అప్పగింతలు:
అమ్మాయిని లోపలకు తీసుకువెళ్ళి వరునికి కాళ్ళుకడిగిన పళ్ళెములో ఆవుపాలు పోసి ముందుగా రెండు చేతులు పాలలో ముంచి తల్లి పొట్టమీద అద్దవలెను. తరువాత గడపకు అద్దవలెను. తల్లిదండ్రి మధ్యలో అమ్మాయిని కూర్చొనపెట్టుకుని పీటముందు పెండ్లిపీట వేయాలి. ఎదురుగా పెండ్లికుమారుని తల్లిదండ్రులను కూర్చొనపెట్టి వారి అరచేతులకు, అమ్మాయి చేతులు పాలలో ముంచి తల్లి, తండ్రి పట్టుకుని వారి అరచేతులకు అమ్మాయి అరచేయి తాకించవలెను. ఆ తరువాత ఆడపడుచు మరుదులు, బావగారు ఇంకా ముఖ్యమైన వారికి ఇదేవిధముగా చేతులతో చేసి ఆఖరుగా అబ్బాయికి అదే విధముగా చేసి అబ్బాయి పక్కన అమ్మాయిని కూర్చొనపెట్టవలెను.
అమ్మాయిని లోపలకు తీసుకువెళ్ళి కలిపిన పెరుగు అన్నము పెట్టవలెను, ఒడిగంటుకండువాలో 5 గిద్దల బియ్యము, ఒడిగంటు గిన్నె 1.25 దక్షిణ తాంబూలము, కందపిలక పెట్టి ముడివేసి పెండ్లికూతురు నడుముకు కట్టుదురు. అమ్మాయి చీరచెంగులో పసుపుకుంకుమ పెట్టి అమ్మాయి చేతిని అబ్బాయి చేతిలో పెట్టాలి. ఇద్దరిని ఎదురు ఎదురు కుర్చీలలో కూర్చోపెట్టి గులాం చల్లించాలి. మేళములతో అమ్మాయిని అత్తవారింటికి పంపవలెను.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
parakrijaya@gmail.com