ్భవః|
నక్షత్రనాయకః శమ్భుశిరశ్చూడామణిర్విభుః|| ౪||
తాపహర్తా నభోదీపో నామాన్యేతాని యః పఠేత్|
ప్రత్యహం భక్తిసంయుక్తస్తస్య పీడా వినశ్యతి|| ౫||
తద్దినే చ పఠేద్యస్తు లభేత్సర్వం సమీహితమ్|
గ్రహాదీనాం చ సర్వేషాం భవేచ్చన్ద్రబలం సదా|| ౬||
|| ఇతి శ్రీచన్ద్రాష్టావింశతినామస్తోత్రం సమ్పూర్ణమ్||
శ్రీగణేశాయ నమః|
అస్య శ్రీచన్ద్రకవచస్తోత్రమన్త్రస్య గౌతమ్ ఋషిః|
అనుష్టుప్ ఛన్దః, శ్రీచన్ద్రో దేవతా, చన్ద్రప్రీత్యర్థం జపే వినియోగః|
సమం చతుర్భుజం వన్దే కేయూరముకుటోజ్జ్వలమ్|
వాసుదేవస్య నయనం శఙ్కరస్య చ భూషణమ్|| ౧||
ఏవం ధ్యాత్వా జపేన్నిత్యం శశినః కవచం శుభమ్|
శశీ పాతు శిరోదేశం భాలం పాతు కలానిధిః|| ౨||
చక్షుషీ చన్ద్రమాః పాతు శ్రుతీ పాతు నిశాపతిః|
ప్రాణం క్షపాకరః పాతు ముఖం కుముదబాన్ధవః|| ౩||
పాతు కణ్ఠం చ మే సోమః స్కన్ధే జైవాతృకస్తథా|
కరౌ సుధాకరః పాతు వక్షః పాతు నిశాకరః|| ౪||
హృదయం పాతు మే చన్ద్రో నాభిం శఙ్కరభూషణః|
మధ్యం పాతు సురశ్రేష్ఠః కటిం పాతు సుధాకరః|| ౫||
ఊరూ తారాపతిః పాతు మృగాఙ్కో జానునీ సదా|
అబ్ధిజః పాతు మే జఙ్ఘే పాతు పాదౌ విధుః సదా|| ౬||
సర్వాణ్యన్యాని చాఙ్గాని పాతు చన్ద్వోऽఖిలం వపుః|
ఏతద్ధి కవచం దివ్యం భుక్తిముక్తిప్రదాయకమ్|
యః పఠేచ్ఛృణుయాద్వాపి సర్వత్ర విజయీ భవేత్|| ౭||
|| ఇతి శ్రీచన్ద్రకవచం సమ్పూర్ణమ్||

ఇది
చంద్రునికి ప్రతీకగా చెప్పబడినది. ముత్యములు ఎక్కువగా ముత్యపు చిప్పల
నుండి లభిస్తాయి. షెల్ ఫిష్ అనబడే నత్తజాతికి చెందిన డిప్పలు కలిగిన ఒక
రకం చేప నుండి లభిస్తాయి. స్వాతిముత్యములు అని మనవాళ్ళు చెప్పుతుంటారు.
స్వాతి కార్తెలో ఆ ముత్యపు చిప్పలు విచ్చుకొని సముద్రం మీద
తేలియాడుతున్నప్పుడు ఆకాశం నుండి రాలే వాన చినుకు చిప్పలో పడి కొద్ది
రోజులకు ముత్యంగా మారుతుందని మనకి చాలా మంది చెబుతుంటారు. నిజానికి ఆకాశం
నుండి జారిపడే స్వాతి చినుకులు ముత్యంగా మారవు. సముద్రంలో 'పెరల్
ఆయెస్టర్స్' అని పిలువబడే ఓ రకమైన గుల్ల చేప వుంటుంది. ఇసుక,
పెంకుముక్కలు, రాళ్ళు తన మీద వాలినప్పుడు ఆ జలచరానికి జలదరింపు
కలుగుతుంది. దాంతో ఆయెస్టర్ ఆ ఆబ్జక్ట్ (పదార్ధం)ని వదిలించుకోవడానికి ఒక
విధమైన ద్రవాన్ని ఆ ప్రాంతంలో విడుదల చేస్తుంది. కాల్షియం కార్బొనేట్ తో
కూడిన ఆ ద్రవాన్ని 'నేకర్' అంటారు. ఈ విధంగా విసర్జింపబడిన ద్రవాలు కొద్ది
సంవత్సరాకు "ముత్యాలు'గా రూపుదిద్దుకుంటాయి. ఐతే ప్రస్తుతం ఇలా దొరికే
సహజ సిద్ద ముత్యాలకన్నా, పంటగా పండించబడే ముత్యాలే ఎక్కువగా
దొరుకుతున్నాయి. జపనీయులు ఈ ముత్యాల పంటకు ఆద్యులు. సుమారుగా వంద
సంవత్సరాల నుండి ముత్యాలపంట మొదలైంది. 'అకోయా' అయోస్టర్ అనే జపాన్ తీర
ప్రాంతంలో దొరుకుతాయి. ముత్యాల పంటకోసం ముత్యాల రైతులు ఈ అయోస్టర్
పట్టుకుని 'ఆబ్జెక్ట్' తాకిస్తారు. దాంతో ఆ అయోస్టర్ ఎప్పటిలాగా 'నేకర్'
ని విడుదల చేయడం దాంతో ముత్యం తయారుకావడం మొదలవుతుంది. పిన్ టాడా అనే అతను
బాగా ప్రాచ్యుర్యం చేశాడు. ఉప్పు నీటిలో సహజంగా ఉత్పత్తి అయ్యేవాటిలోనే
మంచి 'గ్లో' వుంటుంది.
