శ్రీ మేధా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం

మీరు జన్మించిన తేది, సమయం, ప్రదేశం ఈ మూడు సమాచారములు మాకు తెలియచేసినచో మీ వ్రుత్తి,వ్యాపార,ఆరోగ్య,ఆర్ధిక పరిస్తితులు, దాంపత్యం, విద్య, ఉద్యోగ, వివాహ, కుటుంబవ్యవహారాలు, సంతానం, రాజకీయ వ్యవహారాలు,ప్రేమ వ్యవహారములు,కుజ దోషం, కాలసర్ప దోషం మరియు వివాహ, ఉపనయన, గృహప్రవేస, జప, హోమ, వ్రత, అన్నప్రసన, నామకరణం లకు ముహూర్తములు పెట్టబడును. P.V.RADHAKRISHNA CELL :+91 9966455872, Mail us : parakrijaya@gmail.com

8, మార్చి 2016, మంగళవారం

సంపూర్ణ సూర్య గ్రహణము~~~తీసుకోవలసిన జాగ్రత్తలు :)

సంపూర్ణ సూర్య గ్రహణము~~~తీసుకోవలసిన జాగ్రత్తలు :)
********************
ప్రారంభ కాలం : ఉ  4 - 49 ని||
మధ్యకాలంల :      7-27 ని||
అంత్యకాలం :     10 -05 ని||
*********************
"అందరికీ ఉపయోగపడేవిధంగా ఈ పోస్ట్ ని అందరూ షేర్ చేయగలరు

9-3-2016 బుధవారం పూర్వాభాద్ర నక్షత్రం ద్వితీయ పాదం నందు కేతుగ్రస్త సూర్య గ్రహణం సంభవిస్తుంది. సూర్య గ్రహణము అమావాస్య నాడు మాత్రమే వస్తుంది. అన్నీ అమావాస్యలకు సూర్యగ్రహణం ఏర్పడదు. సూర్యుడు, చంద్రుడు అమావాస్యనాడు భూమికి ఒకవైపు ఉంటారు. సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే సరళ రేఖపై ఉండి చంద్రుడు రాహువు లేదా కేతువుస్ధానంలో ఉన్నప్పుడు మాత్రమే సూర్యగ్రహణం ఏర్పడుతుంది. పూర్తి సూర్యగ్రహణ సమయం 8 నిమిషాలకు మించి ఉండదు. సూర్యుడికి, భూమికి మధ్య చంద్రుడు రావడం వల్లనే సూర్యగ్రహణం ఏర్పడుతుంది. దీంతో భూమిమీద కొంత భాగానికి సూర్యుడు కనిపించకుండా పోతాడు. సంపూర్ణ సూర్యగ్రహణం సంభవించే సమయంలో స్థానిక ఉష్ణోగ్రత కూడా భారీగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. మనదేశంలోనివారు "రాహువు" అనే రాక్షసుడు సూర్యుడిని మింగేయటంవల్లనే గ్రహణం ఏర్పడుతుందని బలంగా నమ్ముతారు.

ఆధ్యాత్మికంగా గ్రహణం సమయానికి చాలా విశేషముంది.  గ్రహణం పట్టగానే నదీ స్నానం చేసి, నదీ తీరాన జపం చేసుకుంటే ఆ ఫలితం ఇంకా ఎక్కువ. గ్రహణ స్పర్శ కాలమున నదీస్నానం, మద్యకాలమున తర్పణం, జపము, హోమం, దేవతార్చన  విడువుచుండగా దానం, స్నానం చేయటం మంచిది. గ్రహణ కాలమున భాగవన్నామస్మరణ చేయటం ఉత్తమం. గురువు ఉపదేశించిన  మంత్రజపము, వశీకరణం, శత్రుపీడనం నుంచి విముక్తి లభించేందుకు, మనసు ప్రశాంతంగా ఉండేందుకు గాయత్రి మంత్ర జపము గ్రహణ కాలమందు మరియు ఏడురోజుల వరకు  తప్పనిసరిగా ఆచరించవలెను. గ్రహణం రోజు ఉపవాస దీక్ష చేస్తే మంచిది. గ్రహణ సమయమందు గో భూ హిరణ్యాది (గోవులను, భూములను, బంగారాన్ని) దానములు చేయవలెను.

