శ్రీ మేధా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం

మీరు జన్మించిన తేది, సమయం, ప్రదేశం ఈ మూడు సమాచారములు మాకు తెలియచేసినచో మీ వ్రుత్తి,వ్యాపార,ఆరోగ్య,ఆర్ధిక పరిస్తితులు, దాంపత్యం, విద్య, ఉద్యోగ, వివాహ, కుటుంబవ్యవహారాలు, సంతానం, రాజకీయ వ్యవహారాలు,ప్రేమ వ్యవహారములు,కుజ దోషం, కాలసర్ప దోషం మరియు వివాహ, ఉపనయన, గృహప్రవేస, జప, హోమ, వ్రత, అన్నప్రసన, నామకరణం లకు ముహూర్తములు పెట్టబడును. P.V.RADHAKRISHNA CELL :+91 9966455872, Mail us : parakrijaya@gmail.com
పంచాంగ విషయాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
పంచాంగ విషయాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

19, ఆగస్టు 2013, సోమవారం

ప్రధమ ఋతువు (రజస్వల)

 రాజోదర్శనము అనగా స్త్రీ రజస్వల అగుట. ప్రధమ రాజోదర్శనమునకు వాడుకలో సమర్థ, పుష్పవతి, పెదామనిషి అయినదని కూడా అంటారు. నెల నెల రాజోదర్శనమును బహిష్టు అంటారు. ప్రధమ రజస్వల ప్రాతః కాలమునుంచి మధ్యాహ్నములోపు అయిన శుభము. మిగిలిన కాలము అశుభము.

రజస్వలకు దుష్ట తిధులు: అమావాస్య, ఉభయ పాద్యమిలు, షష్టి, అష్టమి, ద్వాదశి తిదుల యందును పరిఘ యోగముల పూర్వార్ధమునండును, వ్యతీపాత, వైధృతి యోగాములండును, సంధ్యా కాలమునండును, ఉప్పెన, భూకంప మొదలైన వుపద్రవ కాలమండును భద్ర కారణమూ నందును మొదటిసారి రజస్వల అయిన శుభకరము కాదు.

వారఫలము: సోమ, బుధ, గురు, శుక్ర వారములందు ప్రధమ రజస్వల అయిన శుభ ఫలము, ఆది, మంగళ, శని వారములందు అశుభ ఫలము కలుగుతుంది.

శుభ నక్షత్రములు: అశ్విని, రోహిణి, మృగశిర, పుష్యమి, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనూరాధ, మూల, ఉత్తరాషాఢ , శ్రవణం, ధనిష్ఠ, శతభిషం, ఉత్తరాభాద్ర, రేవతి యీ నక్షత్రములందు ప్రధమ రజస్వల అయిన సౌభాగ్యము, సౌఖ్యము, సంతానము, ఆయువు, ధనము కలుగుతుంది. మిగిలిన నక్షత్రములు అశుభ ఫలములు ఇచ్చును. కావున శాంతి చేయాలి. రజస్వల కాకుండానే వివాహాలు జరిపించే పూర్వపు రోజుల ప్రకారము భర్త యొక్క జన్మ నక్షత్రమినాను హాని అని చెప్పబడినది.

దుష్ట నక్షత్రములందు ప్రధమముగా రజస్వల అయినపుడు హోమయుక్తమైన శాంతి జరిపించి దానాదులు నిర్వహించి తిరిగి షుహ నక్షత్రములో రజోదర్శనమైన తదుపరి శుభ ముహూర్త కాలమందు గర్భాదానము చేయాలి. ఆ విధంగా చేసిన యెడల సంతాన ప్రాప్తి కలుగుతుంది మరియు గ్రహణ సమయములందు, సంక్రాంతి యందు, అశుభమైన నిద్రా సమయములందు, అర్ధరాత్రి యందు ప్రధమ రజస్వల అయినచో యుక్తమైన శాంతులు నిర్వహించాలి.

శుభ తిధులు: తదియ, పంచమి, సప్తమి, దశమి, ఏకాదశి, త్రయోదశి, పౌర్ణమి తిధులు శుభము.

లగ్న గ్రహ ఫలము: ప్రదమ రాజోదర్శన సమయమున కేంద్ర, కోణ, లాభ స్థానములందు శుబ గ్రహములు, తృతీయ, షష్ట లాభ స్థానములందు క్రూర గ్రహములు శుభ ఫలములిస్తాయి. చంద్రుడు అష్టమ స్థానమునందు వుండిన పతి నాశనము కలుగ జేస్తాడు. కాని చంద్ర తారాబలములు సంపన్నమైనపుదు పుత్ర, ధన సంపత్తులు కలుగుతాయి. కుజుడైనాను లేక చంద్రుడైనాను లగ్నమునకు 3, 6, 10 స్తానములన్డున్నచో సంపంనులగు కుమారులు కలుగుతారు.

నక్షత్ర గ్రహ ఫలము: రజస్వలా సమయ నక్షత్రమందు గురుడుగాని, శనిగాని వున్నాను, యే గ్రహము లేకున్నను శుభము. రజస్వలా సమయ నక్షత్రము నందు కుజుడున్నను బుధ శుక్రులు కలిసి వున్నాను, రవి వున్నాను రాహు కేతువులున్నను అశుభము.

రాజోదర్శన స్థాన ఫలితము: తన యింటి యందును, గోడల చావిదియండును, స్వగ్రామ మధ్యమందు, జల సమీపమున, ఇంటి ఆవరణ మధ్య ప్రధమ రజస్వల అయిన శుభము. గ్రామము బయట, ఇతర గ్రామములందు, నగ్నముగా వున్నపుడు ఇతరుల యిండ్లలోను ప్రదమ రజస్వల అయిన అశుభము.

వేళా విశేషములు: ప్రాతః కాలం చిర సౌభాగ్యం, ఉషః కాలం శోవ్భాగ్య లోపం, పూర్వాహ్నం పుణ్య క్షేత్ర దర్శనం, మధ్యాహ్నం ధనవతి, పుత్రవతి, సాయంత్రం జారగునం, సంధ్యలందు చేడుప్రవర్తన కలది, అర్ధరాత్రి బాల వైధవ్యం కలుగును.

రాత్రి వేళ నిర్ణయం: రాత్రి రజస్వల అయినచో రాత్రిని మూడు భాగాలుగా చేసి రెండు భాగముల కాలము పూర్వదినము, మూడవ భాగాకాలమున తదుపరి దినమునకు చెందుతుంది.

వస్త్రఫలము: తెల్లబాట్ట కట్టుకొని రజస్వల అయిన సౌభాగ్యవతి, గట్టి బట్ట కట్టుకొని రజస్వల అయిన పతివ్రతయు, దుకూల వస్త్ర దారియైన పట్టపురాణి యగును, నూతన వస్త్రము ధరించాగానే శుభ సంపన్నురాలగును, చిరిగినా బట్ట కట్టుకొనిన దౌర్భాగ్య రాలగును, యెర్రని బట్టకట్టుకోనిన వ్యాధి గ్రస్తురాలగును, నల్లని వస్త్రము ధరించినదైన దరిద్రురాలగును.

రజస్వలా శుద్ధి: రాజోవతి అయిన స్త్రీ మొదటి దినమునండు చండాల స్త్రీ సమానురాలు, రెండవ దినమందు పతితురాలితో సమానురాలు, మూడవ దినమునండు చాకలి స్త్రీతో సమానము, నాలుగవ దినమున కూడా శూద్ర స్త్రీ సమానురాలు, ప్రధమ రజస్వల అయిన స్త్రీ అయిదవ దినమందు దేవ పితృ కార్యములందు పరిశుద్దురాలూ అన్నారు. నాలుగవ దినమందు స్నాముచేత శుచి కాగలదు. బహిష్టు అయిన స్త్రీ మూడు రోజుల తరువాత శుద్ధి అవుతుంది. తిరిగి మల్లి పంతొమ్మిది రోజులలో బహిష్టు అయిన ఒక దినముతో శుద్ధి అట్లుగాక ఇరవై రోజుల అనంతరము ఎప్పుడైనా బహిష్టు అయిన మూడు రోజుల తరువాత శుద్ధి అగును.

ప్రధమ రజస్వల అయిన కన్యకు అక్షతలు తలపై వేసి ఆసనమేసి కూర్చుండ బెట్టాలి. దీపమున్న గదిలోనే కన్యను ఉంచాలి. సువాసినులకు శ్రీ గంధము, పుష్పములను, తమ్బూలములను లవణము, పెసలు మొదలగునవి ఇవ్వాలి. ప్రధమ రజస్వల అయిన వస్త్రముతోనే మూడు రోజులు ఉంచాలి. ఎవరిని తాకకుండా జాగ్రత్త గా, ప్రశాంతముగా, ఉండునట్లు చూడాలి. భోజన విషయంలో పులగము, నెయ్యి, పాలు వంటి సాత్విక ఆహారము ఉప్పు, పులుపు, కారము లేకుండా ఇచ్చుట మంచిది, నాలుగవ రోజు స్నానము చేయించి నూతన వస్త్రములు కట్టించాలి.

సర్వ ఋతువులకు సాధారణ నియమములు: మూడు దినములు ఎవరిని తాకకూడదు. అభ్యంగనము, కాటుక, స్నానము, పగలు నిద్రించుట , అగ్ని ముట్టుట, ప్రాసనము, సూర్యావలోకనము, భూమిపై గీతాలు గీయుట చేయుట చేయకూడదు. క్రింద పడుకోవాలి, ఆవుపాలు, పెరుగు, మజ్జిగ, తాంబూలము, గంధమాల్యములు ఉపయోగించరాదు. ఇవన్నీ ఆరోగ్యము కొరకు పాటించే నియమములు.

వస్త్రఫలము: తెల్లబాట్ట కట్టుకొని రజస్వల అయిన సౌభాగ్యవతి, గట్టి బట్ట కట్టుకొని రజస్వల అయిన పతివ్రతయు, దుకూల వస్త్ర దారియైన పట్టపురాణి యగును, నూతన వస్త్రము ధరించాగానే శుభ సంపన్నురాలగును, చిరిగినా బట్ట కట్టుకొనిన దౌర్భాగ్య రాలగును, యెర్రని బట్టకట్టుకోనిన వ్యాధి గ్రస్తురాలగును, నల్లని వస్త్రము ధరించినదైన దరిద్రురాలగును.

18, ఆగస్టు 2013, ఆదివారం

అధిక మాసము , క్షయ మాసము ( మల మాసము )


అధిక మాసము , క్షయ మాసము ( మల మాసము ) 
      ఈ సారి భాద్రపద మాసమునకు అధిక మాసము వచ్చింది . ఇది రేపటి నుండీ ఆరంభమవుతుంది . అధికమాసమనగా యేమి , అధిక మాసములో యేమి చేయవచ్చును , యేమి చేయరాదు మొదలగునవి ఇక్కడ వివరించడమయినది 

అధిక మాసమును అర్థంచేసుకొనుటకు ముందు సౌర మాసము , చాంద్రమాన మాసము లను గురించి తెలుసుకోవలెను . 

     సౌర మాసము :  రెండు పక్క పక్క సంక్రమణములు మధ్య కాలమునే ఒక సౌర మాసము అంటారు . సంక్రమణమనగా , సూర్యుడు ఒక రాశిని వదలి , తరువాతి రాశిని ప్రవేశించు సమయము . కాబట్టి , సూర్యుడు ఒక రాశిలో ఎంత కాలముంటాడో ఆ అవధి ఒక సౌర మాసము . సౌరమాసపు పేరు , సూర్యుడున్న రాశిపేరుతోనే పిలుస్తారు . ఉదాహరణకు , మేష మాసము , వృషభ మాసము ..ఇలాగ. 

     సూర్యుడి చలనపు వేగము దినదినమూ మారుచుండుట వలన అన్ని సౌర మాసములందూ కాలావధి ఒకటేగా ఉండదు . హెచ్చుతగ్గులు ఉండును . సంవత్సరానికి పన్నెండు సౌర మాసాలుండును . 

     చాంద్రమాన మాసము : రెండు అమావాశ్యల , లేదా రెండు పౌర్ణముల మధ్య కాలమును చాంద్రమాన మాసము అంటారు . అమావాశ్య , / పౌర్ణమి ముగిసినపుడు మాసము కూడా ముగుస్తుంది . అమావాశ్యను గణనకు తీసుకుంటే దానిని  ’ అమాంత మాసము ’ అనీ , పౌర్ణమిని గణనకు తీసుకుంటే దానిని ’ పౌర్ణిమాంత మాసము ’ అంటారు . 

     గుజరాత్ , మహారాష్ట్ర , కర్నాటక , కేరళ , తమిళనాడు , ఆంధ్ర ప్రదేశ్  మరియు బెంగాల్ లలో అమాంతమూ , మిగిలిన రాష్ట్రాలలో పౌర్ణిమాంతమూ వాడుక లో ఉంది .

     అధిక మాసము :  సామాన్యముగా ప్రతియొక్క చాంద్రమాన మాసపు కాలావధిలోనూ ఒక సంక్రమణము ఉంటుంది . అయినా కూడా , సగటు మీద ప్రతి రెండున్నర సంవత్సరాల కొకసారి ఏదో ఒక చాంద్రమాన మాస కాలావధిలో సంక్రమణమే ఉండదు . ఆ చాంద్రమాన మాసమును ’ అధిక మాసము  అంటారు . దాని తరువాతి మాసానికి ’ నిజ మాసము ’ అంటారు . ఈ అధిక-నిజ మాసాలు రెంటికీ ఒకే పేరు . అంటే , ఉదాహరణకు  ఈసారి భాద్రపదము అధిక భాద్రపదము , నిజ భాద్రపదము అని రెండు సార్లు వస్తుంది . 

     ఇలాగ అధిక మాసము వచ్చినపుడు ఆ చాంద్రమాన సంవత్సరములో పదమూడు మాసాలుంటాయి . సరళము గా చెప్పాలంటే , చాంద్రమాన సంవత్సరము , సౌరమాన సంవత్సరము కన్నా పదకొండు రోజుల తక్కువ కాలావధిని కలిగియుంటుంది . దీనిని సరిచేయుటకే రెండున్నర సంవత్సరాలకు ఒకసారి అధిక మాసమును చేరుస్తారు . అలా చేర్చుటకు , ఎప్పుడంటే అప్పుడు కాక , సంక్రమణము లేని మాసము అన్న నియమము ఉంది . 

     క్షయ మాసము : ఒకోసారి , ఒకే చాంద్ర మాన మాసములో రెండు సంక్రమణములు వస్తాయి . ఆ చాంద్రమాన మాసమును క్షయ మాసము అంటారు. క్షయ మాసము కార్తీక , పుష్య మరియు మాఘ మాసములలో మాత్రమే సాధ్యము . క్షయ మాసము వచ్చినపుడు , ఆ మాసమూ , దాని తర్వాతి మాసమూ కూడా కలసి పోయినట్లు పరిగణించి ఆచరిస్తారు . దీనికోసము , తిథిలో నున్న రెండు కరణములలో మొదటిది క్షయ మాసానికీ , రెండోదానిని తర్వాతి మాసానికీ చేరినట్లు భావించి ఆచరిస్తారు . క్షయ మాసమున్న సంవత్సరములో పదకొండు మాసాలే ఉండాలి . కానీ , ఆ సంవత్సరములన్నిటిలోనూ తప్పకుండా ఒక అధిక మాసము వస్తుంది కాబట్టి , మొత్తం మీద పన్నెండు మాసాలుంటాయి . క్షయ మాసము 141 సంవత్సరాలకొకసారి సంభవిస్తుంది . అరుదుగా , 19  సంవత్సరాల కొకసారి వస్తుంది . 


