శ్రీ మేధా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం

మీరు జన్మించిన తేది, సమయం, ప్రదేశం ఈ మూడు సమాచారములు మాకు తెలియచేసినచో మీ వ్రుత్తి,వ్యాపార,ఆరోగ్య,ఆర్ధిక పరిస్తితులు, దాంపత్యం, విద్య, ఉద్యోగ, వివాహ, కుటుంబవ్యవహారాలు, సంతానం, రాజకీయ వ్యవహారాలు,ప్రేమ వ్యవహారములు,కుజ దోషం, కాలసర్ప దోషం మరియు వివాహ, ఉపనయన, గృహప్రవేస, జప, హోమ, వ్రత, అన్నప్రసన, నామకరణం లకు ముహూర్తములు పెట్టబడును. P.V.RADHAKRISHNA CELL :+91 9966455872, Mail us : parakrijaya@gmail.com

22, నవంబర్ 2012, గురువారం

తిధులు- ఫలితాలు

తిధులు- ఫలితాలు

పాడ్యమి - మధ్యాహ్న అనంతరం జయమవుతాయి

విదియ -  ఎ పని చేసిన సంతోషాన్ని ఇస్తుంది

తదియ - సౌక్యం, కార్య సిద్ధి

చవితి   - మధ్యాహ్న అనంతరం జయమవుతాయి
పంచమి - ధన ప్రాప్తం, శుబయోగం
షష్టి      - కలహం, రాత్రి కి శుభం
సప్తమి  - సౌక్యకరం
అష్టమి  -కష్టం
నవమి  - వ్యయ ప్రయాసలు 
దశమి  -  విజయ ప్రాప్తి 
ఏకాదశి - సామాన్య ఫలితములు
ద్వాదశి - బోజన అనంతరం జయం
త్రయోదశి -జయం
చతుర్దశి   -రాత్రి కి శుభం
పౌర్ణమి   - సకల శుబకరం
అమావాస్య- సాయంత్రం నుండి శుభకరం

21, నవంబర్ 2012, బుధవారం

వివాహ నిశ్చయ తాంబూలాలు

వివాహ నిశ్చయ తాంబూలాలు

విదియ, తదియ, పంచమి, సప్తమి, దశమి, ఏకాదశి, త్రయోదశి, ఉభయ పక్ష తిథులు శుక్ల పక్షంలో త్రయోదశి,పూర్ణిమ తిథులు
ఆది, బుధ, గురు, శుక్ర, శని వారములు,
అశ్వని, మృగశిర, పునర్వసు, పుష్యమి, హస్త, చిత్త, అనూరాధ, శ్రవణం, ధనిష్ఠ, శతభిషం, రేవతి, నక్షత్రాలు మంచివి.
లగ్నానికి 5,9 స్థానములలో పాప గ్రహాలు లేకుండా నిశ్చయ తాంబూలాలు తీసుకోవలెను.

నవ వధువు గృహప్రవేషమునకు

విదియ, తదియ, పంచమి, సప్తమి, దశమి, తిథులు.
బుధ, గురు, శుక్రవారములు,
అశ్వని, రోహిణి, మృగశిర, పుష్యమి, ఉత్తరాషాడ, హస్త, చిత్త, అనూరాధ, శ్రవణం, మఖ,
 

మూల, పునర్వసు, జ్యేష్ట, ధనిష్ఠ, రేవతి నక్షత్రములు,
వృషభ, మిధున, కర్కాటక, సింహ, వృశ్చిక, ధనుస్సు, కుంభ, మీన లగ్నములు మంచివి.
పెండ్లి కుమారుడిని, పెండ్లి కుమార్తెను చేయుటకు

విదియ, తదియ, పంచమి, సప్తమి, దశమి, ఏకాదశి, త్రయోదశి, తిథులు, ఆది, బుధ, గురు, శని వారములు,
అశ్వని, పునర్వసు, పుష్యమి, చిత్త,
స్వాతి, శ్రవణం, ధనిష్ఠ,నక్షత్రాలు  5,9 స్థానాల శుద్ధి చూడాలి.
వివాహం జరిగిన 16 రోజుల లోపున తిథి,  వార నక్షత్రాలు పాటించకపోయినాదోషము లేదు.

