బగళాముఖీ యత్రం
|
శ్లో|| అధః ప్రవక్ష్యే శతౄణాం స్తంభినీం బగళాముఖీం |
సాధకానాం హితార్థాయస్తంభనాయచ వైరిణాం ||
-: మూల మంత్రం :-
ఓం హ్రీం బగళా మిఖీ సర్వ దుష్టానాం వాచం ముఖం పదం స్తంభయ జిహ్వాం కీలయ బుద్ధిం వినాశయ హ్రీం ఓం స్వాహా ||
|
శ్రీ బగళాముఖీ యంత్రంను అర్చించు వారు యంత్రమును రాగి రేకు పై కాని కాగితముపై కాని వ్రాసి పటము కట్టించి యథా శక్తి గా ఉదయాస్తమయములందు షోడశోపచార పూజలు చేయుచున్నసమస్త కోరికలు నేరవేరును. భూత ప్రేత పిశాచాది బాధలు తొలుగును మరియు శత్రువిజయము వ్యవహార జయము సంప్రాప్తించును.
శ్రద్ధా వంతులు ప్రతి నిత్యము ఆచమ్య , ప్రాణామాయ , గోత్ర దేశ కాల మాన
సంకీర్తణాధికముగా త్రి న్యాస పూర్వకముగా , పంచ పూజలొనర్చిన విశేష ఫలము
కలుగును.మూల మంత్ర జపముతో పాటు క్రింది తత్ గాయిత్రి ని కూడ జపదశాంశము
గావించిన మహోత్కృష్ట ఫలితములు తప్పక కలుగును.
ధ్యానము , మూల
మంత్రము , ఏ తత్ గాయిత్రి ఈ మూడింటిని అనునిత్యము అనుసరించు సాధకుడు
పొందలేని ఫలితమే లేదు. అనగా తలచినంతనే సాధకుని కృషి యత్నములనుసరించి మంత్ర
యంత్రములు పని సాధన లందు అనంత ఫల సాధకము లగును.
-: శ్రీ బగాళా గాయత్రి :- మహాదేవ్యైచ విద్మహే బగళాముఖి ధీమహి తన్నో అస్త్రః ప్రచోదయాత్.// |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
parakrijaya@gmail.com