శ్రీ మేధా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం

మీరు జన్మించిన తేది, సమయం, ప్రదేశం ఈ మూడు సమాచారములు మాకు తెలియచేసినచో మీ వ్రుత్తి,వ్యాపార,ఆరోగ్య,ఆర్ధిక పరిస్తితులు, దాంపత్యం, విద్య, ఉద్యోగ, వివాహ, కుటుంబవ్యవహారాలు, సంతానం, రాజకీయ వ్యవహారాలు,ప్రేమ వ్యవహారములు,కుజ దోషం, కాలసర్ప దోషం మరియు వివాహ, ఉపనయన, గృహప్రవేస, జప, హోమ, వ్రత, అన్నప్రసన, నామకరణం లకు ముహూర్తములు పెట్టబడును. P.V.RADHAKRISHNA CELL :+91 9966455872, Mail us : parakrijaya@gmail.com
నవగ్రహాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
నవగ్రహాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

21, అక్టోబర్ 2014, మంగళవారం

నవరత్నములు అశుభము



గ్రహాలు వారి రత్నములు
రవి - మాణిక్యము
చంద్రుడు - ముత్యము
కుజుడు - పగడము
బుధుడు - మరకతము(పచ్చ)
గురువు - పుష్యరాగము
శుక్రుడు - వజ్రము
శని - నీలము
రాహువు - గోమేధుకము
కేతువు - వైడూర్యము

ఈ రత్నములలో గురుపాలితులవి శనిపాలితులు, శనిపాలితులవి గురుపలితులు ధరించిన తప్పక దుష్ఫలితములను ఇచ్చును
గురు వర్గము: సూర్యుడు, చంద్రుడు, కుజుడు, గురువు, కేతువు.
శని వర్గము: శని, శుక్రుడు, బుధుడు, రాహువు.


చాలా  మంది జ్యోతిష్యులు నవరత్నములని అన్నింటిని ఒకే ఉంగరములో
దరించవచ్చని అందరికి ధరింప చేస్తున్నారు. ఇది చాలా తప్పు దీని వలన ఆశుభమే తప్ప శుభం లేదు శాస్త్రం చెప్పిందని ఇది మంచిదే అని అంటున్నారు కానీ ఎలా మంచిది అని అడిగితె ఒక్కో కారణం చెపుతున్నారు. గ్రంధాలూ వ్రాసిన వారు మనుషులే కదా వారేమి అయోనిసంభూతులు కాదుకదా తప్పుచేయకుండటానికి. ఇప్పడు ఉన్నది కృత్రిమ జ్యోతిషము దీనివలన ప్రజలు నష్టపోతున్నారు దొంగ జ్యోస్యులు లాభపడుతున్నారు.ఏ జాతకునికి ఐనను నవరత్నము ధరింప వద్దు. ఎంతటివాడికి ఐనను కష్టాలు
తప్పవు.

గురు, శుక్ర, పూర్ణ చంద్ర, శుద్ధ బుధులు శుభులు అని మిగిలిన వారు అనగా
కుజ, శని, రాహు, కేతు లు పాపులు అని వారు అన్న శాస్త్రాలలోనే ఉన్నది,
అలాంటప్పుడు పాపులు కీడు చేస్తారు కదా మరి వారి రత్నములు ధరిస్తే ఎలాశుభం చేస్తాయి.

నిజానికి గ్రహాలలో పాపులు ఎవ్వరు లేరు అందరు పూజనీయులే. లగ్నానుసారంగా శుభ, పాప గ్రహాలు ఏర్పడుతాయి.

