శ్రీ మేధా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం

మీరు జన్మించిన తేది, సమయం, ప్రదేశం ఈ మూడు సమాచారములు మాకు తెలియచేసినచో మీ వ్రుత్తి,వ్యాపార,ఆరోగ్య,ఆర్ధిక పరిస్తితులు, దాంపత్యం, విద్య, ఉద్యోగ, వివాహ, కుటుంబవ్యవహారాలు, సంతానం, రాజకీయ వ్యవహారాలు,ప్రేమ వ్యవహారములు,కుజ దోషం, కాలసర్ప దోషం మరియు వివాహ, ఉపనయన, గృహప్రవేస, జప, హోమ, వ్రత, అన్నప్రసన, నామకరణం లకు ముహూర్తములు పెట్టబడును. P.V.RADHAKRISHNA CELL :+91 9966455872, Mail us : parakrijaya@gmail.com

26, జూన్ 2016, ఆదివారం

వాస్తు శాస్త్రము

వాస్తు శాస్త్రము

పూర్వ‌కాలంలో అంధకాసుర‌డ‌నే రాక్ష‌సుడు ముల్లోకాల వాసుల‌ను ముప్ప‌తిప్పులు పెట్టుచుండెను. అప్పుడు లోక సంర‌క్ష‌ణార్థం ప‌ర‌మేశ్వ‌రుడు ఆ రాక్ష‌సునితో యుద్ధం చేశాడు. ఆ స‌మ‌యంలో శివుని ల‌లాటం నుండి రాలిన ఒక చెమ‌ట బిందువు భూమిపై ప‌డి దాని నుండి భ‌యంక‌ర‌మైన క‌రాళ వ‌ద‌నంతో ఒక గొప్ప భూతం ఉద్భ‌వించి క్ర‌మ‌క్ర‌మంగా భూమి, ఆకాశాల‌ను ఆవ‌రించి సాగింది. ఆ మ‌హాభూతాన్ని చూసిన ఇంద్రాది దేవ‌త‌లు భయ‌భ్రాంతుల‌య్యారు. బ్ర‌హ్మ‌దేవుని శ‌ర‌ణువేడారు. స‌మ‌స్త భూత‌ముల‌ను సంభ‌వించువాడు, స‌ర్వ‌లోక పితామ‌హుడు అయిన బ్ర‌హ్మ దేవ‌త‌ల‌ను ఊర‌డించి ఆ భూత‌మును ఆధోముఖంగా భూమి యందు ప‌డ‌వేసి విధానం చెప్పాడు. బ్ర‌హ్మ‌దేవుని ఆన‌తి ప్ర‌కారం దేవ‌త‌లంద‌రూ ఏక‌మై ఆ భూత‌మును ప‌ట్టి అధోముఖంగా క్రింద‌కు ప‌డ‌వేశారు. ఆ భూతం భూమిపై ఈశ‌న్య కోణ‌మున శిర‌స్సు, నైరుతి కోణ‌మున పాద‌ములు, వాయువ్య‌, ఆగ్నేయ కోణాలందు బాహువులు వుండున‌ట్లు ఆధోముఖంగా భూమిపై ప‌డింది. అది తిరిగి లేవ‌కుండా దేవ‌త‌లు దానిపై కూర్చున్నారు. ఇంత‌మంది దేవ‌త‌ల తేజస్ర్స‌ముదాయంతో దేదీప్య‌మానంగా వెలుగొందుతున్న ఆ భూతాకార అద్భుతాన్ని తిల‌కించిన బ్ర‌హ్మ దేవుడు దాన్నే వాస్తు పురుషుడుగా సృష్టిగావించాడు. వాస్తు పురుషుడు భాద్ర‌ప‌ద బ‌హుళ త‌దియ‌, శ‌నివారం, కృత్రికా న‌క్ష‌త్ర‌ము, వ్య‌తీపాత యోగ‌ము, భ‌ద్ర‌నా క‌ర‌ణ‌ము గుళిక‌తో కూడిన కాలంలో ఆ వాస్తు పురుషుడు జ‌న్మించాడు. ఏ అప‌కారం చేయ‌ని నాపై అధిష్టించి ఈ దేవ‌త‌లు పీడించుచున్నారు. వీరి నుండి న‌న్ను కాపాడ‌మ‌ని వాస్తు పురుషుడు బ్ర‌హ్మ‌దేవున్ని వేడుకున్నాడు.