శ్రీ మేధా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం

మీరు జన్మించిన తేది, సమయం, ప్రదేశం ఈ మూడు సమాచారములు మాకు తెలియచేసినచో మీ వ్రుత్తి,వ్యాపార,ఆరోగ్య,ఆర్ధిక పరిస్తితులు, దాంపత్యం, విద్య, ఉద్యోగ, వివాహ, కుటుంబవ్యవహారాలు, సంతానం, రాజకీయ వ్యవహారాలు,ప్రేమ వ్యవహారములు,కుజ దోషం, కాలసర్ప దోషం మరియు వివాహ, ఉపనయన, గృహప్రవేస, జప, హోమ, వ్రత, అన్నప్రసన, నామకరణం లకు ముహూర్తములు పెట్టబడును. P.V.RADHAKRISHNA CELL :+91 9966455872, Mail us : parakrijaya@gmail.com

27, నవంబర్ 2013, బుధవారం

బుధ రత్నధారణ



                          


            

పచ్చ 

మకరత రత్నాలు బుధగ్రహానికి చాలా ప్రీతికరమైనది. బుధగ్రహము పీత వర్ణము గలవాడు. భూతత్త్వ ప్రధానుడై ఘ్రూణేంద్రియమున కాధిపత్యము వహించుటవల్ల ఈ విశేషములు కల్గిన మకరతము బుధునుకి సంభంధించినదనడంలో ఎట్టిసందేహంలేదు. పచ్చ త్రిదోషములందలి కఫ దోషమును హరింపగలదు. పంచ ప్రాణములలో మొదటిదగు ప్రాణవాయువు సంకేతముగా గల్గియున్నది. ఇది స్త్రీజతికి సంభంధించినదని కొందరు, నపుంసక జాతికి చెందినదని కొందరు చెప్పుచున్నారు. బుధ గ్రహము మాత్రం నపుంసక గ్రహముగా జ్యోతిష్యశాస్త్రంళో వ్రాయబడినది. శరీరమునందలి సహస్రార చక్రమునకు ఈ మకరతమునకు కాంతివర్ణ సామిప్యములు గలవు. పచ్చను ధరించిన యెడల అందలి ఆకుపచ్చ కాంతులు శరీరము నందలి వివిధ నాడీమండలములపై సకల అనారోగ్యములను వారించి అనారోగ్యమును నివారించి ఆరోగ్యమును ప్రసాదించగలదు.
ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి అను నక్షత్రములందు జన్మించిన వారు ఏ సమయములందైనను పచ్చలను ధరించవచ్చును మిగిలిన నక్షత్ర జాతకులలో రోహిణి, హస్త, శ్రవణ, నక్షత్రములు గలవారు మినహా మిగిలిన అన్ని నక్షత్రములవారు ఈ పచ్చలను ధరించుట వలన శుభఫలితాలను పొందగలుగుతారు. పచ్ఛలను ధరించుట వలన జనన సమయము నందలి జాతక గ్రహముల యొక్క స్థితిగతులను విచారించి దశాంతర్దశలు, గోచారము బాగుగా పరిశీలించి బుధగ్రహము దోషప్రదునిగా నున్న సమయములందు మాత్రమే పచ్ఛను ధరించిన యెడల గ్రహముల వల్ల సంభవించే అన్ని విధములైన అరిష్టములు హరించుకొనిపోయి శుభఫలితాలు కల్గును.
జన్మ సమయమున ఏర్పడిన జాతక చక్రము బుధగ్రహము 6-8-12 స్థానాధిపత్యములను పొందియుండుట ఆ స్థానాధిపతులతో కలసియుండుట, వారిచే చూడబడుట 6-8-12 స్థానమునందలి దోషప్రదము మరియు బుధుడు అష్టమ వ్యయాదిపత్యములు కలిగి , ద్వితీయ సప్తమ దశమ స్థానములందుండుట, యోగకారకుడై నీచ , శతృక్షేత్రములందుండుట, పాపగ్రహసహితుడై కేంద్రకోణ రాశులయందుండుట, పాపగ్రహ సహితుడై కేంద్ర కోణ రాశులయందుంచుట, షడ్వర్గ అష్టకవర్గ బలములను బుధుని దుష్టత్వము నధికము గావింపగలవు.
బుధుడు దుష్ట లక్షణముతో కూడియుండి అతని యొక్క మహర్దశగానీ అంతర్దశగానీ సంభవించినప్పుడు, లేక గోచారమునందు దుష్టస్థాన సంచారము కలిగిన కాలము, ఇతర రాజయోగ దశలయందు బుధుని అంతర్దశలు, విదశలు సంభవించిన కాలమునందు అనేక విధములైన కష్టనష్టములు ఆపదలు సంభవించగలవు. అట్టిచెడు సమయములందు ముఖ్యముగా కఫ పైత్య వికారములచే కలుగు వ్యాధులను, బుద్ధిబలము లోపించుట, వ్యాపారాటంకములు, వ్యాపార నష్టములు, కుటుంబకలహములు, దైవనింద వ్యవహార బాధలు, నరముల బలహీనత, విధ్యార్థులకు పరీక్షలలో అపజయము, అందున గణిత విభాగమునందు పురోభివృద్దిలోపించుట కృత్రిమ ప్రయోగాది బాధలు, మతి విభ్రమము, విడువనట్టి జ్వరభాధ, కామెర్లరోగము స్త్రీలకు సంభంధించిన వ్యాధులు కష్ట ప్రసవము మొదలగు అనేక విధములైన వ్యాధి బాధ దుఃఖములు కలుగుచుండగలవు.
