శ్రీ మేధా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం

మీరు జన్మించిన తేది, సమయం, ప్రదేశం ఈ మూడు సమాచారములు మాకు తెలియచేసినచో మీ వ్రుత్తి,వ్యాపార,ఆరోగ్య,ఆర్ధిక పరిస్తితులు, దాంపత్యం, విద్య, ఉద్యోగ, వివాహ, కుటుంబవ్యవహారాలు, సంతానం, రాజకీయ వ్యవహారాలు,ప్రేమ వ్యవహారములు,కుజ దోషం, కాలసర్ప దోషం మరియు వివాహ, ఉపనయన, గృహప్రవేస, జప, హోమ, వ్రత, అన్నప్రసన, నామకరణం లకు ముహూర్తములు పెట్టబడును. P.V.RADHAKRISHNA CELL :+91 9966455872, Mail us : parakrijaya@gmail.com

31, మే 2014, శనివారం

శంఖుస్థాపన చేసే విధానం

 



ఇంటి పొడవును 9 భాగాలుగా చేసి ఇందులో పాదాల నుంచి 3 భాగాలు విడిచిపెట్టాలి. మిగిలిన 3 భాగాలలో వాస్తుపురుషుడి పాదాలు వున్న నాభిస్థానం. ఈ నాభిస్థానంలో తవ్వి నవధాన్యాలతో శంఖువును స్థాపించాలి.


ముందు శంఖువును ధాన్యరాశిపై వుంచి వాస్తుపూజ చేసినాక శంఖుస్థాపన చేయాలి. గంధపు చెక్కతోకాని, మారేడు, అత్తి, మద్ది, వేప, చండ్రకొయ్యతో కాని శంఖువును తయారు చేస్తారు. శంఖుస్థాపనకు మొదటి జాము ప్రశస్తం. రెండవ, మూడవ జామున, రాత్రులందు, శంఖుస్థాపన చేయకూడదు. ఇల్లు కట్టుకునే ముందు శంఖుస్థాపన చేయడం మంచిది. దీని వల్ల కొన్ని దోషాలు నివారణ అవుతాయి.


బ్రాహ్మడి జాబితా ప్రకారము అన్ని తెచ్చుకొనవలెను. ముందు రోజురాత్రి గుంట తీయించవలెను. జంపకనాలు, కుర్చీలు, పీటలు, మంచినీళ్ళు, గ్లాసులు మొదలగునవి. వచ్చిన అతిధులకు టిఫిన్లు, టీ ఇచ్చి, బొట్టు, పండు తాంబూలము ఇచ్చి పంపవలెను.

ఆ విధముగా చేసిన గృహము నందుండు వారికి సకల ఆయురారోగ్య ఐశ్వర్య కలుగ చేస్తుంది .
  
గృహ ఆరంభము చేయుటకు మాస ఫలితములు ఈ విధముగా ఉన్నాయి .

శ్లోకం : చైత్రమాసే గృహారంభే ధనధాన్య పశుక్షయం , వైశాఖం శుభదంచైవ , జ్యేష్టాయమరణం
        ఆషాడం కలహం భవేత్ , శ్రావణం శుభదం , భాద్రపదే సదా రోగీ,
        ఆశ్వీయుజం కలహం, కార్తీకే శుభదం ప్రోక్తం , మార్గశిర్షే మహాద్భయం
        పుష్యేచా అగ్ని భయంచ ,మాఘేస సంపదా , పాల్ఘునే రత్న లాభః
అని చెప్పితిరి

తాత్పర్యము : చైత్ర మాసమున గృహారంభము చేసినచో ధన నష్టము జరుగును ,వైశాఖ మాసము శుభము , జ్యేష్ట మాసము మరణమును కలుగ జేయును , ఆషాడ మాసమునందు తగవులు ఏర్పడును , శ్రావణము సకల శుభములు ప్రసాదించును , బాద్రపద మాసమునందు అనారోగ్యము కలుగును .,, ఆశ్వీయుజం కలహములు , గృహమునందు ఉండువారికి మనస్సుకు శాంతి కరవగును . కార్తీకము మంచిది . మార్గశిర మాసము భయమును కల్గిస్తుంది . పుష్య మాసము న గృహా రంభము చేయుట వలన అగ్నిచే దహించ బడును . మాఘ మాసము సకల సంపదలు , ఐశ్వర్యము , కలుగుతాయి . ఫాల్గుణ మాసమున చేయుట వలన అనేక విధములుగా అభివృద్ధి కలుగుతుంది .