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం జన్మ నక్షత్ర, రాశ్యాదులలో గ్రహణం చెడు ఫలితాలను ఇస్తుంది. ఎవరి జన్మరాశి యందు, జన్మ నక్షత్రమందు గ్రహణం కలుగునో వారికి విశేషముగా పూజలు, జపాలు, దానాలు చేసుకోవలెను. గ్రహణం పడిన నక్షత్రమందు ఆరు నెలలు ముహూర్తాలు నిషేదిస్తారు. జన్మరాశి నుండి 3,6,10,11 రాసులలో గ్రహణమైన శుభప్రధం 2,5,7,9 రాసులందు గ్రహణమైన మధ్యమం. మిగిలిన రాసులందు గ్రహణమైన అరిష్టం.

మతాంతరంలో గర్గుడు జన్మరాశి నుండి 7,8,9,10,12 లలో గ్రహణమైతే అరిష్టమని, రాహువు జన్మ నక్షత్రమందు లేదా 7 వ నక్షత్రమందు ఉన్న అరిష్టం అని తెలియజెప్పాడు.

మరొక మతాంతరంలో రాహువు ఏ నక్షత్రంలో ఉండి సూర్య,చంద్రులను మ్రింగుతాడో ఆ నక్షత్ర జాతకులకు చెడు జరుగుతుందని తెలియజెప్పారు.

మరొక మతాంతరంలో గ్రహణం త్రిజన్మ నక్షత్రాలలో అనగా జన్మ నక్షత్రానికి ముందు నక్షత్రం, వెనుక నక్షత్రాలలో పడుతుందో రోగం సంభవిస్తుందని చెప్పటం జరిగింది. సూర్యగ్రహణ ప్రభావం ఆరు నెలల వరకు ఉంటుంది.

సూర్యగ్రహణ దోష నివారణకు దానం, హోమం,జపం,దేవతార్చన,అభిషేకం, శక్తి కలిగిన వాళ్ళు బంగారంతో చేసిన నాగప్రతిమను, శక్తి లేనివారు శిలరూపంలో చెక్కిన నాగ ప్రతిమను గాని, పిండితో చేసిన నాగప్రతిమను గాని బ్రాహ్మణునికి, లేదా దేవాలయం నందు సూర్యబింబంతో(కాపర్,వెండి,బంగారం,స్పటికం) సహా దానం చేసిన మంచిది.

ఎవరి జన్మ రాశి, జన్మ నక్షత్రంలో గ్రహణం సంభవిస్తుందో ఔషదములతో కూడిన స్నానమాచరించిన గ్రహణ దోషం తొలగిపోవును. మణిశిల, యాలకులు, దేవదారు, కుంకుమపువ్వు, వట్టివేళ్ళు, గోరోచనం, కస్తూరి, కుంకుమ, ఎర్ర పుష్పాలు, ఎర్రగన్నేరు, రక్త చందనం, చెరువు మట్టి లేదా, పుట్ట మట్టి, గోశాల మట్టి గాని తెప్పించుకొని  గ్రహణమునకు ముందే కలశ కుంభములందు ఉంచి దేవతలను ఆవాహనం చేసుకొని “ఓం సూర్యాయనమః” అంటూ స్నానమాచరించాలి. శక్తి కొలది బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి. హోమం చేయశక్తి లేనివారు నాల్గింతలు జపం చేయాలి.