వివాహమునకు

విదియ, తదియ, పంచమి, సప్తమి, దశమి, ఏకాదశి, త్రయోదశి తిథులు,
బుధ, గురు, శుక్రవారాలు,
రోహిణి, మృగశిర, ఉత్తర, హస్త, స్వాతి, అనూరాధ, మూల, ఉత్తరాషాఢ, ఉత్తరాభాద్ర, రేవతి నక్షత్రాలు,
వృషభ, మిధున, కర్కాటక, తుల, కన్య, ధనుస్సు, మీన లగ్నములు
వైశాఖ, జ్యేష్ట, కార్తీక, మార్గశిర, ఫాల్గుణ మాసములు మంచివి.
రవి మేష రాశిలో ఉండగా, చైత్రమాసమున వివాహము చేయవచ్చును. 7వ స్థానములో ఏ గ్రహమూ ఉండరాదు. అష్టమ శుద్ధి తప్పనిసరి.

19, నవంబర్ 2012, సోమవారం

గర్భాదానము ( శోభనము)

గర్భాదానము ( శోభనము)

విదియ, తదియ, పంచమి, సప్తమి, దశమి, త్రయోదశి తిథులు,
సోమ, బుధ, గురు, శుక్రవారములు 


రోహిణి, మృగశిర, పునర్వసు, పుష్యమి, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, అనూరాధ, ఉత్తరాషాడ, శ్రవణం, ధనిష్ట్ట,శతభిష, ఉత్తరాభాద్ర  నక్షత్రములు,
వృషభ, కర్కాటక, కన్య, తుల, ధనుస్సు, మీనలగ్నములు,
లగ్న శుద్ధి అష్టమ శుద్ధితప్పనిసరి.*పంచపర్వములు,సంధ్యాసమయము,శ్రాద్ధదినములు పనికిరావు. 


వివాహము జరిగిన 16 రోజులలో మాత్రము ముహూర్తము అవసరములేదు.
*(పండుగలలో, సూర్య అస్తమయ, సూర్యోదయములో, మరియు పిత్రు (పెద్దల)దినములలో దంపతులు బ్రహ్మచర్యము  పాటించవలెను.)

14, నవంబర్ 2012, బుధవారం

దగ్ధయోగాలు

దగ్ధయోగాలు

షష్టి - శనివారం,
 సప్తమి - శుక్రవారం, 
అష్టమి
 - గురువారం,
నవమి - బుధవారం ,
దశమి - మంగళవారం
ఏకాదశి - సోమవారం
ద్వాదశి - ఆదివారం ,
ఇట్లు వచ్చిన ఏ విధమైన శుభకార్యాలు చేసుకోనరాదు.
వీటిని దగ్ధయోగాలు అంటారు.

13, నవంబర్ 2012, మంగళవారం

ఏది మంచి రోజు?

ఏది మంచి రోజు?



ఏ మంచి ప్రారంబించడానికి అయిన ఒక మంచి రోజు చూసుకుంటూ ఉంటాము. కాని దానికి మరొకరి మీద ఆధారపడనవసరం లేదు. ఈ క్రింది విధముగా చుచుకున్నచో సరిపోవును.
ఉదాహరణ:  ఆదివారం ప్రారంబించాలంటే ఆ రోజు హస్త, మూల, పుష్యమి, అశ్వని, ఉత్తర, నక్షత్రలయిన మంచిది.
  
 ఆది
 సోమ
మంగళ
 బుద
గురు        
 శుక్ర    
 శని
హస్త  
శ్రవణం  
 అశ్వని రోహిణి    రేవతి రేవతి   శ్రవణం  
 మూలా  రోహిణి  ఉత్తరాభాద్ర  అనురాధ  అనురాధ  అనురాధ  రోహిణి
 ఉత్తర  మృగశిర  కృత్తిక  హస్త  అశ్వని  అశ్వని  స్వాతి
 త్రయం  పుష్యమి ఆశ్రేశ    కృత్తిక  పునర్వసు  పునర్వసు
 పుష్యమి  మృగశిర పుష్యమి    శ్రవణం
 అశ్విని
ఇవికాక తారాబలం,చంద్రబలం కూడా చుచుకున్న మంచిది.  పై చక్రము, తారాబలం,చంద్రబలము కలిపిన శ్రేష్టము.

8, నవంబర్ 2012, గురువారం

స్త్రీలు నూతనముగా ఆభరణాలు, వస్త్రములు ధరించుటకు

స్త్రీలు నూతనముగా ఆభరణాలు, వస్త్రములు ధరించుటకు

అశ్వని, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనూరాధ, ధనిష్ట, రేవతి నక్షత్రములందు,
బుధ, గురు, శుక్రవారములందు, వెండి, బంగారు ఆభరణములు,
నూతన వస్త్రములు ధరించుటకు మంచిది.
సోమ, మంగళ వారములందు సౌభాగ్యవతులైన స్త్రీలు ఆభరణములు నూతనవస్త్రములు ధరించరాదు.

ఈ బ్లాగును సెర్చ్ చేయండి



Related Posts Plugin for WordPress, Blogger...