     ఇక , ఇంకో సిద్ధాంతము ప్రకారము , సావన వ్యవస్థ అని ఉన్నది . దీనిని ’ బ్రహ్మ సిద్ధాంతము ’ అంటారు . దీని ప్రకారము , బ్రాహ్మణునికి అమావాశ్యతో ముగియునది మాసము . వైశ్యునికి పౌర్ణమితో ముగియునది , రాజులకు సంక్రమణముతో ముగియునది మాసము . 

అధిక మాసము , క్షయ మాసము ఏది వచ్చినా దానిని సామాన్యముగా ’ మల మాసము ’ అంటారు . 

     మలమాసములో నిత్య నైమిత్తిక కర్మలు ( సంధ్యావందనము , ఉపాకర్మ ,  ఔపాసన , బ్రహ్మ యజ్ఞము , తర్పణము ,శ్రాద్ధము వంటివి ) తప్పక చేయాలి . హోమాగ్ని నాశనమైనచో దానిని తిరిగి కూర్చుట , దేవతా ప్రతిమకు అర్చనా సంస్కారాలు లోపించిన తిరిగి ప్రతిష్ఠాపన చేయుట , నైమిత్తికములని చెప్పబడినవి . పాత గృహముల పునరుద్ధరణ ( రిపేరీలు ) చేయవచ్చును . 

సీమంతము , అన్న ప్రాశన వీటిని వదలరాదు . అంటే చేయవచ్చును . 

     తిథి వార నక్షత్రములతో చెప్పబడిన కామ్య కర్మలు , శుభ కార్యములు చేయరాదు . ఈ నిషేధము ఎలాగంటే , ఆ నెలలో మొదలుపెట్టి , అదే నెలలోనే పూర్తి చేయుట కూడదు . అధిక మాసములలో యజ్ఞములు ఆరంభించి ముగించుట కూడదు . ఎందుకంటే అక్కడ సంక్రమణములేక సూర్య మండలము తపిస్తున్నది యని . 

17, ఆగస్టు 2013, శనివారం

లగ్నము అనగా ఏమిటి ?

లగ్నము అనగా ఏమిటి ?------------------------సూర్యుడు ఒక్కొక్క నెల ఒక్కొక్క రాశిలో ఉంటాడు.ప్రతి రోజూ సూర్యోదయ సమయములో ఆ రాశి నుండి ప్రయాణము సాగించి ఆ రోజు పూర్తయ్యేసరికి ౧౨ రాశులు చుట్టి వస్తాడు. (నిజానికి భూమే సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. మనము స్థిరముగా ఉన్నట్లు, సూర్యుడే తిరుగుతున్నట్లు కనిపిస్తుంది). విధంగారోజుకు ఒక డిగ్రీ చొప్పున ముందుకు నడుస్తూ నెల రోజుల తరువాత రాశిని వదిలి తరువాత రాశిలోకి ప్రవేశిస్తాడు. విధంగా ప్రతి రోజు ౧౨ రాశులలో సంచరిస్తున్నప్పుడు ఏదైనా ఒక సమయములో ఒక వ్యక్తి జననం అయితే సమయానికి సూర్యుడు రాశిలో సంచరిస్తూ ఉంటాడో రాశి లగ్నం అవుతుంది.
జాతక చక్ర నిర్మాణానికి కావలసినవి - దిగ్దేశకాలమనములు, అనగా --జాతకుని యొక్క () పుట్టిన తేది () పుట్టిన సమయము () పుట్టిన స్థలము

భారత ప్రామాణిక కాలమానము (IST) 82 1/2 (82.30) తూర్పు రేఖాంశము (East Longitude) గా నిర్ణయించబడినది. జాతకుడు పుట్టిన ప్రదేశములోని సమయమును "స్థానిక కాలమానము" (Local Mean Time, LMT) అందురు. LMT యొక్క అక్షాంశ, రేఖాంశములు (Latitude, Longitude) లను గుర్తించ వలెను. (అక్షాంశ, రేఖాంశముల పట్టిక Tables of Ascendants పుస్తకములోని ౧౦౦వ పేజి నుండి చూడవచ్చును). తరువాత IST మరియు LMT ల మధ్య గల వ్యత్యాసమును లెక్కించవలెను. IST మరియు LMT మధ్య గల వ్యత్యాసమును నాలుగుచే (౩౬౦ డిగ్రీలు గల భూమి తన చుట్టూ తాను తిరుగుటకు ౨౪ గంటలు పడితే, ఒక డిగ్రీ తిరుగుటకు పట్టే సమయము నాలుగు నిమిషాలు) గుణించగా వచ్చిన లబ్ధమును జాతకుడు పుట్టిన సమయమునకు కలుపుట లేదా తీసివేయుట ద్వారా LMT ని సవరించవలెను.
ఉదా: ఒక జాతకుడు విశాఖపట్నంలో సా.గం.౫-౩౦ ని.లకు పుట్టాడని అనుకుంటే,83.24 IST East Longitude17.42 LMT of vsk. East Longitude---------------04.03 IST(-)LMTx(-) 4---------------(-)16.12---------------5-30-00 జాతకుడు పుట్టిన సమయము, గం-ని-సె(-) 0-16-12---------------5-13-48 స్థానిక కాలమానమునకు సవరించిన తరువాత, జాతకుడు పుట్టిన వాస్తవ సమయము---------------
నక్షత్ర కాలమానము (Sidereal Time)-------------------------------------సూర్యుడు ఒక నక్షత్రము నుండి బయలుదేరి తిరిగి అదే నక్షత్రమును చేరుటకు పట్టే కాలమును నక్షత్రకాలమానము అందురు. ఇది గం.౨౩.౫౭ ని. ఉంటుంది. జాతకుడు పుట్టిన తేదికిTables of Ascendants పుస్తకములోనిSidereal Time (Table-1) ప్రకారము నక్షత్ర కాలమానము గుర్తించ వలెను.
జాతకుడు పుట్టిన సంవత్సరమును సవరణ చేసుకొనవలెను (Tables of Ascendants, Table-2)
తరువాత .గం. ౧౨ నుండి జాతకుడు పుట్టిన సమయానికి ఉన్న కాలము యొక్క వ్యత్యాసము (Time interval) ను కూడా సవరణ చేయవలెను. (Tables of Ascendants, Table-4)
భారతీయ నక్షత్ర కాలమాన సవరణ కూడా చేయవలెను (Tables of Ascendants, from Page 100). ఇది ని. లకు ఒక సెకను చొప్పున సరిచేయవలెను.
భారతీయ జ్యోతిషం నిరయన (అయనము లేనిది) పద్దతిని అనుసరించుచున్నది. కావున అయనాంశవ్యత్యాసమును కూడా సవరణ చేయవలెను.

16, ఆగస్టు 2013, శుక్రవారం

వివాహ లగ్నము మరియు వైవాహిక జీవితము

  (Marriage Ascendant & Married Life)

వివాహ లగ్నము మరియు వైవాహిక జీవితము (Marriage Ascendant & Married Life)
జ్యోతిష్య శాస్త్ర ప్రకారము కుండలిలో స్థితిలో వున్న గ్రహములు వైవావిక జీవితమును సుఖమయముగాను మరియు కలహపూర్ణముగాను చేయగలదు. కాని ఈ తత్వములు ప్రమాణికమైనవి. యది వైవాహిక లగ్నము (marriage ascendant)ను సరైన రీతిలో విచారణ చేసిన ఎడల వివాహము అనంతరము దాంపత్య జీవితములో కలిగే సమస్యలు చాలా వరకు తగ్గ గలవు మరియు వైవాహిక జీవితము సుఖమయముగా వుండగలదు.
వివాహ సంస్కారములను వ్యక్తి యొక్క రెండవ జీవితముగా లెక్కించెదరు. దీని ప్రకారము వివాహ సమయములో శుభ లగ్నము (benefic ascendent) అదే విధముగా మహత్యము కలిగి వుండును, జన్మ కుండలి(birth chart)లో లగ్న స్థానము(ascendant)లో శుభ గ్రహములు స్థితిలో వుండును. వివాహము కొరకు లగ్నమును నిశ్చయించు సమయములో వధువు మరియు వరుని యొక్క కుండలిని పరీక్షణ (examination of birth charts) చేసి వివాహ లగ్నమును నిశ్చయించవలెను. యది కుండలి లేని ఎడల వరుడు మరియు కన్య యొక్క పేరులో వున్న రాశి (name according to birth sign) కి అనుగుణముగా లగ్నమును విచారించవలెను. జ్యోతిష్య శాస్త్ర ప్రకారము జన్మ లగ్నము (birth ascendant) మరియు రాశి(birth sign) నుండి అష్టమ లగ్నము (8th ascendant) అశుభ ఫలదాయకముగా వుండును. అనగా ఈ లగ్నములో వివాహము గురించి ఆలోచించరాదు.

జన్మ లగ్నము మరియు జన్మ రాశి (Moon sign) నుండి నాల్గవ మరియు పన్నెండవ రాశి గుణములను లెక్కించుటలో స్రేష్టముగా వున్న ఎడల ఈ లగ్నములో వివాహము సంభవము అన్యతా జన్మ లగ్నము నుండి చతుర్ధ మరియు ద్వాదశ రాశితో లగ్నములో వివాహము దోషపూరితముగా వుండును. ఎవరి కుండలిలో లగ్నము నుండి కేంద్ర స్థానములో (center house) శుభ గ్రహములు వుండునో వారికి వివాహ లగ్న దోషము కలుగదు. కుజ లగ్నము (Mars ascendant) నుండి బుధుడు, గురువు మరియు శుక్రుడు యది కేంద్ర(center house)లో లేదా త్రికోణ(trine house)లో వున్న ఎడల వివాహ లగ్నములో అనేక విదములైన దోషములు అనగా దగ్దతిధి, గుడ్డి, చెవిడు కలుగవు (dagdh, blind and deaf dosha). వివాహ లగ్నము యొక్క సందర్బమును లెక్కించు సమయములో రాహువు శనికి సరిసమమైన ప్రబావకారిగా వుండును మరియు కుజుడు కేతువుకు సమానముగా వుండునని చెప్పదగ్గది.

15, ఆగస్టు 2013, గురువారం

పంచాంగ సాధారణ నియమాలు


 అధిక మాస క్షయమాసములందు విడువతగినవి :

సోమయాగాది కర్మాణి నిత్యాన్యపి మలిమ్లుచే, తదైవాగ్రయణాధాన చాతుర్మాయాది కాన్యపి|| మహాలయాష్టకా శ్రాద్ధోపాకర్మాద్యపికర్మయత్, స్పష్టమాస విశేషాఖ్య విహితం వర్జయేన్మలే || "అగ్న్యాధనం ప్రతిష్ఠాంచ యజ్ఞదాన వ్రతానిచ, వేద వ్రత వృషోత్సర్గ చూడాకర్మణి మేఖలాః|| మాంగల్య మభిషేకంచ మలమాసే వివర్జయేత్, గృహ ప్రవేశ గోదాన స్థానాశ్రమ మహోత్సవం|| వాపీ కూప తడాకాది ప్రతిష్ఠాం యజ్ఞ కర్మచ, న కుర్యాన్మల మాసేతు సంనర్పాహస్పతౌ తధా" || ఈ విధమైన ఆధారములు పరిశీలించగా మూలమాసమందు క్షయమాసము నందును మౌఢ్యకాలమునందువలెనే (పైన చెప్ప బడిన) కార్యములను విడువవలెను.

ఋణ విషయం :

ఋణములు ఇవ్వవలెను అన్నచో స్వాతీ పునర్వసు, విశాఖ, పుష్యమి, శ్రవణం, ధనిష్ఠ, శతబిషం, అశ్వనిల యందు చిత్త, రేవతి, అనూరాధ, మృగశిర, చర, లగ్నములందు లగ్నాత్ కోణ స్థానమందు శుభగ్రహములు ఉండగాను లగ్నాత్ అష్టమ స్థానమందు గ్రహములు లేకుండా చూసి ఋణములు ఈయవలెను. మంగళ, బుధ వారముల యందు సంక్రమణము లందును హస్తా నక్షత్రముతో కూడిన ఆదివారమునందు ఋణములు తీసుకొన్నయెడల ఆరుణము తీసుకొన్నయెడల ఆ ఋణము తీర్చుట కష్టము. వృద్ధినామ యోగము వున్నరోజున అప్పు తీసుకోకూడదు. త్రిపుష్కరము అనగా శని, ఆది, మంగళ వారములలో ఒక రోజు త్రిపాద నక్షత్రము, భద్రతిధిని కలిపి ద్విపుష్కరం అంటారు. ఈ పై రెండు విశేషములలోను ఋణములు పుచ్చుకొనకూడదు. మంగళ వారం ఋణం తీర్చుట విశేషము. దారుణ, ఉగ్ర, సాధారణ, స్థిర నక్షత్రములందు భద్రకరణము నందు, పాతలమందు వృద్ధికోసం యిచ్చే ధనం తిరిగి పొందబడదు.

ఏకవింశతి మహాదోషములు

1 పంచాంగశుద్ది 11 సగ్రహ చంద్ర
2 సంక్రాంతి దోషం 12 దుర్ముహూర్తం
3 పాపార్గళం 13 ఖర్జూరి చక్రం
4 కునవాంశ 14 గ్రహణభ దోషం
5 కుజాష్టమం 15 ఉత్పాతభం దోషం
6 భృగషట్కం 16 క్రూరయగ్ధిష్ణి
7 కర్తరీ దోషం 17 అశుభ విద్ధ
8 అష్టమ లగ్నం 18 విషఘటిక
9 అష్టమచంద్రుడు 19 లగ్నాస్త దోషం
10 గండాస్త దోషం 20. 6,8,12 స్థిత చంద్ర, 21వ్యతీపాత వైధృతి

ఔషధసేవ :

హస్తత్రయే పుష్య పునర్వసౌచ విష్ణుత్రయే చాశ్వినీ పౌషణ భేషు | మిత్రేందు మూలేషుచ సూర్యవారే భైషజ్యముక్తం శుభ వావాసరేపి|| హస్త చిత్త స్వాతి, పుష్యమి, పునర్వసు, శ్రవణ, ధనిష్ఠ, శతభీషం, అశ్వనీ, రేవతి, అనూరాధ, మృగశిర, మూలా నక్షత్ర దినములయందును " శుద్ధేరిః ఫద్యున మృతిగృహే నత్తిధౌనోజనేర్ క్షే" లగ్నాత్ పన్నెండు సప్తమ, అషటమ స్థానములందు గ్రహములు లేకుండగాను ఔషధసేవ ప్రారంభం చేయ వలెను. జన్మనక్షత్రంలో ఔషధసేవ చేయకూడదు.

కొన్ని సాధారణ నియమాలు

మౌనం పాటించవలసిన కాలము.

ప్రభాతే మైధునేచైవ ప్రసావే దంతధావనే
స్నానేన భోజనేకాలే మౌనంషట్స విధేయతే ||
ప్రభాత కాలమునందు, మైదాన కాలంలోను, మల మూత్ర విసర్జన సమయంలోను, దమ్తావఏధాన సమయంలోను, స్నానము చేయునప్పుడు, భోజనం చేయునప్పుడు మౌనంగా వుండాలి.
" కుర్యాన్మాత్ర పురేషేతు రౌత్రౌచే ద్దక్షిణాముఖః దినా ఉదజ్మఖ!"
మూత్రపురీషాదులు రాత్రి సమయంలో దక్షిణ ముఖంగా కూర్చొని పగటికాలంలో ఉత్తరముఖంగా కూర్చొని విసర్జించవలెను. అయితే ఉత్తర, దక్షిణ ముఖములుగా మలమూత్ర విసర్జించవలెనని వాస్తు శాస్త్రం చెబుతుంది.