పచ్చ ద్వారా కలిగే శుభయోగాలు :
శ్రేష్ఠమైన పచ్చలను ధరించిన యెడల, బుద్ధి జ్ఞానములు అభివృద్దినొందగలవు. విధ్యాజయము, పాండిత్యము, చక్కని వాక్కులు, జ్యోతిషశాస్త్రాభిరుచులు కలుగగలవు. మాటలు సరిగారాని వారికి, నత్తి మాటలుగలవారు ఈ పచ్చను ధరించిన వారి వాక్కులు సుస్పాష్టములై యుంటవి. తల్లివర్గీయులైన భంధువులతో గల స్పర్థలు అంతరించి వారివలన సహాయ సహకారములు పొందగలరు.
తాము చేయుచున్న వృత్తులలో కలిగే ఆటంకములు, అవాంతరములు తొలగిపోయి వారివారి వృత్తులు నిర్విఘ్నంగా కొనసాగ గలవు. కుటుంబములో సంభవించే గృహచ్ఛిద్రములు అంతరించి కుటుంబసౌఖ్యం లభిస్తుంది. వ్యాపార వ్యవహారములందేర్పడిన స్తబ్దత తొలగిపోయి వ్యాపార విజయము చేకూరును. దైవభక్తి జ్ఞానాభివృద్ది, సత్కార్యచరణ సమాజంలో గౌరవ ప్రతిపత్తులు ధన సంపద ఐశ్వర్యాభివృద్ది కల్గుటయే గాక, శరీరమునందు కలిగే అనేక విధములైన జ్వరాతిసార కామిలాది బాధలు నివారణ కాగలవు. బి.పి అధికంగానున్న వారికిది దివ్యౌషధము, మరియు ఈ రత్నము, అంతభ్రమణము, మూర్చరోగము, కంఠమునందలి వొణుకు, నాలుక యందలి దోషములు స్త్రీల యొక్క ఋతు సంభంధమైన వ్యాధులు నివారింపగలదు. ప్రసవవేదనజెందు స్త్రీలకు ఈ పచ్చను ధరింపజేసిన సుఖప్రసవము కాగలదు. వ్యాధి నివారణతో బాటు పరిపూర్ణ ఆరోగ్యమును కూడా ఈ పచ్చ ప్రసాదించగలదు.
పచ్చను ధరించే పద్దతి :
పచ్చలను దోష రహితమైనవిగా చూచుకొని ధరించాలి. ఉత్తమ మైన మరకతాలు సత్ఫలితాలను కలిగించగలవు. మరకత రత్నాన్ని బంగారంతో పొదగబడిన బాణాకారంగల ఉంగరంలో ఇమిడ్చి ధరించడం శాస్త్రీయము. కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాఢ నక్షత్రములు కలిగిన బుధవారంగానీ, ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రములు గల శుక్రవారం నాడు గానీ బుధుని యొక్క హోరాకాలంలో వర్జ దుర్ముహుర్తములు లేకుండా బోడి రత్నమును (పచ్చను) ఉంగరంలో బిగించాలి. ఆ తర్వాత ఆ ఉంగరమును ఒక దినము ఆవు పంచకంనందు ఉంచి రెండవదినము పశుపు నీటియందు నిద్ర గావింపజేసి పంచామృతములచే శుద్దిచేసి పూజించాలి.
ధరించెడివారు తమకు తారాబలం చంద్రబలం కలిగిన శుభతిదులయందు, ఆది, బుధ, శుక్రవారములలో వృషభ, సింహ, కన్య, తులా లగ్నములుగల సమయమునందు ఉంగరము ధరించవలెను. ధారణకు ముందే శాస్త్రోత్తమముగా పూజలు జరిపి కుడి హస్తమునందుంచుకొని ఈ శాన్యదిశగా తిరిగి గురువుని, గణపతిని స్మరించి "ఓం శ్రీం ఐం హ్రీం శ్రీం సౌమ్యాయ సౌః క్లీం ఐం బుధాయస్వాహా" అను మంత్రమును 108 సార్లు జపించిన తర్వాత ఆ ఉంగరమును ముమ్మారు కనులకద్దుకొని కుడిచేతి చిటికెన వ్రేలునకు గానీ, లేక ఉంగరపు వ్రేలునకు గానీ ధరించవలెను. స్త్రీలు ఎడమ చేతి చిటికెన వ్రేలుకి ధరించుట ఆచారమై ఉన్నది. ఉంగరము అడుగుభాగం మాత్రము రంద్రము కలిగి యుండాలి. కొందరు సిద్ద పురుషులు మరకత రత్నమును శివలింగములుగా దీర్చి దేవ తార్చనయందు నిత్య పూజలు నిర్వహించుచుండెదరు. అట్టివారి పుణ్యఫలితము అనంతము. వారికి త్వరగా మోక్షము ప్రాప్తించగలదు.