జాతకుడు పుట్టిన నక్షత్రము ప్రకారము కొందరు రత్నాన్ని సూచిస్తారు ఇది మరో తప్పు నక్షత్రము గ్రహ ప్రారంభ దశను సూచిస్తుంది దానిపైనే చంద్రుడు
ఉంటాడు.  రోహిణి నక్షత్రము ఇది చంద్ర దశ ప్రారంభ నక్షత్రము చంద్రుడు
ముత్యమునకు అధిపతి కావున రోహిణి నక్షత్రములో జనించిన వారు ముత్యము ధరించవచ్చును అని చెపుతున్నారు, మరి లగ్నము ఏమి కావ
లి. నక్షత్రము పై ఉన్నది చంద్రుడే కదా లగ్నము ధనుస్సు ఐనప్పుడు కటకాధిపతి చంద్రుడు లగ్నానుసరంగాఅష్టమాధిపతి అవుతాడు. ధనుర్లగ్నానికి చంద్రుడు శత్రువు కదా అప్పుడు ఎలా ముత్యము ధరిస్తే శుభము కలుగు తుందో వారికే తెలియాలి.

జ్యోతిష శాస్త్రములో ముక్యమైనవి లగ్నము తదుపరి గ్రహాలు, నక్షత్రాలు.
లగ్నమే ప్రాణవాయువు, లగ్నమే సాధన, లగ్నమే    ముక్యము లగ్నము లేనిది జ్యోతిష శాస్త్రము అడుగుకుడా ముందుకు వేయలేదు.

రత్నాలు ధరించుటకు ముందు లగ్నాన్ని పరిశీలించాలి. లగ్న, పంచమ,
నవమాధిపతులను గమనించి వారి రత్నములను మాత్రమే ధరించాలి తప్ప వేరే వారివి ధరిస్తే కష్టాలు తప్పవు.

eg: మకర రాశిని చూద్దాము. మకారానికి లగ్నాధి పతి శని(శనికి నీలము)
పంచమాధిపతి శుక్రుడు(శుక్రునికి వజ్రము) నవమాధిపతి బుదుడు[బుడునికి పచ్చ(ఆకుపచ్చ)] ధరించ వచ్చు, రాహువు శనిపాలితుడే కావున గోమేధుకము కూడాధరించ వచ్చు.

లగ్నము ప్రకారము రత్నము సుచించుటే క్షేమము.

నవరత్నములు ధరించుట వలన ఆ జాతకునికి లేక తన భార్య పిల్లకు కష్టాలు
తప్పవు. వంశమే నాశనము చేయగల శక్తి ఉన్నది.

4, ఆగస్టు 2014, సోమవారం

నవగ్రహ దీపాల నోము ఎలా, ఎప్పుడు చేయాలి?

నవగ్రహ దీపాల నోముః-
నవగ్రహ దీపాల నోము ఎలా చేయాలి. నవగ్రహాల అనుగ్రహం కోసం, ఐశ్వర్యం పొందేందుకు కార్తీక పౌర్ణమి రోజున ఈ నోము నోచుకుంటారు.
 


తొమ్మిది ప్రమిదలు, తొమ్మిది ఒత్తుల చొప్పున వెలిగించి, ఒక్కొక్క ప్రమిద వద్ద నవధాన్యాలలో ఒక్కొక్క రకం ధాన్యం కొద్దిగా ఉంచి, ఒక్కొక్క ప్రమిదను (ధాన్యం సహా) ఒక్కొక్క బ్రాహ్మణునికి దానమివ్వాలి.
నవగ్రహ శాంతికి సంబంధించి పూజాది కార్యక్రమాలు చేసేవారు ఆయా ప్రత్యేక వస్తువులతో పూజని నిర్వహించాలి. పూజలో గ్రహ శాంతికి దోష నివారణకు దానాలు చేయాలి. ఇలా చేసిన వారకి దోష నివారణ జరిగి సకల శుభాలు కలుగుతాయి. కోరిన కోర్కెలు నెరవేరతాయి.

 సూర్య గ్రహ పూజ చేసేవారు గోధుమలను దానము చేయాలి. చేతికి కెంపు ఉంగరాన్ని ధరించటం వల్ల రోగాదులు, మానసిక బాధలు తొలగి మనశ్శాంతి కలుగుతుంది.