జన్మ నక్షత్రము లో చేయదగిన కార్యములు

జన్మ నక్షత్రము నిషేకము, యాగము, చౌలకర్మ, అన్నప్రాసన, వ్యవసాయము, ఉపనయనం, రాజ్యపట్టాభిషేకం, భూసంపాదన, అక్షరాభ్యాసం నందు శుభప్రధము. పుంసవనం, సీమంతం, యుద్ధము, గర్భదానం, శ్రౌద్ధము, క్షౌరము, ఔషధ సేవ, ప్రయాణముల అందు అశుభప్రధం. స్త్రీలకు వివాహ విషయమై శ్రేష్ఠము.
దోషం - శాంతి మంత్రం
ఆరోగ్య సమస్యలు వున్ననూ ||
పిల్లలకు దృష్టిలోపం వున్ననూ, గర్భిణీలకు గర్భరక్షణ కోసం
మానసిక అశాంతి ఎక్కువగా వున్ననూ
విభూధి చేతపట్టుకొని 41 సార్లు పారాయణం చేసి
విభూధి ముఖమున ధరించిన శాంతి లభించును.
శ్రీమద నృశింహ విభవే గరుడ ధ్వజాయ
తాపత్రయో శమనామ భవౌషధాయ
తృష్నాది వృశ్చికజలగ్ని భజంగరోగ
క్లేశ వ్యయాయ హరయే గురవేనమస్తే
పిల్లలకు మాటలు రాగానే ఈ శ్లోకం నేర్పి వారి చేత నిత్యం పారాయణం చేయిస్తే, దృష్టి దోషం, నరఘోష, భూత బాధ దగ్గరకు రావు ఆరోగ్యంగా వుంటారు.


నవరత్నములు ధరించవలసినవారి నక్షత్రములు

వైఢూర్యం :అశ్విని, మఘ, మూల పుష్యరాగం :పునర్వసు,విశాఖ,పూర్వాభాద్ర పచ్చ:ఆశ్రేష,రేవతి,జ్యేష్ఠ నీలం:పుష్యమి,ఉత్తరాభాధ్ర,అనూరాధ కెంపు: కృత్తిక,ఉత్తర,ఉత్తరాషాడ వజ్రం:భరణి,పుబ్బ,పూర్వాషాఢ గోమేధికం:ఆర్ద్ర,స్వాతి,శతభిషం పగడం:మృగశిర,చిత్త,ధనిష్ఠ ముత్యం:రోహిణి,శ్రవణం,హస్త

నవవస్త్రాభరణధారణ :

విప్రాజ్ఞయందు, ఉత్సవముల యందు ఈ క్రింద చెప్పిన తిధివార నక్షత్ర సంభంధం లేకుండా వస్త్రభూషణం చేయవచ్చును. రేవతి, రోహిణి, ఉత్తర, ఉత్తరాషాఢ, ఉత్తరాభాద్ర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనూరాధ, ధనిష్ఠ, పునర్వసు, పుష్యమి యందు రిక్తేతర తిదుల యందు, ఆది, సోమ, బుధ, గురు, శుక్రవారముల యందును నూతన వస్త్రధారణ మాంచిది. మంగళవారం ఎర్రని వస్త్రములు ధరించుటకు మంచిది. పునర్వసు, పుష్యమి నక్షత్రములందు దృవనక్షత్రములయందును, మంగళవారము నందును సౌభాగ్యవతియగు స్త్రీ నూతన వస్త్రాభరణధారణ చేయకూడదు.

మౌఢ్యమునందు విడువవలసిన కార్యములు

వ్యాపారం, తటాక, కూప, గృహారంభ, గృహప్రవేశములు, వ్రతారంభ, వ్రతోద్యాపన, వధూప్రవేశ, మహాదాన సోమయాగాష్టకా శ్రాద్ధములు సంచయన, ప్రధమో పాకర్మ వేధవ్రతములు, కామ్య వృషోత్సర్గ వివాహాదుల, దేవతా ప్రతిష్ఠలు, దీక్షోపనయన, చూడా కర్మలు, కర్మలు, అపూర్వ దేవతీర్ధ దర్శనము, సన్యాగ్రహణము, అగ్నిస్వీకారము, రాజ దర్శనము, రాజ్యాభిషేకము, యాత్ర, సమావర్తనము, కర్ణవేధనలు చేయకూడదు. అయితే మాస ప్రాధాన్యములైన సీమంతము పుంసవనం, నామకరణం, అన్నప్రాశన వంటివి చేయవచ్చును.

శూన్యమాస విచారణ

మీనములో రవి ఉండగా చైత్ర మాసము, మిధునంలో వుండగా ఆషాడమాసము, కన్యలో రవి ఉండగా భాద్రపద మాసము, ధనుస్సులో ఉండగా పుష్యమాసము శూన్యమాసములు.

సముద్ర స్నానం

సముద్రే పర్వసు స్నాయా దయాయాంచ విశేషతః|
పాపైర్విముచ్యతే సర్వై రమాయాం స్నానమాచరన్||
సముద్రమందు పూర్ణమ, అమావాస్య మొదలగు పర్వములందే స్నానం చేయవలెను. శుక్ర, మంగళ వారములు నిషేధము. "ఆకామావై పౌర్ణిమ" గా పిలువబడు ఆషాఢపౌర్ణిమ, కార్తీక పౌర్ణిమ, మాఘ పౌర్ణిమ, వైశాఖ పౌర్ణీమలు సముద్రస్నానమునకు విశేషమైనపర్వములు. "అశ్వత్థ సాగరౌసేవ్యౌ సస్పర్శస్తు కదాచన. అశ్వత్థం మందవారేచ సముద్ర పర్వణి స్పృశేత్" అశ్వత్థ వృక్షమును సముద్రమును సర్వదా సేవించవలెను కాని స్పృశించకూడదు. శనివారం అశ్వత్థ వృక్షమును పర్వములందు సముద్రమును స్పృశించ వచ్చును. వ్రతాచరణ నిమిత్తంగా అశ్వత్థ (రావి) వృక్షమును స్పృశింపవచ్చును.

సేవకా సయ్యాది విషయము :

పాదుకలు, ఆసనములు, మంచములు వాడుక విషయంలో దృవ, క్షిప్ర, మృదునక్షత్రములను శ్రవణం, భరణి, పునర్వసు నక్షత్రములయందును, మంచితిధుల యందును వాడకం ప్రారంభించుట మంచిది. క్షిప్ర, దృవ నక్షత్రముల యందును, అనూరాధ పుష్యమి నక్షత్రముల యందును, బుధ, గురు, శుక్ర, ఆదివారముల యందును, సేవాకార్యం నౌకరీ ప్రారంభించవలెను. శుభలగ్నమందును దశమ ఏకాదశస్ఠః ఆనములందును రవి లేక కుజుడు వుండగా ప్రారంభించవలెను.

14, ఆగస్టు 2013, బుధవారం

వివాహా ముహూర్తాలు

 ఏక నక్షత్ర వివాహ విషయము :

రోహిణి, ఆర్ద్ర, పుష్యమి, మఘ, విశాఖ, శ్రవణం, ఉత్తరాభాద్ర, రేవతి ఈ ఎనిమిది నక్షత్రముల విషయంలో వధూవరులకు ఏక నక్షత్రమైన దోషం లేదు. అశ్వని, భరణి, ఆశ్రేషా, పుబ్బ, స్వాతీ, మూల శతభిషం యివి మధ్యమములు తక్కిన నక్షత్రములు దోషములు.

అయితే 27 నక్షత్రములలో కూడా ఒకే నక్షత్రము అయినప్పటికీ భిన్న పాదములు అయినచో దోషం లేదు.

ఏకోధర వివాహము :

' పుత్రీ పాణీని పీడనాచ్చ పరతస్పువో ద్వివాహశ్శుభో, న్యాఅన్యత్పుత్ర కరగ్రహత్తునక మప్యుద్వాహ ఏవవ్రతత్' అనే కాలమృత శ్లోకాధారముగా ఏక కాలమందు పుత్ర పుత్రికా వివాహముల విషయములో పుత్రిక వివాహానంతరము పుత్ర వివాహము ముఖ్యమ్ననియు పుత్ర వివాహానంతరము పుత్రికా వివాహమునకు పుత్ర ఉపనయనము అయిన చేయ కూడదనియు పుత్ర ఉపనయనాంతరము పుత్రికా వివాహము శుభకరమనియు పుత్ర వివాహము చేసిన సంవత్సరమ్మునందు ఆరు నెలల పర్యంతము ఏకోదరులకు ఉపనయనాదులు అశుభకరములు. " ఫాల్గుణే చైత్ర మాసేతు పుత్రోద్వాహోపనయనాయనే అబ్ద భేదాత్ర్పకుర్వీత ఋతుత్రయ విడంబన" అనగా ఫాల్గుణ మాసంలో ఒకరికి చైత్రమాసంలో మరొకరికి సంవత్సరము భేధం ఉన్నందున వివాహ, ఉపనయనాదులు చేయ వచ్చును.

కన్యాదాతల నిర్ణయం :

కన్యాదానము చేయు అధికారము తండ్రికి, త్యండ్రి కానిచో పితామహుడు, సోదరుడు, పిన తండ్రి, పెత్తండ్రి మెదలగు పితృవంశస్థులు వారు కానిచో స్వగోత్రీకులు కానిచో ఎవరైనను చేయ వచ్చును.

కుజదోష నివారణ :

పాతాళేపి ధనౌరంధ్రే జామిత్రే చాష్ఠమేకుజే
స్థితః కుజః పతింహంతి నచేచ్ఛు భయతేక్షితః
ఇందోరప్యుక్త గేహేషు స్థితః భౌమోధవాశనిః
పతిహంతాస్త్రియాశ్చైవం వరస్య యది స్త్రీ మృతిః
(బృహతృరాశరీరాశాస్త్రం)

జన్మలగ్నము -

చంద్రలగ్నముల లగాయతు 2,4,7,8,12 రాశుల యందు కుజుడు వున్నయెడల దానిని కుజదోషంగా పరిగణించాలి. ఈ కుజదోషం ఇరువురికి వున్నను లేక ఇరువురికి లేకున్నను వివాహం చేసుకొనవచ్చును. ఈ దోషం ఒకరికుండి మరొకరికి లేకున్నను వైవాహిక జీవితం కలహ ప్రదంగా వుంటుంది. కుజుడు కలహ ప్రదుడు. శని ఆయుర్దాయ కారకుడు. కావున పైన చెప్పిన విధానంలో శని దోషం కూడా చూడవలెను అని పరాశర మతం " నచేచ్ఛభయతేక్షితః" అనివున్న కారణంగా కుజునికి శుభగ్రహముల కలయిక (లేదా) శుభగ్రహ వీక్షణ వున్నచో దోషం వుండదు. కేవలం ఆడవారి జాతకంలో వుంటే మగవారికి ఇబ్బంది. కేవలం మగవారి జాతకంలో వుంటే ఆడవారికి ఇబ్బంది.
ద్వితీయ స్థితియే భౌమదోషస్తు యుగ్మ కన్యక యోర్వినా! ద్వాదశే భౌమ దోషస్తు వృషతాళిక యోర్వినా! చతుర్ధేభౌమ దోషస్తు మేష వృశ్చికయోర్వినా! సప్తమే భౌమదోషస్తు నక్రకర్కట యోర్వినా! అష్టమే భౌమదోషస్తు ధనుర్మీనద్వయం వినా! కుంభేసింహేన దోషస్స్యాత్ ప్రత్యక్షం దేవ కేరళే || ద్వితీయ స్థితి కుజదోషం మిధున కన్యలకు లేదు. ద్వాదశ స్థితి కుజదోషం వృషభ తులలకు లేదు. చర్తుర్ధస్థితి కుజదోషం మేషవృశ్చికములకు లేదు. సప్తమ స్థితి కుజదోషం ధనుస్సు, మీనములకు లేదు. కుంభము, సింహముల యందు జననమయినచో కుజదోషం వుండదు. మేష, వృశ్చిక, మకర లగ్నములవిషయంలోను మృగశిర ధనిష్ఠ, చిత్త, నక్షత్రముల విషయంలోను కుజదోషం వుండదు.

నిశ్చితార్ధం :

నిశ్చితార్ధమునకు పెండ్లితో సమానమైన, సమాన బలమైన ముహూర్తం చూడవలెను. కారణం నిశ్చితార్ధంతోనే వధూవరులు భంధం ప్రారంభం అవుతుంది. అంతేకాకుండ జాతక ప్రభావాలు వారిరువురికి ఒకరి ప్రభావం మరొకరి మీద చూపుతుండి. వివాహమునకు సంభంధించిన తిధి వార నక్షత్ర లగ్నములు చూడవలెను. అయితే నిశ్చితార్దం రోజున గణపతి పూజ చేయవలెను. కావున భోజనానంతరం పూజ పనికి రాదు. కావున ఉదయ సమయంలోనే నిశ్చితార్ధం చేయవలెను.

నూతన వధూవాస దోషములు :

" వివాహాత్ప్రమే పౌషే ఆషాఢే చాధి మాసకే. నసా భర్తృగృహే తిష్ఠే చ్ఛైత్రే పితృగృహే తధా" వివాహం అయిన ప్రథమ సంవత్సరం ఆ వధువు అత్తవారింట ఉన్నచో ఆషాఢమాసంలో అత్తగారికి గానీ, అధిక మాసం అందు భర్తకును, పుష్య మాసంలో మామగారికి గానీ గండము. మొదటి సంవత్సరము చైత్ర మాసంలో తండ్రి యింట ఉన్న ఎడల తండ్రికి హాని అని వున్నది కానీ ఈ ఒక్క విషయము ఆచారం లేదు.

పునర్వివాహము :

ప్రమదామృతి వాసరాదితుః పునరుద్వాహ విధిర్వరస్యద విషమే పరివత్సరే శుభోయుగళేచాపి మృతిప్రదోభవేత్" అనగా పూర్వ భార్య మృతి నొందిన దిన ప్రభృతి బేసి సంవత్సరముల యందు పునర్వివాహము చేసుకొనుటకు శుభము. సరిసంవత్సరములందు అశుభము.
" తృతీయా మానుషీకన్యా నోద్వాహ్యా మ్రియతేహిసాః విధవా వాభవేత్తస్మాత్ తృతీయేర్కం సముద్వహేత్" మూడవ వివాహము మనుష్య కన్యకు చేసుకొనుట పనికిరాధు అట్లైనచో భార్యకు మృతి కలుగును, విధవ అయిన అగును. కావున తృతీయము అర్క వివాహము చేయునది.

పెండ్లి చూపులకు :

సోమ, మంగళ వారములు కాకుండాను భరణి, కృత్తిక, ఆర్ద్ర, ఆశ్రేష, పుబ్బ, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, పుర్వాభద్ర, నక్షత్రములు కాకుండా, వ్యర్జ దుర్ముహర్తములు లేకుండాను, చవితి, షష్ఠి, అష్టమి, ద్వాదశి, అమావాస్య కాకుండా శుభగ్రహ హోరాలయందు పగటి సమయమున పెండ్లి చూపులఏర్పాటు చేయవలెను.

పెండ్లి పనులు ప్రారంభించుటకు :

సోమ, మంగళ వారములు విడువవలెను అశ్వని, రోహిణి మృగశిర, పునర్వసు, పుష్యమి, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, అనూరాధ, మూల, ఉషా, శ్రవణం, ధనిష్ట, శతభిషం, ఉత్తరాభాద్ర, రేవతి, నక్షత్రములయందు విదియ, తదియ, పంచమి సప్తమి, దశమి ఏకాదశి, త్రయోదశి, పౌర్ణిమ, బహుళ పాడ్యమి తిధుల యందు, శుభగ్రహ హోరాల యందు వర్జ్యం దుర్ముహర్తం వదలి పెండ్లి పనులు ప్రారంభించాలి.