జాతి పచ్చ (మరకతం)
జాతిపచ్చ బుధగ్రహానికి సంబంధించినది. జాతిపచ్చను ఇంగ్లీష్ లో 'ఎమరాల్డ్' అంటారు. ఎమరాల్డ్ బైరేల్ కుటుంబంలో గ్రీన్ వెరైటీ, అల్యూమినియం, బెరిలియం తాలుకూ సిలికేట్ తో ఉంటుంది. దీర్ఘచతురస్రాకారం (Rectangle), స్టెప్ కట్ అనేదాన్ని ఎమరాల్డ్ కి సాధారణంగా ఉపయోగిస్తారు. కటింగ్ ఆవిధంగా ఉన్నప్పుడే ఎమరాల్డ్ క్రిస్టల్ తాలూకు లోతు, అందమైన రంగు, ఫోకస్ చేయబడుతుంది. 1934 నుండి సింథటిక్ ఎమరాల్డ్ కూడా తయారు చేస్తున్నారు. పచ్చను మరకతను అని కూడా అంటారు.

మరకతము సుందర యౌవనముగల నెమలిపిట్ట రంగును, నాచువలెను, గాజువలెను ప్రకాశించే గరికమొలక రీతిగాను, కోమలమగు పాలచెట్టు యొక్క కొమ్మరంగునను, మంచి కాంతి గల రామ చిలుక రెక్కల చాయను, సుందరమియన్ దిరిశిన పువ్వురంగువలెను ఈ ఎనిమిది రంగులలో ప్రకాశించును.


పచ్చలో దోషాలు:
పుప్పి: పుచ్చులు వున్నవి
గార: కప్పువేసినట్లు ఉన్నవి
కర్కశం: కఠినముగా గరుకుగా ఉన్నవి
పచ్చమీద సున్నము పూసినను ఆ పూత అతిక్రమించి బాల సూర్యుని ప్రకాశమున విరాజిల్లుచుండును. అట్టి శుద్ధమైన పచ్చను ఎంత ఖరీదుతో అయినా కొనవచ్చును.

దొరుకు ప్రదేశాలు:
కొలంబియా, బ్రెజిల్, జాంబియా, ఆప్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇరాన్, రష్యా, ఈజిప్ట్, ఇండియా, ఆఫ్రికా, దేశాలలోని గనుల్లో దొరుకుతాయి. వీటన్నింటిలో కొలంబియన్ ఏమరాల్డ్స్ ఉత్తమమైనవిగా చెప్పబడుతున్నాయి. ప్రపంచంలోని ఏమరాల్డ్స్ లో తొంభై శాతం ఈ కొలంబియన్ గనుల నుండే వస్తున్నాయి.

గనుల్లో నుండి బయటకు తీయగానే ఏమరాల్డ్స్ ని చాలా వరకు ఆయిల్ లో ముంచుతారు. దీని వలన రత్నం తాలుకూ ఉపరితలంలోని పగుళ్ళు కప్పబడిపోతాయి. కొన్నిసార్లు పగుళ్ళు కప్పిపుచ్చటానికి, రంగును ఇంప్రూవ్ చేయడానికి ఆయిల్ ను ఉపయోగించడమూ జరుగుతుంది.

