ఇంటి పొడవును 9 భాగాలుగా చేసి ఇందులో పాదాల
నుంచి 3 భాగాలు విడిచిపెట్టాలి. మిగిలిన 3 భాగాలలో వాస్తుపురుషుడి పాదాలు
వున్న నాభిస్థానం. ఈ నాభిస్థానంలో తవ్వి నవధాన్యాలతో శంఖువును స్థాపించాలి.
ముందు శంఖువును ధాన్యరాశిపై వుంచి వాస్తుపూజ
చేసినాక శంఖుస్థాపన చేయాలి. గంధపు చెక్కతోకాని, మారేడు, అత్తి, మద్ది, వేప,
చండ్రకొయ్యతో కాని శంఖువును తయారు చేస్తారు. శంఖుస్థాపనకు మొదటి జాము
ప్రశస్తం. రెండవ, మూడవ జామున, రాత్రులందు, శంఖుస్థాపన చేయకూడదు. ఇల్లు
కట్టుకునే ముందు శంఖుస్థాపన చేయడం మంచిది. దీని వల్ల కొన్ని దోషాలు నివారణ
అవుతాయి.
బ్రాహ్మడి జాబితా ప్రకారము అన్ని
తెచ్చుకొనవలెను. ముందు రోజురాత్రి గుంట తీయించవలెను. జంపకనాలు, కుర్చీలు,
పీటలు, మంచినీళ్ళు, గ్లాసులు మొదలగునవి. వచ్చిన అతిధులకు టిఫిన్లు, టీ
ఇచ్చి, బొట్టు, పండు తాంబూలము ఇచ్చి పంపవలెను.
ఆ విధముగా చేసిన గృహము నందుండు వారికి సకల ఆయురారోగ్య ఐశ్వర్య కలుగ చేస్తుంది .
గృహ ఆరంభము చేయుటకు మాస ఫలితములు ఈ విధముగా ఉన్నాయి .
శ్లోకం : చైత్రమాసే గృహారంభే ధనధాన్య పశుక్షయం , వైశాఖం శుభదంచైవ , జ్యేష్టాయమరణం
ఆషాడం కలహం భవేత్ , శ్రావణం శుభదం , భాద్రపదే సదా రోగీ,
ఆశ్వీయుజం కలహం, కార్తీకే శుభదం ప్రోక్తం , మార్గశిర్షే మహాద్భయం
పుష్యేచా అగ్ని భయంచ ,మాఘేస సంపదా , పాల్ఘునే రత్న లాభః
అని చెప్పితిరి
తాత్పర్యము : చైత్ర మాసమున గృహారంభము చేసినచో ధన నష్టము జరుగును ,వైశాఖ మాసము శుభము , జ్యేష్ట మాసము మరణమును కలుగ జేయును , ఆషాడ మాసమునందు తగవులు ఏర్పడును , శ్రావణము సకల శుభములు ప్రసాదించును , బాద్రపద మాసమునందు అనారోగ్యము కలుగును .,, ఆశ్వీయుజం కలహములు , గృహమునందు ఉండువారికి మనస్సుకు శాంతి కరవగును . కార్తీకము మంచిది . మార్గశిర మాసము భయమును కల్గిస్తుంది . పుష్య మాసము న గృహా రంభము చేయుట వలన అగ్నిచే దహించ బడును . మాఘ మాసము సకల సంపదలు , ఐశ్వర్యము , కలుగుతాయి . ఫాల్గుణ మాసమున చేయుట వలన అనేక విధములుగా అభివృద్ధి కలుగుతుంది .
శంఖు స్థాపనకు పనికి వచ్చే నక్షత్రములు .
ఉత్తర , ఉత్తరాషాడ , ఉత్తరాభాద్ర , రోహిణి , మృగశిర ,చిత్త , ధనిష్ఠ అనూరాధ , రేవతి , స్వాతి , శతభిషం గ్రుహారంభామునకు ప్రశస్తమైన నక్షత్రములు .
బుధ , గురు , శుక్ర వారముల యందు సూర్యోదయమునకు ముందు ౩ నుండి 6 గంటల లోపల గానీ , సూర్యోదయము తరువాత ఉదయం 11 గంటల లోపల గానీ శంఖు స్థాపన ముహూర్తము ఏర్పాటు చేసుకోవలెను
ఈ ముహూర్తము సకల సుగుణములు కలది 4 , 8 , 12 స్థానముల శుద్ది కలిగి వృషభ చక్రశుద్ది, తారాబలము , చంద్రబలము , పంచకరహితములు బాగుగా యున్నది అయి ఉండాలి .
4, , 8 , 12 స్థానములను గురించి ఇంతకుముందు కూడా ప్రస్తావించాను . వీటి గురించి కొంత వివరణ .
4 వ స్థానము సుఖాన్ని సూచిస్తుంది . ఇట్టి ఈ స్థానములో పాప గ్రహములు ఉండుట వలన గృహము నిర్మాణమైన తరువాత గృహమందు ఉండువారికి సుఖములు లేక అనేక రకాల కష్ట నష్టములు కల్గును .
8 . ఇది ఆయుస్సు ను సూచిస్తుంది . ఇక్కడ శుద్ది లేకపోతె గృహమునందు మరణము కల్గును .
12 ఇది ఖర్చులను , నష్టములను , అపజయములను సూచిస్తుంది . ఈ స్థానము శుద్ది గా ఉండక పొతే గృహ యజమానికి గానీ అందుండు వారికి గానీ అన్నింటా అపజయములు కల్గును.
శంఖుస్థాపనకు సామాగ్రి పట్టిక
పసుపు 100 gr.
కుంకుమ 100 gr.
విడిపూలు 3 kg.
పూలమూరలు 10
తమలపాకులు 100
వక్కలు 100 gr.
అగరుబత్తీలు 1 packet
హరతికర్పూరం 100 gr.
గంధం 1 bottle
ఖర్జూరపండ్లు 150 gr.
పండ్లు 5 types
పసుపుకొమ్ములు 150 gr.
టవల్స్ 2
జాకెట్ ముక్కలు 2
చెక్క శంఖు 1
బియ్యము 5 kg.
కొబ్బరికాయలు 15
చిల్లరడబ్బులు 21
దారపుబంతి 1
ఆవు పాలు 1/2 lt.
నవధాన్యాలు 1/2kg.
దీపారాధన కుందులు 1 set
వత్తులు 1 packet
నెయ్యి 1/2 kg.
కలశం చెంబు 1
దేవునిపటాలు
నిమ్మకాయలు 10
నవరత్నాలు 1 set
గ్రానయిట్ రాళ్ళు 5
పంచెల చాపు 1
కొత్త ఇటికలు 10
వరిపిండి 1/2 కేజి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
parakrijaya@gmail.com