గురు గ్రహ పూజను నిర్వహించేవారు శనగలను దానం చేయాలి. అదే విధంగా కనక పుష్యరాగం ఉంగరాన్ని ధరించటం వల్ల అధికారం, ధనయోగంతో పాటు కీర్తివంతులవుతారు.

చంద్రుని పూజకు బియ్యాన్ని దానం చేస్తే సరిపోతుంది. ముత్యాన్ని ధరించటం వల్ల నేత్రాలకు సంబంధించిన బాధలకు నివృత్తి కలుగుతుంది. ఇక కుజ గ్రహ పూజలో కందులను దానం చేయాలి. పగడపు ఉంగరాన్ని ధరించటం వల్ల రుణ విముక్తి కలిగి శత్రు బాధ తొలగుతుంది.

 బుధ గ్రహ పూజలో పెసలను దానం చేయాలి. పచ్చల ఉంగరాన్ని ధరించటం వల్ల ధనలాభం కలగటమే కాక వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి కలుగుతుంది.

శుక్రుని పూజలో అలచందల దానము చేయాలి. వజ్రం, పగడము ధరించిటం వల్ల కార్యసిద్ధి కలుగుతుంది. వివాహాది శుభకార్యములకు ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి.

 రాహు పూజకు మినుములను దానం చేయాలి. గోమేధిక ఉంగరాన్ని ధరించటం వల్ల భయాందోళనలు తగ్గుతాయి. ధనప్రాప్తి కలుగుతుంది.

 కేతువు పూజలో ఉలవల దానం చేయాలి. వైఢూర్యం ఉంగరాన్ని ధరించాలి. దీనివల్ల సర్పాది భయాలు తొలగటమే కాక దైవశక్తి పెరుగుతుంది.

 శనిపూజలో నువ్వులను దానం చేయాలి. నీలిరంగు రాయి కలిగిన ఉంగరాన్ని ధరించటం వల్ల ఆరోగ్యవంతులవటమే కాక ఇతరత్రా కష్టాలు తొలగిపోతాయి. ఇంకా ప్రతి శనివారం నవగ్రహాలకు దీపమెలిగించినా ఈతిబాధలుండవు. ఆర్థిక ఇబ్బందులు, అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తికావాలంటే కార్తీక పౌర్ణమిన శివాలయంలో అభిషేకం చేయించాలని పురోహితులు అంటున్నారు.






4, జులై 2014, శుక్రవారం

నవగ్రహాలు - రాహువు

రాహువు :


సూర్య చంద్ర గ్రహాణాలకు కారకుడు గా చెప్పబడేరాహువు ను 
 ఒక పాము రూపం లో వర్ణిస్తారుఒకకత్తి ని ఆయుధంగా చేసుకొని,
 ఎనిమిది నల్లటిగుర్రాలను అధిరోహిస్తూ ఉంటాడు.పుత్ర దోషం,
 మానసిక రోగాలుకుష్టు మొదలైనవిరాహు ప్రభావములే. 
పడమర - దక్షినాభిముఖుడై ఉంటాడు.
అదిదేవత : దుర్గ
ప్రత్యధిదేవత : పాము
వర్ణం : నలుపు
వాహనం : 
నలుపు సింహం
ధాన్యం : మినుగులు
పుష్పం : అడవి మందారం
జాతిరత్నం : గోమేధుకం
వస్త్రం : నల్లటి వస్త్రం
నైవేద్యం : మినుగులతో కూడిన అన్నం