లోపాలు లేని జాతిపచ్చ సంపదను, ఆరోగ్యాన్ని జ్ఞానాన్ని అందిస్తాయి. జాతిరత్నం జ్ఞాపకశక్తిని పెంచడమే కాదు, ధరించిన వ్యక్తి చదువు పట్ల ఏకాగ్రత ఏర్పడేలా చేస్తుంది. ఎమరాల్డ్ నుండి ఆకుపచ్చ కిరణాలు బయటకు వెదజల్లబడతాయి. కాబట్టి ఆరంగు మూత్రపిండాలు, ప్రేగుల మీద, కాలేయం మీద పనిచేసి ఆరోగ్యస్థితిని మెరుగు పరుస్తుంది. అంతేకాక శ్వాసప్రక్రియ సరిగా జరగడం, ఏకాగ్రత కలగడం, ఇన్ సోమ్నియా, డీసెంట్రీ, డయేరియా, ఆస్తమా, అల్సర్ వ్యాదులనుండి దూరం కావడం జరుగుతుంది.

బంగారం లేదా, వెండిలో జాతిపచ్చను పొదిగి బుధవారం ధరించడానికి, కుడిచేతి చిటికెన వ్రేలికి ధరించాలి.

జాతిపచ్చకున్న నామాలు:
వ్యాపారనామం: ఎమరాల్డ్, దేశీయనామం, పన్నా, ఇతరనామాలు: మరకతము, అశ్మగర్భము, గరలాం గురణాంకితము, గురుడాశ్శము, గురుడోత్తరము, గారుడం, తృణగ్రాహి, గరుడపచ్చ, మకరతము, హరిన్మణి.

లక్షణాలు:
రసాయన సమ్మేళనం- BeOAl2O3, 6 స్ఫటిక ఆకారం - హెక్సాగోనాల్, స్ఫటిక లక్షణం, - ఫ్రిసేమ్యాటిక్, వర్ణం - ముదురు ఆకుపచ్చ నుండి లేత ఆకుపచ్చ; వర్ణమునకు కారణం - క్రోమియం, మెరుపు - విట్ రియస్, కఠినత్వము - 7.5,దృఢత్వము - పూర్, సాంద్రత (S.G.) 2.67 – 2.78, క్లీవేజ్ - స్పష్టంగా లేదు, ఏక లేక ద్వికిరణ ప్రసారము (SR/DR)-DR, పగులు - శంకు ఆకృతి, అంతర్గత మూలకాలు - ఇండియా దానిలో రెండు మూలకాల సమ్మేళనం, మైకా, ఫింగర్ ప్రింట్, ద్రవం, కొలంబి పచ్చలో - మూడు మూలకాల సమ్మేళనం పైరైట్, మైకా ౦ బ్రెజిల్ పచ్చలో- డోలమైట్, పైరట్, క్రొమైట్ కాంతి పరావర్తన పట్టిక (RI)-1.56 నుండి 1.57 వరకు 1.59 – 1.60 వరకు U.V.Light (S.W) లో చర్య ఉండదు. L.W. లో ఎరుపుగా ఉండును. సాదృశ్యాలు - చాల్ సిడని, గ్రీన్ బెరిల్, గ్రీన్ సఫై ర్ సహజంగా దొరికే జాతిపచ్చ రంగును అధికం చేయుట. ఉపరితలానికి పూత పూయుట ఇరీడియేషన్ చేస్తారు.

ప్రకృతిలో దొరికే పచ్చలో S.G. మరియు RI అధికంగా ఉంటుంది. సింథటిక్ లో వీటి విలువ తక్కువగా ఉంటుంది. అంతర్గత మూలకాలలో S.G, RI ల ద్వారా (సింథటిక్ వాటిని) గుర్తుంచవచ్చును. శ్రేష్టమైన పచ్చలు కొలంబియాలో దొరుకుతాయి.