సూర్యగ్రహణానికి ముందు 12 గంటలు వేదకాలము. ఈ వేదకాలం నందు భోజనం చేయరాదు. చిన్నపిల్లలు, వృద్ధులు కనీసం మూడు లేదా ఆరు ముహూర్త కాలమందు వేదకాలంగా పాటించి భోజనం చేయరాదు. అలా కాకుండా భోజనం చేసిన నరకమును, శయనించితే రోగం, మూత్రం చేసిన దారిద్ర్యం కలుగును. తైలాభ్యంగన స్నానం చేసిన కుష్ఠు రోగం వచ్చును.

గ్రహణసమయములో  ఉపవాసము ,తినే  పదార్దాలు ఫై దర్భలు వేయడం చూస్తూ ఉంటాము. ఈతరం  వాళ్ళకు అది వింతగాను, మూర్ఖంగాను కనిపించవచ్చు. ఆలాగే గ్రహణానికి కొన్ని గంటలముందు నుంచే ఉపవాసం ఉండడం విడ్డూరంగా ఉంటుంది . విక్రం సారాభాయ్ పరిశోధన కేంద్రం  వారి పరిశోధనలో  గ్రహణ  సమయంలో సూర్యకాంతి  పడిన నీరు కలుషితం అవుతుందని దీనిని నివారించటంలో  దర్భలు శ్రేష్టమైన ఓషధ గుణాలు కలిగి ఉన్నాయని సైంటిఫిక్ గా పరిశోధనలు చేసి ఋజువులతో తెలియజేశారు. దీని ప్రకారం తినే పదార్ధాలఫై  వేసిన ధర్బలు తులసి దళముల కంటే ఎక్కువుగా చెడును కలిగించే కిరణములను నిరోదిస్తుంది  అని చెప్పవచ్చు.

సూర్య గ్రహణసమయంలో  సూర్యకిరణములలోని  మార్పులు  అనూహ్యoగా  ఉండడంతో  జీర్ణవ్యవస్థతో దీని ప్రభావం ఎక్కువుగా ఉంటుంది. అందుకనే జంతువులు కూడా ఆ సమయంలో ఆహారం ముట్టవని జైపూర్ జంతు ప్రదర్శనశాల  వారి  పరిశోధనలో బయటపడింది .ప్రకృతిపరంగా  ఏర్పడిన  ఈ మార్పుకు జంతువులు సైతం నియమాలు పాటిస్తున్నప్పుడు తెలివైన మానవుడు ప్రకృతికి బిన్నoగా ప్రవర్తించకూడదు. ఆ సమయములో  ఏర్పడే కిరణాల ప్రభావం వల్ల శరీరంలోని మార్పులుకు అనుగుణంగా  ఆ సమయంలో భోజనాలు చేయకుండ ఉంటే మంచిది అని పెద్దలు చెపుతుంటారు.ఆ క్షణంలో  మార్పు కనిపించదు  కాని దాని ప్రభావం తప్పకుండ ఉంటుంది.

గ్రహణ సమయంలో దేవాలయాలన్నీ మూసేస్తారు అసలు దేవాలయాల్ని ఎందుకు మూస్తారు అంటే  ఆగమ  శాస్త్రానుసారం గ్రహణ సమయంలో దేవాలయాల్ని మూసి, తర్వాత ప్రోక్షణ చేసి పూజలు ప్రారంభించాలి.  అందుకే దేవాలయాలు మూసివేస్తారు.

గ్రహణం సమయంలో చేసే మానసిక జపం మామూలుగా చేసే దానికన్నా అనేక రెట్లు ఎక్కువ ఫలితాన్నిస్తుందంటారు.  గ్రహణ సమయంలో ఆవు నెయ్యతో దీపారాధన చేసి, దాని ముందు కూర్చుని జపం చేస్తే, ఆ మంత్రంతో హోమం చేసినంత ఫలితాన్నిస్తుంది. అయితే అందరూ ఈ జపాలు చేయలేరు.  శారీరకంగా అశక్తులు వుండవచ్చు, ఉద్యోగరీత్యా, ఇంకా ఇతర పనులవల్ల కుదరకపోవచ్చు.  అలాంటివారు శాస్త్ర ప్రకారం సూర్య గ్రహణానికి 12 గం. ముందునుంచీ కడుపు ఖాళీగా వుండాలి.  ఈ సమయంలో ఏమైనా తినటంవల్ల అనారోగ్యం కలుగవచ్చు. 
గ్రహణాన్ని నేరుగా కళ్ళతో చూడకూడదు. కంటిలో వుండే సున్నితమయిన పొరలు దెబ్బతిని అంధత్వం వస్తుందని, ఎలాంటి ఉపకరణాలూ లేకుండా నేరుగా కంటితో గ్రహణాన్ని చూడటం వల్ల కంట్లో ఏర్పడే దోషాలను ఏ చికిత్సతోనైనా బాగు చేయటం చాలా కష్టమని ప్రసిధ్ధ కంటి వైద్య నిపుణులు  అంటున్నారు.

