శ్రీ మేధా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం

మీ జనన తేది,జనన సమయం,జనన ప్రదేశం ఈ మూడు సమాచారములు మాకు తెలియచేసినచో మీ వ్రుత్తి,వ్యాపార,ఆరోగ్య,ఆర్ధిక పరిస్తితులు, దాంపత్యం, విద్య,ఉద్యోగ,వివాహ,కుటుంబవ్యవహారాలు, సంతానం, రాజకీయ వ్యవహారాలు,ప్రేమ వ్యవహారములు,కుజ దోషం, కాలసర్ప దోషం మరియు వివాహ, ఉపనయన, గృహప్రవేస, జప, హోమ, వ్రత, అన్న ప్రసన , నామకరణం లకు ముహూర్తములు పెట్టబడును. P.V.RADHAKRISHNA CELL :+91 7013390324, Mail us :parakrijaya@gmail.com

Social Media Buttons

Follow by Email

Sunday, July 5, 2015

నవగ్రహ దోషములు-స్నానౌషధములు

సిద్ధౌషధ సేవలవలన రోగములు,మంత్ర జపమువలన సకల భయము తీరునట్లుగా ఔషధస్నాన విధానమువలన గ్రహదోషములు నశించును.

సూర్య గ్రహ దోషము తొలగుటకు: మణిశిల,ఏలుకలు,దేవదారు,కుంకుమపువ్వు,వట్టివేళ్ళు,యష్టిమధుకము,ఎర్రపుష్పాలు,ఎర్రగన్నేరు పువ్వులు _ ఈ వస్తువులను నీళ్ళూ వేసి కాచి,ఈ నీటితో స్నానము చేయవలెను.
సూర్య గ్రహ దోష నివారణకు గాను సూర్యూని పూజించుట, ఆదిత్య హ్రుదయము పారయణ చేయుటకు, కెంపు,(మాణిక్యము) ధరిచుట , సుర్యునకు గోధుములు, బెల్లం, కంచు, గుర్రము,రక్త చందనము,పద్మములు, ఆదివారము, దానము చేసినచో రవి వలన కలిగిన దోషములు తొలగును. మరియు కంచుచే చేయబడినను ఉంగరం ధరించుట వలనను,మంజిష్టము గజమదము,కుంకుమ పువ్వు రక్తచందనములను రాగి పాత్రయందలి నీటిలో కలిపి ఆ రాగి పాత్ర యందలి నీటితో స్నానము చేసిన దోష నివృత్తి కలుగును.రాగి ఉంగరము ధరించిన కూడ మంచిది. 
శుభ తిధి గల ఆదివారమునందు సూర్యుని ఓం-హ్రాం-హ్రీం-హ్రౌం-సః సూర్యాయనమహః అను మూలమంత్రమును 40 రోజులలో 6 వేలు జపము పూర్తి చేసిన సూర్యసంభంధమైన దోషము తొలగును. 
 

చంద్ర గ్రహ దోషము తొలగుటకు: 
గో మూత్రము,ఆవు పాలు,ఆవు పెరుగు,ఆవు పేడ,ఆవు నెయ్యి,శంఖములు,మంచిగంధములు,స్పటికము_ ఈ వస్తువులను నీళ్ళలో వేసి కాచి, ఆ నీటితో స్నానము చేయవలెను. చంద్రగ్రహ దోష నివారణకు చంద్రుని పూజించుట,దుర్గా దేవి ఉపాసించుట,బియ్యం దానం చేయుట,ముత్యము ఉంగరమున ధరించుట గాని,మాలగా వేసుకొనుట గాని చేయవలయును.సీసము,తెల్లని ఆవు, ముత్యములు, తెల్లని వస్త్రము నేయితో నింపిన కలశము,ఎద్దులలో ఎదేని ఒకటి సోమవారము దానము చేసినచో చంద్రునకు సంభంధించిన దోషము పోవును. వట్టివేర్లు,దిరిసెన గంధము,కుంకుమ పూవు,రక్తచందనము కలిపి శంఖువు నందు పోసిన నీటి చేత స్నానము చేసినచో చంద్ర దోషము పరిహారము కలుగును.సీసపు ఉంగరము ,వెండి ఉంగరము గాని ధరించుట మంచిది. 
శుభ తిధి గల సోమవారము నందు ఓం-శ్రాం-శ్రీం-శ్రౌం-సః చంద్రయనమః అను మంత్రమును 40 జపము చేసి చివరి రోజున అనగ 41వ రోజున బియ్యం,తెల్లని వస్త్రము నందు పోసి దానము చేసినచో చంద్ర దోష నివారణ కలుగును. 
 

