డ్రైనేజీ - వాస్తు
డైనేజీ విషయంలో సైతం వాస్తు ఎన్నో నియమాలను వివరించింది. పాటించామా జీవితాంతం... ఆనంద ప్రమోదాలే. . నిర్లక్ష్యం చేశామా... పలురకాల బాధలు.
1. ఇంల్లో అన్నిరకాల ఉపయోగించిన నీరు, వర్షపు నీరు, తూర్పు ఈశాన్యం నుంచి గానీ ఉత్తర ఈశాన్యం నుంచి గానీ బలయటకు వెళ్ళేలా ఏర్పాటు చేసుకోవాలి. డ్రైనేజీని ఏర్పాటు చేసే సమయంలో ఈ నియమాన్ని విధిగా పాటించి తీరాలి.
2. పశ్చిమ నైఋతి ఉత్తర దిశ మీదుగా నీరు ఈశాన్యం పైపు నడిచి బయటకు వెళ్ళాలి. అలానే దక్షిణ నైఋతి నుండి దక్షిణం, తూర్పులగుండా ప్రవహించి ఈశాన్యం నుంచి బయటకు వెళ్లేలా డ్రైనేజీలు నిర్మించాలి.
3. ఈ విధంగా నీరు ఫ్రీగా నడిచి ఈశాన్యానికి నడిచే రీతిగా కాలవలు నిర్మించాలి. నైఋతిలోని నీరు ఆగ్నేయానికి వాయువ్యాయానికి ఫ్రీగా నడిచేందుకు వీలుగా నైఋతి నుండి వాయువ్యానికి, ఆగ్నేయానికి వాటం ఉండేలా జాగ్రత్తపడాలి.
4. వాయువ్యానికి చేరిన నీటిని ఈశాన్యం వైపు నడవాలంటే వాయువ్యం కన్న ఈశాన్యం పల్లంగా ఉండాలి. ఇదే రీతిగా ఆగ్నేయ మూలకన్న కలువ ఈశాన్యంలో పల్లంగా ఉండాలి. అప్పుడే నైఋతి నుండి ఆగ్నేయానికి చేరిన నీరు ఫ్రీగా ఈశాన్యానికి వెళ్తాయి.
5. ఇంట్లో కాలకృత్యాలకు ఇతర ఇతర అవసరాలకు వినియోగించిన నీటిని ఎలా అయితే ఈశాన్యం గుండా బయటకు పంపామో అదే రీతిగా ఇంటి స్లాప్‌లు కూడా ఈశాన్యంలో పల్లంగా ఉండేలా జాగ్రత్త వహించి వర్షపు నీరు స్లాబ్ పై నిలువ ఉండకుండా ఈశాన్యంలో ఏర్పాటు చేసిన తూము ద్వారా బయటకు వెళ్ళేలా స్లాబ్ నిర్మాణం సమయంలో పూర్తి జాగ్రత్తలు పాటించాలి. లేని పక్షంలో స్లాబ్‌పైన వర్షపు నీరు నిలచి పోయి, స్లాబ్ లీక్ అయ్యే ప్రమాదం ఉంది.
6. ఈశాన్యం గుండా డ్రైనైజ్ వాటర్‌ను బయటకు పంపడం కుదరని పక్షంలో... వాయువ్యం మీదుగా లేదా, ఆగ్నేయం గుండా డ్రైనేజీ వాటర్‌ను బయటకు పంపేలా ఏర్పాట్లు చేసుకోవాలి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
parakrijaya@gmail.com