2, జులై 2014, బుధవారం

కేతు గ్రహానికి శాంతులు

  1. కేతువుకి ఏడు వేలు జపం+ఏడు వందలు క్షీరతర్పణం+డెభై హోమం+ఏడు మందికి అన్నదానం చేసేది.
  2. వినాయక చవితి రోజున గణేషుని పూజించుట.
  3. వినాయకుడు,విష్ణు మూర్తి ఆలయాలను దర్శించి, పేదలకు ఆహారం పంచవలెను.
  4. మంగళ వారం రోజున ఖర్జూరం పేదలకు పంచవలెను.
  5. మంగళ వారం రోజున ఉలవలు,అరటిపండు ఆవుకి ఆహారంగా పెట్టాలి. గమనిక: ఏరోజు ఆవుకి ఆహారంగా ఏ ధాన్యం పెడుతామో ఆరోజు మనం ఆ ఆహారాన్ని తినరాదు.
  6. కుక్కలకు,గుర్రములకు ఏ ఆహారాన్ని అయినా పెట్టవలెను.
  7. మూడు మంగళ వారాలు వినాయకుని గుడిలో ఉండ్రాళ్ళు నివేదన చేసి, పేదలకు పంచేది.
  8. శ్రీ కాళహస్తి వెళ్లి కేతు గ్రహ దోష నివారణార్ధం "సర్ప దోష పరిహార పూజ" జరిపించండి

1, జులై 2014, మంగళవారం

నవగ్రహాలు - కేతువు

కేతువు :


భార్య చిత్రలేఖఆస్తి నష్టంచెడు అలవాట్లుపుత్ర దోషంమొదలైనవి
 తొలగాలంటే కేతు పూజలు చేయాలి. 
ఉత్తరం - పడమటి ముఖాసీనుడై ఉంటాడు.

అదిదేవత : చిత్రగుప్తుడు
ప్రత్యధిదేవత : బ్రహ్మ
వర్ణం : ఎరుపు
వాహనం : గద్ద
ధాన్యం : ఉలవలు
పుష్పం : ఎర్రని కలువ
వస్త్రం : రంగురంగుల వస్త్రం
జాతి రత్నం : వైడుర్యం
నైవేద్యం : ఉలవల అన్నం.


30, జూన్ 2014, సోమవారం

రాహు గ్రహానికి శాంతులు

  1. పదునెనిమిది వేలు జపం+పదునెనిమిది వందలు క్షీరతర్పణం+నూట ఎనభై హోమం+పదునెనిమిది మందికి అన్నదానం చేసేది.
  2. శ్రీ కాళహస్తి వెళ్లి రాహు దోష నివారణార్ధం సర్ప దోష పరిహారపూజను జరిపించాలి.
  3. సుబ్రహ్మణ్య ఆలయాలు దర్శించాలి.
  4. మూడు శని వారాలు ఏదైనా ఆలయంలో దేవునికి పెరుగు అన్నం(ధద్హోజనం)నివేదన చేసి, పేదలకు దానంగా పంచిపెట్టేది.
  5. దేవి సప్తశతి పారాయణ (లేక) మంత్రం, దేవి కవచం రోజూ పటించాలి.
  6. ప్రతి శని వారం ఒక పలావు పొట్లం ఒక విధవా స్త్రీకి దానం చెయ్యాలి. తయారు చెఇంచ లేకుంటే కొని కూడా ఇవ్వ వచ్చు.
  7. శని వారం రోజు ప్రారంభించి వరుసగా పదునెనిమిది రోజులు పారుతున్న నీటిలో రోజుకో కొబ్బరి కాయ వేయడం వల్ల రాహు గ్రహ దోషం తగ్గి పోవును.
  8. కొద్ది పాటి బొగ్గులని నీట్లోకి ధార పోయటం వల్ల రాహు గ్రహ దోషం పోతుంది.
  9. పడక గదిలో(నిద్రించే గది) నెమలి పించాన్ని కనపడేటట్లు పెట్టి, లేవగానే చూడటం వల్ల రాహు గ్రహ పీడ నెమ్మదిగా నివారణ అవుతుంది.
  10. ఆదివారం రోజున మినప వడలు కాని, మినప ఉండలు కాని పేదలకు, సాధువులకు పంచండి.

