శ్రీ మేధా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం

మీరు జన్మించిన తేది, సమయం, ప్రదేశం ఈ మూడు సమాచారములు మాకు తెలియచేసినచో మీ వ్రుత్తి,వ్యాపార,ఆరోగ్య,ఆర్ధిక పరిస్తితులు, దాంపత్యం, విద్య, ఉద్యోగ, వివాహ, కుటుంబవ్యవహారాలు, సంతానం, రాజకీయ వ్యవహారాలు,ప్రేమ వ్యవహారములు,కుజ దోషం, కాలసర్ప దోషం మరియు వివాహ, ఉపనయన, గృహప్రవేస, జప, హోమ, వ్రత, అన్నప్రసన, నామకరణం లకు ముహూర్తములు పెట్టబడును. P.V.RADHAKRISHNA CELL :+91 9966455872, Mail us : parakrijaya@gmail.com

26, జూన్ 2016, ఆదివారం

వాస్తు శాస్త్రము

.

గృహ నిర్మాణ స్థల వైశిష్ట్యం

గృహ నిర్మాణ సమయంలోనే వాస్తు నియమాలు పాటిస్తే సరిపోదు. గృహ నిర్మాణ నిమిత్తం స్తలాన్ని చేసుకునే తరుణంలో కూడా హండ్రెడ్‌ పర్సెంట్‌ ఆ స్థలం విషయంలో వాస్తు నియమాలు పాటించాలి. ఏ మాత్రం వాస్తుకు వ్యతిరేకంగా లేని స్థలాన్ని మాత్రమే సెలక్టు చేసుకుని... ఆ స్థలంలోనే పూజాది కార్యక్రమాలు నిర్వహించి వాస్తు పూజ విధిగా చేసి... అప్పుడు గృహ నిర్మాణం ప్రారంభించాలన్నది శాస్త్రం చేస్తున్న సూచన. 
1. మీరు తీసుకునే స్థలం బల్లపరుపుగా చదునుగా ఉండాలి. 
2. మీ స్థలానికి పడమర దిశలో కానీ, దక్షిణ దిశలో కానీ తటాకాలు, కాలువలు, జలాశయాలు, పెద్ద పెద్ద గోతులు ఏ మాత్రం ఉండకూడదు. 
3. పడమర, దక్షిణ దిశలలో స్థలం ఎత్తుగా ఉండవచ్చు. ఆనుకుని ఉన్నస్థలం మెరకగా ఉండవచ్చు. ఎత్తయిన కొండలు, గుట్టలు ఏవయినా ఉండవచ్చు. ఇది గృహ నిర్మాణానికి అనువైన స్థలంగా వాస్తు చెబుతుంది. 
4. మీరు సెలక్టు చేసుకున్న స్థలం... ఉత్తరం పల్లంగా ఉండవచ్చు... ఉత్తర భాగాన జలాశయాలు, కాలువలు ఉండవచ్చు. 
5. అలాగే తూర్పు దిశలో కూడా ఎలాంటి మెరలు, గుట్టలు లేకుండా మీ తూర్పుదిక్కున స్థలం పల్లంగా ఉండాలి. స్థలానికి తూర్పున తటాకం, జలాశయం, బావి, గొయ్యి, కాలువ ఇలాంటివి ఏవి ఉన్నా దాన్ని శుభప్రదమైన స్థలంగా పరిగణించాలి. 
6. మీరు నిర్ణయించుకున్న స్థలానికి నైఋతి దిశలో ఎంత ఎత్తయిన కట్టడాలువ ఉంటేవ మీకు అంత శుభప్రదం, నైఋతిలో మెరక, కొండలు, గుట్టలు ఉన్నా అది శుభాదయకమే. 
7. నైఋతి, ఆగ్నేయం, వాయువ్య దిక్కులతో పోల్చినపుడు... ఈశాన్య దిక్కు పల్లంగా ఉంటే అది ఎంతో మంచిది. 
8. ఒకవేళ ఇలా లేకున్నా.... ఈశాన్యాన్ని పల్లంగా చేసుకుంటే ఉత్తమం. పొరపాటున కూడా ఈశాన్యం కన్నా ఇతర మూడు మూలలు పల్లంగా ఉండరాదు. 