గర్భం ధరించిన స్త్రీలు గ్రహణం రోజున బయట తిరిగితే అరిష్టమని భారతీయ స్త్రీలు ప్రగాఢంగా నమ్ముతారు. అందుకే కడుపుతో ఉన్నవారిని ఇంట్లోనే ఉంచుతారు. గ్రహణం ఉన్నంతసేపు వీరిని బయటికి రానివ్వరు. నిద్రపోనివ్వరు, ఇంట్లోనే మెల్లిగా నడవమని చెబుతుంటారు. గర్భం ధరించిన స్త్రీలు గ్రహణ సమయంలో ఇంటికే పరిమితమవ్వడం మంచిదని, అంతేగాక తమ నివాస గృహాలలో ఆ సమయంలో సూర్యుడి ఛాయలు పడకుండా జాగ్రత్తపడాలని , గ్రహణ సమయంలో ప్రసరించే అతినీలలోహిత కిరణాలు గర్భిణీ స్త్రీలపై తీవ్ర ప్రభావం చూపుతాయని పండితులు హెచ్చరిస్తున్నారు. సూర్య కాంతికి కూర్చోకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూరగాయలు తరగడం.. ఇత్యాది వంట పనులు చేయకూడదు. గర్భస్ధ శిశువుల మీద గ్రహణ సమయంలో కిరణాల ప్రభావం చాలా వుంటుందని డా. అపర్ణా సక్శేనా గర్భస్ధ ఎలుకలమీద చేసిన ప్రయోగాలతో కనుగొన్నారు.  ఆ కిరణాలలో వుండో రేడియో ధార్మిక శక్తి  వలన ఆ ఎలుకలకి పుట్టిన పిల్లలలో ఎముకలు, మజ్జలో లోపాలు, అవయవాలు సరిగ్గా తయారు కాకపోవటం వగైరా లోపాలు కనుగొన్నారు.  అందుకే గర్భిణీలు గ్రహణ సమయంలో బయట తిరగకూడదన్నారు.

మన పూర్వీకులు ఏ సైన్స్ ఏ పరిశోధనలు లేని కాలంలో ఎంతో  విజ్ఞానంతో, ఎంతో  దూరం ఆలోచించి, ఎన్నో తరాలదాకా ప్రజలకి మేలు చేసే విషయాలను తెలియజెప్పారు. వాటిని పాటించి శుభాల కోసం ప్రయత్నం చేద్దాం.

3, మార్చి 2016, గురువారం

ఆడపిల్లను కాపురానికి పంపుట



ఆడపిల్లను కాపురానికి పంపుట:

పెండ్లికూతురుతో పంపవలసినవి:
చీరలు
మేకప్‌ బాక్స్‌
టవల్సు వెండిబిందె
సూట్‌కేసు
కంచము
జాకెట్లు
బొట్టుపెట్టె
తెరలు
వెండిసామాన్లు
బీరువా మంచము
లంగాలు
గలీబులు
దుప్పట్లు
కప్పులు
స్పూన్లు గ్లాసు
చేతిగుడ్డలు
ఇంట్లో అందరికి బట్టలు
బాలపోలిమునకు ఇచ్చు నగలు