29, జూన్ 2014, ఆదివారం

నవగ్రహాలు - సూర్యుడు

సూర్యుడు:
  కశ్యపుని కుమారుడు సూర్యుడుభార్య అదితిఅందుకేఆదిత్యుడు అని పిలుస్తాము.
 సప్త అశ్వాలతో ఉన్న రధం అతనివాహనం సప్త అశ్వాలు ఏడు చక్రాలకు ప్రతీకలు.
మూలాధారంస్వాదిష్టానంమణిపూరకంఅనాహతం,విశుద్ధఆగ్య్హ్నా చక్రం , సహస్రారం )

 వివాహ పరిబంధన దోషంపుత్ర దోషంపుత్ర పరిబంధన దోషం,విద్యా పరిబంధన దోషం 
ఉద్యోగ పరిబంధన దోషంసూర్య దోషంమొదలైన దోషాలతో బాధ పడే వారు సూర్యుని
  పూజించటంవలన ఫలితం పొందుతారు. 
సింహరాశి కి అధిష్టాన దేవుడు సూర్యుడునవగ్రహాలలో మద్య స్థానం ఆదిత్యుడిది. 
అధిదేవత అగ్నిప్రత్యధి దేవత రుద్రుడుఆదిత్యుడు ఎరుపు వర్ణం లో ఉంటాడు.

ఇష్టమైన ధాన్యం : గోధుమలు
పుష్పం : తామర
వస్త్రం : ఎర్రని రంగు గల వస్త్రం
జాతి రాయి : కెంపు
నైవేద్యం : గోధుమలురవ చక్కర పొంగలి

28, జూన్ 2014, శనివారం

నవగ్రహాలు - శని

శని :
 
సూర్యభగవానుడి పుత్రుడు శనిభార్య ఛాయా దేవి (నీడ).
 నల్లని వర్ణం తోనలుపు వస్త్రధారణతోకాకివాహనంగా కలిగి ఉంటాడు.
శని దేవుడిని అందరు తిడ్తూ ఉంటారునిజామే అలాoటిబాధలు పెడతాడు  శనిమనల్ని ఎంతగా బాధ పెట్టికష్టాలు పెడతాడోఅంతకంటే ఎక్కువ 
మంచి చేసివెళ్తాడు.కుంభమకర రాసులకి అధిపతిపడమటి వైపు 
 ముఖాసీనుడై ఉంటాడు.
అదిదేవత : యముడు
ప్రత్యధిదేవత ప్రజాపతి
వర్ణం : నలుపు
ధాన్యం : నల్ల నువ్వులు
పుష్పం : నల్లని తామర
వస్త్రం : నల్లని వస్త్రం
జాతి రత్నం : నీలం
నైవేద్యం : నల్లని నువ్వులు కలిపిన అన్నం

27, జూన్ 2014, శుక్రవారం

నవగ్రహాలు - శుక్రుడు

శుక్రుడు :


ఉషనబృగు మహర్షి  సంతానంఅసురులకుగురువు ఇతను.
 రజోగుణ సంపన్నుడుధవళ వర్ణంతో మద్యవయస్కుడిగా ఉంటాడు.
 ఒంటె / గుఱ్ఱము /మొసలి వాహనంగా కల్గి ఉంటాడు.అనుకోని 
పరిస్థితుల వల్లన కుటుంబాలు విడిపోవడంలేక తగాదాలు రావడం ,
బాగా కలిసి ఉండేవారిమద్యలో శత్రుత్వం కలగడం మొదలైన 
 విపత్కరపరిస్థితులనుండి శుక్రాచార్యుని పూజ వలన బయటపడే  
అవకాశం ఉంది. వృషభతులరాశులకు అధిపతి.
అదిదేవత : ఇంద్రుడు
వర్ణం : తెలుపు
వాహనం : మొసలి
ధాన్యం : చిక్కుడు గింజలు
పుష్పం : తెల్లని తామర
వస్త్రం : తెల్లని వస్త్రం
జాతి రత్నం : వజ్రం
నైవేద్యం : చుక్కుడు గింజల తో కూడిన అన్నం