9. స్థలాన్ని సెలక్టు చేసుకునే సమయంలో... మీ స్థలానికి అతి చేరువలో స్మశానం, కర్మాగారాలు, అధిక ధ్వనిని కల్గించే రైల్వే మార్గాలు, స్టేషన్‌లు, విమానాశ్రయాలు లేకుండా తగు జాగ్రత్త పాటించాలి. ధ్వని కాలుష్యం మీరు నివశించే చోటుకు అతి చేరువగా ఉంటే... మీ ఆరోగ్యం పై ఈ ధ్వని కాలుష్యం ప్రభావం చూపుతుంది. 
10. స్థలానికి అతి చేరువలో మురుగు ప్రవహించే కాలువలు లేకుండా చూసుకోవాలి. అలానే నీరు నిలిచిపోయే గోతులు లేకుండా జాగ్రత్త వహించాలి. 
11. స్థలాన్ని త్రవ్వినపుడు ఎముకలు, దంతాలు బయటపడినా, పాము పుట్టలు, దిబ్బలు బయటపడినా అది నివాసయోగ్యం కాని స్థలంగా భావించి దాన్ని వదిలివేయాలి. 
12. ఉత్తరం కన్నా దక్షిణం మెరకగా అంటే ఎత్తుగా ఉన్న స్థలంలో గృహ నిర్మాణం చేసినట్లయితే... ఆ గృహంలో నివశించే వారి ఆర్ధిక పరిస్థితి ఉన్నతంగా ఉంటుంది. 
13. ఇలా కాకుండా దక్షిణం పల్లం ఉత్తరం మెరకగా ఉన్న స్థలంలో గృహ నిర్మాణం చేసినట్లయితే ఆర్ధికంగా, ఆరోగ్య పరంగా పలురకాల సమస్యలు ఈ గృహంలో నివశించే వార్ని వేధిస్తాయి. 
14. తూర్పు కన్నా, పడమర ఎత్తుగా ఉన్న స్థలంలో గృహ నిర్మాణం చేశారంటే... ఈ గృహంలో నివసించే వారికి చక్కని మనశ్శాంతి, సమాజంలో గౌరవ ప్రతిష్టలు లభిస్తాయి. ప్రశాంతంగా జీవించ గల్గుతారు. 
15. తూర్పు ఎత్తుగాను, పడమర పల్లంగాను ఉన్న స్థలంలో గృహ నిర్మాణం చేసినట్లయితే.. మానసిక ప్రశాంతత ఉండదు. ఆరోగ్య సమస్యలు, మానసిక సమస్యలు, పలురకాల ఇబ్బందులు వీర్ని వెన్నాడుతూనే ఉంటాయి. 
16. నైఋతి దిక్కుకన్నా ఈశాన్య దిక్కులో స్థలం పల్లంగా ఉన్నట్లయితే.. ఈ స్థలం గృహ నిర్మాణానికి ఎంతో శుభప్రదమైనదిగా వాస్తుశాస్త్రం చెబుతుంది. మంచి ఆరోగ్యం, మంచి గౌరవ ప్రతిష్ఠలు, పదుగురు అభినందించే సంతతి ఇలాంటి గృహంలో నివశించే వారికి లభ్యమవుతాయి. 
17. ఆగ్నేయం కన్నా వాయువ్యం పల్లంగా ఉండాలి. ఇలాంటి స్థలంలో గృహనిర్మాణం వాస్తు నియమానుసారం చేస్తే అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. సమాజంలో మాంచి గౌరవ ప్రతిష్ఠలు పొందగల్గుతారు. 
18. వాయువ్యం ఎత్తుగా ఉండి... వాయువ్య కన్నా ఆగ్నేయం తక్కువ ఎత్తులో ఉండే స్థలంలో గృహ నిర్మాణం చేయరాదు. 
19. నైఋతి మూలకన్నా ఈశాన్యం మూల ఎత్తుగా ఉన్న స్థలంలో కూడా గృహనిర్మాణం చేయరాదు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

parakrijaya@gmail.com

ఈ బ్లాగును సెర్చ్ చేయండి



Related Posts Plugin for WordPress, Blogger...