కుజ గ్రహ దోషము:
మారేడు పట్టూ,ఎర్రచందనము,ఎర్రపువ్వులు,ఇంగిలీకము,మాల్కంగినీ, సమూలంగా పొగడ పువ్వులు _ ఈ వస్తువులను నీళ్ళలో వేసి కాచి ఆ నీటితో స్నానము చేయవలయును.
కుజ దోష నివారణకు గాను కుజుని పూజించి సుబ్రహ్మణ్య స్వామిని పూజించుట వలన గాని,ఎర్రని పగడమును గాని కందులు,మేకలు,బెల్లము,బంగారము,ఎర్రని వస్త్రము,రాగి వీటి యందేదయిన దానము చేయుటకు కాని కుజదోష నివారణ అగును. వెండి పాత్రయందు చండ్రకర్ర గంధము,దేవదారుగంధం ఉసిరికపప్పు కలిపిన నీటితో స్నానముచేసిన అంగారకదోషం నివర్తింపబడును.బంగారు ఉంగరము ధరించు ఆచారము కలదు. 
శుభ తిధి గల మంగళవారము నందు ఓం-క్రాం-క్రీం-క్రౌం-సః భౌమాయనమః అను మంత్రమును 7వేలు 40 రోజులలో పూర్తి చేసిన ఎర్రనిరంగు బుట్టలో కందులు వేసి 41 వ రోజున దానము చేయుట మంచిది. 
 

బుధ గ్రహ దోషము:
 ఆవుపేడ,తక్కువ పరిమాణములో పండ్లు,గోరోచనము,తేనే,ముత్యములు బంగారము _ ఈ వస్తువులను నీళ్ళలో వేసి కాచి,ఆ నీటితో స్నానము చేయవలయును.
బుధ గ్రహ దోష నివారణకుగాను బుధగ్రహమునకు పూజ,విష్ణు సహస్రనామ పారయణ చేయవలయును. పెసలు దానము చేయవలెను. ఆకుపచ్చరంగుబట్ట, తగరము, టంకము, పచ్చపెసలు, మరకతము, లొట్టపిట్ట, గజదండము (అంకుశము),పచ్చని పూవులు మొదలగు వానిలో ఒకటి దానము చేసినచో బుధగ్రహము వలన కలుగు దోషము పరిహరించబడును. నదీసంగమము నందు గల సముద్రపు నీటిని మట్టిపాత్రలో పోసి ఆ నీటిలో గజమదము కలిపి,ఆ నీటిని స్నానము చేసినచో బుధ దోషము తొలగును.ఇత్తడి లేక కంచు ఉంగరము ధరించుట సంప్రదాయము. 
శుభతిధితో కూడిన బుధవారమునందు ఓం-బ్రాం-బ్రీం-బ్రౌం-సః బుధాయనమః అను మంత్రమును 40 రోజులలో జరిపించి చివరి రోజున అనగా 41 ఆకు పచ్చని వస్త్రములలో పెసలు పోసి దానము చేసినచో బుధగ్రహ దోష నివారన కలుగును. 
 