శంఖు స్థాపనకు పనికి వచ్చే నక్షత్రములు .
ఉత్తర , ఉత్తరాషాడ , ఉత్తరాభాద్ర , రోహిణి , మృగశిర ,చిత్త , ధనిష్ఠ అనూరాధ , రేవతి , స్వాతి , శతభిషం గ్రుహారంభామునకు ప్రశస్తమైన నక్షత్రములు .

బుధ , గురు , శుక్ర వారముల యందు సూర్యోదయమునకు ముందు ౩ నుండి 6 గంటల లోపల గానీ , సూర్యోదయము తరువాత ఉదయం 11 గంటల లోపల గానీ శంఖు స్థాపన ముహూర్తము ఏర్పాటు చేసుకోవలెను

ఈ ముహూర్తము సకల సుగుణములు కలది 4 , 8 , 12 స్థానముల శుద్ది కలిగి వృషభ చక్రశుద్ది, తారాబలము , చంద్రబలము , పంచకరహితములు బాగుగా యున్నది అయి ఉండాలి .

4, , 8 , 12 స్థానములను గురించి ఇంతకుముందు కూడా ప్రస్తావించాను . వీటి గురించి కొంత వివరణ .
4 వ స్థానము సుఖాన్ని సూచిస్తుంది . ఇట్టి ఈ స్థానములో పాప గ్రహములు ఉండుట వలన  గృహము నిర్మాణమైన తరువాత గృహమందు ఉండువారికి సుఖములు లేక అనేక రకాల కష్ట నష్టములు కల్గును .
8 . ఇది ఆయుస్సు ను సూచిస్తుంది . ఇక్కడ శుద్ది లేకపోతె గృహమునందు మరణము కల్గును .
12 ఇది ఖర్చులను , నష్టములను , అపజయములను సూచిస్తుంది . ఈ స్థానము శుద్ది గా ఉండక పొతే గృహ యజమానికి గానీ అందుండు వారికి గానీ అన్నింటా అపజయములు కల్గును.


శంఖుస్థాపనకు సామాగ్రి పట్టిక

పసుపు     100 gr.
కుంకుమ     100 gr.
విడిపూలు     3 kg.
పూలమూరలు     10
తమలపాకులు     100
వక్కలు     100 gr.
అగరుబత్తీలు     1 packet
హరతికర్పూరం     100 gr.
గంధం           1 bottle
ఖర్జూరపండ్లు    150 gr.

పండ్లు         5 types
పసుపుకొమ్ములు     150 gr.
టవల్స్               2
జాకెట్ ముక్కలు     2

చెక్క శంఖు     1
బియ్యము     5 kg.
కొబ్బరికాయలు     15
చిల్లరడబ్బులు     21
దారపుబంతి     1
ఆవు పాలు     1/2 lt.
నవధాన్యాలు     1/2kg.
దీపారాధన కుందులు     1 set
వత్తులు        1 packet

నెయ్యి           1/2 kg.
కలశం చెంబు     1
దేవునిపటాలు    
నిమ్మకాయలు     10
నవరత్నాలు     1 set
గ్రానయిట్ రాళ్ళు     5
పంచెల చాపు       1
కొత్త ఇటికలు       10
వరిపిండి         1/2 కేజి





