శ్రీ మేధా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం

మీ జనన తేది,జనన సమయం,జనన ప్రదేశం ఈ మూడు సమాచారములు మాకు తెలియచేసినచో మీ వ్రుత్తి,వ్యాపార,ఆరోగ్య,ఆర్ధిక పరిస్తితులు, దాంపత్యం, విద్య,ఉద్యోగ,వివాహ,కుటుంబవ్యవహారాలు, సంతానం, రాజకీయ వ్యవహారాలు,ప్రేమ వ్యవహారములు,కుజ దోషం, కాలసర్ప దోషం మరియు వివాహ, ఉపనయన, గృహప్రవేస, జప, హోమ, వ్రత, అన్న ప్రసన , నామకరణం లకు ముహూర్తములు పెట్టబడును. P.V.RADHAKRISHNA CELL :+91 7013390324, Mail us :parakrijaya@gmail.com

Social Media Buttons

Follow by Email

Friday, January 15, 2016

Sankranti


15-Jan-2016
ముహూర్తం: సూర్యోదయం: 6.53 గంటలకు
సూర్యాస్తమయం: 5.57 గంటలకు
శ్రీమన్మథనామ సంవత్సరం-పుష్యమాసం
ఉత్తరాయనం-హేమంతరుతువు
శుక్లపక్షం
షష్ఠి రాత్రి 7.57 వరకు
నక్షత్రం: ఉత్తరాభాద్ర రాత్రి 2.31 వరకు
వర్జ్యం: మధ్యాహ్నం 12.57 నుంచి 2.27 వరకు
దుర్ముహూర్తం: ఉదయం 9.06 నుంచి 9.50 వరకు
తిరిగి మధ్యాహ్నం 12.47 నుంచి 1.31 వరకు
అమృతఘడియలు: రాత్రి 10.00 నుంచి 11.30 వరకు
రాహుకాలం: ఉదయం 10.30 నుంచి 12.00వరకు

మేషం

అందరితో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. ముఖ్యులతో సంభాషించేటపుడు మెళకువ వహించండి. నిరుద్యోగులతో ప్రముఖుల సిఫార్సుతో మంచి అవకాశం లభిస్తుంది. రాజకీయ, పారిశ్రామిక రంగాల వారికి అనూహ్యమైన అవకాశాలు దక్కుతాయి. పనివారితో సమస్యలు తలెత్తినా నెమ్మెదిగా సమసిపోతాయి.

వృషభం

సేల్స్ సిబ్బంది, కొనుగోలుదార్లతో అనునయంగా మెలగాలి. పందేలు, బెట్టింగ్‌లకు దూరంగా ఉండాలి. వృత్తి వ్యాపారాల్లో ఒడిదుడుకులను అధికమిస్తారు. స్త్రీల ప్రతిభకు మంచి గుర్తింపు రాణింపు లభిస్తుంది.

మిథునం

ఆర్థిక లావాదేవీలు, కీలకమైన వ్యవహారాలు సమర్థంగా పరిష్కరిస్తారు. మిర్చి, నూనె, ఆవాలు, చింతపండు, వెల్లుల్లి వ్యాపారులకు స్టాకిస్టులకు కలిసిరాగలదు. తలపెట్టిన పనిలో కొంతముందు వెనుకలుగానైనా సంతృప్తికానరాగలదు. రవాణా రంగంలోని వారికి చికాకులు అధికమవుతాయి.

కర్కాటకం

ఉద్యోగస్తులకు పండుగ అడ్వాన్స్‌లు క్లయింట్‌లు మంజూరవుతాయి. కుటుంబీకుల ఆరోగ్యంలో మెళకువ వహించండి. వైద్య, ఇంజనీరింగ్ రంగాల్లో వారికి ఒత్తిడి పెరుగుతుంది. మీ ముఖ్యుల కోసం ధనం బాగుగా వెచ్చించవలసి ఉంటుంది. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు.