గురు గ్రహదోషమునకు:
 మాలతీపువ్వులు,తెల్ల ఆవాలు,యష్టి మధుకం,తేనే _ వస్తువులను నీళ్ళలో వేసి కాచి,ఆ నీటితో స్నానము చేయవలయును.
గురు దోష నివారణకు గురుగ్రహమును పూజించుట నమక పారాయణ చేయుట వలన దోషనివారణయగును. పుష్యరాగం ఉంగరమున ధరించుట శనగలు, పుష్యరాగం, పసుపు, చక్కెర, ఏనుగు, బంగారు రంగువస్త్రము గాని, బంగారము గాని ఎదొకదానిని దానము చేయుటవలన కూడా గురునకు సంభంధించి నదోషము శాంతింఛ గలదు. బంగారుతో చేసిన పాత్రతో బ్రహ్మమేడి (బొడ్డ), మారేడు, మర్రి,ఉసిరిక ఫలములను వేసి ఆ నీటితో స్నానము చేసినను గురువునకు సంభంధించిన దొషము తొలగిపోవును. బంగారముతో చేసిన ఉంగరము సాంప్రదాయము. 
శుభతిధి గల గురువారము నాడు ఉదయము ఓం-హ్రాం-హ్రీం-హ్రౌం-సః బృహస్పతయే నమః అను మంత్రము 40రోజులలో 16వేలు జపము పూర్తి చేసి పసుపు పచ్చని బట్టలో సెనగలు దానమిచ్చినచో గురుగ్రహ దోష శాంతి కలుగును. 
 

శుక్ర గ్రహదోషము:
 యాలుకలు,మణిశిల,శౌవర్చ లవణము,కుంకుమ పువ్వు_ ఈ వస్తువులను నీళ్ళలో వేసి కాచి,ఆ నీటితో స్నానము చేయవలయును.
శుక్ర గ్రహ గ్రహ నివారణకు గాను శుక్రగ్రహమునకు లక్ష్మీదేవికి పూజ చేయవలెను.వజ్రమును ఉంగరమున ధరించుట వలన శుభ్రవస్త్రము,తెల్లనిగుర్రము తెల్లని ఆవు,వజ్రము, వెండి, గంధము, బియ్యం బొబ్బర్లు వీటియందేదొకటి దాన మిచ్చుట వలన గాని శుక్ర గ్రహ దోషము నివారింపబడును. వెండి పాత్రయందలి నీటిలో గోరోచనము గజమదము, శ్తపుష్పము, శతావరిని కలిపి, ఆ నీటితో స్నానము చేసి శుక్రగ్రహ సంభంధమైన దోషము తొలగును.వెండితో చేసిన ఉంగరము గాని, ముత్యముతో వెండి ఉంగరము ధరించుట సంప్రదాయము. 
శుభతిధితో కూడిన శుక్రవారమునందు ఓం-ద్రాం-ద్రీం-ద్రౌం-సః శుక్రాయనమః అను మంత్రము 20,వేలు 40రోజులలో జపము పూర్తిచేసి ,41వ రోజున తెల్లని వస్త్రములో బొబ్బరులుపోసి దానము చేసిన శుక్రసంభంధమైన దోషము నివారింపబడును. 

శని గ్రహ దోషము: 

నల్ల నువ్వులు,సుర్మరాయి,సాంబ్రాణి,సోపు, _ వస్తువులను నీళ్ళలో వేసి కాచి,ఆ నీటితో స్నానము చేయవలయును.
శని గ్రహ దోష నివారణకు శనిగ్రహ పూజలు,ఈశ్వర పూజ,తైలాభిషేకము,నీలమణి ధరించుట, నువ్వులు దానము చేయుట వలన గ్రహ దోష నివారణ కలుగును. నీలము, నూనె , నువ్వులు, గేదె, ఇనుము ,నల్లని ఆవులందు ఏదో ఒకటి దానము చేయవలెను. ఇనుప పాత్రయందు గల నీటిలో మినుములు, ప్రియంగు ధాన్యము,నీలగంధ,నీలపుష్పములు వేసి ఆ నీటితో స్నానము చేసిన శనిగ్రహ దోషము నివారణయగును. 
శుభతిధి గల శనివారము నుండి ఓం-ఖ్రాం-ఖ్రీం-ఖ్రౌం-సః శనయేనమః అను మంత్రము 40 రోజులలో 19వేలు జపము చేసి ,41వ రోజున నువ్వులు నల్లని బట్టలో వేసి శని గ్రహ దోష నివారణ యగును. 
 