అప్పుడు బ్ర‌హ్మ‌దేవుడు సంతోషించి వాస్తు పురుషా ! గృహ‌ములు నిర్మించున‌ప్పుడు, త్రివిధ‌మ‌యిన గృహ ప్ర‌వేశ స‌మ‌య‌ములందు, గ్రామ‌, న‌గ‌ర ప‌ట్ట‌ణ‌, దుర్గ దేవాల‌య‌, జ‌లాశ‌య, ఉద్యాన‌వ‌న నిర్మాణ స‌మ‌య‌ములందు ముందుగా నిన్నే పూజిస్తారు. అలా పూజించ‌ని వారికి ద‌రిద్ర‌ముతో పాటు అడుగ‌డుగునా విఘ్న‌ములు చివ‌ర‌కు మృత్యువు కూడా సంభ‌వించున‌ని వాస్తు పురుషునికి వ‌ర‌మిచ్చారు. అంతేకాక వాస్తు ప‌రుషునిపై అష్ట‌దిక్కుల‌లో వున్న దేవ‌త‌లు తృప్తి పొందు విధంగా ఆయా స్థ‌లాల‌లో నివ‌సించే దేవ‌త‌లు వారివారి విధులు నిర్వ‌హించుట వ‌ల‌న గృహ‌స్థుల‌కు స‌ర్వ‌సుఖ‌ములు, స‌త్ఫ‌లితులు క‌లుగున‌ట్లు ఆశీర్వ‌దించారు. బ్ర‌హ్మ‌దేవుని ఆశీస్సులు ప్ర‌కారము ఈశాన్య‌మున – ఈశ్వ‌రుడు (ఈశ‌), ఆగ్నేయ‌మున – అగ్ని, నైరుతిన ఆదిత్య‌డు, వాయువ్య‌మైన – వాయువు, తూర్పున – వ‌రుణుడు, ఉత్త‌ర‌మున – కుబేరుడు (సోమ‌), అష్ట‌దిక్కుల‌లో అధిష్టించిన ఈ దేవ‌త‌లు తృప్తి చెందే విధంగా నిర్మాణ క్ర‌మం వుంటే ఆ గృహంలో నివ‌సించే వాళ్లు స‌ర్వ‌సుఖ సంప‌ద‌ల‌ను పొందుతారు. ఇదీ వాస్తు – పురాణం. ఈశాన్య‌ములో పూజ‌లు, ప‌విత్ర కార్య‌ములు అగ్నేయ‌మున అగ్నిదేవునికిసంబంధించిన వంటావార్పు నైరుతిన ఆయుధ సామాగ్రి, వాయువ్య‌మున స్వ‌తంత్రాభిలాష చిహ్న‌ములు, తూర్పున ఆధిత్యునికి ప్రీతిక‌ర‌మైన ప‌నులు,య‌మ‌స్థాన‌మైన ద‌క్షిణ‌ము శిర‌స్సు ఉంచి నిద్రించుట‌, కుబేర స్థాన‌మైన ఉత్త‌రాన్ని ద‌ర్శిస్తూ మేలు కొనుట‌, వ‌రుణ స్థాన‌మైన ప‌శ్చిమాన పాడి ప‌శువుల‌ను పెంచుట మొద‌లైన విధులు ఆయా దిక్కుల్లో ఉన్న దేవ‌త‌ల‌కు తృప్తిని క‌లిగిస్తాయి. ఈ సారాంశాన్ని వాస్తు శాస్త్రం నియ‌మాలు మ‌న‌కు వెళ్ల‌డిస్తున్నాయి. గృహ నిర్మాణాలు చాలా ర‌కాలు వీటిలో మ‌న‌ష్యోప‌యుక్త‌ములు, ప‌శ‌వుల‌కు సంబంధించిన నిర్మాణాలు, ప‌క్షుల‌కు సంబంధించిన నిర్మాణాలు దేవ‌త‌ల‌కు సంబంధించిన నిర్మాణాలు ఇలాగ అనేక విధాలుగా వున్నాయి. వాస్తుశాస్త్రక‌ర్త‌లు నిర్మాణాల‌ను ముఖ్యంగా 4 భాగాలుగా విభ‌జించారు. (1) సాధార‌ణ మ‌నుష్య నివాస‌ములు (2) ప్ర‌భు నిర్మాణ‌ములు (3) దేవ‌తా నిర్మాణ‌ములు (4) స‌ర్వ‌సాధార‌ణ ప్ర‌జోప‌యోగ నిర్మాణాలు. సామాన్యంగా ప్ర‌తి గృహ‌స్తుల‌కు అవ‌స‌ర‌మైన స‌దుపాయ‌ముల‌ను గురించి మార్పుల‌తో నిర్మాణాలు చెప్ప‌బ‌డియున్న‌వి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

parakrijaya@gmail.com

ఈ బ్లాగును సెర్చ్ చేయండి



Related Posts Plugin for WordPress, Blogger...