శ్రీ మేధా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం

మీరు జన్మించిన తేది, సమయం, ప్రదేశం ఈ మూడు సమాచారములు మాకు తెలియచేసినచో మీ వ్రుత్తి,వ్యాపార,ఆరోగ్య,ఆర్ధిక పరిస్తితులు, దాంపత్యం, విద్య, ఉద్యోగ, వివాహ, కుటుంబవ్యవహారాలు, సంతానం, రాజకీయ వ్యవహారాలు,ప్రేమ వ్యవహారములు,కుజ దోషం, కాలసర్ప దోషం మరియు వివాహ, ఉపనయన, గృహప్రవేస, జప, హోమ, వ్రత, అన్నప్రసన, నామకరణం లకు ముహూర్తములు పెట్టబడును. P.V.RADHAKRISHNA CELL :+91 9966455872, Mail us : parakrijaya@gmail.com

22, మార్చి 2018, గురువారం

అన్నప్రాశన

అన్న ప్రాశన:

అన్నప్రాశన అంటే పుట్టిన శిశువుకు మొట్టమొదటిసారి అన్నం ముట్టించడం. ఈ సంస్కారం వలన శిశువుకు ఆయువు, ఆరోగ్యం, తేజస్సు వృద్ధి చెందుతాయి.
అన్నప్రాశన చేయు విధానం:
పిల్లలకు ఆరు లేక ఎనిమిది లేక పది మాసములందైనను వర్షాంతమందైనను, శుక్లపక్షమునందు శుక్రుడు ఆకాశమందు పరిశుద్ధుడై ప్రకాశించుచున్నపుడు నవాన్నప్రాశనము చేయవలెనని ఋషులచే చెప్పబడింనది(ముహూర్త దర్పణం). అన్నప్రాశన మగపిల్లలకు సరినెలలలోను, ఆడపిల్లలకు బేసి నెలలలోను చేయుట లోకాచారముగానున్నది. అన్నప్రాశన పూర్వాహ్ణమందు మాత్రమే చేయవలెను. బిడ్డ తల్లిదండ్రులు తూర్పుముఖంగా చాప మీద కూర్చుని బిడ్డను తల్లి ఒడిలో కూర్చోబెట్టుకోవాలి. ముందు విఘ్నేశ్వర పూజ చేయాలి. బంగారు గిన్నెలోగానీ, వెండి గిన్నె లేదా కంచంలోగానీ పాయసం, తేనె, పెరుగుల మిశ్రమాన్ని కలిపి, తండ్రి బంగారు ఉంగరాన్ని పాయసంలో ముంచి దాన్ని బిడ్డకు తినిపించాలి. ఉంగరంతో మూడుసారులి తినిపించాక చేత్తో పెట్టాలి. ఈ విధంగా అన్నప్రాశన కార్యక్రమ జరపాలి.

జీవికా పరీక్ష:
అన్నప్రాశన సమయంలో దైవ సన్నిధిలో నగలు, డబ్బు, పుస్తకము, కలము, ఆయుధము, పూలు మొదలైన వస్తువులు ఉంచి శిశువును వాటి దగ్గర వదులుతారు. శిశువు మొదటిసారిగా ఏ వస్తువు తాకునో ఆ వస్తువుతో సంబంధమైన జీవనోపాధి ఆ శిశువుకు ఉంటుందని భావన. అన్నప్రాశన దైవ సన్నిధిలో చేయాలి. ముందుగా సత్యనారాయణ స్వామి వ్రతం జరిపి ఆ స్వామి సన్నిధిలో అన్నప్రాశన చేయాలి. భార్యా భార్తలు తూర్పు ముఖంగా కూర్చుని, బిడ్డను తల్లి ఒడిలో కూర్చుండబెట్టాలి. వెండితో కానీ, కంచుతో కానీ చేసిన పాత్రలో పాయసముంచి, అందులో కొద్దిగా నెయ్యి, తేనె వేసి ముందుగా తండ్రి మూడు సార్లు బంగారపు ఉంగరంతో పాయసం తీసి శిశువుకు పెట్టాలి. తరువాత తల్లి కూడా అదేవిధంగా పెట్టాలి. తరువాత మేనమామ తదితరులు పెట్టాలి.

చేయవలసిన శుభ ఘడియలు:
తిధులు: విదియ, తదియ, పంచమి, సప్తమి, దశమి, త్రయోదశి మరియు చతుర్దశి.

వారములు: సోమ, బుధ, గురు మరియు శుక్ర

నక్షత్రములు: ఆస్వని, రోహిణి, మృగశిర, పునర్వసు, పుష్యమి, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, అనూరాధ, ఉత్తరాషాడ, శ్రవణం, ధనిష్టం, శతభిషం, ఉత్తరాభాద్ర మరియు రేవతి.

లగ్నములు: వృషభ, మిథున, కర్కాటక, కన్య, తుల, ధనుస్సు మరియు మీన లగ్నాలు. దశమ స్థానంలో ఏ గ్రహాలూ ఉండకూడదు. ముహూర్త సమయాన బుధ, కుజ, శుక్ర గ్రహాలు ఒక వరసలో ఉండకూడదు.

గ్రహదోషములు: లగ్నంలో రవి ఉండకూడదు. అలా ఉంటే ఆ బిడ్డకు కుష్టు రోగము వచ్చే అవకాశం కలదు. క్షీణ చంద్రుడుంటే దరిద్రుడు అవుతాడు. కుజుడుంటే పైత్య రోగి, శని ఉన్నచో వాత రోగి, రాహుకేతువులున్నచో మిక్కిలి దరిద్రుడు అవుతాడు. 

శుభ గ్రహములు: లగ్నంలో పూర్ణ చంద్రుడుంటే అన్నదాత అవుతాడు. బుధుడుంటే విశేష జ్ఞానాంతుడు, గురుడుంటే భోగి, శుక్రుడుంటే దీర్ఘాయువు కలవాడు అవుతాడు. 

అన్నప్రాశన కాలం: 6 నుంచి 12 నెలలలోపు ఎప్పుడైననూ చేయవచ్చు. అయితే శుక్లపక్షంలో శుక్రుడు ఆకాశంలో పరిశుద్ధుడై ప్రకాశిస్తున్నప్పుడు అన్నప్రాశన చేయాలి. మగ పిల్లలకు సరి నెలలలోనూ, ఆడ పిల్లలకు బేసి నెలలలోనూ చేయాలి. దీనిని పూర్ణాహ్వమందు మాత్రమే చేయాలి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

parakrijaya@gmail.com

ఈ బ్లాగును సెర్చ్ చేయండి



Related Posts Plugin for WordPress, Blogger...