జపాన్
లో మొదలైన ముత్యాలపంట ఇతర ప్రాంతాలకు వ్యాపించింది. ముత్యాలు క్రీమ్,
తెలుపు, సిల్వర్, గోల్డ్, బ్లూ షేడ్స్, గులాబీ రంగుల్లో దొరుకుతాయి. నలుపు,
ఎరుపు, ముత్యాలు కూడా దొరుకుతాయి. 'తహితి' ప్రదేశంలో ప్రత్యేకించి నలుపు
రంగు ముత్యాలు దొరకడం విశేషం. వ్యవసాయం ద్వారా పండించబడే ముత్యాల కన్నా
సహజంగా దొరికే ముత్యాలు పదిరెట్లు ఎక్కువ ఖరీదును కలిగి ఉంటాయి. దాని సైజు,
షేప్, కలర్, షేడ్స్ ను బట్టి ముత్యాల ధరను నిర్ణయిస్తారు. పర్ఫెక్ట్
రౌండ్ వున్న ముత్యం విలువైన షేప్ గా పరిగణించబడగా, సిమెంట్రి కర్ డాప్ర్,
పియర్ షేప్, బరున్ షేప్ లు కూడా మంచి అకారంగానే చెప్పుకుంటారు. ముత్యములు
వివిధ చోట్ల దొరుకుతాయి.
“జలధర ఫణిఫణ కీచక
జలచర కరి మస్తకేక్షు శంఖ వరాహో
జ్జ్వల దంష్ట్ర శుక్తు లుదరం
బుల ముత్యము లొదవు వర్ణములు వివిధములై"
తా:
ముత్యములు మేఘములందును, పాముల యొక్క పడగల యుండును, వెదురు బొంగులందును,
మత్స్యమూలా శిరస్సులందును చెరుకు గడల యందును, శంఖములందును, అడవిపంది
కోరలయందును లభిస్తాయి. ముత్యపు చిప్పలందు మాత్రమే మంచి ముత్యములు లభించును.
ముత్యములకు ఆకార విశేషంబులను బట్టి అణియనియు, సుతారమనియు, సుపాణియనియు మూడు విధములగు భేదములు జన్మలక్షణంబును బట్టి గలవు.
ముత్యంలో దోషాలు:
దృశ్యం - త్రికోణాకారంలో వున్నవి
పార్శ్వకము - గుంటలు వున్నవి
త్రివృత్తము - మూడు పొరలుగా వున్నవి
కాకపాణి - నలుపు రంగులో వున్నవి
వికటపీఠము - చిన్న చిన్న బోడిపలతో వున్నవి
విద్రుమము - ఎరుపు రంగులో వున్నవి
జఠరము - కాంతి వంతము లేకుండా వున్నవి
ధూమ్రాంకం - మబ్బు రంగులో వున్నవి
మత్స్యాక్షి - చేప కన్నువలె ఉన్నవి
శుర్తికా స్పర్శము - ఇసుక రేణువులతో వున్నవి
ముత్యములను పరీక్షించుట:
ఉప్పును
గోమూత్రంలో కలిపి అందు ముత్యములను నానబెట్టి వరి ఊకతో చక్కగా తోమినప్పుడు
పగిలిపోయినచో అవి కృత్రిమ ముత్యములనియు, పగులకుండ మెరుపు మొలకల వలె
క్రొత్తఛాయతో ప్రకాశించునని. సహజ ముత్యములని పిలువబడును.