చాకలికి, పనిమనిషికి చీరలు, అమ్మాయికి కావలసిన ఏవైనా వస్తువులు ఇవ్వవచ్చును. కొత్తచీర కట్టుకున్న తరువాత వడిలో వడిబాలు, పసుపుకుంకుమ పెట్టి వడిలో అద్దాలు 5, దువ్వెనలు 5, బొమ్మలు 5, కుంకుమ బరిణలు 5, కాటుక కాయలు 5 పెట్టవలెను. పసుపు చెంబు చేతికి ఇచ్చిన తరువాత కారులో కూర్చొనవలెను. కాపురానికి పంపునప్పుడు కంచము ఇవ్వరాదు. తరువాత ఇవ్వవచ్చును.

అల్లుడుగారిని తీసుకురావటము



అల్లుడుగారిని తీసుకురావటము:

మంచమునకు పూలు కట్టించవలెను. గులాబి, సంపెంగలతో అలంకరించాలి. మంచము మీద కొత్త దుప్పటి వేయాలి. పూలు 200 మూరలు పట్టును. అలంకరణ చిక్కగా వుండవలెనన్న 400 మూరల పూలు పట్టును.

గదిలో టేబులు మీద గుడ్డవేసి చిన్న పళ్ళెములలో కాని కప్పులలోకాని 10 రకాల స్వీట్సు, 10 రకాల హాట్సు, 2 కిళ్ళీలు పెట్టవలెను. మంచినీళ్ళు, వెండిగ్లాసుతో పాలు పెట్టవలెను. పాలు తప్పక ఇద్దరు షేర్‌ చేసుకుని తాగవలెను. దంపతులు ఉదయము బట్టలు మార్చుకున్న తరువాత రూము నుంచి బయటకు రావలెను. ముందుగానే అబ్బాయి, అమ్మాయి బట్టలు గదిలో పెట్టవలెను.

అమ్మాయికి తెలుపుచీర అత్తగారు, అల్లుడికి తెలుపు పంచెలు మామగారు ఇచ్చెదరు. దంపతులకు రాత్రికి భోజనము పెట్టినాక రూములో ఎదురెదురుగా మంచం మీద కూర్చొనపెట్టి పాన్పు వేయుదురు. దంపతులకు తాంబూలాలు ఇప్పించాలి. ఈ తాంబూలములో అమ్మాయి వాళ్ళు జాకెటుముక్క, అబ్బాయి వాళ్ళు జాకెటు ముక్క, తమలపాకులు, వక్క, కొబ్బరిబొండము, దక్షిణ, కొత్తదంపతుల చేత 5 లేక 9మంది దంపతులకు ఇప్పించెదరు. హారతి అద్ది పేర్లు చెప్పించి అందరు ఇవతలకు వచ్చెదరు.

1పూట పీటలమీద కూర్చొనపెట్టెదరు. పంతులుగారిచే ముహూర్తము పెట్టించి 1గంట ముందుగా పాన్పువేయుదురు. అత్తగారి వాళ్ళు 5 లేక 9 పళ్ళెములలో అమ్మాయికి పసుపుకుంకము, స్వీటు, హాటు, ఆకులు, వక్కలు, కొబ్బరిబోండాలు, పూలు, పండ్లు, అరిశెలు, బిస్కెట్లు తీసుకువస్తారు.

2, మార్చి 2016, బుధవారం

అమ్మాయి పుష్పావతి అయిన సమయములో చేయవలసినవి:



అమ్మాయి పుష్పావతి అయిన సమయములో చేయవలసినవి:

తూర్పు ముఖం వచ్చునట్లుగా నేలమీద గడ్డిపరచి దానిమీద తెలుపు డిజైను దుప్పటి లేక చీర ఐదుగురు ముత్తైదువులు పట్టుకుని వేయవలెను. కొందరి ఇంట తెలుపు డిజైను కొత్త చీర సమర్త పెండ్లికూతురుకు కట్టి మొదటి రోజు కూర్చొనపెట్టుదురు. ఆ ఐదుగురు అక్షింతలు నాలుగు వైపులా, మధ్యలో ఐదుచోట్ల శనగలు, పండ్లు, తాంబూలము, ఎండుకొబ్బరి చిప్ప, చిమ్మిరి ముద్ద పెట్టాలి. పక్కన ఒక చెక్కబొమ్మ పెట్టవలెను. ఆ బొమ్మకు గుడ్డ చుట్టవలెను. అమ్మాయి కాళ్ళకు పసుపు రాసి పారాణి పెట్టాలి. అమ్మాయికి ఓణీ వేయవలెను. 5పోగుల దారానికి పసుపు రాసి తమలపాకు కట్టి ఒకటి రోలుకి, రోకలికి కటాలి. అమ్మాయికి తాంబూలము ఇవ్వవలెను. అమ్మయిని కూర్చోబెట్టి రోలులో 5 చిమ్మిరి ముద్దలు వేసి చిమ్మిరితొక్కి హారతి పట్టవలెను. సమర్తపాట, మంగళ హారతి పాటలు పాడవలెను. రోలులోని చిమ్మిరి, ముందుగ 3 సార్లు అమ్మాయి చేతిలో పెట్టి మిగిలినది సమర్తకాని పిల్లలకు పెట్టుదురు. బొట్టు, గంధము ముందుగా సమర్త పెండ్లికూతురునకు ఇచ్చి, తరువాత ముత్తైదువులకు ఇచ్చెదరు.

మొదట 3రోజులు పులగము అన్నము (బియ్యములో పెసరపప్పు కలిపి వండవలెను), ఒక మూకుడులో విస్తరాకు లేక వెండి గిన్నె వుంచి సమర్త పెండ్లికూతురునకు, ఆ అన్నము పెట్టెదరు. అన్నములోకి బెల్లము ముక్క లేక పంచదారతో తినవలెను. తరిగినవి తినరాదు. పుల్లలు తుంచుట చేయకూడదు. అరటిపండు ఎవరైనా వలిచి ఇచ్చిన తినవలెను. ఉపనయనము సమయములో వాడిన మూకుడులో అన్నము పెట్టిన ఏదైనా దోషము ఉన్న పోవును. వరుస స్నానము 4, 7, 9, 11 రోజులలో చేయించెదరు. 4వ రోజు భోజనములో అట్లు వడ్డించాలి, పాలరసము చేయాలి. వరస స్నానము 4సార్లు, మాములుగా బంతిలో భోజనము చేయవచ్చును. 4 రోజుల తరువాత కొబ్బరి పొడుము, అప్పడము, వడియముతోనే భోజనము పెట్టవలెను. తినలేనిచో పాలు, మజ్జిగ పలుచగ చేసి అన్నములో పోయవలెను.

పత్యము: 
వంకాయ, గోంగూర, తరిగినవి. అరిశె, జున్ను, అట్టు తినకూడదు. చిమ్మిరి ముద్దలు, వేరే ఏ స్వీటు అయినా తినవచ్చును. సమర్త సమయమున చిమ్మిరి ఎంత పంచిన అంత మంచిది. ఏదైనా గుడి ముందు వాళ్ళకు చిమ్మిరి ముద్దలు పంచవచ్చును. 

చిమ్మిరి తొక్కుటకు కావలసినవి: 
నువ్వులు - ఒకటిన్నర కేజి (100 ముద్దలు వచ్చును)
బెల్లము - ఒకటిన్నర కేజి
ఎండు కొబ్బరి తురుము - అర కేజి
నువ్వులు వేయించి, రోలులో తొక్కి దానికి బెల్లము, ఎండుకొబ్బరి కలిపి బాగా తొక్కి ముద్దలు చేయాలి.

11వ రోజు అమ్మాయికి గాజులు తొడిగించెదరు. ఆ రోజు బంధువులను పిలిచి భోజనములు పెట్టెదరు. అందరికి 2 గాజులు కూడా పంచిపెట్టెదరు. 4సమర్తలు, కన్నెముట్లు 3, అయిన దాక ఊరు పొలిమేర దాటరాదు.