సింహం

మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి అధికం. కళాకారులకు, రచయితలకు పత్రికా రంగాల వారిక గుర్తింపు, రాణింపు లభిస్తుంది. పిత్రార్జిత ఆస్తిని అమ్మటానికి చేయుయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యుల ప్రేమ ప్రేమాను బంధాలు విస్తరిస్తాయి. మీ గౌరవ మర్యాదలకు భంగం కలుగకుండా చూసుకోవాలి.

కన్య

వ్యాపారాభివృద్ధికి చేసే కృషిలో సఫలీకృతులవుతారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూ సమాచారం అందుతుంది. మీ శ్రీమతితో సలహా ప్రకారం నడుచుకోవడం ఉత్తమం. చిన్నారులకు విలువైన కానుకలు చదివించుకుంటారు. దైవ, సేవ, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఓర్పు, నేర్పుతో అనుకున్న పనులు సాధిస్తారు.

తుల

స్త్రీల భావాలకు కళాత్మతకు మంచి గుర్తింపు లభిస్తుంది. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. రాజకీయ నాయకులకు వ్యాపారాల్లో ఆటంకాలు తొలగి కొద్దిపాటి లాభాలు గడిస్తారు. నూతన పరిచయాలు మీ పురోభివృద్ధి తోడ్పడతాయి. అందరితో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు.

వృశ్చికం

వైద్య రంగంలోని వారు అరుదైన శస్త్రచికిత్సలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. పండ్లు, పూల, కొబ్బరి చల్లని పానీయ వ్యాపారస్తులకు శుభదాయకంగా ఉంటుంది. పెద్దమొత్తం నగదుతో ప్రయాలు క్షేమం కాదు. మీ శ్రీమతితో ప్రోత్సాహంతో కొత్త యత్నాలు మొదలెడతారు. దైవ, సేవా, పుణ్యకార్యాల పట్ల ఆసక్తి కలుగుతుంది.

ధనస్సు

స్త్రీలకు స్వీయ సంపాదన పట్ల ఆసక్తి, అందుకు అనువైన పరిస్థితుల నెలకొంటాయి. నిరుద్యోగులకు ప్రకటనల పట్ల అవగాహన ముఖ్యం. కొనుగోలుదార్లకు పనివారలను గమనిస్తుండాలి. నోరు అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. మీ అభిరుచులకు తగిన వ్యక్తులతో పరిచయం మీకెంతో సంతృప్తినిస్తుంది.

మకరం

ఆర్థిక విషయాల్లో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. మీ బలహీనతలు, అలవాట్లు అదుపులో ఉంచుకోవడం మంచిది. కొంతమంది మీ పరపతిని దుర్వినియోగం చేస్తారు. పత్రికా సిబ్బంది వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. కుటుంబీలకులతో కలిసి విందు వినోదాలలో ఉల్లాసంగా పాల్గొంటారు.

కుంభం

కొత్తగా చేపట్టిన వ్యాపారాల్లో నిలదొక్కుకోవడానికి మరింతగా శ్రమించవలసి ఉంటుంది. స్త్రీలకు ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం కూడదు. దైవ దర్శనాలలో చురుకుగా పాల్గొంటారు. హోటల్ తినుబండ వ్యాపారస్తులకు సంతృప్తి కానవచ్చును. రాజకీయాలలో వారికి అలజడి అధికమవుతుందని గమనించండి.

మీనం

ప్రేమికులు, విద్యార్థులు అతిగా వ్యవహరించడం వల్ల చిక్కుల్లో పడే ఆస్కార్ ఉంది. మీ సంతానం భవిష్యత్ కోసం నూతన పథకాలు చేపడుతారు. వృత్తి, వ్యాపారాల వారికి ఆటంకాలు తొలగిపోతాయి. వసతి ఏర్పాట్ల విషయంలో చిక్కులు తొలగిపోతాయి. పందాలు పోటీలలో జాగ్రత్త అవసరం. ఆలయాలను సందర్శిస్తారు.

No comments:

Post a Comment

parakrijaya@gmail.comRelated Posts Plugin for WordPress, Blogger...