ముత్యాలు దొరుకు ప్రదేశం:
వర్షియన్
గల్ఫ్, శ్రీలంక, ఆస్ట్రేలియా, వియత్నాం, జపాన్, ఇండోనేషియా, థాయ్ లాండ్,
మలేషియా, చైనా, వెనిజులా, పనామా, దక్షిణ భారతదేశంలో ముత్యాలు దొరుకుతాయి.
జాపాన్ ముత్యాలు ఉత్పత్తి ప్రారంభించిన మొదటి దేశంగా గుర్తింపు పొందినా,
ఆస్ట్రేలియా ముత్యాల ఉత్పత్తిలో అగ్రస్థానంలో వుంది.
సహజ
సిద్ధమైన ముత్యాలను, ఇమిటేషన్ ముత్యాలను కొంతవరకు సులభంగానే గుర్తించవచ్చు,
సహజమైన ముత్యాలు మృదువుగా వుంటాయి. అదే కృత్రిమ ముత్యాలు గట్టిగా, పంటి
మీద రుద్దితే ఇసుకలాంటి పొడిని రాలుస్తాయి. పంటల ద్వారా పండించే ముత్యాల
మీద సహజముత్యాలకుండే స్థాయిలో నేకర్ లేయర్ వుండదు. పంట ముత్యాలలో ఆఫ్
మిల్లీ మీటర్ కన్నా తక్కువగా ఈ లేయర్ వుంటుంది. కాబట్టి ఈ పంట ముత్యాలు
జ్యోతిషపరంగా తక్కువ ఫలితాలు ఇస్తాయని అంటారు.
ముత్యాలు
మనిషి మానసిక స్థితిని, జ్ఞాపక శక్తిని పెంచి, కోపాన్ని కంట్రోల్
చేస్తాయి. అలాగే అవి మనిషిలోని ఆధ్యాత్మిక, ధ్యానశక్తిని పెంచి
పోషిస్తాయి. మంచి ముత్యాలు ధరించడం వల్ల మనిషికి సంపద, సంతానభాగ్యం, పేరు
ప్రఖ్యాతులు, అదృష్టం, ఆరోగ్యం కలుగుతాయని నమ్మకం. ముత్యాలను వెండిలో
పొదిగి సోమవారం ధరించడం మంచిది. ముత్యాన్ని చేతి ఉంగరపు వ్రేలుకి ధరించాలి.
ముత్యాలకు వివిధ నామాలు:
వ్యాపారనామం - పెరల్, దేశీయనామం - పెరల్, మోతి
ఇతర నామాలు - మౌలికం, కటశర్కర, కువలము, క్షీరాబ్దిజము, గాంగేప్తి, భౌతికం, ముక్త ముత్తియము, ముత్తెము, హురుముంజి అనే పేర్లు గలవు.
ముత్యం లక్షణాలు:
రసాయన
సమ్మేళనం - CaCO3, H2O (82 – 86% CaCO3 ఆర్గోనైట్, 10 – 14% కన్ బి లైన్,
2-4 నీరు), వర్ణం - తెలుపు, నలుపు, ఉతర వర్ణాలు, వర్ణమునకు కారణం -
లెడ్, జింక్, పోరోఫెథైన్స్ , మోటాలో పోలోఫెరైన్స్, మెరుపు - పొలి
కఠినత్వము, - 3.5 నుండి 40, ధృడత్వము - గుడ్, సాంద్రత (S.G) – 2.65 to
2.85, ఏకలేక ద్వికిరణ ప్రసారము (SR/DR). SR/Agg, పగులు - అసమానం, అంతర్గత
మూలకాలు లేవు, కాంతి పరావర్తన పట్టిక (RI) 1.530 1.685 అతినీలలోహిత
కిరణాల పరీక్ష (U.V.Light) జడం నుండి బలంగా, సాదృశ్యాలు - ప్లాస్టిక్,
గాజు.దీనిలో బసారాముత్యాలకు బరువును చావ్ లలో కోలుస్తాటు. ఇది 1.259
క్యారెట్ లు ఇది కల్చర్ కూడా చేస్తారు.
చంద్రగ్రహ దోష నివారణకు చంద్రుని పూజించుట,దుర్గా దేవి ఉపాసించుట,బియ్యం దానం చేయుట,ముత్యము ఉంగరమున ధరించుట గాని,మాలగా వేసుకొనుట గాని చేయవలయును.సీసము,తెల్లని ఆవు, ముత్యములు, తెల్లని వస్త్రము నేయితో నింపిన కలశము,ఎద్దులలో ఎదేని ఒకటి సోమవారము దానము చేసినచో చంద్రునకు సంభంధించిన దోషము పోవును. వట్టివేర్లు,దిరిసెన గంధము,కుంకుమ పూవు,రక్తచందనము కలిపి శంఖువు నందు పోసిన నీటి చేత స్నానము చేసినచో చంద్ర దోషము పరిహారము కలుగును.సీసపు ఉంగరము ,వెండి ఉంగరము గాని ధరించుట మంచిది.