రాహు గ్రహ దోషము :
 సాంబ్రాణి,నువ్వు చెట్టు ఆకులు,కస్తూరి,ఏనుగు దంతము(ఏనుగు దంతము లేకపొయినను తతిమ్మా వాటితో) _ ఈ వస్తువులను నీళ్ళలో వేసి ఆ నీటితో స్నానము చేయవలయును.
రాహు గ్రహ దోష నివారణకుగాను రాహుగ్రహమును పూజించుట,దుర్గాదేవిని పూజించుట,గోమేధికమును ధరించుట వలన రాహుగ్రహదోషనివారణ యగును,గోమేధ్కము,గుర్రము,నీలవస్త్రము,కంబళి నూనె, మినుములు, పంచలోహములు, వీటియందేదైన దానము చేయుట వలన కూడా దోష శాంతి కలుగును. గేదె కొమ్ముతో చేసిన పాత్రయందలి ఉదకమున గుగ్గిలము,ఇంగువ,హరిదళము,మనశ్శిలలతో కలిపి ఆ నీటితో స్నానముచేసిఅన్చో రాహుదోషము తొలగును.పంచలోహములతో చేసిన ఉంగరము ధరించుట సాంప్రదాయం. 
శుభతిధి గల శనివారము నాడు రాహుమంత్రమగు ఓం-భ్రాం-భ్రీం-భ్రౌం-సః రాహవే నమః అను మంత్రమును 40 రోజులలో 18 వేలు జపము పూర్తి చేసి ,41వ రోజున మినుము చల్లని బట్టలో వేసి దానం చేసినచో రాహుగ్రహ సంభంధమైన దోషం తొలగిపోవును. 
 

కేతు గ్రహ దోషము:
 సాంబ్రాణి,నువ్వుచెట్టు ఆకులు,ఏనుగు దంతం,మేజ మూత్రం ,మారేడు పట్ట_ ఈ వస్తువులను నీళ్ళలో వేసి కాచి ఆ నీటితో స్నానం చేయవలెను.
కేతు దోష నివారణకుగాను కేతుగ్రహమును పూజించి సూర్యనమస్కారములు చేయుచు ఉలవలు దానమీయవలెను,వైఢూర్యము,నూనె,శాలువా,కస్తూరి,ఉలవలు వీటిని దానముచేసినను కేతుగ్రహ దోషనివారణ కలుగును.ఖడ్గమృగము కొమ్ముతో చేయబడిన పాత్రయందు గల నీటిలో పర్వతముల యందు పందికొమ్ముచే త్రవ్వబడిన మట్టి,మేకపాలు కలిపి ఆ నీటితో స్నానము చేసినచో కేతుగ్రహ దోష నివారణ కలుగును.పంచలోహముల ఉంగరము ధరించుట సాంప్రదాయము. 
శుభతిధిఅ గల మంగళవారము నాటి నుండి ఓం-ప్రాం-ప్రీం-ప్రౌం-సః కేతవే నమః అను మంత్రమును 40 రోజులలో 7 వేలు జపము పూర్తి చేసి 41వ రోజున ఎర్రని వస్త్రములో ఉలవలు పోసి దానమిచ్చినచో కేతుగ్రహ దోష నివారణ కలుగును.

No comments:

Post a Comment

parakrijaya@gmail.comRelated Posts Plugin for WordPress, Blogger...