సమర్త స్నానము:
3వ రోజు రాత్రి 3గం||కి స్నానము చేయించవలెను. నువ్వుల నూనె వంటికి రాసి నలుగు పెట్టి తలస్నానము చేయించాలి. అయినాక 5ని|| తరువాత మరల తలస్నానము చేయించవలెను. దీనినే దొంగస్నానము అందురు. 7, 9, 11 రోజులలో ఉదయమే ఇలా నలుగుపెట్టి స్నానము చేయించవలెను. 11వ రోజు పంతులు గారు వచ్చి పుణ్య వచనము చేయించెదరు. 2వ సమర్త 9వ రోజుతో, 3వ సమర్త 7వ రోజుతో, 4వ సమర్త 5వ రోజుతో, మూడుముట్లు కన్నెముట్లు అని 4వ రోజు దూరము గానే వుంచి 5వ రోజు ఇంట్లోకి వచ్చెదరు.

అప్పగింతలు



అప్పగింతలు:

అమ్మాయిని లోపలకు తీసుకువెళ్ళి వరునికి కాళ్ళుకడిగిన పళ్ళెములో ఆవుపాలు పోసి ముందుగా రెండు చేతులు పాలలో ముంచి తల్లి పొట్టమీద అద్దవలెను. తరువాత గడపకు అద్దవలెను. తల్లిదండ్రి మధ్యలో అమ్మాయిని కూర్చొనపెట్టుకుని పీటముందు పెండ్లిపీట వేయాలి. ఎదురుగా పెండ్లికుమారుని తల్లిదండ్రులను కూర్చొనపెట్టి వారి అరచేతులకు, అమ్మాయి చేతులు పాలలో ముంచి తల్లి, తండ్రి పట్టుకుని వారి అరచేతులకు అమ్మాయి అరచేయి తాకించవలెను. ఆ తరువాత ఆడపడుచు మరుదులు, బావగారు ఇంకా ముఖ్యమైన వారికి ఇదేవిధముగా చేతులతో చేసి ఆఖరుగా అబ్బాయికి అదే విధముగా చేసి అబ్బాయి పక్కన అమ్మాయిని కూర్చొనపెట్టవలెను. 

అమ్మాయిని లోపలకు తీసుకువెళ్ళి కలిపిన పెరుగు అన్నము పెట్టవలెను, ఒడిగంటుకండువాలో 5 గిద్దల బియ్యము, ఒడిగంటు గిన్నె 1.25 దక్షిణ తాంబూలము, కందపిలక పెట్టి ముడివేసి పెండ్లికూతురు నడుముకు కట్టుదురు. అమ్మాయి చీరచెంగులో పసుపుకుంకుమ పెట్టి అమ్మాయి చేతిని అబ్బాయి చేతిలో పెట్టాలి. ఇద్దరిని ఎదురు ఎదురు కుర్చీలలో కూర్చోపెట్టి గులాం చల్లించాలి. మేళములతో అమ్మాయిని అత్తవారింటికి పంపవలెను.

అద్దె ఇంటికి వెళ్ళునప్పుడు



అద్దె ఇంటికి వెళ్ళునప్పుడు:

తీసుకువెళ్ళవలసినవి:

సీతారాముల పటము
నూనె, కుంది
గిన్నె, గరిటె
యాలుకులు, ఉప్పు
లక్ష్మీ, వినాయకుడు పటాలు
గరిట, హారతి ఇచ్చునది పళ్ళెము, 
కొబ్బరికాయలు 2
పెరుగు, కందిపప్పు పసుపు, కుంకుమ
ఆకులు, వక్క
పొయ్యి, మసిగుడ్డ, పాతగుడ్డ
కవ్వము, మంచినీళ్ళు
అక్షింతలు, కర్పూరము
పూలమాల, విడిపూలు
బియ్యము, బెల్లము
దిండ్లు, దుప్పట్లు
వత్తి, పత్తి
నిమ్మకాయలు, చాకు
జీడిపప్పు, నెయ్యి
కట్టుకొనుగుడ్డలు, చాపలు