30, మే 2014, శుక్రవారం

శుక్ర గ్రహానికి శాంతులు

  • శుక్రునికి ఇరవయ్ వేలు జపం+రెండువేలు క్షీరతర్పణం+రెండొందలు హోమం+ఇరవయ్ మందికి అన్నదానం చేసేది.
  • శుక్ర గ్రహ దోష నివారణార్థం శ్రీ లక్ష్మి దేవి, పరసు రాముడు ఆలయాలను సందర్సించాలి.
  • శుక్ర వారం రోజు అలసందులు,అరటి పండు ఆవుకి ఆహారంగా పెట్టాలి. గమనిక: ఏ రోజు ఆవుకి ఏ ధాన్యం ఆహారంగా పెడుతామో ఆ ధాన్యం మనం తినరాదు.
  • పాలతో చక్కర పొంగలిని చేసుకొని,ధునిలో వేయవలెను.
  • శ్రీ రాజ రాజేశ్వరి దేవి అష్టకాన్ని(లేదా) రాజ రాజేశ్వరి దేవి స్తవాన్ని రోజూ పటించాలి.
  • మల్లె పూల మాలను లక్ష్మి దేవికి అలంకరించాలి.
  • చీమలకు పంచదార(చక్కర) ఆహారంగా వేస్తూ ఉండాలి.
  • దీపావళి పర్వ దినాన లక్ష్మి అష్టకము (లేక) కనకధారా స్తోత్రం ఎనిమిది మార్లు పారాయణ చెయ్యాలి.


29, మే 2014, గురువారం

బృహస్పతి(గురువు)గురు గ్రహానికి శాంతులు

  • గురువుకి పదహారువేలు జపం+పదహారువందలు క్షీరతర్పణం+నూట అరవై హోమం+పదహారు మందికి అన్నదానం చేసేది.
  • గురు వారం రోజున శనగ గుగ్గిళ్ళు పేదలకు పంచవచ్చు.
  • గురువులకు సంబందించిన గ్రంధములు నలుభై ఒక రోజులు పారాయణ చెయ్యాలి. అనగా సాయి బాబా, దత్తాత్రేయ,వెంకయ్య స్వామి మొదలగు వారి చరిత్ర.
  • ప్రతి గురు వారం శివాలయాలు గాని,సాయి మందిరాలు గాని,దత్తాత్రేయ మందిరాలు గాని దర్శించి పూజలు జరిపించ వచ్చును.
  • గురు వారం రోజు శనగలు,అరటి పండు ఆవుకి ఆహారంగా పెట్ట వచ్చు. గమనిక: ఏ రోజు ఆవుకి ఆహారంగా ఏ ధాన్యం పెడుతామో ఆ రోజు ఆ ఆహారం తినరాదు.
  • తేనెను ధునిలో వేస్తూ, పదకొండు సార్లు ప్రదక్షిణలు చెయ్యాలి.
  • బాదం కాయ, శనగ నూనె, కొబ్బరికాయలను పారుతున్న నీటిలో వేయవచ్చు.

28, మే 2014, బుధవారం

బుధ గ్రహ దోషానికి శాంతులు

  • బుధునికి పదిహేడువేలు జపం+పదిహేడు వందల క్షీరతర్పణం+నూట డెభై హోమం+పదిహేడు మందికి అన్నదానం చేసేది.
  • బుధ వారం రోజున పెసర పప్పు పొంగలి, పచ్చని అరటి పళ్ళు పేదలకు దానం చెయ్యాలి.
  • బుధ వారం రోజున విష్ణు మూర్తి ఆలయాలను దర్శించవచ్చు.(ఉదా:రాముడు,కృష్ణుడు,రంగనాధ స్వామి,నరసింహ స్వామి ఆలయాలు.)
  • పెసలు,అరటిపండు కలిపి ఆవుకి ఆహారంగా పెట్టాలి. గమనిక: ఏ రోజు ఆవుకు ఆహారంగా ఏ ధాన్యం పెడుతామో ఆ ధాన్యం మీరు తినరాదు.
  • ఒక రాగి ముక్కకి పెద్ద రంద్రం చేసి, దానిని పారుతున్న నీటిలో వేయవలెను.
  • బుధ గ్రహం బాగాలేనపుడు నపుమ్సకులకు (కొజ్జాలు) లేదు అనకుండా ధర్మం చెయ్యాలి.
  • తొలి ఏకాదశి రోజున విష్ణు సహస్ర నామ స్తోత్రం ఐదు మార్లు పారాయణ చేయగలరు.
  • బుధ వారం రోజున పురుష సూక్తం(లేదా) విష్ణు సూక్తం (లేదా) నారాయణ సూక్తం పారాయణ చేయాలి.
  • తులసి మాలను పదిహేడు బుధ వారములు శ్రీ వెంకటేశ్వర స్వామికి అలంకరించండి.