వధూప్రవేశము :

" వివాహ మారభ్య వధూప్రవేశో యుగ్మేదినే షోడశవాసంరాంతే" వివాహ దిన ప్రభృతి పదహారు రోజుల లోపల ఎప్పుడైననూ సరిదినముల యందునూతన గృహప్రవేశం చేయవచ్చును.
వధూ ప్రవేశోనది వాప్రశస్తుః నూతన వధువు అత్తవారింట అడుగు పెట్టవలెను అంటే పగలు పనికి రాదు. సూర్యాస్తమయాత్ పరం, సూర్యోదయాత్ పూర్వము ప్రసస్తము.
షష్ఠేష్టమేవా దశమే దినేవా వివాహ మారభ్య వధూ ప్రవేశః పంచాంగ శుద్ధంచ దినం వినాపి తిధౌన సద్గోచరకేపికార్యః అనగా వివాహము అయినది మొదలు ఆరు, ఎనిమిది, పది దినములందు వధువు ప్రవేశించిన ఎడల ఆ దినములు తిధి వారనక్షత్ర యోగకరణములచే శుద్ధము కాకపోయినప్పటికీ శుభ ప్రదముగానే వుంటుంది.
ఒక వేళ మొదటి నెలలో వదూ ప్రవేశం జరగనిచో మెదటి సంవత్సరంలో బేసి నెలలో స్థిర, క్షిప్ర, మృదు, శ్రవణ, ధనిష్ఠ, మూల, మఘ, స్వాతీ, నక్షత్రదినములందు రిక్త తిధులను విడచి నూతన వధూ ప్రవేశం చేయ వలెను.
ఎప్పుడు వధూ ప్రవేశం చేసిననూ వర్జ్య దుర్ముహోర్త కాలములు విడువవలెను.

వివాహ ప్రయత్నం ఎప్పుడు ప్రారంభించాలి?

వివాహము చేయవలెను అని తలచినప్పుడు ఎవరు వివాహ ప్రయత్నములు చేయదలచారో వారికి నక్షత్రం తారాబలం కుదిరిన రోజున, భరణి, కృత్తి, ఆర్ద్ర, పున, పుష్య, ఆశ్రేష, పుబ్బ, చిత్త, విశాఖ, జేష్ఠ, పూర్వాషాఢ, పూర్వాభద్రలను విడచి, మంగళ, సోమ వారములు కాకుండా, వర్జ్య దుర్ముహూర్తములు లేని సమయంలో గణపతిని ప్రార్ధించి తదుపరి యిష్టదైవమును ప్రార్ధించి వివాహప్రయత్నము చేయ వలెను.

వివాహం :

భరణి, కృత్తిక, ఆర్ద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్రేష, పుబ్బ, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, పూర్వాభద్ర నక్షత్రములు పనికిరావు. చిత్త పనికి వస్తుంది అని కొందరి వాదన. బుధ, గురు, శుక్ర, శని, ఆది వారములు పనికి వస్తాయి. అయితే అన్ని గ్రంధాలలో శుభగ్రహవారములు అన్ని వున్న కారణముగా క్షీణ చంద్రుడు కాని సమయములో వున్న సోమవారాం పనికి వస్తుంది. "మాసంతే దిన పంచకే పితృతిధౌ" బహుళ ఏకాదశి నుండి అయిదు రోజులు, పితృతిధులు వున్నరోజులలో వివాహం పనికి రాదు. పాపగ్రహ వీక్షణ వున్న సమయంలో సప్తమంలో అష్టమంలో పాపగ్రహములు వున్న లగ్నములు పనికిరావు మాఘ, ఫాల్గుణ, చైత్రం, వైశాఖ, జ్యేష్ఠ, శ్రావణ, ఆశ్వయుజంలో దసరా తర్వాత కార్తికం, మార్గశిరంలో ధనుర్మాసం ముందర వివాహములు చేయుట ఆచారంగా వున్నది. మధ్యాహ్నం 12 లోపల, మరల సూర్యాస్తమయం తర్వాత వివాహం చేయవచ్చు.

వివాహం -ఆబ్దికం :

వివాహమునకు ముందురోజు ఆబ్దికం వున్నచో ఆ ముహుర్తం పనికిరాదు. ఇది కన్యాదాత విషయంలోను వరుడు, వరుని తండ్రి ఆబ్దీకములు పెట్టవలసినవిషయంలో మాత్రమే. వివాహం చేసిన నెలలోపుగా వధూవరుల యిండ్ల వారి పైతలరాలవారి ఆబ్దీకములు రాకుండా చూసుకుని వివాహముహోర్తం నిర్ణయించాలి.

13, ఆగస్టు 2013, మంగళవారం

వధూవరుల జాతకంలో పరిశీలించవలసిన విషయాలు

కుజదోష విచారణ:-

పాతాళేపి ధనౌరంధ్రే జామిత్రే చాష్టమేకుజే
స్ధితః కుజః పతింహంతి నచేచ్చు భయుతేక్షితః
ఇందోరప్యుక్త గేహేషు స్ధితఃఅ భౌమోధవాశనిః
పతిహంత్రౌస్త్రియాశ్చైవం వరస్య యది స్త్రీ మృతిః
(బృహతృరాశరీరాశాస్త్రం)
జన్మలగ్నము- చంద్రలగ్నముల లగాయితు 2,4,7,8,12 రాశుల యందు కుజుడు వున్నఎడల దానిని కుజదోషంగా పరిగణించాలి. ఈ కుజదోషం యిరువురికీ వున్ననూ లేదా యిరువురికీ దోషం లేకున్ననూ వివాహం చేయవచ్చును. ఈ దోషం ఒకరికి వుండి మరొకరికి లేని ఎడల వైవాహిక జీవితం కలహప్రదంగా వుంటుంది. కుజుడు కలహ ప్రదుడు. శని ఆయుర్దాయకారకుడు కావున పైన చెప్పిన విధానంలోనే శనిదోషం కూడా చూడవలెను అని పరాశర మతం. "నచేచ్చభయుతేక్షితః" అని ఉన కారణంగా కుజునికి శుభగ్రహముల కలయిక (లేదా) శుభగ్రహవీక్షణ వునచో దోఆషం వుండదు. కేవలం ఆడవరై జాతకంలో దోషం వుంటే మగవారికి యిబ్బంది. కేవలం మగవారి జాతకంలో వుంటే ఆడవరైకి యిబ్బంది.

ద్వితీయ భౌమరోషస్తు యుగ్న కన్యక యోర్వినా| ద్వాదశే భౌమ దోషస్తు వృషతాళిక యోర్వినా| చతుర్ధే భౌమదోషస్తు మేష వృశ్చికయోర్వినా| సప్తమే భౌమదోషస్తు నక్రకర్కట యోర్వినా| అష్టమే భౌమదోషస్తు ధనుర్మీనద్వయం వినా| కుంభేసింహేన దోషస్స్యాత్ ప్రత్యక్షం దేవ కేరళే|
ద్వితీయ స్ధితి కుజదోషం మిధున కన్యకలకు లేదు. ద్వాదశ స్ధితి కుజదోషం వృషభ తులలకు లేకు. చతుర్ధస్ధితి కుజదోషం మేషవృశ్చికములకు లేకు. సప్తమస్ధితి కుజదోషం మకర కర్కాటకములకు లేదు. అష్టమ స్ధితి కుజదోషం ధనస్సు, మీనములకు లేదు. కుంభము, సింహముల యందు జననమయనలో కుజదోషం వుండదు. మేష, వృశ్చిక, మకర లగ్నముల విషయంలోను మృగశిర ధనిష్ఠ, చిత్త నక్షత్రముల విషయంలోను కుజదోషం వుండదు.

ఊర్ధ్వ, అధో, తిర్యజ్మఖ నక్షత్రములు

అశ్వని, మృగశిర, పునర్వసు, హస్త, చిత్త, అనూరాధ, , జ్యేష్ఠ, రేవతి యివి తిర్యజ్ముఖ నక్షత్రములు. భరణి, కృత్త్యిక, ఆశ్రేష, పుబ్బ, విశాఖ, మూల, పూర్వాషాఢ, పూర్వాభద్ర యివి అధీముఖములు. రోహిణి, మృగశిర, పుష్యమి, ఉత్తర ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ఠ, శతభిషం, ఉత్తరాభాద్ర యివి ఊర్థ్వముఖ నక్షత్రములు.

క్షీణ చంద్ర వివరణ

చంద్రుడు, శుక్ల అష్టమి లగాయతు కృష్ణ అష్టమి వరకు పూర్ణ బలవంతుడు. యిది సామాన్య నియమము. యిందలి విశేష పాఠమేమనగా కృష్ణ పక్షంలొ పాడ్యమి నుండి పంచమి వరకు మిక్కిలి పూర్ణుడు. తదాది అయిదు రోజుల మధ్యమం చివరి అయిదు రోజులు అనగా కృష్ణ పక్ష ఏకాదశి నుండి అమావాస్య వరకు చంద్రుడు క్షీణ చంద్రుడు. దీనికి వ్యతిరేకంగా కృష్ణ పక్షం ఊహించవలెను. అనగా శుద్ధ పాడ్యమి నుండి పంచమి వరకు క్షీణ చంద్రుడు షష్ఠి ప్రభృతి దశమి వరకు మధ్యం తదుపరి పూర్ణిమ వరకు పూర్ణ చంద్రునిగా పరిగణించాలి. అయితే కృష్ణ పక్షంలోని చివరి అయిదు రోజులు శుభకార్య విషయంగా ప్రాంతీయ ఆచారములను పరిధిలోనికి తీసుకొని నిషేధించుచున్నాము.

గండనక్షత్ర విషయం :

ఆశ్రేషా, మూల, విశాఖ, జ్యేష్ఠ నక్షత్రములలో జన్మించిన స్త్రీ విషయంలో వివాహం పొంతనలు చూసేటప్పుడు గండనక్షత్రములుగా పరిగణీంచవచ్చును. అయితే అందులో ఆశ్రేష 4వపాదం మూల 1 పాదము, విశాఖ నాల్గవపాదం, జ్యేష్ఠ 4వ పాదం మాత్రమే దోషం గండరరక్ష జనన దోషాన్ని పరిశీలించిన మీదట ఆశ్రేషా, జ్యేష్ఠ నక్షత్రములు చివరి నాలుగు ఘడియలు మాత్రమే దోషమని మూల 1వ పాదంలో ప్రారంభంలో ప్రారంభ నాలుగు ఘడియల కాలమే దోషం అని తోచుచున్నది.

గణకూటమి :

వివాహ విశేషః పట్టికలో చుపిన ప్రకారం వధూవర నక్షత్రం పరస్పర దేవరాక్షస గన్ములైన అధము. మనుష్య రాక్షస గణముల విషయంలో గ్రహమైత్రి కుదిరిన స్వీకరించవచ్చును దేవ - దేవ; దేవ - మనుష్య; మనుష్య - మనుష్య; రాక్షస - రాక్షస విశేషములు.

గ్రహ మైత్రి :

నక్షత్ర విశేషములు అనే పట్టికలో నక్షత్రములు పొందిన రాశ్యాధిపుల వివరణ ఇవ్వబడినవి. వాటిని దృష్టిలో వుంచుకొని క్రింద పట్టికద్వారా ఆయా గ్రహముల శతృమిత్రత్వాలు పరిశీలించారు.
రవి:శని, శుక్రులు శత్రువులు. బుధుడు సముడు. చంద్ర, కుజ గురువులు మిత్రులు.
చంద్ర :రవి, బుధ మిత్రులు, మిగిలిన వారు సములు.
కుజ :రవి, చంద్ర, గురువుల మిత్రులు. బుధుడు శత్రువు, శుక్ర, శని సములు.
బుధ : రవి శుక్రులు మిత్రులు, చంద్రుడు శత్రువు, కుజ, గురు, శనులు సమములు
గురు : బుధ, శుక్రులు మిత్రులు, చంద్రుడు శత్రువు.కుజ గురు, శనులు సములు
గురు : బుధ, శుక్రులు శతృవులు, శని సముడు , రవి, చంద్ర, కుజులు మిత్రులు.
శుక్ర : బుధ, శనులు మిత్రులు. కుజ గురులు సములు; రవి, చంద్రులు శత్రువులు
శని : బుధ, శుక్రులు మిత్రులు; గురువు సముడు; రవి, చంద్ర, కుజులు సములు.

వధూవర రాశ్యాధిపులు పరస్పర శతృవులైనచో విడువదగినది.

స్త్రీ దీర్ఘము :

వధూనక్షత్రం నుండి వరుని నక్షత్రం లెక్కింపగా 9 నక్షత్రముల లోపు వున్నయెడల అధమము. 9 తర్వాత 18 లోపు వున్న మధ్యమము. 18 తర్వాత 27 లోపు వున్న యెడల ఉత్తమము.

గ్రహముల స్వభావములు

శని, రాహు, కేతు, కుజులు క్రూర స్వభావ గ్రహములు. శుక్ర, గురు, బుధ, చంద్రులు సౌమ్య స్వభావ గ్రహములు. అయితే " బుధః పాపాయుతః పాపః క్షీణచంద్రస్తధైవచ" అనగా పాపగ్రహములతో కలసిన బుధుడు పాపగ్రహముగాను, క్షీణ చంద్రుని పాపగ్రహముగాను చెప్పబడినది. కుజ, రవి, గురువులు పురుష స్వభావ గ్రహములు రాహు, చంద్ర, శుక్రులు స్త్రీ స్వభావం కలిగిన గ్రహాలు. శని, బుధ, కేతువులు నపుంసక స్వభావగ్రహములు, గురు, శుక్రులు, బ్రాహ్మణ గ్రహములు; రవి, కుజులు క్షాత్ర గ్రహములు. చంద్ర, బుదులు వైశ్యులు, శని శూద్ర కులాధిపతి.

తారాబలఫలమ్

సంపత తార సంపదలను, విపత్ తార కార్య నాశనమును క్షేమతారా క్షేమమును, ప్రత్యక్ తార కార్య నాశనమును సాధన తార కార్య సాధనమును నైధవ తార హీనత్వమును మిత్రతారా సుఖమును, పరమమైత్ర తార సుఖసంపదలను కలుగచేస్తుంది. అయితే అత్యవసర పరిస్థితిలో ప్రథమ నవకములో ప్రత్యక్ తారను విడచి మూడు నవకములలో నైథవ తారను విడచి మిగిలిన నక్షత్రములలో ముహూర్తము చేయవచ్చును.
ఒకవేళ కర్కాటక రాశికి వృషభరాశికి చెందు నక్షత్రములు తారాబల విష్యములో విపత్, ప్రత్యక్ తారలు అయినప్పటికీ శుభకార్యములు చేయవచ్చును. జన్మ నక్షత్రములో నక్షత్రము ప్రారంభమునుండి ఏడు ఘడియలు విపత్తార యందు ప్రారంభ 3 ఘడియలు ప్రత్యక్ నైథవ తారల యందు ప్రారంభ 8 ఘడియలు విడువవలెను. మిగిలిన ఘడియలు గ్రాహ్యము.

తారాబలము

జన్మ నక్షత్రము నుండిన లెక్కింపగా వరుసగా ఇరవై ఏడు నక్షత్రములకు జన్మ, సంపత్, విపత్, క్షేమ, ప్రత్యక్, సాధన, నైధవ, మిత్ర, పరమైత్ర అనబడే తొమ్మిది సంజ్ఞలు ఉంటాయి. యివే సంజ్ఞలు మరలా 10వ నక్షత్రమునుండి 18 వరకు మరలా 19 నక్షత్రం నుండి 27 వ నక్షత్రము వరకు ఉంటాయి.

