మహాసరస్వతీ యంత్రం
|
మేరుతంత్ర గ్రంధమును అనుసరించి ఏడు విధములైన సరస్వతీ యంత్రములు గలవు. అవి
౧. చింతమణి సరస్వతి
౨.జ్ఞాన సరస్వతి
౩. నీల సరస్వతి
౫. కిణి సరస్వతి
౬. అంతరిక్ష సరస్వతి
౭.మహా సరస్వతి , అను రూపములను పొంది ఉన్నది. మేథా శక్తి బుద్ధి కుశలత , పరీక్షలయందు విజయము , ఈ యంత్ర ప్రయోజనములు.
-: మూల మంత్రం :-
ఓం హ్రీం హ్ర్సైం హ్రీం ఓం ఐం ధీం క్లీం సౌః సరస్వత్య్తే స్వాహా || |
శ్రీ మహ సరస్వతీ యంత్రంను
అర్చించు
వారు యంత్రమును రాగి రేకు పై కాని కాగితముపై కాని వ్రాసి పటము
కట్టించి యథా శక్తి గా ఉదయాస్తమయములందు షోడశోపచార పూజలు చేయుచున్న మేథా శక్తి బుద్ధి కుశలత , పరీక్షలయందు విజయము , ఈ యంత్ర ప్రయోజనములు.
శ్రద్ధా వంతులు ప్రతి నిత్యము ఆచమ్య , ప్రాణామాయ , గోత్ర దేశ కాల మాన
సంకీర్తణాధికముగా త్రి న్యాస పూర్వకముగా , పంచ పూజలొనర్చిన విశేష ఫలము
కలుగును.మూల మంత్ర జపముతో పాటు క్రింది తత్ గాయిత్రి ని కూడ జపదశాంశము
గావించిన మహోత్కృష్ట ఫలితములు తప్పక కలుగును.
ధ్యానము , మూల
మంత్రము , ఏ తత్ గాయిత్రి ఈ మూడింటిని అనునిత్యము అనుసరించు సాధకుడు
పొందలేని ఫలితమే లేదు. అనగా తలచినంతనే సాధకుని కృషి యత్నములనుసరించి మంత్ర
యంత్రములు పని సాధన లందు అనంత ఫల సాధకము లగును.
-: శ్రీ సరస్వతీ గాయత్రి :- వాగ్దేవ్యైచ విద్మహే బ్రహ్మపత్న్యై చ ధీమహి తన్నోవాణీః ప్రచోదయాత్.// |