బుధు గ్రహ దోష నివారణ

బుధ గ్రహ దోష నివారణకుగాను బుధగ్రహమునకు పూజ,విష్ణు సహస్రనామ పారయణ చేయవలయును. పెసలు దానము చేయవలెను. ఆకుపచ్చరంగుబట్ట, తగరము, టంకము, పచ్చపెసలు, మరకతము, లొట్టపిట్ట, గజదండము (అంకుశము),పచ్చని పూవులు మొదలగు వానిలో ఒకటి దానము చేసినచో బుధగ్రహము వలన కలుగు దోషము పరిహరించబడును. నదీసంగమము నందు గల సముద్రపు నీటిని మట్టిపాత్రలో పోసి ఆ నీటిలో గజమదము కలిపి,ఆ నీటిని స్నానము చేసినచో బుధ దోషము తొలగును.ఇత్తడి లేక కంచు ఉంగరము ధరించుట సంప్రదాయము.
శుభతిధితో కూడిన బుధవారమునందు ఓం-బ్రాం-బ్రీం-బ్రౌం-సః బుధాయనమః అను మంత్రమును 40 రోజులలో జరిపించి చివరి రోజున అనగా 41 ఆకు పచ్చని వస్త్రములలో పెసలు పోసి దానము చేసినచో బుధగ్రహ దోష నివారన కలుగును. 



 || బుధపంచవింశతినామస్తోత్రమ్||

శ్రీగణేశాయ నమః|
అస్య శ్రీబుధపఞ్చవింశతినామస్తోత్రస్య ప్రజాపతిరృషిః,
త్రిష్టుప్ ఛన్దః, బుధో దేవతా, బుధప్రీత్యర్థం జపే వినియోగః||
బుధో బుద్ధిమతాం శ్రేష్ఠో బుద్ధిదాతా ధనప్రదః|
ప్రియఙ్గుకలికాశ్యామః కఞ్జనేత్రో మనోహరః|| ౧||
గ్రహపమో రౌహిణేయో నక్షత్రేశో దయాకరః|
విరుద్ధకార్యహన్తా చ సౌమ్యౌ బుద్ధివివర్ధనః|| ౨||
చన్ద్రాత్మజో విష్ణురూపీ జ్ఞానీ జ్ఞో జ్ఞానినాయకః|
గ్రహపీడాహరో దారపుత్రధాన్యపశుప్రదః|| ౩||
లోకప్రియః సౌమ్యమూర్తిర్గుణదో గుణివత్సలః|
పఞ్చవింశతినామాని బుధస్యైతాని యః పఠేత్|| ౪||
స్మృత్వా బుధం సదా తస్య పీడా సర్వా వినశ్యతి|
తద్దినే వా పఠేద్యస్తు లభతే స మనోగతమ్|| ౫||
ఇతి శ్రీపద్మపురాణే బుధపఞ్చవింశతినామస్తోత్రం సమ్పూర్ణమ్||


 || బుధకవచమ్||

శ్రీగణేశాయ నమః|
అస్య శ్రీబుధకవచస్తోత్రమన్త్రస్య కశ్యప ఋషిః,
అనుష్టుప్ ఛన్దః, బుధో దేవతా, బుధప్రీత్యర్థం జపే వినియోగః|
బుధస్తు పుస్తకధరః కుఙ్కుమస్య సమద్యుతిః|
పీతామ్బరధరః పాతు పీతమాల్యానులేపనః|| ౧||
కటిం చ పాతు మే సౌమ్యః శిరోదేశం బుధస్తథా|
నేత్రే జ్ఞానమయః పాతు శ్రోత్రే పాతు నిశాప్రియః|| ౨||
ఘ్రాణం గన్ధప్రియః పాతు జిహ్వాం విద్యాప్రదో మమ|
కణ్ఠం పాతు విధోః పుత్రో భుజౌ పుస్తకభూషణః|| ౩||
వక్షః పాతు వరాఙ్గశ్చ హృదయం రోహిణీసుతః|
నాభిం పాతు సురారాధ్యో మధ్యం పాతు ఖగేశ్వరః|| ౪||
జానునీ రౌహిణేయశ్చ పాతు జఙ్ఘేऽఖిలప్రదః|
పాదౌ మే బోధనః పాతు పాతు సౌమ్యోऽఖిలం వపుః|| ౫||
ఏతద్ధి కవచం దివ్యం సర్వపాపప్రణాశనమ్|
సర్వరోగప్రశమనం సర్వదుఃఖనివారణమ్|| ౬||
ఆయురారోగ్యశుభదం పుత్రపౌత్రప్రవర్ధనమ్|
యః పఠేచ్ఛృణుయాద్వాపి సర్వత్ర విజయీ భవేత్|| ౭||
|| ఇతి శ్రీబ్రహ్మవైవర్తపురాణే బుధకవచం సమ్పూర్ణమ్||


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

parakrijaya@gmail.com

ఈ బ్లాగును సెర్చ్ చేయండి



Related Posts Plugin for WordPress, Blogger...