శ్రీ మేధా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం

మీరు జన్మించిన తేది, సమయం, ప్రదేశం ఈ మూడు సమాచారములు మాకు తెలియచేసినచో మీ వ్రుత్తి,వ్యాపార,ఆరోగ్య,ఆర్ధిక పరిస్తితులు, దాంపత్యం, విద్య, ఉద్యోగ, వివాహ, కుటుంబవ్యవహారాలు, సంతానం, రాజకీయ వ్యవహారాలు,ప్రేమ వ్యవహారములు,కుజ దోషం, కాలసర్ప దోషం మరియు వివాహ, ఉపనయన, గృహప్రవేస, జప, హోమ, వ్రత, అన్నప్రసన, నామకరణం లకు ముహూర్తములు పెట్టబడును. P.V.RADHAKRISHNA CELL :+91 9966455872, Mail us : parakrijaya@gmail.com

23, ఆగస్టు 2014, శనివారం

గృహ నిర్మాణ గ్రామార్వణము


మనకు వాస్తు శాస్త్ర పండితులు గ్రామార్వణము గురించి చెప్పియున్నారు . గ్రామార్వణము గురించి ఈ విధముగా చెప్పితిరి .

ఏ గ్రామము నందు గృహము నిర్మించుటకు స్థలము కొనదలచినారో ఆ గ్రామము యొక్క నక్షత్రము కనుగొనాలి
( గ్రామము పేరులో ఉన్న మొదటి అక్షరమును బట్టి నక్షత్రము తెలుయును .) 
ఆ గ్రామనక్షత్రమునుండి  స్థలము కొనదలచిన వ్యక్తీ యొక్క నక్షత్రము వరకు లెక్కించగా వచ్చు సంఖ్యను బట్టి ఫలితములు తెలుసుకోవచ్చు . దీనినే నరాకార చక్రమందురు . నరాకార చక్రమునందున్న నక్షత్రముల ఫలితములు ఈ విధముగా ఉన్నాయి

శ్లోకం  :  శిరః పంచార్ధ లాభం , ముఖేత్రీ అర్ధ నాశనం , బాణరో
ధన దాన్యంచ పాదయో షట్ దరిద్రః  ప్రుష్టేకం ప్రాణ సందేహం
చతుర్నాభి శుభావహం,నేత్రే ద్వి ప్రీతి లాభంచ ,
సవ్యహస్తేన సంపదా , వామ హస్తనే దరిద్రః

తాత్పర్యము ; శిరస్సు నందు 5 నక్షత్రములు ధన లాభము కలుగజేయును , .ముఖము నందు ౩ నక్షత్రములు ధన నష్టమును , .గర్భమునందు 5 నక్షత్రములు ధన, ధాన్య సమృద్ధిని , పాదముల యందు 6 నక్షత్రములు దరిద్రమును  కల్గించును, పృష్టం నందు 1 నక్షత్రము ప్రాణ నష్టము సూచించును .నాభి యందు 4 నక్షత్రములు శుభమును ,  నేత్రముల యందు 2 నక్షత్రములు ప్రీతిని కలుగ జేయును, కుడి చేతి యందు 1 నక్షతము సంపదను , ఎడమ చేతియందు 1 నక్షత్రము దరిద్రమును అనుభవింప చేయును .

ఉదా : వినయ్  అను వ్యక్తీ గాంధీనగర్ అను గ్రామములో గృహ స్థలము కొనాలని అనుకొన్నాడు . ఇది అతనికి అనుకూలమా ?  గాంధీనగర్ నక్షత్రము ధనిష్ఠ అవుతుంది . వినయ్ నక్షత్రము రోహిణి . నవతార చక్రము ప్రకారము లెక్క వేయగా 9 వ నక్షత్రము కావున శుభ ప్రదము .

ఈ అర్వణము గ్రామములకు చెప్పబడినది కదా . మరి పెద్ద నగరముల యందు నివసించే వారికి ఎలా అని సందేహము కలుగక మానదు . వేల , లక్షల జనాభాతో పట్టణాలు పెరిగి పోతున్నాయి . పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ సంస్థలు పెద్ద వెంచర్స్ వేసి గృహాలను అమ్ముతున్నాయి . వీటికి అర్వణము ఎలా చూడాలి .
మీరు నివసించ బోయే వీధి ని గానీ, రియల్ ఎస్టేట్ సంస్థలలో అయితే ప్రాంతము పేరును బట్టి అర్వణము చేసుకొని వచ్చే ఫలితమును బట్టి గృహ నిర్మాణము చేసుకోవాలి .  .
 

http://bhavisyadarsini.blogspot.in/2014/01/blog-post_5873.html

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

parakrijaya@gmail.com

ఈ బ్లాగును సెర్చ్ చేయండి



Related Posts Plugin for WordPress, Blogger...