శ్రీ మేధా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం

మీరు జన్మించిన తేది, సమయం, ప్రదేశం ఈ మూడు సమాచారములు మాకు తెలియచేసినచో మీ వ్రుత్తి,వ్యాపార,ఆరోగ్య,ఆర్ధిక పరిస్తితులు, దాంపత్యం, విద్య, ఉద్యోగ, వివాహ, కుటుంబవ్యవహారాలు, సంతానం, రాజకీయ వ్యవహారాలు,ప్రేమ వ్యవహారములు,కుజ దోషం, కాలసర్ప దోషం మరియు వివాహ, ఉపనయన, గృహప్రవేస, జప, హోమ, వ్రత, అన్నప్రసన, నామకరణం లకు ముహూర్తములు పెట్టబడును. P.V.RADHAKRISHNA CELL :+91 9966455872, Mail us : parakrijaya@gmail.com

8, అక్టోబర్ 2014, బుధవారం

కాలానుగుణ "వాస్తు" అంటే?



జ్యోతిష్య శాస్త్రంలో సమానంగా ఎదుగుతున్న ప్రాచీన భారతీయ సంప్రదాయ శాస్త్రాలలో 'వాస్తు' ఓ విభాగం . కొన్ని సందర్భాల్లో ఇది జ్యోతిష్య శాస్త్రాన్ని సైతం అధిగమించి ఎదుగుతోందనడానికి నిదర్శనం, ఈ వాస్తు పట్ల దేశ వ్యాప్తంగా పెరుగుతున్న ఆదరణే అని చెప్పవచ్చు. అయితే కేవలం మార్కెట్లో పుస్తకాలు కొని చదివి వాస్తును తెలుసుకోవాలనుకుంటే మాత్రం గృహస్తు లేదా భవన నిర్మాణ నిర్మాతలు పప్పులో కాలేసినట్లే. మారుతున్న కాలంతో పాటుగా భారతీయ వాస్తులో సైతం కొన్ని అధునాతనమైన మార్పులు ప్రయోగాత్మకంగా మార్చవలసి వస్తున్నా, వాటివల్ల జరిగే ప్రయోజనపు పాళ్ళు అధికంగా వుండటంతో, అటు ఆర్కిటెక్టులూ, ఇటు శాస్త్రీయ సిద్ధాంతులు సైతం వీటిని తమ నిర్మాణాల్లో అమలు పర్చేందుకు ముందుకు రావడం ఒక స్వాగతించవలసిన శుభపరిణామం.సాధారణంగా వాస్తులో ప్రధానమైనది నిర్ధిష్టమైన కొలతలతో కూడిన “ఆయముల” నిర్ణయం. ఇంటిలోని ఏయేదిక్కుల్లో, యేయే ఆయములు వుంటే ఎలా కల్సివస్తుందో చెబుతుందీ పద్ధతి. దీనినే పాశ్చాత్యులు 'బాగ్‌వా' అంటారు. ఇళ్ళు లేదా భవంతిని నిర్మించబోయే భూమిని అష్టదిక్పాలకులు పాలిస్తుంటారు. ఒకొక్క దిక్కునూ ఒకొక్క దేవత శాసించి, నియంత్రిస్తుంటుంది.

తూర్పును ఇంద్రుడు, పడమరను వరుణుడు, ఉత్తరానికి కుబేరుడు, దక్షిణానికి యముడు, ఈశాన్యమునకు ఈశానుడు, ఆగ్నేయానికి అగ్ని, వాయవ్యానికి వాయువు, నైరుతీదిశను నిరుతి అనే ఎనిమిదిమంది దిక్పాలకులు పాలిస్తుంటారు.

ఇంద్రుడికి ప్రతినిధి సూర్యుడు, వరుణుడికి  శనీశ్వరుడు, కుబేరునికి బుధుడు, యమునికి కుజుడు, ఈశానునికి గురువు (బృహస్పతి), అగ్నికి శుక్రుడు, వాయువునకు కేతువు, నిరుతికి రాహువు ఉపప్రతినిధులు. మనలో చాలామందికివాస్తు వేరు జ్యోతిష్యం వేరు అనే ఒక భిన్నాభిప్రాయముంది. అయితే సరియైన శాస్త్రం తెలిసిన వాస్తు లేదా జ్యోతిర్వేత్తలు నేటి ఈ వాస్తును జ్యోతిర్శాస్త్రంలోని ఒక విడదీయరాని అంతర్భాగంగా మాత్రమే పరిగణిస్తున్నారు. వాస్తవానికి ఇదే నిజం కూడానూ.