20, మే 2014, మంగళవారం

కుజ(అంగారక)గ్రహ దోషానికి శాంతులు


  • కుజునికి ఏడువేలు జపం+ఏడువందలు క్షీరతర్పణం+డెభై హోమం +ఏడుగురికి అన్నదానం చేసేది.
  • ప్రతి రోజు సుబ్రహ్మణ్య అష్టకం చదవాలి.
  • మంగళవారం రోజున యెర్రని కుక్కలకు పాలు,రొట్టెలు ఆహారంగా వెయ్యాలి.
  • కుజగ్రహ దోష నివారణార్ధం ఆలయాలు దర్శించాలి. అవి కుమారా స్వామి,నరసింహ స్వామి,విష్ణు మూర్తి,ఆంజనేయ స్వామి ఆలయాలు.
  • కందులు,బెల్లం కలిపి ఆహారంగా పెట్టాలి. గమనిక: ఏ రోజు ఆవుకి ఏ ధాన్యం ఆహారంగా పెడుతామో ఆ ఆహారం మీరు తినరాదు.
  • పేలాలు ధునిలో వేస్తూ పన్నెండు ప్రదక్షిణాలు చెయ్యాలి.
  • సుబ్రహ్మణ్య షష్టి పర్వ దినాన సుబ్రహ్మణ్య అష్టకం ఏడు సార్లు పారాయణ చెయ్యాలి.



19, మే 2014, సోమవారం

చంద్ర గ్రహ దోషానికి శాంతులు

  • చంద్రునికి పది వేలు జపం+వెఇ క్షీరతర్పణం+వంద హోమం+పది మందికి అన్నదానం చేఇంచేది.
  • సోమవారం రోజున పేదలకు,సాధువులకు,ముష్టి వాళ్లకు అన్నదానం చేయుట(లేక)దద్దోజనం పంచి పెట్టాలి.
  • పది సోమవారాలు నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేసి,ఒకటింపావు కిలో బియ్యం బ్రాహ్మణుడికి దానం ఇచ్చేది.
  • సోమవారం రోజుల్లో గౌరీ,పార్వతి,కనకదుర్గ అమ్మవార్ల దేవాలయాలు దర్శించండి.
  • బియ్యపు పిండిని చీమలకు ఆహారంగా వెయ్యాలి.
  • బియ్యం,అరటిపండు,కొంచెం కళ్ళు ఉప్పు కలిపి ఆవుకి ఆహారంగా పెట్టవచ్చు. గమనిక:ఏరోజు ఆవుకి ఆహారంగా యీధన్యం పెడుతామో ఆరోజు ఆ ఆహారం తీసుకోరాదు.
  • రోజు రాత్రి పూట పడుకొనేముందు వెండిగ్లాస్ తో పాలు త్రాగి పడుకొనవలెను.
  • పది మాస శివ రాత్రులు శివునకు పాలాభిషేకం చేసి, తీర్థం స్వీకరించండి.