త్రిజ్యేష్ఠ స్వరూపం :

" అధ్యగర్భప్రసూతాయాః కన్యకాయా పరస్యచ; జ్యేష్ఠమాసే నకుర్విత కదాచిదపి మంగళమ్" ప్రధమ గర్భంలో జన్మించిన వధూవరుల విషయంలో జ్యేష్ఠమాసంలో వివాహం చేస్తే త్రిజ్యేష్ఠ అవుతుంది. అలాగే ఆ వధూవరులు ఒకరు జ్యేష్ఠమాసంలో జన్మించిన మరొకరు జ్యేష్ఠులైతే వారికి జ్యేష్ఠ మాసంలో వివాహం చేయ కూడదు. మిగిలిన మాసంలో చేయుటకు అభ్యంతరంలేదు. ఎటువంటి త్రిజ్యేష్ఠా స్వరూపం అయినా జ్యేష్ఠమసంలో మాత్రమే వివాహం నిషేధం మిగిలిన మాసంలో దోషంలేదు.

నక్షత్ర భేధములు

అశ్వని, హస్త, పుష్యమి నక్షత్రములు క్షీప్ర ( శీఘ్ర) సంజ్ఞ నక్షత్రములు, మూల, ఆర్ద్ర, జ్యేష్ఠ, ఆశ్రేష నక్షత్రములు దారుణ నక్షత్రములు. చిత్త, రేవతి, మృగశిర, అనూరాధ నక్షత్రములు మృదు (సౌమ్య) నక్షత్రములు. భరణి, మఘ, పుబ్బ, పూర్వాషాఢ, పూర్వాభద్రలు స్థిర (ధృవ) నక్షత్రములు. భరణి, మఘ, పుబ్బ, పూర్వాషాడ, పూర్వాభద్రలు ఉగరనక్షత్రములు. కృత్తిక, విశాఖ సాధారణ నక్Sధత్రములు. స్వాతి, పునర్వసు, శ్రవణం ధనిష్ఠ, శతభిషం నక్షత్రములు చర నక్షత్రములు

నక్షత్ర విచారణ :

జన్మ నక్షత్రములు తీసుకొన్నతర్వాత వాటి ద్వారా గ్రహమైత్రి, గణకూటమి, యోనికూటమి, రాశికూటమి, స్త్రీ దీర్గము, నాడికూటమి ముఖ్యంగా పరిశీలించాలి. యివి ఆరు కూటములు మహేంద్రకూటమి, వశ్యకూటమి, దినకూటమి, వేదాకూటమి, రజ్జుకూటమి, వర్నకూటమి యివి ఆరు కూటములు సామాస్యకూటములు. సామాన్యకూటములు ఈ పన్నెండు కూటములు కలిపి ద్వాదశ వర్గులు అంటారు. అందు ముఖ్య ఆరు వర్గులను సూక్ష్మంగా పరిశీలించగా

నాడీకూటమి :

వధూవర నక్షత్రములు యిరువురివీ ఒకే నాడీ నక్షత్రములు కాకూడదు. వేరువేరు నాడులైన విశేషము. నాడీ వివరములు పట్టికలో వున్నవి. పట్టికలో ఇచ్చినవి త్రినాడీ స్వరూపము.

యోని కూటమి :

పట్టికలో చూపిన నక్షత్ర జంతువులకు పరస్పర శతృత్వం వున్నటువంటివి
గో -వ్యాగ్రములు;
అశ్వ - మహిషములు;
గజ -సింహములు ;
కుక్క -లేడి;
పాము-ముంగీస;
కపి -ఎనుములు;
మార్జాల - మూషికములు
పరస్పర శతృత్వ జంతువులు కావున అవికాక మిగిలిన నక్షత్రములు స్వీకరించాలి.

రాశికూటమి :

అమ్మాయి రాశి లగాయతు అబ్బాయి రాశి రెండు, మూడు, నాలుగు, అయిదోది. ఆరు రాశులు కాకపోయినా శుభము. గ్రహమైత్రి కుదిరినప్పుడు రాశికూటమి, నాడీకూటమి, స్త్రీ దీర్ఘములు కుదరకపోయిననూ దోషం వుండదు.

12, ఆగస్టు 2013, సోమవారం

గృహప్రవేశము :గృహాప్రవేశ ముహూర్తాలు

గృహప్రవేశము :

కాలామృతం ఆధారంగా వైశాఖంలో గృహప్రవేశం గృహపతికి బహుపుత్రంబు, జ్యేష్ఠమాసం శుభప్రదము. ఫాల్గుణమాసం సంపత్కరము, మాఘం ధాన్య ప్రదము. అయితే ఉత్తరాయంలో కుంభంలో రవి ఉండగా తప్పమిగిలిన అన్నియు శ్రేష్ఠములే. బహుగ్రంధకర్తలు కార్తీక, మార్గశిర, శ్రావన మాసములు శ్రేష్ఠములు అని తెలిపిరి.

వారములు:

ఆదివారము అత్యంత దుఃఖమును క్షీణేందువారము (బహుళసప్తమి తర్వాత సోమవారము) కలహమును, పూర్ణేందు వారము సంపదను, మంగళవారము అగ్నిభయమును, బుధవారము ధాన్యమును గురువారము పశుపుత్రులను, శుక్రవారము శుభసౌఖ్యములోను, శనివారము స్థైర్యమును, చోరభయమును కలుగచేయును.

నక్షత్రములు :

చిత్త, అనూరాధ, ధనిష్ఠ, ఉత్తర, ఉత్తరాభాద్ర, ఉత్తరాషాఢ, రేవతి, శతభిషం, రోహిణి, మృగశిర, ఈ నక్షత్రములు ప్రశస్తమైనవి. పుష్యమి మధ్యమము. పునర్వసు, స్రవణం నక్షత్రములలో గృహప్రవేశమైన ఆ ఇల్లు అన్యాక్రాంతమగును. ఆర్ద్ర, కృత్తిక, అగ్నిభయమును కలుగచేయును.

లగ్నములు :

కర్కాటక లగ్నమునందు గృహప్రవేశము నాశనము, తులాలగ్నమునందు గృహప్రవేశమును వ్యాధిని, మకరలగ్నమునందు గృహప్రవేశమును ధాన్య నష్టము, మేషలగ్నము నందు చలనమును కలుగచేయును, వృషభ, సింహ లగ్నములు స్థిరములు అయినకారముగా ఆ లగ్నము నందు గృహప్రవేశము మంచిది. మిధున, కన్యా, ధనుర్మీన లగ్నములు గృహ ప్రవేశమునకు శుభప్రదమైనవే.

విశేషములు :

గృహప్రవేశమునకు 4,8,12 స్థానములు శుద్ధిగా ఉండుట విశేషము. 4 గృహస్థానము, 8 ఆయఃస్థానము, 12 వ్యయస్థానము అయినకారనముగా ఈ స్థానములు శుద్ధిగా వుండవలెను, 3,6,11 ల యందు పాపగ్రహములు, 1,2,4,5,7,9,10,11 లలో శుభగ్రహములుండగా గృహప్రవేశము విశేషము.

ద్వారం ఎత్తుటకు :

పాడ్యమి, విదియ, తదియ, పంచమి, సప్తమి, నవమి, దశమి, ఏకాదశి, త్రయోదశి, పూర్ణిమ తిధుల యందును, సోమ, బుధ, గురు, శుక్ర, వారముల యందును శుభగ్రహ హోరలయందును ద్వారం ఎత్తుటకు మంచిది. శ్లాబ్ విషయమై కూడా అంతే. వర్జ్య, దుర్ముహుర్త, రాహుకాలములు విడచి సూర్యోదయము మొదలు మధ్యాహ్నం లోపల శ్లాబ్ వేయుట ప్రారంభించాలి అలాగే ద్వారం ఎత్తాలి. దీనినికూడా ఆషాడ, భాద్రపద,పుష్యమాసములు పనికిరావు.

నామ నక్షత్ర వినియోగం

సంగ్రామ, వ్యవహారములకు, ధామార్వణం, నగరార్వణం, మంత్రార్వణం విషయములలోను నామ నక్షత్రము చూడవలెను. ధామార్వణం విషయంలో కాలామృతం సంస్కృత వ్యాఖ్యానంలోక్షేత్రార్వణం అని వివరించిన కారణంగా గృహము ఏదిశలో కట్టుకోవాలి. ఆయాది వివరణల విషయంగా నామనక్షత్రం వాడి ముహూర్త విషయంలో జన్మ నక్షత్రం వాడవలెను.

బోరింగ్ లేదా బావి తీయుటకు ముహూర్తం :

హస్త, పుష్యమి, రోహిణి, ఉత్తర, ఉత్తరాషాడ, ఉత్తరాభాద్ర, అనూరాధ, శ్రవణం, ధనిష్ఠ, శతభిషం, రేవతి, మఘ.... ఈ నక్షత్రాలు శ్రేష్ఠము. ఆది, మంగళ, శనివారములలో తీయుబావులయంధు నీరు ఎక్కువకాలం వుండదు. మీన, మకర, కర్కాటక, వృషభ, కుంభ లగ్నములందును, లగ్నానికి చతుర్థస్థానముకు పాపగ్రహ సంబంధం లేకుండాను చూచుకొని ముహూర్తం చేయవలెను. జలరాసులు
" మత్స్యే కుళిరే మకరే బహోదకం, కుంభేవృషే చార్థజల ప్రమాణం, అళ్యంచ తౌల్యామ్ మిధునేన పాదం శేషేతు రాశఊ జలనాశంచ"

శంఖుస్థాపన చేయుటకు :

మాసములు :

చైత్రమున ధనహాని, వైశాఖం శుభం, జ్యేష్ఠం మరణం, ఆషాఢం పశునాశనం, శ్రావనం భృత్యవృద్ది, భాద్రపదమాసం ప్రజాపీడ, ఆశ్వయుజం కలహప్రధం, కార్తీకం ధనలాభం, మార్గశిరం భయము, పుష్యం అగ్నిభయము, మాఘం అధిక సంపద, ఫాల్గుణం రత్నలాభం.

నక్షత్రములు :

అశ్విని,రోహిణి, మృగశిర, పునర్వసు, పుష్యమి, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, అనూరాధ, ఉషా, శ్రవనం ధనిష్ఠ, శతభిషం ఉత్తరాభద్ర,రేవతి.

వారములు:

ఆది, మంగల, శని వారములు నిషేధము. అయితే శని ఆదివారములు వాడుకలో ఉన్నవి.

లగ్నబలం :

వీలైనంతవరకు పాపగ్రహ సంభంధంలేని ఏ లగ్నమైనా, లగ్నము అష్టమముతో పాపగ్రహములు లేని లగ్నము, కుజగురువులు బలంగా వున్న గ్రహములు స్వీకరించాలి.

స్థలం రిజిష్ట్రర్ చేయించుకోవడానికి:

చవితి, షష్ఠి, అష్టమి, ద్వాదశి, అమావాస్య తిధులు, భరణి, కృత్తిక, ఆర్ద్ర, ఆశ్రేష, మఘ, పూర్వాభాధ్ర నక్షత్రములు, మంగళవారం కాకుండాచూచుకొని, స్థలము రిజిస్త్రేషన్ చేయించుకోవాలి. అయితే రిజిష్టర్ చేయించుకొనే సమయానికి వర్జ్యం, దుర్ముహూర్తం, రాహుకాలం వుండకూడదు. వీలైనంతవరకూ శుభగ్రహ హోరల సమయంలో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి

11, ఆగస్టు 2013, ఆదివారం

జ్యోతిషం - విస్తర ప్రస్తారం

జ్యోతిషం

 ఆరు వేదాంగాలలో జ్యోతిషము ఒకటి. ఇప్పటికీ ఆదరణ పొందుతున్న ప్రాచీనశాస్త్రాలలో ఇది కూడా ఉంది. మొట్టమొదటిగా జ్యోతిష్య శాస్త్రాన్ని గ్రంధరూపంలో వరాహమిహిరుడు అందించాడు. హిందూ సాంప్రదాయాల మరియు విశ్వాసాలలో జన్మ సిద్దాంతం ఒకటి. జన్మసిద్దాంతం ప్రకారము పూర్వ జన్మ పాపపుణ్యాల ప్రభావం ప్రస్తుత జన్మలో ఉంటుంది. దానికి తగిన విధంగా, తగిన సమయంలోనే జీవి జననం ఈ జన్మలో జరుగుతుంది. అనగా అటువంటి గ్రహస్థితి లో జీవి జననం జరుగుతుంది. ఇది అంతా దైవలీలగా హిందువులు భావిస్తారు. కావున ప్రతి జీవి భూతభవిష్యత్వర్థమాన కాలములు జననకాల గ్రహస్థితి ప్రకారము జరుగుతాయి.
జ్యోతిష్యం  ప్రపంచ వ్యాప్తంగా అనేకమంది విశ్వసించే విధానం. ఇది నిర్దిష్టమైన హిందూ ధర్మ శాస్త్రము.జీవి జీవితంలో జరిగినది, జరుగుతున్నది, జరగబోయేదీ జననకాల గ్రహస్థిత ప్రకారము, శరీర లక్షణాలు, అర చేతులు, మొదలగు వివిధ అంశాలను ఆధారం చేసుకొని చెప్పబడుతుంది.


  • శ్రీనివాసుడు పద్మావతిని చేపట్టడానికి సోది చెప్పే స్త్రీ రూపంలో వచ్చి తన ప్రణయ వృత్తాంతాన్ని ఆకాశరాజు దంపతులకు తెలిపి వారిలో తమ వివాహం పట్ల సుముఖత కలిగించి పద్మావతిని పరిణయమాడటంలో విజయం సాధించనట్లు పురాణ కధనాలు చెప్తున్నాయి.
  • కంసుడికి మేనల్లుడి రూపంలో మరణం పొంచివున్నట్లు ఆకాశవాణి ముందుగానే వినిపించింది.
  • శిశుపాలునిమరణం కృష్ణుని ద్వారా సంభవించనున్నదని పెద్దలు చెప్పినట్లు అందువలన శిశుపాలుని తల్లి కృష్ణుని నుండి నూరు తప్పుల వరకు సహించేలా వరం పొందినట్లు భారతంల వర్ణించబడింది. ఆ తరవాత నూరు తప్పులు చేసి శిశుపాలుడు కృష్ణుని చేతిలో మరణించడం లోక విదితం.
  • త్రిజటా స్వప్నవృత్తాంతము శ్రీ రాముడు రావణుని వధించి సీతమ్మను విడిపించినట్లు త్రిజట ద్వారా వాల్మీకి పలికించడం స్వప్న ఆధారిత జ్యోస్యం వాడుకలో ఉన్నదని చెప్పడానికి నిదర్శనం.

 జానపదుల జోస్యం

  • చిలుక జోస్యం, పుల్లల జోస్యం, రాగుల జోస్యం, చిప్పకట్టె జోస్యం, అంజన పసరు జోస్యం, చెంబు జోస్యం మొదలైనవి జానపదుల జోస్యాలు.
  • బాలసంతు వారు శైవులు.తెల్లవారు ఝామున గంట వాయిస్తూ ఇంటింటికి వచ్చి ఇంటి యజమాని విన్నా వినకపోయినా జోస్యం చెప్పి వెళతారు.

