స్థలంలో దిక్కుల గురించి....
స్థలంలో దిక్సూచినుపయోగించి ఉత్తర దక్షిణాలకు నిర్ధారించాకే తూర్పు, పడమరలను తదనుగుణంగా నిర్ణయించడం సులవవుతుంది. స్థలానికి నాలుగు దిక్కులే కాదు. నాలుగు మూలలు కూడా ఉంటాయి. వాటిని నిర్ణయించడంపై భిన్నాభిప్రాయాలు ఉన్నా, గ్రంథస్తంగా అందుతున్న పరిజ్ఞానాను సారంగా అయితే.... ఒక దిక్కును తొమ్మిది భాగాలుగా విభజించి, అటుపై మూలల నిర్ణయం చేయాలి. ఆ వివరాలు వివరంగా తెల్సుకుందాం. తూర్పు దిక్కును '9' భాగాలు చేయండి. మీరు తూర్పుకు తిరిగి నిలబడినపుడు తూర్పు దిక్కులో మీ కుడిచేతి వైపు ఉన్న రెండు భాగాలు తూర్పు ఆగ్నేయంగా భావించాలి. అలాగే మీ ఎడమ చేతివైపు ఉన్న చివరి రెండు భాగాలు తూర్పు ఈశాన్యంగా.. ఈ రెంటి నడుమ ఉన్న అయిదు భాగాలను తూర్పు దిక్కుగా భావించాలి. ఒక ఉత్తరం విషయానికొస్తే... మీరు ఉత్తరదిశగా తిరిగితే... మీ కుడిచేతి వైపున ఉండే చివరి రెండు భాగాలు ఉత్తర ఈశాన్యం, ఎడమచేతి చివరగా ఉండే రెండు భాగాలు ఉత్తర వాయువ్యం, వీటి నడుమ ఉన్న అయిదు భాగాలు ఉత్తర దిక్కుగా భావించాలి. ఇక పడమర వియానికొస్తే... మీరు పడమర దిక్కుగా నిలబడినపుడు పడమర దిక్కులోని 9 భాగాలలో మీ కుడిచేతివైపు చివరగా ఉండే రెండు భాగాలు పశ్చిమ వాయువ్యంగాను, మీ ఎడమ చేతివైపు చివరగా ఉండే రెండు భాగాలు పశ్చిమ నైఋతిగాను వీటి నడుమ ఉండే అయిదు భాగాలు పశ్చిమ దిశగా గ్రహించాలి. దక్షిణాన్ని కూడా ఇలానే గమనిస్తే.. మీరు దక్షిణ దిశగా తిరిగి నిలబడినపుడు.. మీకుడి చేతి చివరన ఉన్న రెండు భాగాలు... దక్షిణ నైఋతి. అలానే ఎడమచేతి వైపు చివరగా ఉండే రెండు భాగాలు దక్షిణ ఆగ్నేయం అని గ్రహించాలి. స్థలం ఏదయినా సరే దిక్కులు, మూలల్ని ఇలా నిర్ణయించుకోవాలి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
parakrijaya@gmail.com