26, జూన్ 2014, గురువారం

నవగ్రహాలు - గురుడు

గురుడు :బృహస్పతి(గురువు)


బృహస్పతి అని కూడా అంటాము.దేవతలకుదానవులగురువైన 
శుక్రాచారుడికి గురువు ఇతనుసత్వగుణసంపన్నుడుపసుపుపచ్చ 
 / బంగారు వర్ణం లో ఉంటాడు.పేరు ప్రఖ్యాతులుసంపద,
 తోడ బుట్టినవారి క్షేమము కొరకుగురువు ని పూజించాలి 
ధన్నురాశిమీనా రాశిలకు అధిపతిఉతరముఖుడైఉంటాడు.

అధిదేవత : బ్రహ్మ
ప్రత్యధిదేవత ఇంద్రుడు
వర్ణంపసుపు
వాహనం : గజరాజు
ధాన్యం : వేరుసెనగ పప్పు
పుష్పం : మల్లె
వస్త్రం : బంగారు రంగు వస్త్రం
జాతి రత్నం : పుష్య రాగం
నైవేద్యం : సెనగపప్పు తో కూడిన అన్నం

25, జూన్ 2014, బుధవారం

నవగ్రహాలు - బుధుడు


బుధుడు :
 
తారచంద్రుల పుత్రుడు బుధుడురజోగుణవంతుడు.
 పుత్రదోషంమంద విద్యచంచలమైన మనసు కలవారు 
 బుధునిపూజలు చేసి ఉపసమనం పొందుతారుతెలివితేటల వృద్ధి, 
సంగీతంజ్యోతిష్యంగణితంవైద్యం వంటి వాటిలోరానిచాలంటే బుధుడి
  అనుగ్రహం పొందాలి.మిధున మరియు కన్యారాశి కి అధిపతి బుధుడు.
 తూర్పు -ఉత్తర ముఖుడై ఉంటాడు.
అధిదేవత : విష్ణు
ప్రత్యధిదేవత : నారాయణుడు
వర్ణం : చిగురాకు పచ్చ
వాహనం : సింహం
ధాన్యం : పచ్చ పెసర పప్పు
వస్త్రం : పచ్చని రంగు వస్త్రం
జాతి రత్నం : పచ్చ
నైవేద్యం : పెసరపప్పు తో కూడిన అన్నం

24, జూన్ 2014, మంగళవారం

నవగ్రహాలు - కుజుడు

మంగళ :కుజ(అంగారక)

అంగారకుడు ( ఎర్రని వర్ణం కలవాడుఅని కూడా పిలుస్తాం. 

ఇతను భూదేవి కుమారుడుమేషవృశ్చిక రాసులకిఅధిపతి.
 దక్షినాభిముఖుడురుచక మహాపురుష యోగవిద్యను భోదిస్తాడు.
 తమోగుణ వంతుడు.భార్య / పిల్లలు / అన్నదమ్ముల వల్ల సమస్యలు
  ఉండేవారు,స్నేహితులతో శత్రుత్వంసంపదను కోల్పోయిన వారు 
మంగళ దేవుడిని పూజించటంవలన సత్ఫలితాలను పొందుతారు. అధిదేవత : భూదేవిప్రత్యదిదేవత : క్షేత్ర పాలకుడు
వర్ణంఎరుపు
ధాన్యం : కందిపప్పు
పుష్పం : సంపంగి మరియు తామర
వస్త్రం : ఎరుపు రంగు వస్త్రం
జాతి రత్నం : ఎర్రని పగడం
నైవేద్యం : కందిపప్పు తో కూడిన అన్నం

ఈ బ్లాగును సెర్చ్ చేయండి



Related Posts Plugin for WordPress, Blogger...