ప్రశ్నా శాస్త్రం:-  

జ్యోతిష శాస్త్రంలో ప్రశ్నాశాస్త్రం ప్రాముఖ్యత సంతరించుకుంది. ప్రశ్నా శాస్త్ర సంబంధిత విషయాలు శ్రీ విష్ణు ధర్మోత్తర మహాపురాణంలో లభ్యమవుతాయి. కనుక ఈ శాస్త్రం ఆతి పురాతన కాలం నుండి ప్రాచుర్యం పొంది ఉంది. ప్రశ్నఅడగడం అన్నది అప్పటి నుండి ఇప్పటి వరకు వాడుకలో ఉన్న విషయమే. అనేక రూపాలలో ప్రశ్నలకు సమాధానం చెప్పేవాళ్ళున్నా జ్యోతిష శాస్త్ర పండితులు అతి జాగరూకతతో గణించి చెప్పే సమాధానాలు విశ్వసించ దగినవి. ప్రశ్నా శాస్త్రానికి సమాధానం చెప్పాలంటే సాధారణంగా జాతక చక్రాన్ని చూసి చెప్పే కంటే విశేష పాండిత్యం అవసరమౌతుంది. పురాణాలలో ప్రశ్నా శాస్త్రాన్ని గురించి ప్రత్యేకంగా ప్రస్తావించబడింది. పృచ్ఛకుడు ఎలా ఉండాలి, ఏ సమయంలో ప్రశ్న అడగాలి. ఎలాంటి ప్రదేశంలో అడగాలి మొదలైన అనేక విషయాలు ప్రస్తావించబడ్డాయి. అలాగే ప్రశ్నను చెప్పే పండితుడు ఎలా చెప్పాలి అనే విషయాలు ప్రస్తావించబడ్డాయి. వాటిలో శ్రీ విష్ణు ధర్మోత్తర మహాపురాణంలో ప్రస్తావించబడిన విషయాలు ఇక్కడ చూడవచ్చు.

  • ప్రశ్నచెప్పే జ్యోతిష పండితుడు శుభ్రమైన వస్త్రధారణ చేసి ఉండాలి. శ్వేతవస్త్రధారణ మరింత శ్రేష్టం.
  • ప్రశ్నచెప్పే జ్యోతిష పండితుడు మంచి మనసు కలవాడై ఉండాలి.
  • ప్రశ్నచెప్పే జ్యోతిష పండితుడు శుభసమయంలో సమాధానం చెప్పాలి.
  • చెప్పే జ్యోతిష పండితుడు తలంటుకున్న సమయంలో, దుఃఖితుడై ఉన్న సమయంలో, వికలమై మనస్సు కల్లోలితమైన సమయంలో, తల విరబోసుకున్న సమయంలో, భీమి మీద నిలబడి ఉన్న సమయంలో సమాధానం చెప్పకూడదు. అలాంటి సమయంలో పండితుడిని ప్రశ్న అడగకూడదు. ఆ పరిస్థితిలో చెప్పే సమాధానం అశుభాన్ని కలిగిస్తుంది.
  • ప్రశ్న అడిగే ప్రదేశం పట్టి ఫలితాలు ఉంటాయి. పూలున్న ప్రదేశం, వృక్షములు ఉన్న ప్రదేశం, పచ్చిక మైదానాలు, నదీతీరాలు, సరస్సు తీరాలు, చక్కగా లక్ష్మీకళుట్టిపడుతున్న భవనాలలో చెప్పే సమాధానం
శుభఫలితాలు ఇస్తాయి.

  • ప్రశ్న అడుగు పృచ్ఛకుడు స్మశానం, కబేళా (మాంసవిక్రయ శాల), కారాగారం, నడి రోడ్డు, బురదగల ప్రదేశం, పాడుబడిన కట్టడాలు, పాడుబడిన గృహములు, ఎలుకలు కలుగులు, పాము కన్నాలు, పురుగులు ఉన్నప్రదేశంలో అడిగిన అశుభఫలితాలు కలుగుతాయి.
  • దండహస్తులు (చేత కర్రలు పట్టుకున్న వాళ్ళు), కాషాయ వస్త్ర ధారులు, తల అంటుకున్న వాళ్ళు, జాతి భ్రష్టులు, నపుంసకులు, స్త్రీలు, సంకెళ్ళు తాళ్ళు పట్టుకున్న వాళ్ళు, తాడి పండ్లు చేత పట్టున్న వాళ్ళు అడిగిన ప్రశ్నకు ఫలితం భయంకరం ఫలితాలను ఇస్తుంది.
  • సంధ్యా సమయం, మిట్ట మధ్యాహ్నం, మధ్యాహ్నానికి ముందు సమయం, రాత్రి వేళలు అడిగిన అశుభ ఫలితం ఇస్తుంది. ఉత్తర దిక్కు, ఈశాన్య మూల, తూర్పు దిక్కున నిలిచి అడిన శుభ ఫలితం ఇస్తుంది.
  ఇది హిందువుల ప్రగాఢ విశ్వాసము.హస్తసాముద్రికము, గోచారము, నాడీ జ్యోస్యము, న్యూమరాలజీ, ప్రశ్న చెప్పడం, సోది మొదలైన విధానాలుగా జ్యోస్యం చెప్పడం వాడుకలో ఉంది. పురాణాలలో జ్యోతిష్యం

 సాయన, నిరయణ సిద్ధాంతాలు

రాశి చక్రానికి ప్రారంభ బిందువు ఎక్కడ అన్నదొక వివాదం. ప్రతీ సంవత్సరం సూర్యుడు భూమధ్య రేఖ పైకి వచ్చే బిందువుని వసంత విషువద్బిందువు (Vernal Equinox) అని అంటారు. అది సుమారుగా మార్చి 21వ తేదీన జరుగుతుంది. ఆరోజు భూమధ్య రేఖమీద పగలు, రాత్రి సమానంగా ఉంటాయి. ఈ బిందువే రాశి చక్రానికి ప్రారంభ బిందువు అని ఒక సాంప్రదాయం. ఇలా లెక్కపెట్టే రాశిచక్రాన్ని సాయన రాశిచక్రం అంటారు. కానీ భూమి తనచుట్టూ తాను తిరగడమే కాక బొంగరంలా ధృవాల దగ్గర అటూ ఇటూ ఊగుతూ ఉంటుంది. ఈ ఊగే చలనం ఫలితంగా ప్రతి ఏడాదీ సూర్యుడు భూమధ్య రేఖ మీదకి వచ్చే బిందువు కొద్దిగా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది (Precession of the Equinoxes).
దీని ఫలితంగా రాశిచక్రపు ప్రారంభ బిందువు కూడా మారిపోతూ ప్రతీ డెబ్భైరెండు సంవత్సరాలకు ఒక డిగ్రీ చొప్పున వెనక్కి జరిగిపోతూ ఉంటుంది. కాబట్టి సాయన రాశి చక్రం అంటే ప్రతీ ఏడాదీ ప్రారంభ బిందువు మారిపోయే రాశిచక్రం (Tropical Zodiac). దీన్ని ప్రధానంగా పాశ్చాత్య జ్యోతిషంలో ఉపయోగిస్తారు.
అయితే ప్రస్తుతం ప్రాచుర్యంలో ఉన్న భారతీయ జ్యోతిశ్శాస్త్రం ఇలా మారిపోయే రాశిచక్రాన్ని పరిగణనలోకి తీసుకోదు. ఒకానొక స్థిరమైన బిందువునించి రాశిచక్రాన్ని లెక్కిస్తుంది. ఆ రాశిచక్రాన్ని నిరయణ రాశి చక్రం అంటారు. వసంతవిషువద్బిందువుకీ (అంటే పాశ్చాత్య రాశిచక్రపు ప్రారంభ బిందువుకీ) ఈ స్థిర బిందువుకీ మధ్య ప్రస్తుతం సుమారు 23 డిగ్రీల తేడా ఉన్నది. దాన్నే అయనాంశ అంటారు. అయితే ఈ స్థిరబిందువు ఎక్కడ ఉండాలి అన్నదానిపై కూడా జ్యోతిష్కులకి ఏకాభిప్రాయం లేదు. భారతీయ జ్యోతిషంలో కూడా ఒక సంప్రదాయానికీ మరొక సంప్రదాయానికీ ఈ స్థిరబిందువు కొద్దిగా మారుతుంది. అంటే అయనాంశ మారుతుంది. ఈ అయనాంశలో లాహిరి, రామన్, దేవదత్త, కృష్ణమూర్తి మొదలైన రకాలు ఉన్నాయి.

గోచారము గోచారము అంటే గోళాలు యొక్క సంచారం ఆధారంగా జోస్యం చెప్పడం. చంద్రగోళం భూప్రదక్షణం చేసే సమయంలో ఒక్కొక్క రోజూ ఒక్కొక్క నక్షత్రం సమీపంలో కనిపిస్తుంది. చంద్రుడు సమీపలోని నక్షత్రాన్ని జాతకుని జన్మ నక్షత్రం. ఈ నక్షత్రాలను వాటి ప్రక్కన కనిపించే నక్షత్రాతో కలిపి ఒక ఊహా రేఖతో గుర్తించి వాటిని రాసులుగా గుర్తించారు. దీని ఆధారంగా చంద్రుని సమీపంలో ఉన్న నక్షత్రరాసిని జాతకుని రాశిగా వ్యవహరిస్తారు. సూర్యుడు ఒకరాశినుండి ఇకంకొక రాశి మారటానిని సంక్రమణ లేక సంక్రాంతి అంటారు. సూర్యుడు జ్యోతిష్యశాస్త్రాన్ననుసరించి ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క రాసిలో ప్రవేసిస్తాడు. సంవత్సరాకాలంలో 12 రాసులలో సంచరిస్తాడు. తమిళులు తమ సంవత్సరాన్ని సూర్య సంచారాన్ని అనుసరించి గణిస్తారు. సుర్యుడు మేషంలో ప్రవేసించే రోజు వారికి నూతన సంవత్సర ఆరంభం అవుతుంది. సూరుడు మకరరాశిలో ప్రవేసించినపుడు హిందువులు పెద్ద పండుగగా ఆచరించే సంక్రాంతి పండుగ పర్వదినం. సంక్రాంతిని మకర సంక్రాంతి అనే పేరుతో కూడా పిలవడం హిందువుల అలవాటు. ఒక సంవత్సర కాలంలో 12 సంక్రాంతులు వస్తాయి. ఈ విధంగా సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని మొదలైన గ్రహాలు ఛాయా గ్రహాలుగా జ్యోతిష్యశాస్త్రాలలో పిలవబడే రాహువు, కేతువు యొక్క సంచారము జ్యోతిష్య గణనలో భాగాలు. ఇవి కాక తెలుగు, మళయాళ జ్యోతిష్కులు శని గ్రహ ఊపగ్రహాలలో పెద్దదైన మందిని శని పుత్రునిగా వ్యహరిస్తూ గణనలోకి తీసుకుంటారు. తమిళ జ్యోతిష్యంలో మాంది గణనలోకి తీసుకొనే ఆచారం లేదు. గ్రహాలు సూర్యుని చుట్టూ ప్రదక్షిణ చేసే కాలాన్ని 12 రోజులుగా విభజించి జ్యోతిష్య గణన చేస్తారు. వీటి ఆధారంగా గోచార ఫలితాలు ఉంటాయి.

జ్యోతిష శాస్త్రంలో నక్షత్రాలను మూడు గణాలుగా విభజిస్తారు. ఇరవై ఏడు నక్షత్రాలలో అశ్వని, మృగశిర, పునర్వసు, పుష్యమి, హస్త, స్వాతి,అనూరాధ, శ్రవణం, రేవతి అను తొమ్మిది నక్షత్రాలు దేవగణ నక్షత్రాలు. భరణి, రోహిణి, ఆరుద్ర, పుబ్బ (పూర్వ ఫల్గుణి), ఉత్తర(ఉత్తర ఫల్గుణి), పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, పూర్వభాద్ర, కృత్తిక, ఉత్తరాభాద్ర అను తొమ్మిది నక్షత్రాలు మానవ గణ నక్షత్రాలు. ఆశ్లేష, మఖ, చిత్త, విశాఖ, జ్యేష్ట, మూల, ధనిష్ట, శతభిషం(శతతార) అనే తొమ్మిది నక్షత్రాలు రాక్షస గణ నక్షత్రాలు.

  • దశ వర్గులు రాశి, హోర, ద్రేక్కాణ, సప్తమాంశ, నవాంశా, దశాంశ, షోడాంశ, త్రిశాంశ అన్న పది విధానాలు రాశిచక్ర నిర్మాణ విధములు.
  •  జన్మలగ్నము

    భూమి తనచుట్టూ తాను తిరిగే ఆత్మ ప్రదక్షిణ కాలంలో ప్రతి రెండు గంటలకు లగ్నం మారుతూ 24 గంటల సమాయాన్ని 12 రాశుల లగ్నాలుగా విభజిస్తూ జ్యోతిష్య గణన చేస్తారు. చైత్రమాసం పాడ్యమి సూర్యోదయం మేష లగ్నంతో ఆరంభం ఔతుంది. ఒక రోజుకు నాలుగు నిమిషాల కాలం ముందుకు జరుగుతూ చేర్చుకొని ఒక మాసకాలంలో 120 నిమిషాలు లగ్న కాలం మారుతూ వైశాఖమాస ప్రారంభం వృషభ లగ్నంతో ఉదయం ఆరంభం ఔతుంది. ఈ విధంగా లగ్న గణన చేస్తూ జాతకుడు పుట్టిన లగ్న నిర్ణయం చేస్తారు.

     ఛాయాగ్రహాలు

    జ్యోతిష్య శాస్రంలో రాహుకేతువులు ఛాయా గ్రహాలు. వీటికి జ్యోతిష్య శాస్రంలో ఇల్లు లేదు. రాహుకేతువులు అపసవ్య మార్గంలో ప్రయాణం చేస్తాయి. రాహువు కేతువుకు సరిగ్గా ఏడు రాశులు దూరంలో ప్రయాణం చేస్తాయి. కనుక ఈ రెండు గ్రాహాలు ప్రయాణకాలం సమమే. రాహువును కాలసర్పంగా వ్యవహరిస్తారు. రాశి చక్రంలో రాహువు కేతువుకు మద్యలో అన్ని గ్రహాలు ఉంటే దానిని కాలసర్ప దోషంగా నిర్ణయిస్తారు.

     గ్రహస్థితి బలాబలాలు

    జ్యోతిష శాస్త్రమున గ్రహములు దిగ్బలం, స్థానబలం, కాల బలం, చేష్టాబలం అను నాలుగు విధముల బలనిర్ణయం చేస్తారు , లగ్నంలో గురువు, బుధుడు ఉన్న బలవంతులు. నాలుగవ స్థానములో చంద్రుడు, శుక్రుడు ఉన్న బలవంతులు. పదవ స్థానమున సూర్యుడు, కుజుడు బలవంతులు. స్వ స్థానమున, ఉచ్ఛ స్థానమున, త్రికోణమున, మిత్ర స్థానమున, స్వ నవాంశ అందు ఉన్న గ్రహములు, శుభ దృష్టి గ్రహములు బలముకలిగి ఉంటాయి. స్త్రీ క్షేత్రములైన వృషభము, కటకము, కన్య, వృశ్చికము, మకరము, మీనములందు చంద్రుడు, శుక్రుడు బలవంతులు. పురుష రాశులైన మేషము, మిధునము, సింహము, తుల, ధనస్సు, కుంభములందు సూర్యుడు, కుజుడు, గురువు, బుధుడు, శని బలవంతులు. సూర్యుడు, కుజుడు, శుక్రుడు పగటి అందు బలవంతులు. రాత్రి అందు బుధుడు, శని, గురువు బలవంతులు. సర్వ కాలమందు బుధుడు బలవంతుడు. శుక్ల పక్షమున శుభగ్రహములు, కృష్ణ పక్షమున పాపగ్రహములు బలవంతులు. యుద్ధమున జయించిన వాడు, వక్రగతి కల వాడు, సూర్యుడికి దూరముగా ఉన్న వాడు చేష్టా బలం కలిగిన వాడు. అంటే ఉత్తరాయణమున కుజుడు, గురువు, సూర్యుడు, శుక్రుడు దక్షిణాయనమున చంద్రుడు, శని రెండు ఆయనముల అందు స్వక్షేత్రమున ఉన్న బుధుడు చేష్టా బలము కల వారు. స్త్రీ గ్రహములైన చంద్రుడు, శుక్రుడు రాశి మొదటి స్థానమున ఉన్న బలము కలిగి ఉంటారు. పురుష గ్రహములైన సూర్యుడు, కుజుడు, గురువు రాశి మధ్యమున ఉన్న బలము కలిగి ఉంటాయి. నపుంసక గ్రహములైన బుధుడు, శని రాశి అంతమున ఉన్నచేష్టా బలము కలిగి ఉంటాయి. రాత్రి అందు మొదటి భాగమున చంద్రుడు, అర్ధరాత్రి అందు శుక్రుడు, తెల్లవారు ఝామున కుజుడు, ఉదయకాలమున బుధుడు, మధ్యహ్న కాలమున సూర్యుడు, సాయం కాలమున శని సర్వ కాలమందు గురువు బలవంతులు. శనికంటే కుజుడు, కుజుని కంటే బుధుడు, బుధునికంటే గురువు, గురువుకంటే శుక్రుడు, శుక్రునికంటే చంద్రుడు, చంద్రునికంటే సూర్యుడు బలవంతులు.