శుభ తిధి గల సోమవారము నందు ఓం-శ్రాం-శ్రీం-శ్రౌం-సః చంద్రయనమః అను మంత్రమును 40 జపము చేసి చివరి రోజున అనగ 41వ రోజున బియ్యం,తెల్లని వస్త్రము నందు పోసి దానము చేసినచో చంద్ర దోష నివారణ కలుగును.
|| చన్ద్రాష్టావింశతినామస్తోత్రమ్||
శ్రీగణేశాయ నమః|
అస్య శ్రీచన్ద్రాష్టావింశతినామస్తోత్రస్య గౌతమ ఋషిః,
సోమో దేవతా, విరాట ఛన్దః, చన్ద్రప్రీత్యర్థే జపే వినియోగః|
చన్ద్రస్య శ్రృణు నామాని శుభదాని మహీపతే|
యాని శ్రృత్వా నరో దుఃఖాన్ముచ్యతే నాత్ర సంశయః|| ౧||
సుధాకరశ్చ సోమశ్చ గ్లౌరబ్జః కుముదప్రియః|
లోకప్రియః శుభ్రభానుశ్చన్ద్రమా రోహిణీపతిః|| ౨||
శశీ హిమకరో రాజా ద్విజరాజో నిశాకరః|
ఆత్రేయ ఇన్దుః శీతాంశురోషధీషః కలానిధిః|| ౩||
జైవాతృకో రమాభ్రాతా క్షీరోదార్ణవసమ్భవః|
నక్షత్రనాయకః శమ్భుశిరశ్చూడామణిర్విభుః|| ౪||
తాపహర్తా నభోదీపో నామాన్యేతాని యః పఠేత్|
ప్రత్యహం భక్తిసంయుక్తస్తస్య పీడా వినశ్యతి|| ౫||
తద్దినే చ పఠేద్యస్తు లభేత్సర్వం సమీహితమ్|
గ్రహాదీనాం చ సర్వేషాం భవేచ్చన్ద్రబలం సదా|| ౬||
|| ఇతి శ్రీచన్ద్రాష్టావింశతినామస్తోత్రం సమ్పూర్ణమ్||
|| చన్ద్రకవచమ్||
శ్రీగణేశాయ నమః|
అస్య శ్రీచన్ద్రకవచస్తోత్రమన్త్రస్య గౌతమ్ ఋషిః|
అనుష్టుప్ ఛన్దః, శ్రీచన్ద్రో దేవతా, చన్ద్రప్రీత్యర్థం జపే వినియోగః|
సమం చతుర్భుజం వన్దే కేయూరముకుటోజ్జ్వలమ్|
వాసుదేవస్య నయనం శఙ్కరస్య చ భూషణమ్|| ౧||
ఏవం ధ్యాత్వా జపేన్నిత్యం శశినః కవచం శుభమ్|
శశీ పాతు శిరోదేశం భాలం పాతు కలానిధిః|| ౨||
చక్షుషీ చన్ద్రమాః పాతు శ్రుతీ పాతు నిశాపతిః|
ప్రాణం క్షపాకరః పాతు ముఖం కుముదబాన్ధవః|| ౩||
పాతు కణ్ఠం చ మే సోమః స్కన్ధే జైవాతృకస్తథా|
కరౌ సుధాకరః పాతు వక్షః పాతు నిశాకరః|| ౪||
హృదయం పాతు మే చన్ద్రో నాభిం శఙ్కరభూషణః|
మధ్యం పాతు సురశ్రేష్ఠః కటిం పాతు సుధాకరః|| ౫||
ఊరూ తారాపతిః పాతు మృగాఙ్కో జానునీ సదా|
అబ్ధిజః పాతు మే జఙ్ఘే పాతు పాదౌ విధుః సదా|| ౬||
సర్వాణ్యన్యాని చాఙ్గాని పాతు చన్ద్వోऽఖిలం వపుః|
ఏతద్ధి కవచం దివ్యం భుక్తిముక్తిప్రదాయకమ్|
యః పఠేచ్ఛృణుయాద్వాపి సర్వత్ర విజయీ భవేత్|| ౭||
|| ఇతి శ్రీచన్ద్రకవచం సమ్పూర్ణమ్||
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
parakrijaya@gmail.com