మగవారు రాముని పటము, ఆడవారు ఒక ప్లేటులో పసుపు, కుంకుమ, అక్షింతలు, పెరుగు, కవ్వము, ఉప్పు, కందిపప్పు వుంచి పట్టుకుందురు. పంతులుగారు చెప్పిన టైముకు మొదటి గుమ్మము వద్ద కొబ్బరికాయ కొట్టి, నిమ్మకాయ కట్‌చేసి, గుమ్మము మీద పసుపు, కుంకుమ, అక్షింతలు చల్లి, నిమ్మచెక్కలకు కుంకుమ అద్ది గుమ్మమునకు రెండువైపులా పెట్టవలెను. తూర్పు ఈశాన్యములో పేపరు మీద దేముని పటము పెట్టి పూజచేసుకోవలెను. పొంగలి నైవేద్యము పెట్టవలెను. పిలిచిన అతిధులకు పొంగలి పెట్టి బొట్టు, పండు, తాంబూలము ఇవ్వవలెను. పెరుగు, ఉప్పు, కవ్వము ఆ ఇంట్లో వుంచవలెను. 3/4 డబ్బా, 3 గిద్దలు, 3 గుప్పిడులు, అవసరమును బట్టి పొంగలి చేసుకొనవచ్చును. పేపరు ప్లేట్లు, గ్లాసులు, మంచినీరు ఏర్పాటుచేయాలి.

అక్షరాభ్యాసము

జీవితంలో ముఖ్యమైన ఘట్టాలు

మనలో ప్రతిఒక్కరి జీవితంలోనూ కొన్ని ముఖ్యమైన ఘట్టాలు, సందర్భాలు వున్నాయి, వస్తూ వుంటాయి. అందరం ఎవరి స్థాయిలో వారు ఆ సందర్భాలను జరుపుకుంటూ వుంటాము. చాలాసార్లు ఇటువంటి సమయంలో ఏంచేయ్యవలెనో, ఎలా చేయ్యవలెనో, మన ప్రత్యేకతను ఎలా చాటుకోవాలనో ఆలోచిస్తూవుంటాం. సాంప్రదాయం ప్రకారం పాటించాలని మనసులో వున్నా, శక్తిసామర్ధ్యాలు వున్నా కొన్నిసార్లు పద్దతులు తెలియక, కావలసిన వస్తువులేవో తెలియక, చిన్న చిన్న విషయాలపైన అవగాహన లేకపోవడం వలన 'సరేలే' అని సర్దుకుపోతూ వుంటాం. ముఖ్యంగా, ఉద్యోగరీత్యా విడిగా అయినవారికి దూరంగా వుండేవారికి ఈ పరిస్థితి సాధారణం. ఇంట్లో పెద్దవారు సమయానికి లేకపోతే చాలామందికి ఇలానేవుంటుందికదా? అందుకే ఈ శీర్షిక. మీకోసం, మాకోసం, మన పిల్లల కోసం సందర్భానుసారంగా వీలైనన్ని వివరాలను సేకరించాలనేది మా ఆకాంక్ష.

అక్షరాభ్యాసము నాడు చేయవలసినవి:

డ్రస్సు, వెండి పలక, వెండి బలపము, స్పూను, క్యారేజి, బుట్ట, వాటరుబాటిలు, నాప్‌కిన్‌, పిల్లలకు 5 లేక 9 మందికి కాని పలక, బలపములు పంచిపెట్టవలెను, మరమరాలు, వేయించిన శనగపప్పు, బెల్లము కలిపి పిల్లలకు పంచిపెట్టవలెను. ఏదైనా దోషము వున్న యెడల పోవును.

ఈ బ్లాగును సెర్చ్ చేయండి



Related Posts Plugin for WordPress, Blogger...