    గ్రహావస్థలు

    గ్రహావస్థలు పది రకాలు. (1) స్వస్థము, (2) దీప్తము, (3) ముదితము, (4) శాంతము, (5) శక్తము, (6) పీడితము, (7) దీనము, (8) వికలము, (9) ఖల, (10) భీతము అనేవి ఆ అవస్థలు.

    1. స్వస్థము: స్వక్షేత్ర మందున్న గ్రహము స్వప్నావస్తను పొందును.
    2. దీప్తము: ఉచ్ఛక్షేత్ర మందున్న గ్రహము దీప్తావస్త నందుండును.
    3. ముదితము: మిత్ర క్షేత్ర మందున్న గ్రహము ముదితావస్తను పొందును.
    4. శాంతము: సమ క్షేత్ర మందున్న గ్రహము శాంతావస్తను పొందును.
    5. శక్తము: వక్రించి యున్న గ్రహము శక్త్యావస్తను పొందును.
    6. పీడితము: రాశి అంతమున 9 సక్షత్ర పాదములలో చివరి పాదము నందున్న గ్రహము పీడావస్థను పొందును.
    7. దీనము: శత్రు క్షేత్ర మందున్న గ్రహము దీనావస్థను పొందును.
    8. వికలము: అస్తంగత మయిన గ్రహము వికలావస్థను పొందును.
    9. ఖల: నీచ యందున్న గ్రహము ఖలావస్థను పొందును.
    10. భీతము: అతిచారము యందున్న గ్రహము భీత్యావస్థను పొందును.
    ఉచ్ఛ స్థానమున ఉన్న దీప్తుడు, స్వక్షేత్రమున ఉన్న స్వస్థుడు, మిత్రక్షేత్రమున ఉన్న ముదితుడు, శుభవర్గమున ఉన్న శాంతుడు, సూర్యునకు దూరమున ఉన్న శక్తుడు, అస్తంగతుడైన వికలుడు, యుద్ధమున పరాజితుడైన పీడితుడు, పాప వర్గమున ఉన్న ఖలుడు, నీచ అందు ఉన్న భీతుడు అని అంటారు. అలాగే సూర్యుడి సామీప్యాన్ని ఆధారంగా చేసుకుని గ్రహగతులను నిర్ణయిస్తారు. సూర్యునితో చేరి ఉన్న గ్రహము అస్తంగత గ్రహం అంటారు.సూర్యునికి రెండవ స్థానంలో ఉన్నశీఘ్రగతిని పొందిన గ్రహం అంటారు. సూర్యుని నాల్గవ స్థానమున ఉన్న గ్రహాన్ని మందుడు అంటారు. సూర్యునికి అయిదు ఆరు రాశులలో ఉన్న గ్రహం వక్రగతిని పొందిన గ్రహం అంటారు. సూర్యునికి ఏడు ఎనిమిది స్థానాలలో ఉన్న గ్రహం అతి వక్రగతిని పొందిన గ్రహం అంటారు.సూర్యునికి తొమ్మిది, పది స్థానాలలో ఉన్న గ్రహం కుటిలగతి పొందిన గ్రహం అంటారు.

    10, ఆగస్టు 2013, శనివారం

    వారాలలోఉన్న రీజనింగ్ రియాలిటీ చూద్దామా?

    వారాలలోఉన్న రీజనింగ్ రియాలిటీ చూద్దామా?

    9, ఆగస్టు 2013, శుక్రవారం

    యోగాలు - పర్యాలోచన

    యోగాలు

    రవి సంబంధిత యోగాలు:
    జ్యోతిష్యంలో సూర్యుని రవి అంటారు అలా సూర్యునికి సంబంధించిన యోగాలు ఇక్కడ సూచించ బడ్డాయి.

    1. బుధాదిత్య యోగం : రవి బుధుడు ఏ రాశిలో ఉన్నా దానిని బుధాదిత్య యోగం అంటారు.
    ఫలితం:- సామర్ధ్యం సూక్ష్మగ్రాహి, విచక్షణతో కూడిన కార్యాలు, పట్టు వదలని ప్రయత్నం వీరి స్వంతం.
    2. శుభవేశి యోగం : రవికి 2వ స్తానంలో శుభగ్రహాలు ఉంటే శుభవేశి యోగం అంటారు.
    ఫలితం:- ప్రశాంత జీవితం, కీర్తి, మర్యాద మరియు అదృష్టం వరించుట.
    3. శుభవాశి యోగం : రవికి 12వ స్తానంలో శుభగ్రహాలు శుభవాశి యోగం అంటారు.
    ఫలితం:- కీర్తి, సంపద, పలుకుబడి, వాక్పఠిమ మరియు స్వయంకృషితో అభివృద్ధి.
    4. ఉభయరాశి యోగం : 2, 12 స్థానాలలో శుభగ్రహాలు ఉంటే ఉభయరాశి యోగం అంటారు.
    ఫలితం:- సంతోషం, సంపద, కీర్తి, మర్యాద, పలుకుబడి మరియు ప్రయత్నంతో ముందుకు రావడం.

    చంద్రుడు సంబంధిత యోగాలు

    5. చంద్రమంగళ యోగం : చంద్రుడు మరియు కుజుడు ఒకే స్థానంలో ఉన్నా నేక చంద్రునికి కేంద్రంలో అంటే 1, 4, 7, 10 స్థానాలలోఉంటే చంద్రమంగళ యోగం అంటారు.
    ఫలితం:- రసాయన మరియు ఔషధ వ్యాపారంలో విజయం. మనో చంచలం రావడానికి అవకాశం.
    6. వసుమతి లేక లక్ష్మి యోగం : చంద్రునికి ఉపజయ స్థానాలయిన 3, 6, 10, 11 స్థానాలలో బుధుడు, శుక్రుడు మరియు గురువు ఉంటే వసుమతి లేక లక్ష్మి యోగం అంటారు.
    ఫలితం:- అకస్మాత్తుగా ధనాగమనం. ఎన్ని కష్టాలు ఎదురైనా ఈ యోగ జాతకులకు ధనం కొరత ఉండదని శాస్త్రం చెప్తుంది.
    7. గజ కేసరి యోగం : చంద్రునికి కేంద్రంలో గురువు ఉంటే గజ కేసరి యోగం అంటారు.
    ఫలితం:- కీర్తి ప్రతిష్టలు, శత్రుజయం, ధనాగమనం, సంపద మరియు దీర్ఘాయువు.
    8. అనపా యోగం : చంద్రునికి 12 స్థానాలలో రాహువు, కేతువు మనహా మీలిన గ్రహాలు ఉంటే అనపా యోగం అంటారు.
    ఫలితం:- ఆరోగ్యమైన శరీరం.
    9:శునభా యోగం : చంద్రునికి 2లో రాహువు, కేతువు మనహా మీలిన గ్రహాలు ఉంటే అనపా యోగం అంటారు.
    ఫలితం:- స్వప్రయత్నంతో సంపాదన.
    10. మేఘదృవా యోగం : చంద్రునికి 2, 12 స్థానాలలో ఏగ్రహాలు లేకుంటే అనపా యోగం అంటారు.
    ఈ యోగం పీడ మరియు కీడు కలిగిస్తుంది. అయినా కేంద్రం అంటే 1, 4, 7, 10 స్థానాలలో ఏదైనా గ్రహం ఉంటే నివృత్తి ఉంటుంది.
    12 అది యోగం చంద్రుడికి 6, 7, 8 స్థానాలలో శుభగ్రహాలు ఉంటే అది యోగం అంటారు.
    ఫలితం:- కారు,బంగళా లాటి వసతులు కలిగిన జీవితం.
    13. శకట యోగం :
    • చంద్రునికి , 6,8, 12వ స్థానంలో గురువు ఉంటే శకట యోగం అంటారు.
    • రాశి చక్రములోని గ్రహములన్ని లగ్నము మరియు సప్తమ స్థానమల మాత్రమే ఉన్న శకట యోగము అంటారు.
    • గురువు లగ్నము తప్ప మిగిలిన స్థానములలో ఉన్న శకట యోగము సంభవిస్తుంది.
    • ఫలితం:- నిలకడ లేని జీవితం, అవమానము, ఆఋధికబాధలు, శారీరక కష్టము, మానసిక బాధలు కలిగించును. ధనవంతుల ఇంత పుట్టినా ఈ యోగప్రభావమున పేదరికము అనుభవించ వలసి ఉంటుంది. అర్హతకు తగిన గౌరవము ఉండదు. మరిఏ ఇతర బాధలు ఉండవు.
    • ఈ యోగముకు భంగము ఏర్పడినప్పుడు సమస్యలు ఉన్నా గౌరవ మర్యాదలాకు భంగము వాటిల్లదు.
    • యోగభంగము : చంద్రుడు బలము కలిగి ఉన్న ఈ యోగము భమ్గము ఔతుంది. చంద్రుడి మీద కుజుడి దృష్టి ఉన్న ఎడల ఈ యోగము భంగము ఔతుంది. లగ్నాదిపతి మరియు భాగ్యాధిపతి బలముగా ఉన్న ఈ యోగము హంగము ఔతుంది. గురువు చంద్రిడి కంటే బలముగా ఉన్న ఈ యోగము భంగము ఔతుంది.
    చంద్రుడు ఉచ్ఛస్థితిలో వృషభములో ఉన్న ఎదల ఈ యోగము భంగము ఔతుంది. చంద్రుడు స్వరాశి అయిన కతకములో ఉన్న ఈ యోగము భంగము ఔతుంది. రాహువు చంద్రుడితో కలసి ఉన్న ఈ యోగము భమ్గము ఔతుంది. రాహువు దృష్టి గురువు మీద ఉన్నప్పుడు ఈ యోగము భంగము ఔతుంది.
    • లగ్నములో చంద్రుడు లేక గురువు ఉన్నా, శుక్రుడ్రు చంద్రుడితో కలసి ఉన్నా, ఈ శకత యొగము ధనప్రాప్తి కలిగించును. చంద్రుడు ఇదే యోగము చంద్రుడు మిధున, కన్యా, తులా, వృశ్చికములలో ఉన్న కలుగును. అలాగే కటకములో శుక్రుడు బుధుడితో కలసి ఉన్నా ఈ యోగము కలుగును.
    14. తృతురా యోగం చంద్రునికి 2, 12 స్థానాలలో రాహువు, కేతువు కాక మిగిలిన ఏ గ్రహాలు ఉన్నా తృతురా యోగం అంటారు.
    • ఫలితం:- ఆదాయాన్ని మించిన ఖర్చులు, దారిద్యం నుండి విమోచనం దొరకడం కష్టం. స్వల్ప సంతానం, అమిత ధైర్యం, కూడబెట్టిన ధనం పరుల స్వంతం.

    రాజయోగం

    1. విపరీత రాజయోగం 6వ స్థానాధిపతి 8, 12 స్థానాలలో ఉన్నా, 8వ స్థానాధిపతి 6వ, 12వ స్థానాలలో ఉన్నా, 12వ స్థానాధిపతి 6వ, 8వ స్థానాలలో ఉన్నా విపరీత రాజయోగం అంటారు. గ్రహాలు మిత్ర, ఉచ్చ, రాజ్య స్థానాలలో ఉంటే చక్కని ఫలితం.
    ఫలితం:- ఆయా స్థానాలలో ఉన్న అధిపతి దశాకాలంలో శుభ ఫలితాలు ఉంటాయని శాస్త్రం చెప్తుంది. పైన చెప్పిన పద్దతిలో ఉంటే విపరీతమైన ధనాగమనం సంభవం.
    • ధర్మకర్మాధిపతి యోగం;-తొమ్మిది పది అధిపతులు కలసి ఏ రాశిలోఉన్నా ఒకరిపై ఒకరు దృష్టి సారించినా పరిమార్పు చెందినా ధర్మకర్మాధిపతి యోగం అంటారు.ఈ యోగం ఉంటే ధన కనక వస్తువాహనాలు జాతకునకు లభిస్తాయని శాస్త్రవివరణ.
    • అందగిరి యోగం;-మేషం ,కటకం,వృషభం,మకరం రాశులలో మిగిలిన గ్రహాలు ఉభయ రాశులలో ఉంటే అందగిరి యోగం అంటారు.ఈ యోగం ఉన్న జాతకుడు
    సంపన్నుదౌతాడు
    గ్రహ ఉచ్చం యోగం
    1.ఋశక యోగం కుజుడు ఉచ్చం అంటే మకర రాశి, లేక రాజ్యం అంటే మేషరాశి మరియు వృశ్చికరాశి లలో ఉండి అవి కేంద్రం అనబడే 1,4,7,10 స్థానాలైతే ఋశక యోగం అంటారు.
    ఫలితం:- హోం మరియు రక్షణ మంత్రి పదవిలాంటి ఉన్నత పదవి. శతృజయం, దేహబలం, గర్వం, మొండి వైఖరి, అకస్మాత్తు అదృష్టం, యోగ కారణంగా లభ్యమైన ధనం తానే విపరీతంగా ఖర్చుచేయుట.
    2.భద్రక యోగం బుధుడు ఉచ్చం అంటే కన్యారాశి, రాజ్యం అంటే కన్య, మిధిన రాశులులలో ఉండి కేంద్రం అనబడే 1, 4, 7, 10 స్థానాలలో ఉంటే భద్రక యోగం అంటారు.
    ఫలితం:- దీర్గాయువు, మేధావి, వాక్పఠిమ, సూక్ష్మగ్రాహి, ఐశ్వర్యం, ప్రజాకర్షణ రాజ్యపాలన.
    3.హంస యోగం గురువు ఉచ్చం అంటే కటకరాశి,రాజ్యం అంటే ధనసురాశి, మీన రాశులులలో ఉండి కేంద్రం అనబడే 1, 4, 7, 10 స్థానాలలో ఉంటే హంస యోగం అంటారు.
    ఫలితం:- సాదువులను గౌరవించడం, నీతిమంతుడు, అందమైన శరీరం, శుభ్రమైన ఆహారం అంటే ప్రీతి, అకస్మాత్తుగా అదృష్టం కలిగి ధనవంతుడు కావడం, భూ ఆధిపత్యం.
    4.మాళవ యోగం శుకృడు ఉచ్చం అంటే మీనరాశి, రాజ్యం అంటే వృషభరాశి, తులరాశి లలో ఉండి కేంద్రం అనబడే 1, 4, 7, 10 స్థానాలలో ఉంటే మాళవ యోగం అంటారు.
    ఫలితం:- దృఢ శరీరం, ధైర్యం, స్త్రీ జనాకర్షణ, అదృష్ట జాతకం, విస్తార ధనం ఉత్తమ కళా నైపుణ్యం.
    5.ససక యోగం శని ఉచ్చం అంటే తులారాశి, రాజ్యం అంటే మకరరాశి, కుంభరాశి లలో ఉంటే ససక యోగం అంటారు.
    ఫలితం:- లోక జనాకర్షణ, అకస్మాత్తుగా అదృష్టం, ప్రపంచం నలుమూలలా ఆస్థులు, దేశాధిపత్యం.