18, మే 2014, ఆదివారం

రవి గ్రహ దోషానికి శాంతులు




  • రవికి ఆరు వేలు జపం+ఆరువందలు క్షీరతర్పణం+అరవయ్ హోమం+ఆరుగురికి అన్నదానం చేసేది.
  • సూర్య దేవాలయాలను దర్శించుట: ౧.శ్రీకాకుళం జిల్లా లోని అరసవల్లి దేవాలయం దర్శించి అరవయ్ ప్రదక్షిణాలు చెయ్యాలి. ౨.తమిళనాడు లోని సూర్యనార్ దేవాలయంలో సూర్య హోమం జరిపించుట.
  • రధ సప్తమి రోజున సముద్రస్నానమాచారించి,సూర్య నమస్కారాలు చేసి, సుర్యాష్టకాన్ని కనీసం ఆరు సార్లు జపించాలి.
  • పేదలకు,ముష్టివాల్లకు,సాధువులకు గోధుమ రొట్టెలు ఆదివారం రోజు పంచాలి.
  • ప్రతి రోజు ఆదిత్యహృదయం పటించాలి.
  • ఆరు ఆదివారాలు నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేసి ఆరవవారం ఒకకిలోపావు గోధుమలు,దక్షిణ బ్రాహ్మణుడికి దానం ఇచ్చేది.
  • గోధుమలు,బెల్లం,కొద్దిగా మిరియాలు కలిపి ఆవుకి ఆహారంగా తినిపించేది. గమనిక:ఏ రోజు ఆవుకి ఆహారంగా ఏ ధాన్యం పెడుతామో ఆరోజు మీరు ఆ ఆహారం తీసుకోరాదు.

17, మే 2014, శనివారం

శని గ్రహానికి శాంతులు

  • శనికి పంతోమ్మిదివేలు( 19,000 ) జపం+పంతొమ్మిది వందలు క్షీరతర్పణం+నూట తొంభై హోమం+పంతొమ్మిది మందికి అన్నదానం చేసేది.
  • శనికి పంతొమ్మిది శని వారాలు తైలాభిషేకం చేఇంచి,నువ్వులు దానం ఇచ్చేది.
  • శని వారం రోజున నువ్వు ఉండలు పేదలకు,సాధువులకు పంచేది.
  • నవ గ్రహాలకు నలుభై ఒక్క రోజులు ప్రదక్షిణలు చేసి శనికి తైలాభిషేకం చేసి,నువ్వులు దానం ఇచ్చేది.
  • ప్రతి రోజు మధ్యాహ్నం కాకులకు అన్నం కాని,బెల్లం కలిపినా నల్ల నువ్వులు కాని పెట్టాలి.
  • అయ్యప్ప స్వామీ దీక్ష మండలం రోజులు స్వీకరించాలి.
  • హనుమంతుని పూజించవచ్చు,ఉపాసన చేయవచ్చు.అనగా ఆన్జనేయాష్టకం,హనుమాన్ చాలీసా రోజూ పారాయణ చేయ వచ్చు.
  • శని త్రయోదశి రోజున శనికి తైలాభిషేకం చేఇంచేది.
  • ప్రవహించే నీటిలో బొగ్గులు,మేకు,నల్ల నువ్వులు,నల్ల గుడ్డ,నువ్వుల నూనె,,గుర్రపు నాడ విడవవలెను.
  • సనివారం రోజున పంతొమ్మిది సంఖ్య వచ్చే విధంగా దానం చెయ్యాలి.
  • శని సిన్గానాపూర్,తిరునల్లార్,మందపల్లి,నర్సిన్ఘోలె (లేక)మీ ఊరిలొ ఉన్న శని ఆలయాలను శని వారం రోజున దర్శించి,పూజలు చేఇంచ వచ్చు.
  • శని వారం రోజు నువ్వులు,అరటి పండు ఆవుకి పెట్టాలి. గమనిక: ఏ రోజు ఆవుకి ఆహారంగా ఏ ధాన్యం పెడుతామో ఆ ఆహారం మీరు తినరాదు.
  • ధునిలో నువ్వులను వేస్తూ,ఇరవయ్ ఆరు ప్రదక్షిణలు చేసేది.
  • ఎనిమిది రోజుల పాటు వరుసగా ప్రవహించే నీటిలో బొగ్గులు వేసి రావాలి.

మా వద్ద నవగ్రహ జప మంత్రములు లభించును.

సంప్రదించండిః-
సెల్ ; 9966455872




ఈ బ్లాగును సెర్చ్ చేయండి



Related Posts Plugin for WordPress, Blogger...