ఉదాహరణకు, సైద్ధాంతిక వాస్తు నియమాలను అనుసరించి చూచితే యజమాని నిద్రించే మాష్టర్ బెడ్‌రూం (పడకగది) నైరుతిదిశలో కానీ వాయవ్యంలో కానీ వుండాలి. అదే విధంగా వంటగది (కిచెన్) అనేది ఆగ్నేయంలో వుండాలి. కానీ మీ జాతకంలో అగ్నిని ఉపప్రతినిధిగా చెబుతున్న శుక్రుడు ఈశాన్యరాశి అయిన మీనంలో వున్నాడనుకోండి అప్పుడు మీ పడకగది పై సిద్ధాంతానికి భిన్నంగా ఈశాన్యంలో నిర్మించుకుంటేనే బాగా కలిసివస్తుంది. జాతకచక్రంలోని 12 రాశుల్లో శుక్రుడు ఏ రాశిలో తన పూర్తి బలాన్ని కల్గివున్నాడో ఆ రాశి ప్రాతినిధ్యం లేదా ఆ రాశీనాథుడు ప్రాతినిధ్యం వహించే దిశగా కానీ, లేదా అటువంటి రాశీనాధుడున్న దిక్కునకానీ పడకగది వుంటే బ్రహ్మాండంగా కల్సివస్తుంది.

దిక్కులూ - జాగ్రత్తలు -  ప్రాముఖ్యతలు

తూర్పులో బరువులు వుండకూడదు. అలా వుంటే సంతానం, ఐశ్వర్యాల వంటివి లభించవు. బావులు, బోర్లు ఈ దిశలో వుండరాదు. పడమర దిశలో ఎక్కువ స్థలాన్ని వదలరాదు. ఇది తూర్పు దిశకన్నా కొంచెం ఎత్తుగా వుండేట్టు చూసుకోవాలి. నైరుతీ, వాయవ్యాలకు తగలకుండా బావులు, బోర్లు కనుక నిర్మించుకుంటే సకల శుభాలు కలుగుతాయి. ఉత్తర దిశ, దక్షిణ దిశ కంటే పల్లంగా వుండాలి. ఉత్తరం ఎంత పెరిగితే యజమానికి అంత ధనలాభం కలుగుతుంది. ఉత్తరం వల్ల సంతానం, విద్య, ఆదాయం, పలుకుబడి ఇబ్బడిముబ్బడిగా పెరుగుతాయి.

దక్షిణంలో జాగా ఎంత తగ్గితే అంత మంచిది. అలా లేకుంటే ఇంట్లో వాళ్ళకు ఎప్పుడూ రోగాలుంటాయి, తగ్గవు. వున్న ఆస్తులు అమ్ముకొని దివాళాతీస్తారు. ఈశాన్యం విశాలంగా, పల్లంగా వుండాలి. ఈ దిశలో నీరు వుండకుండా నైరుతీ, పడమర దిశలమీదుగా పారేనీరు ఈశాన్యం ద్వారా వెలుపలికి వెళ్ళడం వల్ల అద్భుతమైన ఫలితాలు కల్గుతాయి. కానీ సంప్రదాయవాదులు ఈ దిశలో బావికానీ, బోరు కానీ వెయ్యమనే చెబుతూ వస్తున్నారు. ఇది సరికాదు. ఆగ్నేయంను పల్లంగా వుంచకూడదు. గోతులూ, సంపులూ వుంచరాదు. అలా చేసినట్లయితే ఇంటిలోని స్త్రీలకు పలురకాల రోగాలతోపాటుగా లైంగిక, వివాహ సంబంధమైన అవరోధాలు ఏర్పడతాయి. ఇక నైరుతి బాగా కురచగా వుండి ఎంత ఎత్తుగా వుంటే అంతమంచిది. ఈ దిశలో ఎంతగా బరువుంటే అంత లాభం కలుగుతుంది.  నైరుతీలో గుంటలు, గోతులూ, బావులు, బోర్లు ఎట్టి పరిస్థితుల్లో వేయకూడదు. అలా వుంటే మొండి రోగాలూ, ఆస్తులు అమ్ముకోవడం జరిగితీరుతుంది.


వీటన్నింటినీ చదివిన తర్వాత మీకేమనిపిస్తోంది? సరే నేనే చెబుతాను. ఈ ఎనిమిది దిశలు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో పంచభూతాలను తలపింపజేస్తున్నాయి. అవి అగ్ని (ఫైర్), జలము (వాటర్), వాయువు (ఎయిర్), భూమి లేదా పృథ్వీ (ఎర్త్), ఆకాశము (స్కై). అయితే చైనీయుల వాస్తులో అగ్నికి బదులుగా దారువు (వుడ్ - చెక్క), ఆకాశానికి బదులుగా లోహము (మెటల్) అనేవి వుంటాయి. వాస్తు ఏ దేశానికి చెందినదైనా అందులోని మూల సూత్రాలు పంచభూతాలే. ఎందుకంటే మన (జీవుల) శరీరాలన్నీ కూడా ఈ పంచ భూతాలతోనే నిర్మించబడినవి కావడం వల్ల. చైనీయుల వాస్తులో వాయవ్యాన్ని... మెటల్ (లోహం), ఆగ్నేయదిశను.... దారువు, నైరుతిని.... భూమి (ఎర్త్), దక్షిణాన్ని... అగ్ని (ఫైర్), ఉత్తరాన్ని..... నీరు (వాటర్), ఈశాన్యాన్ని... ఎర్త్ (భూమి), తూర్పును... దారువు (వుడ్), పడమరను... లోహము (మెటల్) అనేవి ప్రభావితం చేస్తాయి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

parakrijaya@gmail.com

ఈ బ్లాగును సెర్చ్ చేయండి



Related Posts Plugin for WordPress, Blogger...