    నాభాస యోగాలు

    నాభాసయోగాలు ముప్పై రెండు. అవి వరుసగా నౌకా, ఛత్ర, కూట, కార్ముక, శృంగాటక, వజ్ర, దామపాళ, వీణ, పద్మ, ముసల, వాసి, హల, శర, సముద్ర, చక్ర, మాల, సర్ప, అర్ధేందు, యవ, కేదార, గద, విహగ, యూప, యుగ, శకట, శూల, దండ, రజ్జు, శక్తి, సల, గోళములు. జాతక చ్రములు అన్ని ఈ యోగాలలో ఎదోఒక యోగంలో ఇమిడి ఉంటుంది. నాభాస యోగములు సంఖ్యా యోగము, దళ యోగము, ఆకృతి యోగములని మూడు విధములు.
    • నౌకా యోగం :- లగ్నము నుండి సప్తమ స్తానము వరకు ఏడు రాశుల అందు గ్రహములు అన్నీ ఉపస్థితమై ఉన్న నౌకా యోగం అంటారు.
    • ఫలితం :- నౌకా యోగమున జన్మించిన జాతకుడు జల ఆధారిత సంపద కలిగి ఉంటాడు. లాభాధిఖ్యత కలిగి లోభ గుణం కలిగి ఉంటాడు.
    • ఛత్ర యోగం :- చతుర్ధ స్థానం నుండి గ్రహములు అన్నీ ఉపస్థితమై ఉన్న ఛత్ర యోగం అంటారు.
    • ఫలితం :- ఛత్ర యోగమున జన్మించిన జాతకుడు స్వజనులను ఆశ్రయించి ఉండు వాడు, బుద్ధిమంతుడు, దాత, రాజుకు కావలసిన వాడు, బాల్యమున వార్ధఖ్యమున సుఖము, భాగ్యము, అఖండ ఐశ్వైర్యం కలిగి ఉంటాడు.
    • కూట యోగం :- సప్తమ కేంద్రము మొదలు గ్రహములన్నీ ఉపస్థితమై ఉన్న కూట యోగం అంటారు.
    • ఫలితం :- కూట యోగమున జన్మించిన వాడు చెరసాల కాపలా చేయువాడు, అబద్ధము, జూదము, వంచన, క్రూరత్వం, దారిద్యం మొదలైనవి కలిగి దుర్గములందు నివసించు వ్డుగా ఉంటాడు.
    • కార్ముఖ యోగం :- దశమ స్థానం నుండి గ్రహములు అన్నీ ఉపస్థితమై ఉన్న కార్ముఖ యోగం యోగం అంటారు.
    • ఫలితం :- కార్ముక యోగమున జన్మించిన వాడు రహస్యంగా చరించు వాడు, అసత్యం చెప్పు వాడు, దొంగ, జూదరి, అరణ్య సంచారం, మద్య వయసులో దరిద్రుడు అయి ఉంటాడు.
    • యూప యోగం :- లగ్నము నుండి నాలుగవ స్థానం వరకు గ్రహములన్నీ ఉపస్థితమై ఉన్న యూప యోగం అంటారు.
    • ఫలితం :- ఆత్మ రక్షణ, త్యాగము, ధనము, సౌఖ్యవ్వంతుడు, వ్రతయమము, సాము అందు ఆసక్తుడు ఔతాడు.
    • శర యోగం :- చతుర్ధ కేంద్రము మొదలు నాలుగు రాశులలో వరకు గ్రహములన్నీ ఉపస్థితమై ఉన్నశర యోగం అంటారు.
    • ఫలితం :- ఆయుధములను చేయుట, దొంగలను బంధించుట, వేటాడుట, ఉన్మత్తత, క్రూరత్వము, కుశ్చితత్వము, శిల్పములందు ఆసక్తి కల వాడు ఔతాడు.
    • శక్తి యోగం :- సప్తమ స్థానం నుండి గ్రహములన్నీ నాలుగు స్థానముల ఉపస్థితమై ఉన్న శక్తి యోగం అంటారు.
    • ఫలితం :- వికలత్వము, ధన హీనత, వికలత్వము, అలసత్వము, అల్పాయుష్షు, సౌందర్యము, యుద్ధ నైపుణ్యము కల వాడు ఔతాడు.
    • దండ యోగం :- దశమ స్థాన్మం నుండి నాలుగు రాశులందు గ్రహములన్నీ ఉపస్థితమై ఉన్న దండ యోగం అంటారు.
    • ఫలితం :- దండ యోగమున జన్మించిన వాడు హత ధారా పుత్రులు, సర్వ జన ద్వేషం, బంధు విరోధము, దుఃఖము, సేవకము, నీచ గుణము కల వాడు ఔతాడు.
    • అర్ధ చంద్ర యోగం :- రెండవ లేక మూడవ స్థానం నుండి గ్రహములన్ని ఉపస్థితమై ఉన్న అర్ధ చంద్ర యోగం అంటారు.
    • ఫలితం :- సేనాధిపతి, రాజాభిమానానికి పాత్రుడు, సౌందర్యవంతుడు, మణులు సువర్ణములు ఆభరణములు పొందు వాడు, సౌందర్యవంతుడుగా ఉంటాడు.
    • గదా యోగం :- గ్రహములన్నీ సమీపముగా ఉన్న రెండు కేంద్రముల ఉపస్థితమై ఉన్న గదా యోగం అంటారు. అనగా లగ్న, చతుర్ధ స్థానము లేక, చతుర్ధ, సప్యమ స్థానం, సప్తమ, దశమ స్థానం, దశమ, లగ్న స్థానం అందు ఉన్న గదా యోగం అంటారు.
    • ఫలితం :- గదా యోగమున జన్మించిన వాడు శాస్త్ర పారంగతుడు, యోగ విద్యావంతుడు, యజ్ఞము చేయు వాడు, అభిమానవంతుడు, ధన కనక వస్తు రజ్ఞములు కల వాడు ఔతాడు.
    • వజ్ర యోగం :- లగ్న, సప్తమ కేంద్రలందు శుభ గ్రహములు చతుర్ధ, దశమ స్థానములందు అశుభ గ్రహములు ఉన్న వజ్ర యోగం అంటారు
    • ఫలితం :- శౌర్యము, ఆరోగ్యము, చక్కదనము, స్వజనముతో విరోదము కలవాడు, భాగ్యహాని కలుగుట, బాల్యమున వార్ధక్యమున సుఖము కల వాడు ఔతాడు.
    • యవ యోగం :- లగ్న, సప్తమ కేంద్రలందు ఆశుభ గ్రహములు చతుర్ధ, దశమ స్థానములందు శుభ గ్రహములు ఉన్న యవ యోగం అంటారు.
    • ఫలితం :- యవ యోగమున జన్మించిన వాడు వ్రత నియమ శుభ కార్యముల అందు ఆసక్తుడు, యౌవనమున సుఖవంతుడు, ధనవంతుడు, దాత్రుత్వం, స్థిరమైన ధనం కలవాడుగా ఉంటాడు.
    • పద్మక యోగం :- నాలుగు కేంద్రములందు మిశ్రమముగా గ్రహములన్నీ ఉన్న పద్మక యోగం అంటారు. అనగా లగ్న సప్తమాలలో ఒక దానిలో శుభ గ్రములు ఒక దానిలో అశుభ గ్రహములు అశుభులు ఉండ వలసిన చతుర్ధ, దశమ స్థానాలలో ఒక దానిలో అశుభ గ్రహములు మరొక దానిలో శుభ గ్రహములు ఉన్న పద్మక యోగం అంటారు. కాని వజ్ర, యూప, పద్మక యోగములు యోగములు అసంభములని వరాహ మిహిరుని అభిప్రాయం.
    • ఫలితం :- పద్మ యోగమున జన్మించిన వాడు సౌందర్యము, సద్గుణ సంపత్తి, గొప్ప కీర్తి, భూస్వామిత్వము, చిరాయువు కల వాడు.
    • వాపీ యోగం :- లగ్ననముకు రెండు లేక మూడు స్థానములలో ఒక దానిలో శుభగ్రహములు మరొక దానిలో అశుభగ్రహములు ఉపస్థితమై ఉన్న వాపీ యోగం అంటారు.
    • ఫలితం :- వాపీ యోగమున జన్మించిన వాడు సుస్వరూపము, నేత్ర సౌఖ్యము, స్థిరమైన ధన సౌఖ్యములు, ధన నిక్షేపాదుల అందు సమర్ధుడుగా ఉంటాడు.
    • శకట యోగం :- గ్రహములన్నీ లగ్న సప్తమమున ఉపస్థిమైన శకట యోగం అంటారు.
    • ఫలితం :- శకట యోగమున జన్మించిన వాడు రోగ పీడితుడు, మూర్ఖుడు, దుష్టురాలైన భార్య కలిగిన వాడు, దరిద్రుడు, బంధు మిత్ర జన హీనుడు, బండి మీద జీవనం సాగిస్తాడు.
    • విహగ యోగం :- గ్రహములన్నీచతుర్ధ దశములందు ఉపస్థిమై ఉన్న విహగ యోగం అంటారు.
    • ఫలితం :- విహగ యోగమున జన్మించిన వాడు తిరుగట అందు ఆసక్తుడు, దౌత్యము, కలహ ప్రియత్వము, నీచజీవనము, పొగరు, నీచ స్వభావం కల వాడు ఔతాడు.
    • వాల యోగం ;- గ్రహములన్నీ లగ్న త్రికోణం వదిలి మిగిలిన త్రికోణములందు ఉపస్థితమై ఉన్న వాల యోగం అంటారు. అంటే రెండవ, ఆరవ, దశమ స్థానాలు లేక మూడవ, ఏడవ, ఏకాదశ స్థానాలు, నాలుగవ, ఎనిమిదవ, పన్నెండవ స్థానముల ఉపస్థితమై ఉండుట.
    • ఫలితం :-
    • శృంగాటక యోగం :- గ్రహములన్ని త్రికోణముల అందు ఉన్నఅంటే లగ్నము, పంచమ స్థానము, నవమ స్థానముల ఉన్న శృంగాటక యోగము అంటారు.
    • ఫలితం :- శృంగాటక యోగమున జన్మించిన వాడు కలహములందు ఆసక్తుడు, యుద్ధమున తెగింపు కలవాడు, సంపన్నుడు, స్త్రీలచే ద్వేషింప బడు వాడు, సుఖవంతుడు, సౌందర్యవంతుడు, రాజాభిమాన పాత్రుడు ఔతాడు.
    • చక్ర యోగం : - గ్రహములన్నీ బేసి రాశులైన ఆరు రాశులలో ఉప స్థితమై ఉన్న చక్రయోగం అంటారు. అంటే లగ్నం, మూడు, అయిదు, ఏడు, తొమ్మొది, పదకొండు స్థానాలలో ఉపస్థితమై ఉన్న చక్రయోగం అంటారు.
    • సముద్ర యోగం :- గ్రహములన్నీ రెండవ స్థానం నుండి పన్నెండవ స్థానం వరకు ఉన్న సమ రాశులలో ఉపస్థితమై ఉన్న అంటే రెండవ, నాల్గ్వవ, ఆరవ, ఏనిమిదవ, పదవ, పన్నెండ స్థానాలలో ఉపస్థితమై ఉన్న సముద్ర యోగం అంటారు.
    • ఫలితం :- సముద్రము అందు పుట్టిన రత్నములు, మణులు వివిధ పధార్ధములు కలవాడు, యోగవంతుడు, జనులను ఆకర్షించు వాడు, భూములకు అధిపతి ఔతాడు.
    • సల యోగం :- గ్రహములన్నీ ఉభయ చర రాశులందు ఉపస్థితమై ఉన్నసల యోగం అంటారు.
    • ఫలితం :- సల యోగమున జన్మించిన వాడు తిండి పోతు, దరిద్రుడు, వ్యవసాయము చేత జీవించు వాడు, భయం, భీత స్వభావం కలవాడు, దుఃఖి, బంధు మిత్ర రహితుడు ఔతాడు.
    • ముసల యోగం :- గ్రహములన్నీ స్థిర చర రాశులందు ఉన్న మసల యోగం అంటారు.
    • ఫలితం :-
    • రజ్జు యోగం :- గ్రహములన్నీ చర రాశులందు ఉన్న రజ్జు యోగం అంటారు.
    • ఫలితం :-
    • దళాఖ్య మాలా యోగం :- మూడు కేంద్రముల చంద్రుడు కాక మిగిలిన శుభగ్రహములు ఉపస్థితమై ఉన్న దళాఖ్య మాలా యోగం అంటారు.
    • ఫలితం :-
    • దళాఖ్య సర్పయోగం :- మూడు కేంద్రములందు చంద్రుడు కాక మిగిలిన పాపగ్రహములు ఉపస్థితమై ఉన్న దళాఖ్య సర్ప యోగం అంటారు.
    • ఫలితం :-
    • గోళ యోగం :- ద్వాదశ స్థానాలలో ఏస్థానందు అయినా గోళములన్నీ ఒక్క స్థానములోఉపస్థితమై ఉన్న గోళ యోగం అంటారు.
    • ఫలితం :-
    • యుగ యోగం :- ద్వాదశ స్థానాలలో ఏస్థానందు అయినా గోళములన్నీ రెండు స్థానములలో ఉపస్థితమై ఉన్న యుగ యోగం అంటారు.
    • ఫలితం :-
    • శూల యోగం :- ద్వాదశ స్థానాలలో ఏస్థానందు అయినా గోళములన్నీ మూడు స్థానములలో ఉపస్థితమై ఉన్న శూలయోగం అంటారు.
    • ఫలితం :-
    • కేదార యోగం :- ద్వాదశ స్థానాలలో ఏస్థానందు అయినా గోళములన్నీ నాలుగు స్థానాలలోఉపస్థితమై ఉన్న కేదార యోగం అంటారు.
    • ఫలితం :-
    • పాశ యోగం :- ద్వాదశ స్థానాలలో ఏస్థానందు అయినా గోళములన్నీ అయిదు ఉపస్థితమై ఉన్న పాశ యోగం అంటారు.
    • ఫలితం :-
    • దామినీ యోగం :- ద్వాదశ స్థానాలలో ఏస్థానందు అయినా గోళములన్నీ ఆరు స్థానముల ఉపస్థితమై ఉన్న దామినీ యోగం అంటారు.
    • ఫలితం :-
    • వీణా యోగం :- ద్వాదశ స్థానాలలో ఏస్థానందు అయినా గోళములన్నీ ఏడు స్థానముల ఉపస్థితమై ఉన్న వీణా యోగం అంటారు.
    • ఫలితం :-

    పంచ మహాపురుష యోగాలు

    లగ్నము నుండిగాని రాశి లేక చంద్రలగ్నము నుండిగాని కుజ, బుధ, గురు, శుక్ర, శనులు కేంద్రములందు ఉంది అవి ఆగ్రహములకు ఉచ్ఛ లేక స్వ స్థానములైన వరుసగా రుచక, భద్రక, హంసక, మాళవ శశ యోగము అంటారు. గ్రహములు షడ్వర్గాది బల సంపన్నులై ఉండ వలెను. ఒక యోగము కలిగిన అదృషతవంతుడు రెండు యోగములు ఉన్న రాజసమానుడు మూడు యోగములు కలిగిన రాజు నాలుగు యోగములు కలిగిన చక్రవర్తి ఐదు యొగములు కలిగిన నృపేంద్రుడు కాగలడు.

    ఈ బ్లాగును సెర్చ్ చేయండి



    Related Posts Plugin for WordPress, Blogger...