శ్రీ మేధా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం

మీరు జన్మించిన తేది, సమయం, ప్రదేశం ఈ మూడు సమాచారములు మాకు తెలియచేసినచో మీ వ్రుత్తి,వ్యాపార,ఆరోగ్య,ఆర్ధిక పరిస్తితులు, దాంపత్యం, విద్య, ఉద్యోగ, వివాహ, కుటుంబవ్యవహారాలు, సంతానం, రాజకీయ వ్యవహారాలు,ప్రేమ వ్యవహారములు,కుజ దోషం, కాలసర్ప దోషం మరియు వివాహ, ఉపనయన, గృహప్రవేస, జప, హోమ, వ్రత, అన్నప్రసన, నామకరణం లకు ముహూర్తములు పెట్టబడును. P.V.RADHAKRISHNA CELL :+91 9966455872, Mail us : parakrijaya@gmail.com

26, జూన్ 2016, ఆదివారం

ఇంటి చుట్టూ ఖాళీ ఎలా?

ఇంటి చుట్టూ ఖాళీ ఎలా?

స్ధలాల ఖరీదులు ఆకాశాన్నంటుతున్న ఈ రోజుల్లో ఇంటి చుట్టూ ఖాళీ వదలడానికి ఎక్కువ శాతం ఎవరూ అంగీకరించడం లేదు. స్ధలంలో వీలయినంత ఎక్కువగా గృహ నిర్మాణం కావించి, ఇంటిలోని అన్ని గదులూ పెద్దవిగా ఉండేలా ఆలోచిస్తురే తప్ప, ఇంటి చుట్టూ ఖాళీ స్ధలం వదలకపోతే గాలీ వెలుతురు కరువుతాయిని, ఆ కారణంగా ఆ ఇంట్లి నివశించే వారికి అరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందన్న దిశలో ఎవరూ అలోచించట్లేదు. అపార్టుమెంటు అయినా, గృహం అయినా నాలుగు దిక్కులా ఖాళీ అన్నది ఉత్తమం. అయితే అపార్టుమెంట్స్‌ ఇలా నిర్మాంచడం చాలా కష్టం. కనీసం వీలయినంత మేరకు అపార్టుమెంటులోకి గాలి, వెలుతురు వచ్చేలా నిర్మాణం చేయడం వాస్తు రీత్యా ఉత్తమం. 
దక్షిణం కన్నా ఉత్తరం రాస్త ఎక్కువ ఉంటే చాలు. పడమర కన్నా తూర్పు కాస్త అధికం ఉంటే చాలు... శాస్త్రానికేగా... అనవసరంగా స్ధలం వేస్టు చేయకండి అనే గృహ యజమనులు ఈ మధ్య పెరిగిపోతున్నారు. ఇంటి చుట్టూ ఖాళీ వదిలే సమయంలో వాస్తుశాస్త్ర నియమాలను విధిగా పాటించండి. 
ఆవరణంలో పడమర కన్నా కనీసం మూడురెట్లు ఆపైన అధికంగా తూర్పు దిశన ఖాళీ వదలి తీరాలి. ఇలా ఖాళీ వదిలి నిర్మితయమైన గృహం... సుఖశాంతుల నిలయం అవుతుంది. అలానే దక్షిణం వైపు కన్నా మూడు రెట్లు అంత కన్నా ఎక్కువ ఖాళీని ఉత్తర దిక్కులో వదలడం వలన ఆ ఇంట లక్ష్మీదేవి స్ధిరనివాసం ఏర్పరచుకుటుంది. స్ధిరాస్తుల రూపంలోనో, చరాస్తుల రూపంలోనో డబ్బుకు కొదవ లేకుండా ఉంటుంది. భవిష్యత్‌ విషయంలో దిగులు ఉండని అర్ధిక పరిస్ధితిలో ఆ కుటుంబం అలరారుతుంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

parakrijaya@gmail.com

ఈ బ్లాగును సెర్చ్ చేయండి



Related Posts Plugin for WordPress, Blogger...